గూడూరు : వరకట్న వేధింపులతో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గూడూరు మండలంలోని రాములు తండా శివారు సాంబయ్యపల్లిలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి నానమ్మ, తాతయ్య, తండ్రి భద్య కథనం ప్రకారం... సాంబయ్యపల్లికి చెందిన మాలోతు భద్య కూతురు అనూష (19), నర్సంపేట డివిజన్ చెన్నారావుపేట మండలం పాపయ్యపేట శివారు పంతుల్యతండాకు చెందిన లావుడ్య బాలుకు రెండు నెలల క్రితం వివాహమైంది. ఆ సమయంలో వరకట్నంగా రూ.3లక్షలు ఒప్పుకోగా... అందు లో రూ. 2 లక్షలు ముట్టజెప్పారు. మిగతా డబ్బులు వచ్చే సం వత్సరం ఇస్తామని అనూష తల్లిదండ్రులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
కూతురు పెళ్లి అయిన తర్వాత తండ్రి భద్య తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో కూలీ పనులకు వెళ్లారు. సాంబయ్యపల్లిలో భద్య తల్లిదండ్రులు చావలి, ఈర్య ఉంటున్నారు. అయితే పెళ్లైన కొద్ది రోజుల నుంచే బాలు... అనూషను అనుమానించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బాలు తల్లిదండ్రులు జానకి, గరీభాఇవ్వాల్సి లక్ష వరకట్నం కూడా కావాలంటూ అనూషను దూషించేవారని చెప్పారు. రెండు రోజుల క్రితం భర్త, అత్తామామ వేధింపులకు తట్టుకోలేని అనూష సాం బయ్యపల్లిలోని నానమ్మ, తాత య్య దగ్గరకు వచ్చింది. అత్తగారింట్లో జరిగిన విషయాన్ని వారికి చెప్పి, మనోవేదనకు గురైంది. ఈ విషయాన్ని వారు కొడుకు భద్యకు తెలియజేశారు.
బాలు, అతడి తల్లిదండ్రులతో మాట్లాడి అనూషను పంపించి రమ్మని భద్య వారికి చెప్పాడు. దీంతో కూలీకి వెళ్లొచ్చి మధ్యాహ్నం వచ్చాక అత్తగారింటికి తీసుకెళ్తాం...తయారు కమ్మని అనూషకు చెప్పి వెళ్లారు. తిరిగి వారు ఉదయం 10 గంటలకు ఇంటికి వచ్చే సరికి చీరతో ఉరి వేసుకుని మృతి చెంది ఉంది. వారు బోరున విలపించడంతో తండావాసులు అక్కడికి చేరుకున్నారు. సెల్‌ఫోన్‌లో కూతురు మృతి విషయాన్ని భద్యకు, పోలీసులకు తెలియజేశారు. మృతురాలి తండ్రి భద్య పిర్యా దు మేరకు వరకట్న వేధింపులతోపాటు భర్తపై అనుమాన వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.