
గూడురు ఎమ్మెల్యే సునీల్
సాక్షి, నెల్లూరు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీల ఏర్పాటుపై గూడురు ఎమ్మెల్యే సునీల్ ఓవరాక్షన్ చేశారు. శనివారం గూడురు నియోజకవర్గంలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా స్వాగతం పలుకుతూ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఎమ్మెల్యే.. స్థానికులను బెదిరించడంతో వైఎస్‌ఆర్ సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు. కాగా వైఎస్‌ఆర్ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన సునీల్... ‘పచ్చ’ ప్రలోభాలతో పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment