కేసుల పరిష్కారానికే లోక్‌అదాలత్ | National Lok Adalat for only solution of cases | Sakshi
Sakshi News home page

కేసుల పరిష్కారానికే లోక్‌అదాలత్

Published Sat, Jun 13 2015 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

కేసుల పరిష్కారానికే లోక్‌అదాలత్

కేసుల పరిష్కారానికే లోక్‌అదాలత్

♦ జిల్లా ప్రధాన జడ్జి అనంతపద్మనాభస్వామి
♦ కోర్టులో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ
♦ ఒకేరోజు 1,794 కేసుల పరిష్కారం
 
 నల్లగొండ క్రైం : కేసుల పరిష్కారం కోసమే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి అనంత పద్మనాభస్వామి అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి ఒకేరోజు 1,794 కేసులను పరిష్కరించారు. ప్రతి నెలా రెండో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి కేసులను సత్వరం పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. న్యాయవాదులు కూడా కేసుల పరిష్కారానికి సహకరిస్తున్నారన్నారు.

వివిధ కేసుల్లోని బాధితులంతా జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ సత్యనారాయణ, ప్రశాంతి, రజిని, బార్ అసోసియేషన్ నాయకులు కేవీ.సుధాకర్, ప్రసన్నకుమార్, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శైలజాదేవి, న్యాయమూర్తి సునీత, సబ్ జడ్జి జ్ఞానేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement