లారీ ఢీకొని బాలుడి మృతి | boy dies in lorry accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని బాలుడి మృతి

Published Wed, Aug 19 2015 3:01 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

boy dies in lorry accident

గూడూరు: నెల్లూరు జిల్లా గూడూరులో ఓ లారీ బాలుడి ప్రాణాలు బలి తీసుకుంది. నగరంలోని ఎస్ఆర్ టాకీస్ సెంటర్ సమీపంలో సైకిల్‌పై వస్తున్న బాలుణ్ని సైదాపురం నుంచి కంకర లోడుతో వస్తున్న లారీ ఢీకొంది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన బాలుడు (12) అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతి చెందిన బాలుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement