రాజీతో ఇరువర్గాలకు విజయం | With the success of both sides to compromise | Sakshi
Sakshi News home page

రాజీతో ఇరువర్గాలకు విజయం

Published Sun, Feb 5 2017 3:42 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

రాజీతో ఇరువర్గాలకు విజయం

రాజీతో ఇరువర్గాలకు విజయం

సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి శ్రీసుధ

సాక్షి, హైదరాబాద్‌: న్యాయస్థానాల్లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి శ్రీసుధ అన్నారు. ఈ నెల 11న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్న నేపథ్యంలో లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి వై.వీర్రాజులతో కలసి శనివారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. కుటుంబ వివాదాలు, సివిల్‌ కేసులతోపాటు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, చిట్‌ఫండ్, ప్రమాద బీమా, రుణాల రికవరీ కోసం బ్యాంకులు వేసిన దాదాపు 2 వేల కేసుల్లో ఇరువర్గాలను ఒప్పించడం ద్వారా సమస్యలు పరిష్కరిం చనున్నామని తెలిపారు.

జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష 26కు వాయిదా
19న జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టులకు మెయిన్స్‌ పరీక్ష ఉండటంతో సిటీ సివిల్‌ కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ కోసం జరగనున్న రాత పరీక్ష 26కి వాయిదా పడిందని శ్రీసుధ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement