National Lok Adalat
-
భార్యా భర్తలను కలిపిన లోక్ అదాలత్
సాక్షి, అమరావతి : విభేదాల కారణంగా విడివిడిగా ఉంటున్న భార్యా భర్తలను జాతీయ లోక్ అదాలత్ కలిపింది. ఇందుకు గాను వారిద్దరినీ హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ గుహనాథన్ నరేందర్ అభినందించారు. ఈ భార్య భర్తలు విజయవాడకు చెందిన వారు. వీరికి 2008లో వివాహమైంది. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ భార్య 2022లో పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసులో వారు రాజీపడి కలిసి ఉండేందుకు సిద్ధపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్‌లు శనివారం జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా హైకోర్టుతో సహా రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్‌లు నిర్వహించారు. జస్టిస్ నరేందర్ హైకోర్టు ప్రాంగణం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విజయవాడ, మచిలీç³ట్నం న్యాయస్థానాల్లో జరిగిన లోక్ అదాలత్‌లను స్వయంగా పరిశీలించారు. హైకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ తర్లాడ రాజశేఖర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరగ్గా.. 175 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.2.90 కోట్ల మేర పరిహారాన్ని అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 377 లోక్ అదాలత్‌లు నిర్వహించారు. మొత్తం 45,898 కేసులు పరిష్కారం కాగా, రూ.64.72 కోట్లు పరిహారంగా చెల్లించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన పోషకులు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సేవాధికార సంస్థ రాష్ట్ర కార్యదర్శి బబిత తెలిపారు. -
హైదరాబాద్ జిల్లాలో 1,02,611 కేసులు పరిష్కారం
నాంపల్లి: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రేమవతి, డీసీపీ జోయెల్ డేవిస్‌తో కలిసి ప్రారంభించారు. ఇందులో రాజీ చేసుకోదలచిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద కేసులు, గృహహింస, చెక్‌బౌన్స్, ప్రి లిటిగేషన్ కేసులు మొత్తం 1,02,611 పరిష్కారం అయ్యాయి. పార్టీలు, న్యాయవాదులు కలిసి పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్‌లో సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అనంతరం ప్రేమవతి మాట్లాడుతూ...క్షణికావేశంలో చేసిన తప్పులను, పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్ సరైన వేదిక అన్నారు. ఒకసారి లోక్ అదాలత్‌లో కేసు రాజీ అయితే మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగే బదులు ఒకేసారి లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకుంటే సమయం వృథా అవ్వకుండా ఉంటుందని, ఈ విషయాన్ని న్యాయవాదులు, పోలీసులు పార్టీలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. న్యాయవాదులు ఈ లోక్‌అదాలత్‌లలో ముఖ్య పాత్ర వహిస్తారని, పార్టీలకు సన్నిహితంగా ఉన్న కారణంగా లోక్ అదాలత్‌ల గురించి పార్టీలకు వివరించి అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్, రెండవ అదనపు ట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి భూపతి, ఆరవ అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి జాన్సన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు జోయెల్ డేవిస్, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్‌లో కేసులు రాజీ కుదిరిన కొంత మందికి అవార్డు కాపీలను అందజేశారు. 1,02,611 కేసులు పరిష్కారం ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 32 బెంచీలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,02,611 కేసులు పరిష్కారం అయ్యాయి. క్రిమినల్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ కోర్టు ప్రాంగణం, మనోరంజన్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ రైల్వే కోర్టు ప్రాంగణం, పురానీ హవేలీ కోర్టు ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో కుటుంబ తగాదా కేసులు–277, చెక్»ౌన్స్ కేసులు–1,615, ఎస్టీసీ కేసులు–98,050, సీసీ ఐపీసీ కేసులు– 2,669 పరిష్కారమయ్యాయి. అలాగే ఈ లోక్ అదాలత్‌లో రూ.3,61,97000 పరిహారం కింద చెల్లించినట్లు కార్యదర్శి రాధికా జైస్వాల్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో... రంగారెడ్డి కోర్టులు: రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి పాల్గొన్నారు. అదాలత్‌లో కేసు రాజీపడితే ఇరు వర్గాలు గెలిచినట్లే అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 9 సంవత్సరాలుగా ఆస్తి తగాదాలతో సతమతమవుతున్న అన్నదమ్ముల మధ్య రాజీ కుదిర్చి..ఇకపై కలిసి మెలిసి జీవించాలని వారికి సూచించారు. ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,04,769 కేసులు పరిష్కారమయ్యాయి. కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి డా.పట్టాబి రామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రవీందర్, ఎసీపీ శ్రీధర్ రెడ్డి, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కస్తూరి బాయ్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 1,11,232 కేసుల పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యాయి. 1,11,232 కేసులు పరిష్కారం కాగా, రూ.46.06 కోట్ల పరిహారం అందజేశారు. పరిష్కారం అయిన కేసుల్లో 97,455 పెండింగ్ కేసులు కాగా, 13,777 ప్రీ లిటిగేషన్ కేసులున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ మార్గదర్శకత్వంలో లోక్ అదాలత్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లో 418 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. రాజీకి ఆస్కారం ఉన్న కేసులను ఇందులో పరిష్కరించారు. ఇదిలా ఉంటే హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 511 కేసులను పరిష్కరించారు. రూ.4.01 కోట్ల పరిహారం అందజేశారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కుంభజడల మన్మధరావు, జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ నేతృత్వంలో కేసుల విచారణ జరిగింది. -
ఒకేరోజు 2,76,861 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన వచ్చింది. ఒకేరోజు రికార్డు స్థాయిలో 2,76,861 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 23,205, వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 2,53,656, ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.145.07 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ పి. నవీన్‌రావు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి రాష్టవ్యాప్తంగా లోక్ అదాలత్‌ను పర్యవేక్షించారు. హైకోర్టులో 233 కేసులు.. హైకోర్టు పరిధిలో జరిగిన అదాలత్ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ. శ్రవణ్‌కుమార్, జస్టిస్ కె.శరత్‌లు పాల్గొన్నారు. హైకోర్టులో 233 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.9.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక జిల్లా కోర్టుల్లో స్థానిక న్యాయమూర్తులు కేసులను పరిష్కరించారు. ‘వినియోగదారుల’కమిషన్ ఆధ్వర్యంలో.. పరస్పర అంగీకారంతో కేసుల పరిష్కారం కోసం చేపట్టిన జాతీయ లోక్ అదాలత్‌లో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పరిధిలోని 13 ఫోరంలలో ఈ కేసులను పరిష్కరించినట్లు రాష్ట్ర కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర కమిషన్‌తో పాటు 10 పాత జిల్లాల పరిధిలోని 12 జిల్లా ఫోరంలలో 355 కేసులను గుర్తించి జాతీయ లోక్ అదాలత్‌కు రిఫర్ చేశారు. వీటిలో 248 కేసులకు సంబంధించి సమాచారం ఇవ్వగా, 74 కేసులను ఒక్కరోజే పరిష్కరించారు. ఈ కేసుల విలువ రూ.2.11 కోట్లు ఉంటుందని కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా రాష్ట్ర కమిషన్ పరిధిలో 29 కేసులను పరిష్కరించారు. -
కేసులలో సామరస్య పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్
సాక్షి, హైదరాబాద్: సివిల్, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులలో వేగవంతమైన, సామరస్య పరిష్కారం కోసం నవంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని స్థాయిలలోని న్యాయస్థానాలలో ఈ లోక్ అదాలత్ జరుగుతుందని జాతీయ న్యాయ సేవల సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఎలాంటి రుసుము లేకుండా లోక్ అదాలత్‌లో ఉచితంగా కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ఇప్పటికే పెండింగ్ ఉన్న కేసులలో న్యాయస్థానానికి రుసుము చెల్లించి ఉంటే గనక లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమైతే వెంటనే ఆయా సొమ్ము రీఫండ్ చేస్తారని జాతీయ న్యాయ సేవల సంస్థ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా నవంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ( ఫలించని వ్యూహాలు.. గ్రేటర్ మెట్రోకు కొత్త కష్టాలు!) -
ఏడున్నర లక్షల కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపుతో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ నిర్వహించిన లోక్ అదాలత్‌కు స్పందన లభించింది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఏడున్నర లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 8,175 ప్రిలిటిగేషన్ కేసులు కాగా, మిగతావి వివిధ రకాలైన పెండింగ్ కోర్టు కేసులు. ఈ కేసుల కింద రూ.109.45 కోట్ల పరిహారం లబ్ధిదారులకు చెల్లించేలా ఆదేశాలిచ్చినట్లు న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రెటరీ, జిల్లా, సెషన్స్ జడ్జి ఎస్.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మూడేళ్లలోపు శిక్ష పడే కేసులు, రాజీకి అవకాశమున్న చిన్న కేసులనే లోక్ అదాలత్‌లో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. మెట్రోపాలిటన్ కోర్టుల్లో 3.55 లక్షల కేసులు: మెట్రోపాలిటన్ కోర్టుల పరిధిలోనే 24 బెంచ్‌లు ఏర్పాటుచేసి, 3,55,727 కేసులు పరిష్కరించినట్లు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాపిరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి, సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ తెలిపారు. రూ.2,43,88,400 పరిహారం చెల్లించాలని ఆదేశాలిచ్చామన్నారు. హైకోర్టులో 629 కేసులు రాజీ: హైకోర్టు లోక్‌అదాలత్‌లో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జస్టిస్ పి.నవీన్‌రావు ఆదేశాల మేరకు ప్రత్యక్ష, పరోక్ష విధానాల్లో ఆసక్తి చూపిన కక్షిదారుల కేసుల్ని రాజీ చేశారు. న్యాయ మూర్తులు జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ సాంబశివనాయుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.యతిరాజులు అధ్యక్షతన వేర్వేరుగా 629 కేసుల్ని పరిష్కరించారు. 1150 మంది లబ్ధిదారులకు రూ.36.60 కోట్ల పరిహారం చెల్లింపులకు ఆదేశించినట్లు కమిటీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యాయి. 22,805 కేసులను ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించగా, రూ.33.60 కోట్ల పరిహారం అందజేశారు. ఈ 22,805 కేసుల్లో 20,489 పెండింగ్ కేసులు కాగా, 2,316 ప్రీ లిటిగేషన్ కేసులున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో 353 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టులో కూడా లోక్ అదాలత్ జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్య మూడు బెంచ్‌లను నిర్వహించారు. మొత్తం 629 కేసులు పరిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, ఏపీ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఏవీ శేషసాయి ఆదేశాలు, మార్గదర్శకత్వంలో లోక్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించామని న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు, లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
లోక్ అదాలత్‌లో 15,607 కేసుల పరిష్కారం
సాక్షి అమరావతి/విజయవాడ లీగల్: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో 15,607 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 15,045 పెండింగ్ కేసులు, 562 ప్రీ లిటిగేషన్ కేసులున్నాయి. రూ.25.50 కోట్లు పరిహారంగా చెల్లించారు. హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 561 కేసులను పరిష్కరించారు. రూ.7.04 కోట్లు పరిహారంగా చెల్లించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ మార్గదర్శకంలో లోక్ అదాలత్ నిర్వహించినట్టు అథారిటీ సభ్య కార్యదర్శి చిన్నం శెట్టి రాజు ఓ ప్రకటనలో తెలిపారు. యాక్సిడెంట్ కేసులో రూ.28 లక్షల పరిహారం ఇదిలా ఉండగా విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో బాధితులకు అత్యధికంగా రూ.28 లక్షల పరిహారాన్ని పూర్తి అదనపు ఇన్చార్జ్ విజయవాడ నగర మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి జి.దుర్గయ్య అందజేశారు. కృష్ణలంకకు చెందిన సమ్మెట పార్థసారథి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ 2018 సెప్టెంబర్ 9న ఆర్టీసీ హయ్యర్ బస్ ఢీ కొట్టడంతో మరణించారు. అతని భార్య నవ్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు రూ.30 లక్షల పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది నరసింహారావు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి బాధితురాలికి రూ.28 లక్షలు పరిహారం వచ్చేలా చేశారు. బార్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో బాధితురాలికి అవార్డ్ కాపీ అందచేశారు. -
లోక్‌అదాలత్‌లో బాధితుడికి రూ.కోటి నష్టపరిహారం
