బరి నుంచి తప్పుకోనున్న మురళీకృష్ణ? | general election nominations | Sakshi
Sakshi News home page

బరి నుంచి తప్పుకోనున్న మురళీకృష్ణ?

Published Mon, Apr 21 2014 12:09 AM | Last Updated on Tue, Oct 2 2018 2:53 PM

general election nominations

 గూడూరు, న్యూస్‌లైన్: కోడుమూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పి.మురళీకృష్ణ ఎన్నికల బరి నుంచి తప్పుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. మొదటి నుంచి ఆయన పోటీకి విముఖత చూపుతున్నా.. ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఒత్తిళ్ల నేపథ్యంలో అయిష్టంగానే బరిలో నిలిచినట్లు తెలిసింది.
 
  ఈ నెల 15న ఆయన నామినేషన్ దాఖలు చేసినా.. ప్రచారపర్వంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో పోటీ చేసి ఆర్థికంగా నష్టపోవడం ఎందుకని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. ఆయా మండలాల నాయకులు ప్రచారంలో భాగంగా డబ్బులు ఇవ్వమని మురళిని కోరగా.. తాను పైసా కూడా ఇవ్వనని, పెద్దాయననే అడగాలంటూ గద్దించారని వినికిడి.

నామినేషన్ల ఉపసంహరణ రోజున ఆయన పోటీ నుంచి తప్పుకోవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలాఉండగా మొదటి నుంచి మురళిపై అనుమానం ఉండటంతోనే మాజీ ఎమ్మెల్యే ఎం.మదనగోపాల్‌చే కాంగ్రెస్ ముఖ్య నేతలు నామినేషన్ వేయించినట్లు చర్చ జరుగుతోంది. ఈ నెల 23వ తేదీన ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement