ఒకే రోజు లక్షలాది కేసుల పరిష్కారమే లక్ష్యంగా శనివారం దేశవ్యాప్తంగా లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఒకే రోజు లక్షలాది కేసుల పరిష్కారమే లక్ష్యంగా శనివారం దేశవ్యాప్తంగా లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు సహా అన్ని రాష్ట్రాల హైకోర్టుల నుంచి కింది స్థాయి కోర్టులలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నేషనల్ లోక్‌అదాలత్ కార్యక్రమం జరుగుతుంది. కోర్టులలోని పెండింగ్ కేసులను తగ్గిం చడం, వ్యాజ్యదారులకు సత్వర న్యాయాన్ని అందించాలన్నది ఈ అదాలత్‌ల నిర్వహణ లక్ష్యం. సుప్రీంకోర్టులో నేషనల్ లోక్ అదాలత్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం ప్రారంభించనున్నారు. ఆయనతోపాటు సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ జి.ఎస్.సింఘ్వి, జస్టిస్ ఎ.కె.పట్నాయక్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ తదితరులు పాల్గొంటారు.