state tourney
-
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడా జట్ల ఎంపిక
చిల్లకూరు : కర్నూలు జిల్లాలో అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అండర్– 19 స్కూల్ గేమ్స్ పోటీలకు జిల్లా క్రీడా జట్ల ఎంపికను చిల్లకూరు గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ జోనల్ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. అథ్లెటిక్స్‌లో 100, 200, 800, 1500, 3 కి.మీ, 5కే రన్‌తో పాటు షాట్‌పుట్, జావలిన్ త్రో, డిస్కస్‌త్రో, లాంగ్ జంప్, హైజంప్ పోటీలను నిర్వహించారు. అలాగే గేమ్స్‌కు సంబందించి హ్యండ్‌బాల్ పోటీలను నిర్వహించి ప్రతి ఈవెంట్లోనూ జిల్లా జట్టును ఎంపికచేశారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు గురుకుల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఇబ్రహీం, పీడీలు దుర్గాప్రసాద్, జానకిరామయ్య, పీఈటీలు శ్రీరేష్, రమణయ్య, ప్రసాద్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు వాలీబాల్ జట్ల ఎంపిక
గూడూరు: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా సీనియర్ వాలీబాల్ జట్లను ఆదివారం ఎంపిక చేశారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన పురుషుల జట్టు ఎంపికలకు 50 మంది క్రీడాకారులు హాజరవగా, అత్యుత్తమ ప్రతిభకనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అలాగే డీఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన మహిళల జట్టు ఎంపికకు 32 మంది క్రీడాకారిణిలు హాజరవగా, బాగా రాణించిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి, హరిచంద్రారెడ్డి, క్రికెట్ క్లబ్ చైర్మన్ మునిగిరీష్, రాష్ట్ర వ్యాయామ ఉపాద్యాయుల సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, పీడీ సురేంద్రరెడ్డి, డీఆర్డబ్ల్యూ వ్యాయామ అధ్యాపకురాలు విజయకళ, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు స్విమ్మర్ల ఎంపిక
నెల్లూరు(బృందావనం): ఈ నెల 18 నుంచి విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు జిల్లా స్విమ్మర్ల ఎంపికను ఆదివారం నిర్వహించారు. జిల్లా అమెచ్యూర్ ఆక్వాటిక్స్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఏసీ సుబ్బారెడ్డి క్రీడా ప్రాంగణంలోని స్విమ్మింగ్‌పూల్‌లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభకనబర్చిన 30 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డీవీ రమణయ్య, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి పసుపులేటి రామమూర్తి, స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పిట్టి ప్రసాద్, జిల్లా పీఈటీల అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ కృష్ణారెడ్డి పోటీలను పర్యవేక్షించారు. ఎంపికైన క్రీడాకారులు వీరే. స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన 30మంది క్రీడాకారుల వివరాలను జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సనత్‌కుమార్ ప్రకటించారు. ఎం పెంచలయ్య, ఆర్ హరిసింగ్, వీఎస్.సెల్వం, చొక్కలింగం, వెంకటశేషయ్య, కే శంకర్‌నారాయణ, పీ వెంకటసుబ్బయ్య, ఏఎం శేఖర్, కే శివారెడ్డి, తులసి, పీ వెంకటరత్నం, ఎన్ శ్రీనివాసులు, కిషోర్, ఆర్ వెంకటేశ్వర్లు, కే కమలాకర్, సుబ్బయ్య, శ్రీహరి, జీ కృష్ణారెడ్డి, ఎన్ శేఖర్, రఫీ, అబ్దుల్లా, నాగరాజు, నితిన్, సురేష్ , మస్తాన్‌బాబు, రవి, మురళి, మ«ధు, తదితరులు ఎంపికైన వారిలో ఉన్నారు.