రాష్ట్రస్థాయి పోటీలకు స్విమ్మర్ల ఎంపిక | Swimmers selected for state tourney | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు స్విమ్మర్ల ఎంపిక

Published Mon, Sep 12 2016 1:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

రాష్ట్రస్థాయి పోటీలకు స్విమ్మర్ల ఎంపిక - Sakshi

రాష్ట్రస్థాయి పోటీలకు స్విమ్మర్ల ఎంపిక

 
నెల్లూరు(బృందావనం):  ఈ నెల 18 నుంచి విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు జిల్లా స్విమ్మర్ల ఎంపికను ఆదివారం నిర్వహించారు. జిల్లా అమెచ్యూర్‌ ఆక్వాటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఏసీ సుబ్బారెడ్డి క్రీడా ప్రాంగణంలోని స్విమ్మింగ్‌పూల్‌లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభకనబర్చిన 30 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డీవీ రమణయ్య, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా కోశాధికారి పసుపులేటి రామమూర్తి, స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పిట్టి ప్రసాద్, జిల్లా పీఈటీల అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌ కృష్ణారెడ్డి పోటీలను పర్యవేక్షించారు. 
 ఎంపికైన క్రీడాకారులు వీరే.
స్విమ్మింగ్‌ పోటీలకు ఎంపికైన 30మంది క్రీడాకారుల వివరాలను జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి సనత్‌కుమార్‌ ప్రకటించారు. ఎం పెంచలయ్య, ఆర్‌ హరిసింగ్, వీఎస్‌.సెల్వం, చొక్కలింగం, వెంకటశేషయ్య, కే శంకర్‌నారాయణ, పీ వెంకటసుబ్బయ్య, ఏఎం శేఖర్, కే శివారెడ్డి, తులసి, పీ వెంకటరత్నం,  ఎన్‌ శ్రీనివాసులు, కిషోర్, ఆర్‌ వెంకటేశ్వర్లు, కే కమలాకర్, సుబ్బయ్య, శ్రీహరి, జీ కృష్ణారెడ్డి, ఎన్‌ శేఖర్, రఫీ,  అబ్దుల్లా, నాగరాజు, నితిన్, సురేష్‌ , మస్తాన్‌బాబు, రవి, మురళి, మ«ధు,  తదితరులు ఎంపికైన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement