రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడా జట్ల ఎంపిక | Team selections for state tourney | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడా జట్ల ఎంపిక

Published Sun, Sep 25 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడా జట్ల ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడా జట్ల ఎంపిక

చిల్లకూరు : కర్నూలు జిల్లాలో అక్టోబర్‌ 7, 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అండర్‌– 19 స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు జిల్లా క్రీడా జట్ల ఎంపికను చిల్లకూరు గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్‌ గేమ్స్‌ జోనల్‌ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. అథ్లెటిక్స్‌లో 100, 200, 800, 1500, 3 కి.మీ, 5కే రన్‌తో పాటు షాట్‌పుట్, జావలిన్‌ త్రో, డిస్కస్‌త్రో, లాంగ్‌ జంప్, హైజంప్‌ పోటీలను నిర్వహించారు. అలాగే గేమ్స్‌కు సంబందించి హ్యండ్‌బాల్‌ పోటీలను నిర్వహించి ప్రతి ఈవెంట్‌లోనూ జిల్లా జట్టును ఎంపికచేశారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు గురుకుల కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ ఇబ్రహీం, పీడీలు దుర్గాప్రసాద్, జానకిరామయ్య, పీఈటీలు శ్రీరేష్, రమణయ్య, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement