chillakur
-
మూకుమ్మడిగా బావిలోకి దూకారు.. కానీ!
సాక్షి, నెల్లూరు: కుటుంబ సమస్యల కారణంగా ఓ జంట ముగ్గురు పిల్లలతో కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టాలని చూసింది. కలిసికట్టుగా బాలిలోకి దూకి.. మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే, విధి మరోవిధంగా తలిచింది. వారు దూకిన బావిలో నీళ్లు లేవు. దీంతో దంపతులతో సహా వారి ముగ్గురు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకునేందుకు ముగ్గురు పిలలతో కలిసి దంపతులు బావిలో దూకారు. అయితే, బావిలో నీళ్లు లేకపోవడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. -
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడా జట్ల ఎంపిక
చిల్లకూరు : కర్నూలు జిల్లాలో అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అండర్– 19 స్కూల్ గేమ్స్ పోటీలకు జిల్లా క్రీడా జట్ల ఎంపికను చిల్లకూరు గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ జోనల్ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. అథ్లెటిక్స్‌లో 100, 200, 800, 1500, 3 కి.మీ, 5కే రన్‌తో పాటు షాట్‌పుట్, జావలిన్ త్రో, డిస్కస్‌త్రో, లాంగ్ జంప్, హైజంప్ పోటీలను నిర్వహించారు. అలాగే గేమ్స్‌కు సంబందించి హ్యండ్‌బాల్ పోటీలను నిర్వహించి ప్రతి ఈవెంట్లోనూ జిల్లా జట్టును ఎంపికచేశారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు గురుకుల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఇబ్రహీం, పీడీలు దుర్గాప్రసాద్, జానకిరామయ్య, పీఈటీలు శ్రీరేష్, రమణయ్య, ప్రసాద్ పాల్గొన్నారు. -
డివైడర్‌పైకి దూసుకెళ్లిన కంటైనర్
తటిలో తప్పిన ప్రమాదం చిల్లకూరు : డివైడర్‌పైకి కంటైనర్ లారీ దూసుకెళ్లిన సంఘటన శుక్రవారం మండలంలోని జాతీయరహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. కష్ణపట్నం నుంచి చెన్నైకు బయలుదేరిన కంటైనర్ నక్కలకాలువ కండ్రిగ సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ కునుకు తీయడంతో అదుపుతప్పి డివైడర్ ఎక్కి అవతలివైపునకు వచ్చి నిలిపిపోయింది. దీనిని గుర్తించి ఎదురుగా వచ్చే వాహనచోదకులు అప్రమత్తమవడంతో ప్రమాదం తటిలో తప్పింది. విషయం తెలుసుకున్న స్వర్ణ టోల్‌ప్లాజా సిబ్బంది అక్కడకు చేరకుని కంటైనర్ లారీని పక్కకు తీశారు. దీనిపై పోలీసులకు సమాచారంలేదు. -
తాగునీరు అందించేందుకు కృషి
జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి చిల్లకూరు(పెళ్లకూరు) : జిల్లాపరిషత్ నిధులతో ప్రజల దాహార్తి తీర్చేందుకు కషిచేస్తున్నట్లు జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు ఎంపీపీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి చిల్లకూరు గ్రామం, స్వర్ణముఖినది సమీపంలో తాగునీటి పైపులైను ఏర్పాటుకు భూమిపూజ చేశారు. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ తాగునీటి పైపులైన్ నిర్మాణంతో దళితకాలనీలకు తాగునీటి సమస్య తీరుతుందన్నారు. కిలివేటి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజానీకానికి సేవచేసేందుకు తామంతా ముందుంటామన్నారు. అనంతరం జెడ్పీచైర్మన్, ఎమ్మెల్యేలను ఎంపీపీ, సర్పంచ్ బసివిరెడ్డి వెంకటశేషారెడ్డిలు సత్కరించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు మారాబత్తిన సుధాకర్, నాయకులు పగడాల హరిబాబురెడ్డి, లోకేష్‌నాయుడు, శ్రీనివాసులురెడ్డి, రాకేష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కిరణ్, మోహన్, వేణురెడ్డి, మురళీ, శ్రీనివాసులు, మణి, గురవయ్య, ప్రకాష్, గురవయ్య, సుధాకర్ పాల్గొన్నారు. -
బావిలో పడి నాయనమ్మ, మనవరాలు మృతి
చిల్లకూరు : నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఐదవ తరగతి విద్యార్థిని నాగలక్ష్మి బట్టలు ఉతికేందుకు గ్రామంలోని నేల బావిలోకి దిగి ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయింది. కాపాడేందుకు వెళ్లిన ఆమె నాయనమ్మ పోలమ్మ (60) కూడా నీళ్లలో మునిగి ప్రాణాలు విడిచింది. నాయనమ్మ, మనవరాళ్ల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిల్లకూరు: బైక్‌పై వేగంగా వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై అడ్డంగా వచ్చిన గేదేను ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిఅక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు..మండలంలోని అంకుల్పాటూరులో ఉన్న ఎస్‌బీక్యూ ఉక్కు పరిశ్రమలో గోవర్ధన్‌రెడ్డి(36) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. కాగా, మంగళవారం విధుల్లో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తుండగా మార్గ మధ్యలో గేదే అడ్డురావడంతో ఢీ కొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేశారు. -
