
విరాట్ కోహ్లి-అనుష్క జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందమైన సెలబ్రిటీ జంటగా పేరుగాంచిన ఈ ఇద్దరు ఏ వేడుకకైన జంటగానే హాజరవ్వుతారు. ఫ్యాషన్ పరంగా కూడా ఇద్దరూ స్టైలిష్ ఐకాన్‌లుగా ట్రెండ్‌కి తగ్గట్టు ఉంటారు. అలాగే ఇద్దరు కూడా ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్‌గా ఉంటారు.
వ్యాయామ సెషన్ నుంచి నిద్ర వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంలో ఈ జంట చాలా ప్రత్యేకం. మాములుగా ఏజ్‌ని బట్టి, పరిస్థితుల రీత్యా డైట్‌ని మారుస్తు కాస్త హెల్తీగా మార్పులు చేసకోవడం సహజం. కానీ వీళ్లు ఏకంగా తాగే నీళ్ల విషయంలో కూడా మార్పులు చేశారు. అదికూడా వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న నీళ్లను తాగుతారట. వీళ్లు ఎవియన్ అనే సరస్సు నుంచి వచ్చే నేచురల్ స్ప్రింగ్ వాటర్ (భూమి నుంచి సహజసిద్ధంగా వచ్చేది) తాగుతారట.
అంతేగాదు నివేదికల ప్రకారం ఎవియన్-లెస్-బెయిన్స్ సరస్సులోని నీరు ఎటువంటి రసాయనాలతో కలుషితం కాలేదని వెల్లడయ్యింది. ముఖ్యంగా ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందట. ఎవియన్-లెస్-బెయిన్స్ జెనీవా సరస్సు దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది పశ్చిమ ఐరోపాలోని అతి పెద్ద సరస్సులలో ఒకటి. దీన్ని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు పంచుకుంటున్నాయి. అంతేగాదు ఒక లీటరు ఎవియన్ బాటిల్ ధర దాదాపు రూ. 600ల దాక ఉంటుంది. అంటే ప్రతిరోజు రెండు లీటర్ల నీటిని తీసుకుంటే రూ. 1200 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఒక లీటర్ ఎవియాన్ బాటిళ్లు డజను వచ్చేటప్పటికీ ఏకంగా రూ. 4200/ పలుకుతుంది.
(చదవండి: వర్కౌట్ సెషన్‌లో రకుల్‌కి వెన్ను గాయం..అలా జరగకూడదంటే..!)
Comments
Please login to add a commentAdd a comment