సాక్షి: హిజ్రా ఆపేరు వినగానే కొందరికి విపరీతమైన అసహ్యం. సమాజంలో వారిని చాలా చులకనగా చూస్తారు. రోడ్డు మీదనే డబ్బులు అడుగుతారని అవహేలన చేస్తారు. కానీ వారిలో కూడా అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. సహకారం అందిస్తే అద్భుతాలు చేసి చూపిస్తారు. అలా సమాజంతో చీదరింపులు తిన్న ఓ ట్రాన్స్ జెండర్ విధిపై యుద్ధం చేసింది. అవమానాలను, వేధింపులను భరించింది. చివరకు అనుకున్నది సాధించింది. న్యాయ శాష్త్రంలో పట్టాసాధించింది. న్యాయ మూర్తిగా సేవలు అందిస్తోంది.
పశ్చిమబెంగాల్‌కు చెందని జోయితా మోందాల్ అబ్బాయిగా పుట్టినా అమ్మాయి లక్షణాలు వచ్చాయి. దీంతో ఇంట్లో వాళ్లు గెంటేశారు. సమాజం ఆమెను వెక్కిరించింది. అయినా కుంగిపోలేదు. కష్టాలకు ఎదురీది కోల్‌కతా వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టాపుచ్చుకుంది. 3 నెలల క్రితం సోషల్ వర్కర్ కేటగిరీ కింద జోయితా జడ్జిగా ఎంపికయ్యారు. ఇప్పుడు బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లా ఇస్లాంపూర్ లోక్ అదాలత్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తోంది.
అంతే కాకుండా హిజ్రాల హక్కుల కోసం ఓ ఎన్జీవోను స్థాపించి ఉద్యమాలు నిర్వహించింది.ఇందులో దాదపు మూడు వేల మందిపైగా హిజ్రాలకు సభ్యత్వం ఇచ్చింది. తనలాంటి చీదరింపులు వారికి రాకుండా సామాజిక సేవనే మార్గంగా ఎంచుకొని ముందుకు సాగుతోంది. జీవితంలో ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్న జోయితా. తనలా మిగతా ట్రాన్స్ జెండర్స్ కూడా రాణించి ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment