team selections
-
సెలెక్షన్ ట్రయల్స్‌కు సైనా దూరం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు ఈరోజు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా మహిళల సింగిల్స్‌లో పీవీ సింధును నేరుగా జట్టులో ఎంపిక చేయగా... రెండో బెర్త్ కోసం సైనా నెహ్వాల్, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్‌లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సెలెక్షన్ ట్రయల్స్‌కు ఆహ్వానించింది. అయితే తాము సెలెక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాలేమని సైనా, మాళవిక ‘బాయ్’కు సమాచారం ఇచ్చారు. సైనా, మాళవిక వైదొలిగిన నేపథ్యంలో ఈ ట్రయల్స్‌కు అష్మిత చాలియాను ‘బాయ్’ ఎంపిక చేసింది. అష్మిత, ఆకర్షి మధ్య జరిగే ట్రయల్స్ మ్యాచ్‌లో గెలిచిన వారికి జట్టులో రెండో సింగిల్స్ ప్లేయర్‌గా స్థానం లభిస్తుంది. 32 ఏళ్ల సైనా గత ఏడాది 14 అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొని ఒక్క దాంట్లోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి 14 మంది బరిలోకి దిగనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలను నేరుగా జట్టులోకి ఎంపిక చేశారు. మిగతా బెర్త్‌ల కోసం నేడు ట్రయల్స్‌ను ఏర్పాటు చేశారు. -
దక్షిణాఫ్రికాతో సిరీస్: వన్డేలకు మిథాలీ, టీ20లకు హర్మన్‌ప్రీత్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో లక్నోలో జరిగే మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్లను ప్రకటించారు. వెటరన్ మీడియం పేసర్ శిఖా పాండేతోపాటు వికెట్ కీపర్ తాన్యా భాటియా, వేద కృష్ణమూర్తిలకు రెండు జట్లలోనూ చోటు లభించలేదు. 31 ఏళ్ల శిఖా పాండే భారత్ తరఫున 52 వన్డేలు ఆడి 73 వికెట్లు... 50 టి20 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తీసింది. వన్డే జట్టుకు హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్... టి20 జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. టి20 జట్టులో హైదరాబాద్ పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత మహిళల వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, పూనమ్ రౌత్, ప్రియా పూనియా, యస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్, హేమలత, దీప్తి శర్మ, సుష్మా వర్మ, శ్వేత వర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, మాన్సి జోషి, పూనమ్ యాదవ్, ప్రత్యూష, మోనికా పటేల్. భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, సుష్మా వర్మ, నుజత్ పర్వీన్, అయూషి సోని, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, మాన్సి జోషి, మోనికా పటేల్, ప్రత్యూష, సిమ్రన్. India have announced their squads for the white-ball home series against South Africa. They will play five ODIs and three T20Is, beginning 7 March.#INDvSA pic.twitter.com/5UdRos2u0j — ICC (@ICC) February 27, 2021 -
టెస్టు జట్టులో సిరాజ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్య పరిస్థితుల్లో... ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జంబో బృందాన్ని ఎంపిక చేసింది. నవంబర్ 27న టి20 సిరీస్‌తో మొదలయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీతో ఈ పర్యటన ముగియనుంది. చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలోని భారత సెలక్టర్ల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై మొత్తం 32 మందిని ఈ పర్యటన కోసం ఎంపిక చేసింది మూడు ఫార్మాట్ (టి20, వన్డే, టెస్టు)లలో కలిపి అధికారికంగా 28 మందిని ఎంపిక చేశారు. అయితే నెట్ ప్రాక్టీస్ సెషన్స్ కోసం మరో నలుగురు పేసర్లు కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్ కూడా ఈ 28 మందితో కలిసి ఆస్ట్రేలియాకు వెళతారు. బయో బబుల్ వాతావరణంలో జరిగే ఈ సిరీస్ కోసం మూడు జట్లు ఒకేసారి ఆస్ట్రేలియాకు వెళతాయి. గాయాలతో బాధపడుతున్న స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్‌లను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. తొడ కండరాలతో బాధపడుతున్న రోహిత్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సిరాజ్ శ్రమకు ఫలితం... ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో భారత టి20, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. 26 ఏళ్ల సిరాజ్ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మొత్తం 147 వికెట్లు పడగొట్టాడు. అతను ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు 13 సార్లు, ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు నాలుగుసార్లు తీశాడు. వన్డే, టి20 జట్ల నుంచి పంత్ అవుట్... ఏడాది తర్వాత కేఎల్ రాహుల్ టెస్టు జట్టులో పునరాగమనం చేయగా... నిలకడగా ఆడలేకపోతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను వన్డే, టి20 జట్ల నుంచి తప్పించి కేవలం టెస్టు జట్టుకే పరిమితం చేశారు. తమిళనాడు ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి తొలిసారి టి20 జట్టులో స్థానం పొందాడు. ప్రస్తుత ఐపీఎల్లో 11 మ్యాచ్‌లు ఆడిన 29 ఏళ్ల వరుణ్ 13 వికెట్లు తీశాడు. ఏడు రకాల బంతులను వేయగల వైవిధ్యం వరుణ్ సొంతం. ఈ ఐపీఎల్లో వరుణ్ స్పిన్‌కు వార్నర్, ధోని, పంత్, శ్రేయస్ అయ్యర్ తదితర అంతర్జాతీయ క్రికెటర్లు బోల్తా పడ్డారు. భారత జట్ల వివరాలు టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, పుజారా, విహారి, శుబ్‌మన్ గిల్, సాహా (వికెట్ కీపర్), పంత్ (వికెట్ కీపర్), బుమ్రా, షమీ, ఉమేశ్, సెనీ, కుల్దీప్, జడేజా, అశ్విన్, సిరాజ్. వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, శుబ్‌మన్ గిల్, అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్, జడేజా, చహల్, కుల్దీప్, బుమ్రా, షమీ, సైనీ, శార్దుల్ ఠాకూర్. టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, మయాంక్, అయ్యర్, పాండే, హార్దిక్ పాండ్యా, సామ్సన్ (వికెట్ కీపర్), జడేజా, వాషింగ్టన్ సుందర్, చహల్, బుమ్రా, షమీ, సైనీ, దీపక్ చహర్, వరుణ్ చక్రవర్తి. అదనపు పేస్ బౌలర్లు: కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్. -
వచ్చే వారంలో ఆసీస్ పర్యటనకు భారత జట్టు ఎంపిక!
ముంబై: మరో మూడు వారాల్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ పూర్తిస్థాయి సిరీస్‌లలో పాల్గొననుంది. కానీ జట్టు ఎంపికపై ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టి పెట్టింది. వచ్చే వారం ఆయా జట్లను ప్రకటించే అవకాశాలున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆదివారం బీసీసీఐ చీఫ్ గంగూలీ మాట్లాడుతూ తేదీలు మినహా వేదికలు, మ్యాచ్‌లు ఖరారయ్యాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో క్వీన్స్లాండ్ రాష్ట్రం నుంచి ఆమోదం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎదురుచూస్తోంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పూర్తిస్థాయి షెడ్యూల్‌ను తేదీలతోసహా సీఏ ప్రకటిస్తుంది. రెండున్నర నెలల పాటుసాగే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 12న అక్కడికి బయల్దేరనుంది. అనంతరం 14 రోజుల క్వారంటైన్ ముగిశాక కసరత్తు ప్రారంభిస్తుంది. ఐపీఎల్ వర్క్‌లోడ్, ఆటగాళ్ల గాయాలను దృష్టిలో పెట్టుకొని త్వరలో జట్టును ఎంపిక చేసే అవకాశముంది. ఇప్పటికే భువనేశ్వర్, ఇషాంత్ శర్మ సహా పలువురు ఆటగాళ్లు గాయపడి లీగ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. -
విండీస్ సిరీస్‌కు సై
ముంబై: ప్రపంచ కప్ సాధించలేకపోయిన బాధను అధిగమిస్తూ వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేసింది జాతీయ సెలక్టర్ల బృందం. విడివిడిగా కాకుండా మూడేసి టి20లు, వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఒకేసారి జట్లను ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలక్టర్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు 15 మంది చొప్పున, టెస్టులకు 16 మంది సభ్యుల పేర్లను వెల్లడించారు. వీరిలో పేసర్ నవదీప్ సైనీ (ఢిల్లీ), స్పిన్నర్ రాహుల్ చహర్ (రాజస్తాన్) పూర్తిగా కొత్త ముఖాలు. విశ్రాంతి ఊహాగానాలను తోసిరాజంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి మొత్తం పర్యటనలో పాల్గొననున్నాడు. వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌పై వేటు పడింది. పనిభారం రీత్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను టెస్టులకే పరిమితం చేయగా, ఫిట్నెస్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగే కరీబియన్ పర్యటనలో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. హార్దిక్‌ది గాయయా? విశ్రాంతా? మూడు ఫార్మాట్లలోనూ కీలకమైన పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మొత్తం విండీస్ టూర్‌కే ఎంపిక చేయలేదు. ప్రపంచ కప్‌లో బాగానే రాణించిన హార్దిక్... సెమీస్‌కు వచ్చేసరికి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. కొంతకాలంగా అతడిని వేధిస్తున్న వెన్నునొప్పి తిరగబెట్టకుండా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పృథ్వీ షా మళ్లీ మిస్... అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన యువ సంచలనం పృ థ్వీ షాను ఆ తర్వాత దురదృష్టం వెంటాడుతున్నట్లుంది. పట్టిం చుకోనవసరం లేని ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్లిష్టమైన క్యాచ్ అందుకోబోయి పాదం గాయానికి గురై, కెరీర్‌కు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పృథ్వీ... ఇప్పుడు మరో గాయంతో వెస్టిండీస్ సిరీస్‌నూ చేజార్చుకున్నాడు. రెండు నెలల క్రితం ముంబై టి20 లీగ్‌లో ఆడుతూ గాయం బారినపడ్డ అతడు ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఆడుతున్న భారత ‘ఎ’ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. విండీస్‌తో టెస్టులకు కొంత సమయం ఉన్నా సెలక్టర్లు పృథ్వీని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విదేశాల్లో సత్తా చాటేందుకు అతడు ఇంకొంత కాలం ఆగక తప్పలేదు. టెస్టు జట్టు: సభ్యులు 16 ఎంపిక తీరు: మయాంక్ అగర్వాల్, రాహుల్, పుజారా, కోహ్లి, రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్ యాదవ్. ఎంపిక తీరు: స్పెషలిస్ట్ మూడో ఓపెనర్‌గా ఎవరినీ తీసుకోలేదు. మయాంక్, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. అవసరమైతే తెలుగు ఆటగాడు విహారిని ఓపెనింగ్‌కు పరిశీలించే వీలుంది. ఈ కారణంగానే దేశవాళీ, ‘ఎ’ జట్ల తరఫున సెంచరీలతో దుమ్మురేపుతున్న ప్రియాంక్ పాంచాల్ (గుజరాత్), అభిమన్యు ఈశ్వరన్ (బెంగాల్)లకు పిలుపు అందలేదు. ప్రపంచ కప్ టాప్ స్కోరర్ రోహిత్ శర్మకు మళ్లీ అవకాశం దక్కింది. రోహిత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన జట్టులోనూ సభ్యుడు. ఏడాదిగా గాయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన వృద్ధిమాన్ సాహాను రెండో వికెట్ కీపర్‌గా తీసుకున్నారు. ఆసీస్ టూర్లో జట్టులో ఉన్న మిగతా నలుగురు పేసర్లకూ స్థానం కల్పించిన సెలెక్టర్లు పేసర్ భువనేశ్వర్‌ను పక్కన పెట్టారు. స్పిన్ బాధ్యతలను అశ్విన్–జడేజా–కుల్దీప్ త్రయం మోయనుంది. వన్డే జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, పంత్, జడేజా, కుల్దీప్, చహల్, కేదార్ జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: వేలి గాయంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకొన్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఫిట్నెస్ సాధించడంతో అందుబాటులోకి వచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్–4 స్థానం సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిఖార్సైన బ్యాట్స్‌మెన్ అయ్యర్, పాండేలకు అవకాశం దక్కింది. సీనియర్ దినేశ్ కార్తీక్‌పై వేటుతో రిషభ్ పంత్ ఏకైక కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను తప్పిస్తారని ఊహించినా అతడిపై భరోసా ఉంచారు. ఎడంచేతి వాటం పేసర్ ఖలీల్ పునరాగమనం చేస్తున్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ పేరు ప్రస్తావనకు రాలేదు. టి20 జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్, ధావన్, కోహ్లి, రాహుల్, అయ్యర్, పాండే, పంత్, కృనాల్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్, భువనేశ్వర్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: జాతీయ జట్టు సభ్యులుగా సోదర ద్వయం రాహుల్ చహర్ (స్పిన్), దీపక్ చహర్ (పేసర్) తొలిసారి మైదానంలో దిగే వీలుంది. దీపక్ గతంలో ఒక వన్డే, ఒక టి20 ఆడాడు. ఐపీఎల్, ‘ఎ’ జట్టు తరఫున అదరగొట్టిన 19 ఏళ్ల రాహుల్ చహర్ తన ప్రతిభకు గుర్తింపుగా టీమిండియా గడప తొక్కాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లకు పట్టించుకోని వాషింగ్టన్ సుందర్‌కు తిరిగి పిలుపొచ్చింది. మణికట్టు ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో షమీని పొట్టి ఫార్మాట్‌కు పరిగణించలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ అతడిపై మరింత భారం మోపకుండా ఖలీల్, దీపక్, సైనీ వంటి యువ పేసర్లను పరీక్షించనున్నారు. భువీ ప్రధాన పేసర్‌గా వ్యవహరిస్తాడు. -
విండీస్ పర్యటనకు ధోని దూరం
న్యూఢిల్లీ: ఓవైపు రిటైర్మెంట్పై ఎడతెగని చర్చ నడుస్తుండగా... మాజీ కెప్టెన్ ధోని శనివారం ఒకింత ఆశ్చర్యకర ప్రకటన చేశాడు. మూడు టి20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు ఆగస్ట్‌లో వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత జట్టు ఎంపికకు అందుబాటులో ఉండనని బీసీసీఐకి స్వయంగా తెలిపాడు. రాబోయే రెండు నెలలు తాను ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)లో పని చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. వెస్టిండీస్ పర్యటనకు జట్టు ఎంపిక కోసం ఆదివారం ముంబైలో సెలక్టర్లు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని తన ప్రణాళిక వెల్లడించాడు. ‘మేం మూడు విషయాలు స్పష్టం చేయదల్చుకున్నాం. ధోని ఇప్పుడే క్రికెట్ నుంచి రిటైరవ్వట్లేదు. అతడు ముందుగా అనుకున్న ప్రకారం సైన్యంలో పని చేసేందుకు రెండు నెలలు విరామం కోరాడు. ఈ విషయాన్ని మేం కెప్టెన్ కోహ్లి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు తెలియజేశాం’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వివరించారు. ధోని... పదాతి దళం పారాచూట్ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు. -
టి20ల నుంచి ధోని ఔట్
