తాగునీరు అందించేందుకు కృషి
తాగునీరు అందించేందుకు కృషి
Published Fri, Aug 5 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
చిల్లకూరు(పెళ్లకూరు) : జిల్లాపరిషత్ నిధులతో ప్రజల దాహార్తి తీర్చేందుకు కషిచేస్తున్నట్లు జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు ఎంపీపీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి చిల్లకూరు గ్రామం, స్వర్ణముఖినది సమీపంలో తాగునీటి పైపులైను ఏర్పాటుకు భూమిపూజ చేశారు. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ తాగునీటి పైపులైన్ నిర్మాణంతో దళితకాలనీలకు తాగునీటి సమస్య తీరుతుందన్నారు. కిలివేటి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజానీకానికి సేవచేసేందుకు తామంతా ముందుంటామన్నారు. అనంతరం జెడ్పీచైర్మన్, ఎమ్మెల్యేలను ఎంపీపీ, సర్పంచ్ బసివిరెడ్డి వెంకటశేషారెడ్డిలు సత్కరించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు మారాబత్తిన సుధాకర్, నాయకులు పగడాల హరిబాబురెడ్డి, లోకేష్‌నాయుడు, శ్రీనివాసులురెడ్డి, రాకేష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కిరణ్, మోహన్, వేణురెడ్డి, మురళీ, శ్రీనివాసులు, మణి, గురవయ్య, ప్రకాష్, గురవయ్య, సుధాకర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement