12న జాతీయ లోక్ అదాలత్
గూడూరు:
నవంబరు 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసే దిశగా అందరూ కృషి చేయాలని 7వ అదనపు జిల్లా జడ్జి గురప్ప అన్నారు. స్థానిక కోర్డులో గురువారం సాయంత్రం డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ, రూరల్ సీఐలు, ఎస్సైలతోపాటు సీనియర్ సివిల్ జడ్జి ఏడుకొండలు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దివాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కేపీ సాయిరాంలు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతి లోక్ అదాలత్‌లోనూ కేసుల పరిష్కారంలో జిల్లాలోనే గూడూరు ప్రధమ స్థానంలో ఉందన్నారు. గతంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 138 కేసులు పరిష్కారమయ్యాయన్నారు.