పుణే: భారత జట్టుకు తొలి టి20 ప్రపంచకప్‌ను అందించిన మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ టి20 కెరీర్ ముగిసినట్లేనా! వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టి20 సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో ధోనికి చోటు ఇవ్వకుండా సెలక్టర్లు పరోక్షంగా తమ ఉద్దేశాన్ని చెప్పేశారా. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి ఆలస్యంగా నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించింది. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే టి20 సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్, టి20 సిరీస్‌లకు జట్లను ఎంపిక చేసింది. దీనికి తోడు టెస్టు జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో కూడిన ‘ఎ’ టీమ్‌ను న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే తొలి అనధికారిక టెస్టు కోసం వెల్లడించారు. ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో చోటు కోల్పోయిన మురళీ విజయ్, అంతకుముందే స్థానం లేని రోహిత్ శర్మ, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఎంపిక ఆసీస్‌తో సిరీస్‌కు అనూహ్య నిర్ణయాలు. వరుసగా రెండు టి20 సిరీస్‌లకు ధోనిని పక్కన పెట్టడం అంటే విశ్రాంతిగా భావించలేం కాబట్టి అతను ఇక వన్డేలకే పరిమితమైనట్లని చెప్పవచ్చు. ఆయా జట్లలో ఉన్న రెగ్యులర్ ఆటగాళ్లను మినహాయించి శుక్రవారం ఎంపికలో చోటు చేసుకున్న కీలక మార్పులను చూస్తే... కోహ్లికి మళ్లీ విశ్రాంతి... వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే మూడు టి20ల సిరీస్‌కు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. అతని స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఉన్న ఆటగాళ్లు మినహా కొత్తగా అవకాశం దక్కినవారిని చూస్తే... విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడిన జార్ఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ తొలిసారి జట్టులోకి ఎంపికయ్యాడు. గతంలో టీమ్‌లోకి ఎంపికైనా మ్యాచ్ దక్కని కృనాల్ పాండ్యాకు మరో చాన్స్ లభించింది. భారత్ తరఫున చెరో 6 టి20లు ఆడిన శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లను కూడా తీసుకున్నారు. వన్డేల్లో స్థానం కోల్పోయిన దినేశ్ కార్తీక్‌ను కూడా ఎంపిక చేయడం మరో ఆశ్చర్యకర నిర్ణయం. మరోవైపు ఫిట్నెస్ సమస్యలతో గురువారం ఎంపిక చేయలేదని ప్రకటించిన కేదార్ జాదవ్‌ను నాలుగు, ఐదు వన్డేల కోసం టీమ్‌లోకి తీసుకోవడం విశేషం. ఆసీస్‌తో టి20లకు రెడీ... విండీస్ సిరీస్ అనంతరం కోహ్లి మళ్లీ భారత జట్టుతో చేరతాడు. ఆస్ట్రేలియాతో నవంబర్ 21నుంచి ప్రారంభమయ్యే టి20 సిరీస్‌కు అతను నాయకత్వం వహిస్తాడు. విండీస్‌తో సిరీస్‌కు ఎంపికైన షాబాజ్ నదీమ్‌కు ఇందులో చోటు దక్కలేదు. ఇది మినహా మరే మార్పు లేదు. విహారికి చోటు... ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో సెలక్షన్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంగ్లండ్‌లో రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యం తర్వాత స్థానం కోల్పోయిన ఓపెనర్ మురళీ విజయ్ను మళ్లీ ఎంపిక చేసింది. చోటు కోల్పోయిన తర్వాత విజయ్ కౌంటీల్లో ఎసెక్స్ తరఫున ఆడిన 5 ఇన్నింగ్స్‌లలో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత విజయ్ హజారే టోర్నీలో 3, 44, 24 పరుగులు సాధించాడు. అయితే సొంతగడ్డపై విండీస్‌తో టెస్టులకు ఎంపిక కాని శిఖర్ ధావన్‌పై మాత్రం సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. దాంతో అతనికి అవకాశం దక్కలేదు. టెస్టుల్లో రోహిత్ శర్మ పునరాగమనం మాత్రం పూర్తిగా అతని వన్డే, టి20 ఫామ్‌ను చూసే జరిగిందని చెప్పవచ్చు. దక్షిణాఫ్రికా గడ్డపై రెండు టెస్టుల్లో 10, 47, 11, 10 పరుగులు చేసిన తర్వాత మూడో టెస్టుకు దూరమై ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక కాని రోహిత్ ఆ తర్వాత ఎలాంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడలేదు. ఆసియా కప్‌లో జట్టును గెలిపించిన అనంతరం విజయ్ హజారేలో రెండు వన్డేలు, విండీస్‌తో మరో రెండు వన్డేలు ఆడాడు. పంత్ ప్రధాన కీపర్‌గా ఎదగగా... సాహా గాయం నుంచి కోలుకోకపోవడంతో సెలక్టర్లు మళ్లీ వెటరన్ పార్థివ్ పటేల్‌కే తమ ఓటు వేశారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు టెస్టులు ఆడిన అనంతరం అతను ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వచ్చింది. 2003–04 సిరీస్‌లోనే ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన పార్థివ్ ఇప్పుడు జట్టులో అక్కడి అనుభవంరీత్యా అందరికంటే సీనియర్ కానున్నాడు! విండీస్‌తో సిరీస్‌లో జట్టులో ఉన్నా మ్యాచ్ దక్కని ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి కూడా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లభించింది. ఐదుగురు ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేశ్ యాదవ్లకే కట్టుబడిన సెలక్టర్లు అశ్విన్, జడేజాలతో పాటు మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ను కూడా ఎంపిక చేయడం విశేషం. ప్రాక్టీస్ కోసం ముందుగా... ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే తొలి నాలుగు రోజుల మ్యాచ్ కోసం భారత్ ‘ఎ’ జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. అయితే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం టెస్టు జట్టులో భాగంగా ఉన్న పలువురు ఆటగాళ్లను ఇందులోకి ఎంపిక చేశారు. రహానే కెప్టెన్సీలో విజయ్, పృథ్వీ షా, విహారి, రోహిత్, పార్థివ్ ఈ మ్యాచ్ ఆడనున్నారు. టెస్టుల్లో స్థానం ఆశించిన మయాంక్ అగర్వాల్‌కు ఇక్కడ మాత్రం చోటు లభించింది. హైదరాబాద్ పేసర్ సిరాజ్, ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ కూడా ఈ జట్టులో ఉన్నారు. భారత్ జట్టు 2006 నుంచి ఇప్పటి వరకు 104 టి20 మ్యాచ్‌లు ఆడితే 93 మ్యాచ్‌లలో ధోని భాగంగా ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ధోనికి ఒకే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. విండీస్‌తో, ఆస్ట్రేలియాతో జరిగే టి20ల్లో ధోని ఆడబోవడం లేదు. మేం రెండో వికెట్ కీపర్‌ను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నాం. ఈ విషయంలో పంత్, కార్తీక్ పోటీ పడతారు. అయితే టి20ల్లో ధోని కెరీర్ ముగిసిందని మాత్రం చెప్పలేను. –ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్ ఆసీస్‌తో టెస్టులకు జట్టు: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, రోహిత్, పంత్, పార్థివ్, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్, ఉమేశ్, బుమ్రా, భువనేశ్వర్. న్యూజిలాండ్ ‘ఎ’తో మ్యాచ్‌కు భారత్ ‘ఎ’ జట్టు: రహానే (కెప్టెన్), విజయ్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, విహారి, రోహిత్, పార్థివ్, కృష్ణప్ప గౌతమ్, షాబాజ్ నదీమ్, సిరాజ్, నవదీప్ సైనీ, దీపక్ చహర్, రజనీశ్ గుర్బానీ, విజయ్ శంకర్, కేఎస్ భరత్. వెస్టిండీస్‌తో టి20లకు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాహుల్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, శ్రేయస్, పంత్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్, షాబాజ్ నదీమ్. (నదీమ్ మినహా మిగతా జట్టును ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు ఎంపిక చేశారు. విశ్రాంతి అనంతరం విరాట్ కోహ్లి మళ్లీ కెప్టెన్సీ చేపడతాడు) రోహిత్ శర్మ, విజయ్ -
ఆసియా క్రీడలకు హుసాముద్దీన్
న్యూఢిల్లీ: రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోన్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్‌కు తగిన గుర్తింపు లభించింది. వచ్చే ఆగస్టు–సెప్టెంబర్‌లో ఇండోనేసియా వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టులో హుసాముద్దీన్‌కు (56 కేజీలు) స్థానం దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల హుసాముద్దీన్ ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించాడు. గతవారం జర్మనీలో జరిగిన కెమిస్ట్రీ కప్ అంతర్జాతీయ టోర్నీలో హుసాముద్దీన్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఫలితంగా ఎలాంటి ట్రయల్స్ లేకుండానే అతనికి జట్టులో బెర్త్ ఖాయమైంది. భారత పురుషుల బాక్సింగ్ జట్టు: అమిత్ పంగల్ (49 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ధీరజ్ (64 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు). మహిళల జట్టు: సర్జూబాలా దేవి (51 కేజీలు), సోనియా లాథెర్ (57 కేజీలు), పవిత్ర (60 కేజీలు). -
జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక
రామచంద్రపురం : ఏపీ బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహించే అంతర జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి గన్నమని చక్రవర్తి తెలిపారు. స్థానిక కృత్తివెంటి పేర్రాజు క్రీడా మైదానంలో ఆదివారం క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. అసోసియేష¯ŒS రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ సి.స్టాలి¯ŒS ముఖ్యతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పట్టణ అసోసియేష¯ŒS కార్యవర్గ సభ్యులు పిల్లా వీరవెంకట సత్యనారాయణ, కనకాల వెంకటేశ్వరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పురుషుల జట్టు : జి.జగపతి, జి.జగదీష్, జి.గణేష్, వి.నవీ¯ŒS సాగర్, పి.దుర్గాప్రసాద్, డి.డేవిడ్‌రాజ్, ఎం.శివదుర్గాప్రసాద్ (రామచంద్రపురం), పి.సాయిబాబరాజు, ఎస్.కృష్ణారెడ్డి (అనపర్తి), ఎ¯ŒS.వీరన్న (పిఠాపురం), సంపత్(రాజమండ్రి), సతీష్ (కాకినాడ). మహిళల జట్టు : బి.రమాదేవి, బి.సాయిజ్యోతి, షేక్లహరున్నీశా(రామచంద్రపురం), సుస్మిత, సూర్యకళ, లావణ్య (కాకినాడ), శ్వేత, అనిత, స్రవంతి (పిఠాపురం), తేజశ్వని, నాగదుర్గ (అమలాపురం), పద్మ (రాజమండ్రి). 15 నుంచి పోటీలు పిఠాపురం టౌ¯ŒS : ఈ నెల 15 నుంచి 18 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరులో అంతర జిల్లాల సీనియర్స్ బాస్కెట్ బాల్ పోటీలు నిర్వ హించనున్నారని బాస్కెట్‌బాల్ సంఘం నేత డాక్టర్ సి.స్టాలిన్, కార్యనిర్వాహక కార్యదర్శి ఐ. భీమేష్ ఆదివారం తెలిపారు. పురుషుల, మహిళల జట్ల క్రీడాకారులను రామచంద్రపురంలో ఆదివారం ఎంపిక చేసినట్టు వారు చెప్పారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడా జట్ల ఎంపిక
చిల్లకూరు : కర్నూలు జిల్లాలో అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అండర్– 19 స్కూల్ గేమ్స్ పోటీలకు జిల్లా క్రీడా జట్ల ఎంపికను చిల్లకూరు గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ జోనల్ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. అథ్లెటిక్స్‌లో 100, 200, 800, 1500, 3 కి.మీ, 5కే రన్‌తో పాటు షాట్‌పుట్, జావలిన్ త్రో, డిస్కస్‌త్రో, లాంగ్ జంప్, హైజంప్ పోటీలను నిర్వహించారు. అలాగే గేమ్స్‌కు సంబందించి హ్యండ్‌బాల్ పోటీలను నిర్వహించి ప్రతి ఈవెంట్లోనూ జిల్లా జట్టును ఎంపికచేశారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు గురుకుల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఇబ్రహీం, పీడీలు దుర్గాప్రసాద్, జానకిరామయ్య, పీఈటీలు శ్రీరేష్, రమణయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.