గూడూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : ప్రమాదానికి గురైనవారిని రక్షించడానికి వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా గూడూరు జాతీయరహదారి పై ఉన్న ఆదిశంకర కాలేజీ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగింది.
వివరాల ప్రకారం.. గూడూరు నుంచి నెల్లూరు వెళ్తున్న అంబులెన్స్ కాలేజీ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని వెంటనే మరో అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి చెన్నైకి తరలించారు.
బోల్తా పడిన అంబులెన్స్
Published Fri, Oct 23 2015 6:41 PM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM
Advertisement
Advertisement