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడపలోని ఎన్జీవో కాలనీకి చెందిన ఆర్ వీర సుదర్శన్‌రెడ్డికి శనివారం జాతీయ లోక్‌అదాలత్‌లో రూ.కోటి పరిహారం లభించింది. 2015లో ఇంపీరియల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫారమ్స్ సంస్థతో పన్నెండు సెంట్ల స్థలం అగ్రిమెంట్ విషయంలో సుదర్శన్‌రెడ్డికి వివాదముంది. దీనిపై ఆయన జిల్లా కోర్టులో కేసు వేశారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా కోర్టులోని మొదటి బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ సమక్షంలో సంస్థ ప్రతినిధులకు సుదర్శన్‌రెడ్డికి మధ్య రాజీ కుదిర్చారు. సుదర్శన్‌రెడ్డికి రూ.కోటి నష్టపరిహారాన్ని వెంటనే అందేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్‌లో పరిష్కారమైన 1446 కేసులలో ఇంత పరిహారం వచ్చిన కేసు ఇదే కావడం విశేషం. -
లోక్ అదాలత్‌ల్లో 18,410 కేసుల పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లు విజయవంతమయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 18,410 కేసులు ఒక్క రోజులో పరిష్కారమయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి లోక్ అదాలత్‌లు ప్రారంభించారు. హైకోర్టులో 6 బెంచ్‌లు ఏర్పాటు చేయగా.. 13 జిల్లాల్లో 330 బెంచ్‌లు విచారణలో పాలు పంచుకున్నాయి. హైకోర్టులో సాయంత్రం 5 గంటల తరువాత కూడా అదాలత్‌లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 18,410 కేసులు పరిష్కారమయ్యాయి. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో 638 కేసులు, మిగిలిన బెంచ్‌ల్లో మరో 328 కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 963 ముందస్తు వివాదాల కేసులు కూడా పరిష్కరించారు. కేసుల పరిష్కారం ద్వారా రూ.38.23 కోట్ల పరిహారాన్ని సంబంధిత కక్షిదారులకు చెల్లిస్తారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ప్రధాన న్యాయమూర్తి పెండింగ్ కేసులపై ప్రధానంగా దృష్టి సారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్ అదాలత్‌లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాల్లోని లోక్ అదాలత్‌లను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. న్యాయాధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పలు శాఖల అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, పోలీసులు,, ప్రభుత్వ న్యాయవాదులు, న్యాయవాదులతో ముందస్తు సమావేశాలు నిర్వహించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు తెప్పించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ నెల 3 నుంచి సాయంత్రం కోర్టు పనివేళలు ముగిశాక లోక్ అదాలత్ కేసులు విచారించారు. మిగిలిన న్యాయమూర్తులు కూడా రాత్రి 8 గంటల వరకు కేసులు విచారించారు. కొన్నిసార్లు కక్షిదారుల్ని కోర్టుకు పిలిపించి, వారి సమక్షంలోనే కేసులు పరిష్కరించి, అక్కడికక్కడే పరిహారం నిర్ణయించారు. ముందస్తు బెంచ్‌ల ద్వారా ఈ నెల 12 వరకు 849 కేసులను పరిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రాకేష్ కుమార్ల సూచనలు, సలహాలతో లోక్ అదాలత్‌లు విజయవంతమయ్యాయని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి డాక్టర్ వీఆర్కే కృపాసాగర్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి తెలిపారు. -
ఒక్క రోజు.. 42 వేల కేసులు!
సాక్షి, హైదరాబాద్: జాతీయ లోక్‌అదాలత్‌లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒక్క రోజులోనే ఏకంగా 42,604 కేసులు పరిష్కారమయ్యాయి. కేసులకు పరిహారంగా రూ.48 కోట్ల వరకూ చెల్లింపులు జరగనున్నాయి. ఏపీలోని 13 జిల్లాల్లో 24,640, తెలంగాణలో 17,974 కేసులు పరిష్కారమయ్యా యి. శనివారం జరిగిన లోక్‌అదాలత్‌లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమైనట్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల న్యాయసేవాధికార సంస్థల సభ్య కార్యదర్శులు మధుసూదన్‌రావు, పీవీ రాంబాబు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఏపీలో పరిష్కారమైన కేసుల్లో 13,625 కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నవి కాగా, మిగిలినవి (11,045) ప్రాథమిక విచార ణ దశలో ఉన్నాయి. తెలంగాణలో పరిష్కారమైన కేసుల్లో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నవి 11,117 కాగా మిగిలిన 6,857 కేసులు ప్రాథమిక దశలో ఉన్నా యి. ఏపీలో రూ.17.28 కోట్లు, తెలంగాణలో రూ. 30.68 కోట్లు చొప్పున పరిహారం ప్రకటించారు. హైకోర్టులో కేసులకు రూ.5 కోట్లు పరిహారం హైకోర్టులో జరిగిన లోక్‌అదాలత్‌లో 71 కేసులు పరిష్కారమయ్యాయి. మోటార్ వాహనాల కేసులు 26, భూసేకరణ, క్రిమినల్, ఇతర రిట్లు, ప్రాథమిక దశలోనే కేసుల పరిష్కారం చేయడం ద్వారా రూ.5 కోట్ల మేరకు పరిహారాన్ని ప్రకటించినట్లు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు తెలిపారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ రమేశ్ రంగనాథన్, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ ఆదేశాల మేరకు లోక్‌అదాలత్‌లను నిర్వహించారు. -
ఆత్మవిశ్వాసం: జడ్జిగా ఎదిగిన జోయితా మోందాల్
సాక్షి: హిజ్రా ఆపేరు వినగానే కొందరికి విపరీతమైన అసహ్యం. సమాజంలో వారిని చాలా చులకనగా చూస్తారు. రోడ్డు మీదనే డబ్బులు అడుగుతారని అవహేలన చేస్తారు. కానీ వారిలో కూడా అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. సహకారం అందిస్తే అద్భుతాలు చేసి చూపిస్తారు. అలా సమాజంతో చీదరింపులు తిన్న ఓ ట్రాన్స్ జెండర్ విధిపై యుద్ధం చేసింది. అవమానాలను, వేధింపులను భరించింది. చివరకు అనుకున్నది సాధించింది. న్యాయ శాష్త్రంలో పట్టాసాధించింది. న్యాయ మూర్తిగా సేవలు అందిస్తోంది. పశ్చిమబెంగాల్‌కు చెందని జోయితా మోందాల్ అబ్బాయిగా పుట్టినా అమ్మాయి లక్షణాలు వచ్చాయి. దీంతో ఇంట్లో వాళ్లు గెంటేశారు. సమాజం ఆమెను వెక్కిరించింది. అయినా కుంగిపోలేదు. కష్టాలకు ఎదురీది కోల్‌కతా వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టాపుచ్చుకుంది. 3 నెలల క్రితం సోషల్ వర్కర్ కేటగిరీ కింద జోయితా జడ్జిగా ఎంపికయ్యారు. ఇప్పుడు బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లా ఇస్లాంపూర్ లోక్ అదాలత్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తోంది. అంతే కాకుండా హిజ్రాల హక్కుల కోసం ఓ ఎన్జీవోను స్థాపించి ఉద్యమాలు నిర్వహించింది.ఇందులో దాదపు మూడు వేల మందిపైగా హిజ్రాలకు సభ్యత్వం ఇచ్చింది. తనలాంటి చీదరింపులు వారికి రాకుండా సామాజిక సేవనే మార్గంగా ఎంచుకొని ముందుకు సాగుతోంది. జీవితంలో ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్న జోయితా. తనలా మిగతా ట్రాన్స్ జెండర్స్ కూడా రాణించి ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తోంది. -
లోక్ అదాలత్‌లో 25 వేల కేసులకు పైగా పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఉభయ రాష్ట్రాల్లో శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో పెద్దసంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. 25 వేలకు పైగా పరిష్కారమైన కేసుల్లో రూ.45.56 కోట్లను పరిహారంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 11,662 కేసులు పరిష్కరించి, రూ.19.31 కోట్లను పరిహారంగా ప్రకటించినట్లు తెలంగాణ న్యాయసేవాధి కార సంస్థ సభ్యకార్యదర్శి బి.ఆర్.మధుసూదన్‌రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 13,938 కేసులు పరిష్కరించి, రూ.26.25 కోట్లను పరిహారంగా ప్రకటించినట్లు ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి పి.వి.రాంబాబు వివరించారు. ఇదిలాఉంటే ఉమ్మడి హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 78 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.3 కోట్లను పరిహారంగా ప్రకటించినట్లు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్య దర్శి ఎస్.వి.రమణమూర్తి తెలిపారు. లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో పాటు ఇతర న్యాయమూర్తులు జస్టిస్ జి.శ్యాంప్రసాద్, టి.రజనీ, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.వి.సీతాపతిలు కేసుల విచారణలో పాలు పంచుకున్నారు. -
138 ఎక్సైజ్ కేసులు పరిష్కారం
భీమవరం: జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో భాగంగా భీమవరం యూనిట్ పరిధిలో 138 కేసులు పరిష్కారమైనట్టు భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసులు శనివారం తెలిపారు. వీటిలో భీమవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 9, నరసాపురంలో 84, పెనుగొండలో 20, తణుకులో 17, ఆకివీడులో 8 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో డీ అడిక్షన్ సెంటన్‌ను ప్రారంభించి పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ గులాబ్‌రాజ్ మద్యం సేవించేవారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజు, కె.వీరబాబు, ఎస్సైలు పి.వెంకటేశ్వరమ్మ, ఎస్.రాంబాబు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో అంతిమతీర్పు
ఏలూరు (సెంట్రల్) : అప్పీలు లేని, న్యాయబద్ధమైన అంతిమ తీర్పు పొందేందుకు లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సునీత అన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరకాలంగా కోర్టుల్లో అపరిష్కృతంగా నిలిచిపోయిన 2,700 పెండింగ్ కేసులు శనివారం జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించటం జరుగుతుందన్నారు. జిల్లాలోని 10 కోర్టుల్లో 22 బెంచీలు ఏర్పాటు చేశామని, జిల్లా కోర్టులో 4 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద రూ. 4 లక్షల చెక్కును జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత చేతులమీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కె.సాయిరమాదేవి, రమాదేవి, కె.సునీత, ఎస్.శ్రీదేవి, ఎల్.శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బినేని విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
రాజీతో ఇరువర్గాలకు విజయం
సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శ్రీసుధ సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల్లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శ్రీసుధ అన్నారు. ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వై.వీర్రాజులతో కలసి శనివారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. కుటుంబ వివాదాలు, సివిల్ కేసులతోపాటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, చిట్‌ఫండ్, ప్రమాద బీమా, రుణాల రికవరీ కోసం బ్యాంకులు వేసిన దాదాపు 2 వేల కేసుల్లో ఇరువర్గాలను ఒప్పించడం ద్వారా సమస్యలు పరిష్కరిం చనున్నామని తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష 26కు వాయిదా 19న జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు మెయిన్స్ పరీక్ష ఉండటంతో సిటీ సివిల్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం జరగనున్న రాత పరీక్ష 26కి వాయిదా పడిందని శ్రీసుధ తెలిపారు. -
జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి
గూడూరు : ఈ నెల 12వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసే దిశగా అందరూ కృషి చేయాలని 7వ అదనపు జిల్లా జడ్జి గురప్ప అన్నారు. ఈ మేరకు స్థానిక కోర్టులో శుక్రవారం సాయంత్రం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దివాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కేపీ సాయిరాంలతోపాటు గూడూరు, ఆత్మకూరు డీఎస్పీలు శ్రీనివాస్, సుబ్బారెడ్డిలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో జిల్లాలోనే గూడూరు ప్రథమ స్థానంలో ఉందన్నారు. గతంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 138 కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ దఫా జరుగబోయే అదాలత్‌లో 400 కేసుల వరకు పరిష్కరించే దిశగా ప్రయత్నించాలన్నారు. దీని కోసం ఒక టీంలా ఏర్పడి కృషి చేయాలన్నారు. ఇలా లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులకు సమయం వృథా కాదన్నారు. అలాగే ప్రభుత్వ ధనం కూడా వృథా కాదన్నారు. -
12న జాతీయ లోక్ అదాలత్
గూడూరు: నవంబరు 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసే దిశగా అందరూ కృషి చేయాలని 7వ అదనపు జిల్లా జడ్జి గురప్ప అన్నారు. స్థానిక కోర్డులో గురువారం సాయంత్రం డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ, రూరల్ సీఐలు, ఎస్సైలతోపాటు సీనియర్ సివిల్ జడ్జి ఏడుకొండలు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దివాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కేపీ సాయిరాంలు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతి లోక్ అదాలత్‌లోనూ కేసుల పరిష్కారంలో జిల్లాలోనే గూడూరు ప్రధమ స్థానంలో ఉందన్నారు. గతంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 138 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. -
జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన
సంగారెడ్డి టౌన్: జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమణనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులు సంయమనం పాటించి రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ కార్యక్రమం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 883 కేసులు పరిష్కారం అయ్యాయని, రూ. 31 లక్షల 89 వేల నష్ట పరిహారం కక్షిదారులకు ఇప్పించామని, రూ.3,37,700లు రీకవరీ చేశామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ పేర్కొన్నారు. ఇందులో ఎంవీ 15, బ్యాంకు 9, సివిల్ 8, క్రిమినల్ 851 కేసులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏడవ అదనపు న్యాయమూర్తి శాంతరాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహేష్‌నాథ్, అదనపు ప్రథమ శ్రేణి జడ్జి హరీష్, న్యాయవాదులు విఠల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సంజీవరెడ్డి, రామరావు, బుచ్చయ్య, చిట్టాగౌడ్, అబ్దుల్‌రబ్, విజయశంకర్‌రెడ్డి, రవీందర్, అనసూయ, మహేష్, విజయ్‌రాజ్, మల్లేశం, సమరసింహారెడ్డి, జ్ఞానోభా, సుభాష్ చందర్, ప్రసాద్ పాటిల్, సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న, సీఐలు ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, నరేందర్, ప్రభాకర్, ఎస్సైలు గణేష్, బాలస్వామి శివలింగం, కోటేశ్వరరావు, యాదవ్రెడ్డి, ఏఎస్సైలు ఆంజనేయులు, రాములు, రాజు క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
8న జాతీయ లోక్ అదాలత్
జహీరాబాద్: ఈనెల 8వ తేదిన జిల్లా జడ్జి ఎం.వి.రమణనాయుడు ఆధ్వర్యంలో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించడం జరుగుతుందని జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజి స్రే్ట్ డి.దుర్గప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌ఆదాలత్‌ను జహీరాబాద్ కోర్టు యందు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ప్రజలందరు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
11న జాతీయ లోక్ అదాలత్
► జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుమలత కర్నూలు(లీగల్): జాతీయ లోక్ అదాలత్‌ను ఈనెల 11న శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ కేసుల పరిష్కారానికి నిర్వహించే లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, ఇన్సూరెన్స్, బ్యాంకు కేసులు, ప్రీ లిటిగేషన్, కుటుంబ కేసులను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 38,490 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఇందులో 15,510 క్రిమినల్ కేసులు, 15 వేలకు పైబడి సివిల్ కేసులు ఉన్నట్లు చెప్పారు. లోక్ అదాలత్‌లో జరిగే కేసుల పరిష్కారానికి అప్పీళ్లు ఉండవని.. ఇరువురు కక్షిదారులు సామరస్యంగా తమ సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు వాపసు పొందవచ్చని, అలాగే చెక్కు బౌన్స్ కేసుల్లో రాజీ అయితే చెల్లించాల్సిన కోర్టు ఫీజు రాయితీ ఉంటుందన్నారు. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న 3 బెంచ్‌లలో న్యాయాధికారులు వీవీ శేషుబాబు, ఎంఏ సోమశేఖర్, ఎం.బాబు వీలైనన్ని కేసుల పరిష్కరానికి కృషి చేస్తారన్నారు. విలేకరుల సమావేశంలో లోక్ అదాలత్ కార్యదర్శి ఎంఏ సోమశేఖర్ పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 1,666 కేసుల పరిష్కారం
కర్నూలు(లీగల్): జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,666 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత, కార్యదర్శి ఎం.వి.సోమశేఖర్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్ అదాలత్‌లో జిల్లా 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి వి.వి.శేషు బాబు 33 రోడ్డు ప్రమాద కేసులను పరిష్కరించి బాధితులకు రూ.78.65లక్షల పరిహారం చెల్లించేలా తీర్చునిచ్చారు. రాజీ కాగల క్రిమినల్ కేసులు, ప్రీలిటిగేషన్, సివిల్ కేసులను లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ పరిష్కరించారు. కర్నూలులో 669 కేసులు, నంద్యాలలో 508, ఆదోనిలో 153, పత్తికొండలో 37, ఆలూరులో 46, ఎమ్మిగనూరు 39, డోన్‌లో 33, బనగానపల్లెలో 12, కోయిలకుంట్లలో 35, ఆళ్లగడ్డలో 63, ఆత్మకూరులో 37, నందికొట్కూరులో 34 కేసులను పరిష్కరించారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లా ద్వితీయ స్థానంలో నిలువగా.. మొదటి స్థానాన్ని గుంటూరు జిల్లా దక్కించుకుంది. సాయంత్రం 3.30 గంటలకు లోక్ అదాలత్ కార్యాలయంలో విద్యార్థులకు ‘భారత రాజ్యాంగం-మానవ హక్కుల రక్షణ’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు, మహిళా సాధికారతపై వక్తృత్వ పోటీలను నిర్వహించారు. న్యాయాధికారులు సోమశేఖర్, గాయత్రిదేవి, స్వప్నారాణి, పి.రాజు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో మాంటిస్సోరి, భాష్యం, సెయింట్‌జోసెఫ్, సీరాక్, శ్రీలక్ష్మీ, వాసవి మహిళా కళాశాల, ఎస్సీ, ఎస్టీబీసీ కళాశాల, ప్రసూన లా కాలేజీ, ఉస్మానియా కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి
జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి విజయసారథి వరంగల్ లీగల్ : కేసుల పరిష్కారం నిమిత్తం శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయూలనిజిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి సి.విజయసారథి ఆచార్యులు కోరారు. గురువారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి ప్రధానంగా విద్యుత్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నాలుగు వేల కేసుల పరిష్కారం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 3600విద్యుత్ కేసులు రాజీకి అవకాశం ఉన్నాయని, 288క్రిమినల్ కేసులూ పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులకు నోటీసులు జారీచేసిన ట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి నీలిమా పాల్గొన్నారు. వరంగల్‌కు రావడం ఆనందంగా ఉంది సుదీర్ఘకాలం పనిచేసిన వరంగల్‌కు జిల్లా ప్రధాన జడ్జిగా పదోన్నతిపై రావడం ఆనందంగా ఉందని విజయసారథి ఆచార్యులు అన్నారు. గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికి స్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వద్దిరాజు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్జి విజయసారథి మాట్లాడారు. సీనియర్ న్యాయవాదులు ఉన్న ఓరుగల్లు నుంచి తర్ఫీదు పొందానని, సీనియర్ సివిల్ జడ్జి, అదనపు జిల్లా జడ్జిగా పనిచేసిన సందర్భంగా ఇక్కడి న్యాయవాదులతో ఏర్పడ్డ అనుబంధం మరువలేనిదని అన్నారు. ముగిసిన శిక్షణ.. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 రోజులుగా నిర్వహిస్తున్న జూనియర్ సివిల్ జడ్జిల రాత పరీక్ష ఉచిత కోచింగ్ తరగతులు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ అంశాలు బోధించిన రెండో అదనపు జిల్లా జడ్జి యార రేణుక, జూనియర్ సివిల్ జడ్జి ఆర్.రగునాథ్రెడ్డి, కేయూసీ న్యాయ కళాశాల రిటైర్డ్ ప్రిన్స్‌పాల్ విజయలక్ష్మి, ప్రిన్స్‌పాల్ విజయచందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎండీ సర్దార్, జి.భద్రాద్రి, న్యాయవాది టి. సుజాత, తరగతుల నిర్వహణ బోధనలో సమన్వయకర్తగా వ్యవహరించిన న్యాయవాది నగునూరి విద్యాసాగర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి నర్సింహులు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లా మహాత్మ, సహాయ కార్యదర్శి పత్తిపాటి శ్రీనివాసరావు, మహిళా కార్యదర్శి నారగోని సునిత, కోశాధికారి దైద డేవిడ్రాజ్కుమార్, కార్యవర్గ స భ్యులు దేవేందర్, సంతోష్, గౌసియా, శివకుమార్, మురళి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రేపు హైకోర్టు జడ్జీల రాక వరంగల్‌క్రైం: హైకోర్టు జడ్జీలు జస్టిస్ ఎంఎస్. రాంచంద్రరావు, బి.శివశంకర్‌రావు శనివారం వరంగల్‌కు రానున్నారు. ఆదివారం కాజీపేటలో జూనియర్ డివిజన్ సివిల్ జడ్జీలకు జరగనున్న స్క్రీనింగ్ టెస్ట్ పరిశీలనలో వీరు పాల్గొంటారు. -
కేసుల పరిష్కారానికే లోక్‌అదాలత్
♦ జిల్లా ప్రధాన జడ్జి అనంతపద్మనాభస్వామి ♦ కోర్టులో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ ♦ ఒకేరోజు 1,794 కేసుల పరిష్కారం నల్లగొండ క్రైం : కేసుల పరిష్కారం కోసమే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి అనంత పద్మనాభస్వామి అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి ఒకేరోజు 1,794 కేసులను పరిష్కరించారు. ప్రతి నెలా రెండో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి కేసులను సత్వరం పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. న్యాయవాదులు కూడా కేసుల పరిష్కారానికి సహకరిస్తున్నారన్నారు. వివిధ కేసుల్లోని బాధితులంతా జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ సత్యనారాయణ, ప్రశాంతి, రజిని, బార్ అసోసియేషన్ నాయకులు కేవీ.సుధాకర్, ప్రసన్నకుమార్, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శైలజాదేవి, న్యాయమూర్తి సునీత, సబ్ జడ్జి జ్ఞానేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 1.25 కోట్ల కేసులు పరిష్కారం
బాధితులకు రూ. 3 వేల కోట్ల నష్టపరిహారాల పంపిణీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం జరిగిన రెండో జాతీయ లోక్ అదాలత్‌లో 1.25 కోట్లకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. వాహన ప్రమాదాలు, ఇతర కేసుల బాధితులకు రూ. 3 వేల కోట్ల నష్ట పరిహారం కూడా పంపిణీ జరిగింది. జాతీయ న్యాయ సేవల అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ లోక్ అదాలత్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు సగటున 9 శాతం తగ్గిపోయాయి. శనివారం లోక్ అదాలత్‌ను సుప్రీంకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే ప్రారంభించగా, 53 కేసుల్లో 28 కేసులను మూడు సుప్రీం ధర్మాసనాలు పరిష్కరించాయి. కుటుంబ వివాదాలు, వైవాహిక సంబంధ, ప్రమాదాల కేసులు, బ్యాంకు రికవరీలు, రెవెన్యూ వివాదాలు, ఉపాధి హామీ, ఇతర పథకాల్లో నిధుల పంపిణీ వంటి కేసులు పరిష్కారమయ్యాయి.