అన్నదాత ఆగ్రహం: ఫర్నిచర్ ధ్వంసం | farmers face massive losses due to untimely rains | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆగ్రహం: ఫర్నిచర్ ధ్వంసం

Published Fri, Apr 24 2015 5:58 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

farmers face massive losses due to untimely rains

నల్లగొండ: రాత్రనక, పగలనక కష్టపడి చెమటోడ్చి పండించిన పంటకు మద్దతు ధర లభించకపోవడంతో అన్నదాత ఆగ్రహావేశాలకు గురయ్యాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా సుర్యాపేట మార్కెట్ యార్డులో శుక్రవారం చోటుచేసుకుంది.

 

అకాల వర్షాలతో పాడైపోయిన పంటను తక్కువ ధరకు కొంటుండటంతో ఆవేదనకు గురైన రైతులు ఆందోళన బాట పట్టారు. ఒకానొక సమయంలో ఆగ్రహావేశాలకు గురైన అన్నదాతలు అక్కడున్న ఫర్నిచర్, కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. ప్రభుత్వం ముందుకు వచ్చి రైతన్నను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement