Settlements
-
నీకింత.. నాకింత.. వంగలపూడి అనిత పీఏ సెటిల్మెంట్లు
-
మార్చికల్లా అదే రోజు సెటిల్మెంట్
న్యూఢిల్లీ: కొత్త ఏడాది(2024)లో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో లావాదేవీ చేపట్టిన రోజునే సెటిల్మెంట్ పూర్తికానుంది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో మార్చికల్లా అదే రోజు సెటిల్మెంట్కు తెరతీయనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవీ పురి బచ్ తాజాగా వెల్లడించారు. వెరసి 2024 మార్చి నుంచి టీప్లస్‌జీరో సెటిల్మెంట్ను ప్రవేశపెట్టనున్నట్లు పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన ప్రపంచ ఆర్థిక విధానాల వేదిక 2023లో బచ్ పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే సెబీ స్టాక్ లావాదేవీల సెటిల్మెంట్ గడువులను తగ్గిస్తూ వస్తోంది. దీంతో ప్రస్తుతం లావాదేవీ చేపట్టిన మరుసటి రోజు (టీప్లస్1) సెటిల్మెంట్ అమలవుతోంది. దీన్ని మరో 3 నెలల్లోగా ఒకే రోజుకు పరిమితం చేయనున్నట్లు బచ్ చెప్పారు. కాగా.. టీప్లస్‌జీరో సెటిల్మెంట్ అమలు తదుపరి అప్పటికప్పుడు(ఇన్‌స్టేనియస్) సెటిల్మెంట్ను తీసుకురానున్నట్లు వెల్లడించారు. అయితే ఇది ఆప్షనల్‌గా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
Madhabi Puri Buch: ఇక అదే రోజు సెటిల్మెంట్
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రానున్న(2024) మార్చికల్లా స్టాక్ ఎక్సే్ఛంజీలలో నిర్వహించే లావాదేవీల సెటిల్మెంట్ను అదే రోజు పూర్తిచేసేందుకు వీలు కలి్పంచనుంది. ఇప్పటికే లావాదేవీ చేపట్టిన ఒక్క రోజులోనే(టీప్లస్ 1) సెటిల్మెంట్ పూర్తవుతోంది. అయితే మార్చికల్లా లావాదేవీ నిర్వహించిన రోజే(టీప్లస్0) సెటిల్మెంట్కు తెరతీసే లక్ష్యంతో ఉన్నట్లు సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బచ్ పేర్కొన్నారు. ఆపై మరో 12 నెలల్లోగా లావాదేవీ నమోదైన వెంటనే అప్పటికప్పుడు(ఇన్స్టెంట్) సెటిల్మెంట్కు వీలు కలి్పంచాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రియల్‌టైమ్ ప్రాతిపదికన లావాదేవీల పూర్తిని చేపట్టాలని ఆశిస్తున్నట్లు సెబీ బోర్డు సమావేశం తదుపరి విలేకరుల సమావేశంలో మాధవి వెల్లడించారు. స్టాక్ మార్కెట్ లావాదేవీల ఇన్స్టెంట్ సెటిల్మెంట్ ఆలోచనపై మార్కెట్ మేకర్స్ నుంచి ఈ సందర్భంగా సలహాలు, సూచనలను ఆహా్వనిస్తున్నట్లు తెలియజేశారు. కొత్త సెటిల్మెంట్ను ప్రస్తుత సెటిల్మెంట్కు సమాంతరంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చని మాధవి తెలిపారు. అయితే కొన్ని ఎంపిక చేసిన భారీ ప్రొడక్టులకు మాత్రమే అది కూడా ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ గడువును టీప్లస్ 2 నుంచి టీప్లస్ 1కు తగ్గించిన సంగతి తెలిసిందే. -
