
సాక్షి, నెల్లూరు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 73వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన కొండగుంట నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి పాలిచెర్ల, గాంధీనగర్ చేరుకుంటారు. భోజన విరామం అనంతరం ఇందిరమ్మ కాలనీ మీదగా గూడురు కోర్టు సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.
తిమ్మసముద్రం క్రాస్ వద్ద ముగిసిన పాదయాత్ర
నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం తిమ్మసముద్రం క్రాస్ వద్ద వైఎస్ జగన్ 72వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ఇవాళ ఆయన 14.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. గుర్రంకొండ, ఆర్మనుపాడు, కాండ్ర, వెంకటేశుపల్లి మీదగా తిమ్మసముద్రం క్రాస్ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 980.5 కిలోమీటర్లు నడిచారు.