పంట సాగుకు అధికంగానే ఖర్చవుతోంది. పురుగు మందులతోపాటు, కాంప్లెక్స్ ఎరువుల వాడకం కూడా ఎక్కువే. సాగు పూర్తయ్యే నాటికి రూ.50 వేల వరకు ఖర్చుపెట్టారు. నాటు మిరప బాగాపండితే ఎకరానికి సుమారు 15 క్వింటాళ్ల వరకు పండుతాయి. సరాసరిన 10 క్వింటాళ్లు పండినా ప్రస్తుతం ఉన్న ధరలను బట్టి ఎకరానికి రూ.2.50 లక్షలకు పైగానే ఫలసాయం వస్తుంది. దీంతో పెట్టుబడి ఖర్చులు పోను సుమారు రూ.2 లక్షల ఆదాయం రావాలి. అయితే పరిస్థితి తారుమారైంది.
ఏంటో ఈ పరిస్థితి.. ప్రస్తుతం నాటు మిర్చి ధరలకు హైబ్రిడ్ మిర్చి ధరలకు నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎన్నడూ లే ని విధంగా నాటు మిర్చి క్వింటా ధర రూ.25 వేలకు పైగా పలుకుతుండగా, హైబ్రిడ్ రకాల మిర్చి ధర గణనీ యంగా పడిపోయి క్వింటా కేవలం రూ.7 వేలు ఉంది. ఇక నాటు రకం సాగు చేసిన రైతులు దిగుబడులు అం తంత మాత్రంగా ఉండటంతో ఖర్చులకు సరిపోతుం ద ని చెబుతున్నారు. మార్కెట్‌లో నాటు రకం ఎండు మిర్చి ధర కిలోరూ.300 పలుకుతుండగా,హైబ్రీడ్ రకాల మిర్చి మాత్రం కిలో కేవలం రూ.100 పలుకుతోంది.ఈ తరహా లో వ్యత్యాసం ఎన్నడూ లేదని రైతులు వాపోతున్నారు.
హైబ్రీడ్ సాగు చేసి తీవ్రంగా నష్టపోయాం.. హైబ్రీడ్ రకం రెండెకరాల్లో సాగు చేస్తే రూ.1.60 లక్షలు పెట్టుబడులయ్యాయి. ధరలు చాలా తక్కువగా ఉండటంతో పెట్టుబడులైనా వస్తాయనే నమ్మకం లేకుండా పోతుంది. – నారాయణరెడి, కొండాగుంట, గూడూరు రూరల్ .
ధరల్లో ఇంత తేడా ఎప్పుడూ లేదు.. సుమారుగా అందరం హైబ్రీడ్ రకాలే ఎక్కువగా సాగు చేశాం. పెట్టుబడులు మాత్రం ఏ రకానికైనా ఒక్కటే. అయితే ధరల్లో తేడా ఈ విధంగా ఉంటుం దనుకోలేదు. పెట్టుబడులు కూడా వస్తాయనే నమ్మకం లేకుండా ఉంది. - కస్తూరయ్య, చిట్టమూరు మండలం