
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యాయి. 1,11,232 కేసులు పరిష్కారం కాగా, రూ.46.06 కోట్ల పరిహారం అందజేశారు. పరిష్కారం అయిన కేసుల్లో 97,455 పెండింగ్ కేసులు కాగా, 13,777 ప్రీ లిటిగేషన్ కేసులున్నాయి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ మార్గదర్శకత్వంలో లోక్ అదాలత్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లో 418 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు.
రాజీకి ఆస్కారం ఉన్న కేసులను ఇందులో పరిష్కరించారు. ఇదిలా ఉంటే హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 511 కేసులను పరిష్కరించారు. రూ.4.01 కోట్ల పరిహారం అందజేశారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కుంభజడల మన్మధరావు, జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ నేతృత్వంలో కేసుల విచారణ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment