క్రీడా స్పూర్తిని పెంపొందించడమే లక్ష్యం
-
ఉత్సాహంగా 1–కె, 2–కె రన్
గూడూరు:
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు 1–కె, 2–కె రన్‌ల లక్ష్యమని మున్సిపల్ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ అన్నారు. జిల్లా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ కోట సునీల్‌కుమార్ సహకారంతో స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో విద్యార్థినులకు 1–కె రన్, విద్యార్థులకు 2–కె రన్‌లను బుధవారం ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, చైర్‌పర్సన్ ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఆటలకు దూరం అయ్యారన్నారు. వారిని క్రీడలపై మక్కువ పెంచేందుకు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు జేడీ సుందరరావు మాట్లాడారు. అనంతరం బాలికలు, బాలుర విభాగాల్లో జీఎస్‌రాయలు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులైన హేమలత, మౌరేంద్రలకు నగదు, మెమోంటోలను అందజేశారు. అలాగే ద్వితీయ, తృతీయ, చతుర్ద, పంచమ స్థానాల్లో విజేతలకు నగదు, మెమోంటొలను అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు సుందరరామయ్య, కార్యదర్శి జిలానీ పాల్గొన్నారు.