సీఐ పాటి నాగబాబు, ఎస్సై గైకాడి అనిల్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షిప్రతినిధి, వరంగల్: భూ దందాలు, సెటిల్మెంట్లకు పెట్టింది పేరుగా మారిన కొందరు పోలీస్ అధికారులను గాడిన పెట్టేందుకు సీపీ ఏవీ.రంగనాథ్ చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. అక్రమార్కులను సక్రమ మార్గాన నడిపించేందుకు తరచూ కొరడా ఝుళిపిస్తున్నా.. అది కొద్దిరోజులకే పరిమితమవుతోంది. బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు స్పందించి మునుపెన్నడూ లేని విధంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సస్పెన్షన్ వేటు వేస్తున్నా కొందరి తీరులో మార్పు రావడం లేదు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే కానిస్టేబుల్‌నుంచి ఇన్స్పెక్టర్ల వరకు పలువురిపై సస్పెన్స్ వేటు పడింది. ఉద్యోగులు, సామాన్యులు రూపాయి రూపాయి పోగేసుకుని సొంతింటిని నిర్మించుకోవాలని కొనుగోలు చేసిన భూములకు గతంలో చాలాచోట్ల భద్రతా లేకుండా పోయింది. భూకబ్జాలు, ఆక్రమణలపై పోలీసు కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఇంటిస్థలాలు భద్రంగా ఉంటాయనే భరోసా కలుగుతున్న తరుణంలో కొందరు పోలీసులే కబ్జాదారులకు సహకరిస్తూ సస్పెన్షన్లకు గురవుతుండడం చర్చనీయాంశమవుతోంది. కలకలం రేపుతున్న సస్పెన్షన్లు.. అయినా కావాలి కాసులు.. హద్దుమీరుతున్న పోలీసులను గాడిన పెట్టేందుకు పోలీస్ కమిషనర్ రంగనాథ్ చేపడుతున్న చర్యలు కలకలం రేపుతున్నా.. కొద్ది రోజులకే మళ్లీ కాసుల కోసం కక్కుర్తిపడి కొందరు వివాదాస్పదమవుతున్నారు. ► భూ దందాలు, సెటిల్మెంట్ల వ్యవహారంలో మొదటి వేటు గీసుగొండ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఆర్.వెంకటేశ్వర్లుపై పడింది. భూ కబ్జాదారులతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలకు తోడు ఓ మహిళా ఎస్సైతో హద్దులు మీరి వ్యవహరించారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఆ మహిళా ఎస్ఐపైన వేటు పడింది. ►ఆ తర్వాత నర్సంపేట పోలీసు స్టేషన్లో పనిచేసిన ఏఎస్సై నాగరాణి ఒకరి వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వకపోగా ఆమైపె హనుమకొండ స్టేషన్లో కేసు నమోదు కాగా సస్పెండ్ చేశారు. ►పీడీఎస్ బియ్యం దందా, గుడుంబా తయారీ దారుల నుంచి డబ్బు గుంజడం, బీమా స్కాంలో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ముడుపులు పుచ్చుకున్న నల్లబెల్లి ఎస్ఐ రాజారాంను సీపీ సస్పెండ్ చేశారు. ► భూ తగాదాల్లో జోక్యం చేసుకున్నారన్న ఫిర్యాదుపై మట్టెవాడ సీఐ సీహెచ్ రమేశ్‌ను.. ఇవే రకమైన ఆరోపణల్లో కేయూసీ సీఐ దయాకర్లను సీపీ సస్పెండ్ చేశారు. ► టాస్క్‌ఫోర్స్‌లో సీఐ నరేష్‌తోపాటు హెచ్‌సీ శ్యాంసుందర్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను భూసెటిల్మెంట్లు, వసూళ్ల ఆరోపణలపై సస్పెండ్ చేశారు. ► రంగురాళ్ల వ్యాపారిని బెదిరించిన ఘటనలో కమిషనరేట్ రిజర్వు ఇన్స్పెక్టర్ సతీష్‌పై సుబేదారి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయించి, రిమాండ్ తరలించి సస్పెండ్ చేశారు. ► హసన్‌పర్తి, ధర్మసాగర్ ఇన్స్పెక్టర్లను వీఆర్‌కు బదిలీ చేశారు. ► తాజాగా భూసంబంధిత విషయాల్లో బాధితుల పక్షాన కాకుండా అక్రమార్కులకు వత్తాసు పలికారన్న ఫిర్యాదులపై విచారణ జరిపించి నర్మెట సీఐ పాటి నాగబాబు, ఎస్సై గైకాడి అనిల్ కుమార్‌లను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేయడంతో పోలీస్ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. వివాదంలో నగర ఇన్స్పెక్టర్లు..? సెంట్రల్ జోన్ పరిధిలోని ఇద్దరు నగర ఇన్స్పెక్టర్ల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. భూ కబ్జాదారులతో దోస్తీ చేసి.. భూ ఆక్రమణల కోసం కొందరు అసాంఘిక శక్తులతో టీమ్‌లుగా ఏర్పడ్డారన్న ఆరోపణలపై అక్కడ పనిచేసిన ఇన్స్పెక్టర్లపై గతంలో బదిలీ, సస్పెన్షన్ వేటు వేశారు. ఆ ఠాణాలలో పోస్టింగ్ పొందిన వారు తిరిగి అవే తరహా కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూకబ్జాదారులను కట్టడి చేసేందుకు ‘అవసరమైతే పీడీ యాక్టు నమోదు చేయాలన్న’ సీపీ ఆదేశాలను ‘సొమ్ము’ చేసుకుంటున్నారు. ఇటీవల భూ క్రయవిక్రయాలలో వివాదాస్పదుడని పేరున్న ఓ వ్యాపారిని పిలిపించిన ఓ ఇన్స్పెక్టర్ ‘నీపై ఫిర్యాదులున్నాయి.. పీడీ యాక్టు పెడతా’నని పెద్దమొత్తంలో డిమాండ్ చేసి కొంత ముట్టజెప్పాకే శాంతించారని తెలిసింది. మరో ఇన్స్పెక్టర్ పాత రౌడీషీటర్ల కౌన్సెలింగ్ పేరిట ఇద్దరు భూదందాదా రులను ఇదే తరహాలో బెదిరించినట్లు తెలిసింది. సీఐ, ఎస్సై సస్పెన్షన్ నర్మెట: భూ వివాదంలో అక్రమార్కులకు వత్తాసు పలికినందుకు నర్మెట సీఐ పాటి నాగబాబు, ఎస్సై గైకాడి అనిల్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధి అమ్మాపూర్‌కు చెంది న చెక్కిళ్ల లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, రవీందర్ అన్నదమ్ములు. 35 ఏళ్ల క్రితం లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడ్డారు. ఈక్రమంలో తల్లిదండ్రుల బాధ్యత చూసుకొమ్మని తమ్ము డు రవీందర్‌కు చెప్పారు. ఇందుకుగాను అమ్మాపురంలోని తమ పాలుకు వచ్చిన భూమిని అప్పగించారు. అలాగే.. హైదరాబాద్‌లోని ఆస్తి తాము తీసుకుంటామని చెప్పారు. ఈక్రమంలో గతేడాది గ్రామానికి వచ్చిన లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు గతంలో తాము అప్పగించిన భూమి ఇవ్వాలని తమ్ముడిని నిలదీశారు. దీంతో పాటు పోలీసులను ఆశ్రయించారు. అయితే.. సీఐ నాగబాబు, ఎస్సై అనిల్‌కుమార్.. రవీందర్‌ను పిలిపించి మాట్లాడారు. గ్రామంలో తనకు ఇచ్చిన భూమికి బదులు తన సోదరులు హైదరాబాద్‌లో భూమి తీసుకున్నారని, నాటి నుంచి సేద్యం చేసుకుంటున్నానని రవీందర్ చెప్పాడు. అయినా.. వినిపించుకోకుండా.. 3.10 ఎకరాల (సర్వే నం 339, 341, 347) భూమి ధరణి పోర్టల్‌లో లక్ష్మయ్య, వెంకటేశ్వర్ల పేరుతో ఉందని సీఐ, ఎస్సై వారి వైపే మాట్లాడారు. అంతేకాకుండా రవీందర్, అతడి భార్య, కుమారులపై కేసులు నమోదు చేశారు. దీంతో ఆందోళనకు గురైన బాధితుడు వరంగల్ సీపీ రంగనాథ్‌ను ఆశ్రయించాడు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కమిషనరేట్ పరిధి డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో బుధవారం గ్రామానికి చేరుకున్న పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. స్థానికుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఆ నివేదికను అందుకు న్న సీపీ రంగనాథ్.. సీఐ, ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మరో ఇద్దరు కూడా.. ఇదిలా ఉండగా.. గతంలో నర్మెట ఎస్సైగా పనిచేసిన సీహెచ్.