సాక్షి, హైదరాబాద్: సివిల్, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులలో వేగవంతమైన, సామరస్య పరిష్కారం కోసం నవంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని స్థాయిలలోని న్యాయస్థానాలలో ఈ లోక్ అదాలత్ జరుగుతుందని జాతీయ న్యాయ సేవల సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఎలాంటి రుసుము లేకుండా లోక్ అదాలత్‌లో ఉచితంగా కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొంది.
ఒకవేళ ఇప్పటికే పెండింగ్ ఉన్న కేసులలో న్యాయస్థానానికి రుసుము చెల్లించి ఉంటే గనక లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమైతే వెంటనే ఆయా సొమ్ము రీఫండ్ చేస్తారని జాతీయ న్యాయ సేవల సంస్థ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సెటిల్‌మెంట్ ద్వారా పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా నవంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ( ఫలించని వ్యూహాలు.. గ్రేటర్ మెట్రోకు కొత్త కష్టాలు!)
Comments
Please login to add a commentAdd a comment