రెండు లారీలు ఢీ, ఇద్దరికి గాయాలు
చిల్లకూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అమరావతి హోటల్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నుంచి సిమెంట్ లోడుతో చెన్నైకి వెళుతున్న లారీ చిల్లకూరు మండలం అమరావతి హోటల్ సమీపంలో ఆగి ఉన్న ఓ బొగ్గు లారీని ఢీకొంది. డ్రైవర్ జాకీర్ నిద్ర మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ జాకీర్‌తోపాటు క్లీనర్ తీవ్ర గాయాలతో క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. ఎస్ఐ అంకమ్మ ప్రమాదస్థలికి చేరుకుని డ్రైవర్, క్లీనర్లను బయటకు తీసి 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
మృత్యుశకటం
ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో ఆనందంగా గడిపారు ఆ చిన్నారులు. సోమవారం ఉదయాన్నే స్కూలుకెళ్లేందుకు భారంగా నిద్రలేచారు. ఓ వైపు చలి వణికిస్తున్నా తల్లిదండ్రులు వారిని త్వరత్వరగా ముస్తాబు చేసి స్కూలుకు పంపేందుకు భోజనం క్యారియర్లు సిద్ధం చేశారు. అమ్మానాన్నలకు టాటా..చెప్పి ఆటో ఎక్కిన ఆ పిల్లలు కాసేపటికే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. * ఆటోను ఢీకొన్న స్కూలు బస్సు * ఇద్దరు చిన్నారుల దుర్మరణం * 14 మందికి తీవ్రగాయాలు * ముగ్గురి పరిస్థితి విషమం చిల్లకూరు: ఆటోలో స్కూల్‌కు బయలుదేరిన చిన్నారుల పాలిట ఓ ప్రైవేటు స్కూల్ బస్సు మృత్యుశకటంగా మారింది. వేగంగా వచ్చిన బస్సు ఆటోను ఢీకొనడంతో మోడిబోయిన వెంకీ(7), దొడ్డగ వినయ్(7) మృతిచెందగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే ఇళ్ల నుంచి బయలుదేరిన తమ పిల్లలు ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తీపనూరు సమీపంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..తీపనూరుకు చెందిన వెంకీ, వినయ్, శ్రీ వంశీ, భావన, శ్రీదివ్య చిల్లకూరులోని ఎస్‌కెఆర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో యూకేజీ చదువుతున్నారు. చిల్లకూరు సమీపంలోని ఎల్ఏపీ పాఠశాలలో చదువుతున్న అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్, దినేష్, చరణ్‌తేజ, సుశాంక్, సునీల్, శ్రీహరి,రక్షిత, జగన్‌తో పాటు చిల్లకూరులోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదివే సుజీ విమలాదేవి, మౌనిక ఒకే ఆటోలో బయలుదేరారు. గ్రామాన్ని దాటిన కొద్దిసేపటికే వీరి ఆటో ప్రమాదానికి గురైంది. గూడూరు నుంచి పిల్లల కోసం బయలుదేరిన ఓ కార్పొరేట్ స్కూలు బస్సు వేగంగా వస్తూ ఆటోను ఢీకొంది. కొంతదూరం ఆటోను ఈడ్చుకెళ్లడంతో అందులోని విద్యార్థులతో పాటు డ్రైవర్ రాఘవయ్య తీవ్రగాయాలపాలయ్యారు. మౌనిక వెంటనే తేరుకుని గ్రామం వైపు పరుగుతీసింది. ఓడూరు వైపు నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తమ పెద్దలకు సమాచారం ఇవ్వాలని కోరింది. వారిలో ఒకరు 108, 100కు సమాచారం అందించగా మరొకరు తీపనూరుకు వెళ్లి గ్రామస్తులకు ప్ర మాదవిషయాన్ని తెలియజేశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన పిల్లల తల్లిదండ్రులు ఆందోళనగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపు గూ డూరు, చిల్లకూరు, కోట నుంచి 108 అంబులెన్స్‌లు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను గూ డూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్యం అందే పరిస్థితి లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకి, వంశీ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో మిగిలిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌ల్లో నెల్లూరులోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో చరణ్‌తేజ, సుశాంక్, జగన్ పరిస్దితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఏరియా ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. వివరాల సేకరణ ఘటన జరిగిన వెంటనే డీఈఓ ఆంజనేయులు, గూడూరు ఆర్డీఓ రవీంద్ర, డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు చిల్లకూరు తహశీల్దార్ శ్రీకాంత్కేదారినాథ్, ఎంపీడీఓ చిరంజీవి, డిప్యూటి డీఈఓ మంజులాక్షి, ఎంఈఓ మధుసూదన్‌రావు ఆసుపత్రి వద్దకు చేరుకుని వివరాలను సేకరించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. మృతదేహాల అప్పగింత వెంకి, వినయ్ మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన స్కూలు బస్సు డ్రైవర్ కాలేషాను పోలీసులు అదుపులోకి తీసుకోగా క్లీనర్ శ్రీను పరారీలో ఉన్నాడు. ఎస్సై దశరథరామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.