MLA sunil kumar
-
ఎమ్మెల్యే ఓటుకే ఎసరు
సాక్షి, చిత్తూరు : రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపునకు టీడీపీ ప్రభుత్వం మరింతగా బరితెగిస్తోంది. ఏకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఓటు తొలగింపునకు ప్రయత్నించింది. తాజాగా వైఎస్సార్సీపీ పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఓటుకు ఎసరు పెట్టింది. తన ఓటు తొలగింపునకు దరఖాస్తు వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారని సునీల్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉద్దేశపుర్వకంగానే వైఎస్సార్సీపీ నేతల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఫారమ్- 7 దరఖాస్తులు లక్షా పది వేలు దాటాయని వెల్లడించారు. మొన్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి ఓటు తొలగించగా, నేడు ఎమ్మెల్యే ఓటు తొలగించేందుకు దరఖాస్తులు వచ్చాయని వాపోయారు. చంద్రబాబు తన పచ్చ మీడియాతో తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారని విమర్శించారు. ఓట్లు తొలగింపు విషయంలో తన తప్పును కప్పి పుచ్చేందుకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు దొంగాట ఆడుతున్నారని మండిపడ్డారు. -
గూడూరులో ఎమ్మెల్యే సునీల్ ఓవరాక్షన్
సాక్షి, నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీల ఏర్పాటుపై గూడురు ఎమ్మెల్యే సునీల్ ఓవరాక్షన్ చేశారు. శనివారం గూడురు నియోజకవర్గంలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా స్వాగతం పలుకుతూ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఎమ్మెల్యే.. స్థానికులను బెదిరించడంతో వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు. కాగా వైఎస్ఆర్ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన సునీల్... ‘పచ్చ’ ప్రలోభాలతో పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. -
తొమ్మిది పథకాలతో రాజన్న స్వర్ణయుగం
– పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ – రాజకీయాలకు అతీతంగా పథకాల పంపిణీ – పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం – వైఎస్సార్సీపీ ప్లీనరీతో అధికార పార్టీలో గుబులు బంగారుపాళెం: పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేందుకు నవరత్నాల్లాంటి పథకాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగనన్న వస్తున్నాడని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మళ్ళీ రాజన్న పాలనను తీసుకువచ్చేందుకు ప్లీనరీలో ప్రకటించిన తొమ్మిది పథకాలు ప్రజలతో పాటుగా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహన్ని నింపిందన్నారు. 2019లో పార్టీ అధికారం రాగానే ప్రజలు రాజన్న పాలనను చూడబోతున్నారని చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ రైతు భరోసాతో రైతులకు, వైఎస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. వృద్ధులు, వికలాంగులకు వెయ్యి నుండి 2 వేల రూపాయల ఫించన్ పెంపు, అమ్మఒడి ద్వారా విద్యార్థులకు నగదు ప్రొత్సాహాలను అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ , ఆరోగ్యశ్రీ నిధులు, నిరుపేదలకు 25 లక్షల ఇండ్ల నిర్మాణాలు, జలయజ్ఞంతో రాష్ట్రంలో ప్రాజెక్టుల పూర్తి, మద్యపాన నిషేదం పథకాలతో నవ్యాంద్రను అభివృద్ధి బాట వైపుకు తీసుకు వెళ్ళనున్నట్లు తెలిపారు. పార్టీ ప్రకటించిన ప్రతి పథకాన్ని గ్రామాలకు వెళ్ళి ప్రజలకు తెలియజేస్తామన్నారు. పాదయాత్ర ద్వారా జగనన్న ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోనున్నారని చెప్పారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. ప్లీనరీకి వచ్చిన ప్రజానికాన్ని చూసి అధికార తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు పుట్టిందన్నారు. కనీస అవగాహనలేని లోకేష్ ను మంత్రిని చేశారని, ఆయన ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదన్నారు. ప్రజలు టీడీపీకి చరమగీతం పాడనున్నట్లు చెప్పారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి పార్టీ ప్లీనరికి విచ్చేసిన కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వికలాంగుల కష్టాలు
సదరమ్ క్యాంప్‌నకు వేలాదిగా తరలివచ్చిన బాధితులు వసతులు కల్పించని అధికారులు గూడూరు టౌన్ : స్థానిక డీఎన్ఆర్ కమ్యూనిటీహాల్లో మంగళవారం జరిగిన సదరమ్ క్యాంపునకు గూడూరు, నాయుడుపేట డివిజన్ పరిధిలోని వికలాంగులు వేలాదిగా తరలిరావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వికలాంగులకు సరైన వసతులు కల్పించకపోవడంతో అవస్థలు పడ్డారు. సదరన్ క్యాంప్‌ను ఏజెసీ రాజ్‌కుమార్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ వాణి, ఆర్డీఓలు ప్రారంభించారు. వేలాదిగా వచ్చిన వికలాగుల ధ్రువపత్రాలు పరిశీలించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. జూన్ 2వ తేదీన వారికి అవసరమైన పరికరాలను అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వికలాంగుల సదరమ్ క్యాంపునకు వచ్చిన పలువురు వికలాంగులకు భోజన వసతి కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ధ్రువపత్రాలను పరిశీలించి వారికి అవసరమైన పరికరాలను ఎంపిక చేసేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామాల్లో సరైన సమాచారం లేకపోవడంతోనే రెండు డివిజన్ల నుంచి వేలాదిగా వికలాం గులు తరలివచ్చారు. ఆర్డీఓ రవీంద్ర, ము న్సిపల్ చైర్పర్సన్ దేవసేన, కమిషనర్ ప్రమీల, తహశీల్దార్ వెంకటనారాయణమ్మ, ఎంపీడీఓ పాల్గొన్నారు. అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం సదరమ్ క్యాంప్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు వికలాంగులు తమ కష్టాలను మొర పెట్టుకున్నారు. సదరమ్ క్యాంప్‌నకు సంబంధించి అధికారులు వికలాంగులకు, ప్రజాప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ సదరమ్ క్యాంప్ ఏర్పాటు చేసే సమయంలో గతంలో వికలాంగులకు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించి అవసరమైన వారికి పరికరాలు ఇస్తామన్న పూర్తి సమాచారాన్ని గ్రామాల్లో తెలియజేయకపోవడం తగదన్నారు. ఏడీ వాణి స్పందిస్తూ స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, గ్రామాల్లో ధ్రువపత్రాలు పొందిన వికలాంగులను మాత్రమే హాజరు కావాలని సమాచారం ఇచ్చామన్నారు. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ దీక్ష భగ్నం
చిత్తూరు: జిల్లాలోని ఐరాల మండల వ్యాప్తంగా తొలగించిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు బలవంతంగా సునీల్ కుమార్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. -
పింఛన్ల పునరుద్ధరణ కోరుతూ ఎమ్మెల్యే దీక్ష
ఐరాల: చిత్తూరు జిల్లాలోని ఐరాల మండల వ్యాప్తంగా తొలగించిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం వైఎస్సార్సీపీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం కమిటీల నిర్ణయం మేరకు తొలగించిన పింఛన్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిరాహారదీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు తదితరులు మద్దతు తెలిపి ప్రభుత్వ దమననీతిని ఎండగట్టారు. పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వచ్చారు.