Civil Judge Post
-
సివిల్ జడ్జి పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర న్యాయ శాఖలో 10 పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 8 పోస్టులను నేరుగా, 2 పోస్టులను బదిలీ ద్వారా భర్తీ చేస్తామని రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకు స్వీకరిస్తామని తెలిపారు. హాల్‌టికెట్లు ఏప్రిల్ 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. స్క్రీనింగ్ టెస్టు ఏప్రిల్ 23న ఉంటుందని, పూర్తి వివరాల కోసం హైకోర్టు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. -
87 సివిల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 87 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా.. అందులో 70 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో 31 పోస్టులను ఓపెన్ కేటగిరీకి కేటాయించగా.. అందులో 11 పోస్టులు మహిళలకు ఇచ్చారు. దివ్యాంగులకు (ఓపెన్ కేటగిరి)–1, బీసీ–ఎ 6 (మహిళలకు 2), బీసీ–బీ 8 (మహిళలకు 4), బీసీ–సీ 1, బీసీ–డీ 5 (మహిళలకు 2), బీసీ–ఇ 3 (మహిళలకు 1), ఎస్సీలకు 10 (మహిళలకు 3), ఎస్టీలకు 5 (మహిళలకు 3) పోస్టులు ఖరారు చేశారు. మిగిలిన 17 పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు న్యాయవాదిగా మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధనను ఈసారి సడలించారు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ్టటజిఛి. జౌఠి. జీn ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. -
‘మెజిస్ట్రేట్లు జిల్లా జడ్జీలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారు’
న్యూఢిల్లీ: మెజిస్ట్రేట్లు, సివిల్ జడ్జీలు తదితర న్యాయ వ్యవస్థలోని దిగువ విభాగానికి చెందిన వారు జిల్లా జడ్జీల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కాలంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలుగా విధుల్లో చేరిన జ్యూడీషియల్ అధికారులు.. మళ్లీ తమ పాత హోదాకు తిరిగివెళ్లాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్లు, సివిల్ న్యాయమూర్తులు మెరిట్‌తో, సీనియారిటీతో పదోన్నతుల ద్వారా కానీ, లిమిటెడ్ కాంపిటీటివ్ పరీక్ష ద్వారా కానీ జిల్లా జడ్జీలుగా నియామకం కావచ్చని పేర్కొంది. సాధారణంగా ఏడేళ్ల పాటు వరుసగా న్యాయవాద వృత్తిలో కొనసాగినవారు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులవుతారు. జ్యూడీషియల్ అధికారులుగా విధుల్లో చేరకముందు, ఏడేళ్ల వరుస సర్వీసు ఉన్నప్పటికీ.. వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులు కాబోరని ధర్మాసనం స్పష్టం చేసింది. జిల్లా జడ్జీల నియామకానికి సంబంధించిన ఆర్టికల్ 233కి ధర్మాసనం వివరణ ఇచ్చింది. -
శిరీష శ్రమ ఫలించింది!
సాక్షి, కాళోజీ సెంటర్(వరంగల్) : పట్టుదలకు శ్రమ తోడైతే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదని మరోసారి రుజువైంది. సామాన్య కుటుంబంలో జన్మించి సాధారణ విద్యార్థిగా కొనసాగిన ఆమె ఉన్నత లక్ష్యాన్ని చేరుకొని అందరి చేత శభాస్ అనిపించుకుంటోంది. ఇటీవల వెల్లడైన సివిల్ జడ్జి ఫలితాల్లో గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామం కీర్తినగర్‌కు చెందిన శిరీష పేరు ఉండడంతో ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయానికి రక్షణగా .. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, రోజురోజు మహిళలపై జరుగుతున్న ఘోరాలకు చలించిపోయిన శిరీష ఏనాటికైనా న్యాయశాస్త్రంలో ప్రతిభ చాటాలని నిర్ణయించుకుంది. సైన్స్ కోర్సులో భవిష్యత్ ఉందని తెలిసినా పేదలు, మహిళలకు న్యాయం చేయాలంటే న్యాయ శాస్త్రమే సరైన వేదికగా భావించి ఆ రంగం వైపే అడుగులు వేసింది. ముగ్గురు సంతానంలో ఒకరు.. వరంగల్ పాపయ్యపేట చమన్‌కు చెందిన కటుకోజ్వల సర్వమంగళచారి – రమాదేవి దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో శిరీష 10వ తరగతి వరకు ఆంధ్రా బాలిక హైస్కూల్లో చదివి ఇంటర్, బీఫార్మసీ వరకు హన్మకొండలోనే చదివారు. మూడేళ్ల క్రితం గీసుగొండ మండలం గొర్రెకుంట కీర్తినగర్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది పూసల శ్రీకాంత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే శిరీషకు కుడా న్యాయశాస్త్రం వైపే వెళ్లాలనే ఆలోచన ఉండండంతో భర్త ప్రోత్సహించారు. దీంతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, హైదరాబాద్ బషీర్‌బాగ్ పీజీ కాలేజీలో ఎల్ఎల్ఎం చేశారు. ఆ తర్వాత 2014 నుంచి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే తన లక్ష్యసాధనకు శ్రద్ధగా కృషి చేశారు. 2019 మే లో జరిగిన ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులై ఆగష్టులో జరిగిన మెయిన్స్‌కు హాజరయ్యారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన ఇంటర్వూలో పాల్గొన్నారు. దీంతో 18న ప్రకటించిన సివిల్ జడ్జి ఫలితాలోల్ల శిరీష ఎంపికయ్యారు. ఆనందంగా ఉంది.. నా శ్రమ ఫలించడంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు కష్టపడి డిగ్రీ వరకు చదివిస్తే పీజీ చేసేలా నా భర్త శ్రీకాంత్ ప్రోత్సహించారు. నిజంగా పట్టుదల ఉంటే ఏది సాధ్యం కాదనిపిస్తోంది. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ పేదలు, మహిళలకు మెరుగైన న్యాయసాయం అందేలా కృషి చేస్తా. –కటుకోజ్వల శిరీష -
రాజీతో ఇరువర్గాలకు విజయం
సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శ్రీసుధ సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల్లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శ్రీసుధ అన్నారు. ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వై.వీర్రాజులతో కలసి శనివారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. కుటుంబ వివాదాలు, సివిల్ కేసులతోపాటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, చిట్‌ఫండ్, ప్రమాద బీమా, రుణాల రికవరీ కోసం బ్యాంకులు వేసిన దాదాపు 2 వేల కేసుల్లో ఇరువర్గాలను ఒప్పించడం ద్వారా సమస్యలు పరిష్కరిం చనున్నామని తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష 26కు వాయిదా 19న జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు మెయిన్స్ పరీక్ష ఉండటంతో సిటీ సివిల్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం జరగనున్న రాత పరీక్ష 26కి వాయిదా పడిందని శ్రీసుధ తెలిపారు.