డివైడర్‌పైకి దూసుకెళ్లిన కంటైనర్
Published Sat, Aug 6 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
తటిలో తప్పిన ప్రమాదం
చిల్లకూరు : డివైడర్‌పైకి కంటైనర్ లారీ దూసుకెళ్లిన సంఘటన శుక్రవారం మండలంలోని జాతీయరహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. కష్ణపట్నం నుంచి చెన్నైకు బయలుదేరిన కంటైనర్ నక్కలకాలువ కండ్రిగ సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ కునుకు తీయడంతో అదుపుతప్పి డివైడర్ ఎక్కి అవతలివైపునకు వచ్చి నిలిపిపోయింది. దీనిని గుర్తించి ఎదురుగా వచ్చే వాహనచోదకులు అప్రమత్తమవడంతో ప్రమాదం తటిలో తప్పింది. విషయం తెలుసుకున్న స్వర్ణ టోల్‌ప్లాజా సిబ్బంది అక్కడకు చేరకుని కంటైనర్ లారీని పక్కకు తీశారు. దీనిపై పోలీసులకు సమాచారంలేదు.
Advertisement
Advertisement