రవికుమార్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కా డు. అలాగే ఇటీవల ఓ కేసులో బచ్చన్నపేట ఎస్సైగా పనిచేసిన సిరిపురం నవీన్‌కుమార్(నర్మెట నుంచి బచ్చన్నపేటకు బదిలీపై వెళ్లారు) సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇందుకు భూవివాదంలో జోక్యం చేసుకోవడమే కారణం. -
ఎగవేతదారులతో బ్యాంకుల రాజీకి వ్యతిరేకత
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులతో బ్యాంకులు రాజీ పరిష్కారానికి ఆర్బీఐ అనుమతించడాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజీ పరిష్కారం, సాంకేతికంగా రుణాల మాఫీ పేరుతో ఆర్బీఐ ఇటీవలే ఓ కార్యాచరణను ప్రకటించింది. ఇది బ్యాంకుల సమగ్రత విషయంలో రాజీపడడమేనని, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చడమేనని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్దేశపూర్వక ఎగవతేదారుల సమస్య పరిష్కారానికి కఠిన చర్యలనే తాము సమర్థిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించాయి. మోసం లేదా ఉద్దేశపూర్వక ఎగవేతదారులంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో రాజీ పరిష్కారానికి అనుమతించడం అన్నది న్యాయ సూత్రాలకు, జవాబుదారీకి అవమానకరమని వ్యాఖ్యానించాయి. నిజాయితీ పరులైన రుణ గ్రహీతలను నిరుత్సాహపరచడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తాజా ఆదేశాలు షాక్‌కు గురి చేశాయని పేర్కొన్నాయి. ఇది బ్యాంకింగ్ రంగం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని నీరు గారుస్తుందని, డిపాజిట్ల నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తన నిర్ణయాన్ని ఉపంసహరించుకోవాలని డిమాండ్ చేశాయి. -
గన్మెన్లతో దస్తగిరి దాదాగిరి
సాక్షి ప్రతినిధి, కడప/రైల్వేకోడూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్‌పై ఉన్న ప్రధాన నిందితుడు దస్తగిరి దర్జాగా సెటిల్మెంట్లకు తెగబడుతున్నాడు. సీబీఐ సిఫార్సుల మేరకు ఐదుగురు గన్మెన్లను సమకూర్చుకుని పోలీస్ స్టేషన్ వద్దే దర్జాగా బహిరంగంగా బెదిరింపులకు దిగడం నివ్వెరపరుస్తోంది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నడిబొడ్డున సోమవారం పట్టపగలు మూడు షాపులకు తాళాలు వేసిన దస్తగిరి వాటిని ఖాదర్‌వలీ అనే వ్యక్తికి అప్పగించాలంటూ బెదిరింపులకు దిగాడు. పోలీస్‌స్టేషన్ పక్కనే గన్మెన్లతో హల్చల్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 30 ఏళ్లుగా షాపులు నిర్వహిస్తున్నా.. రైల్వే కోడూరులో అబ్దుల్ వాహిద్, శివయ్యనాయుడు, వైష్ణవి మెడికల్స్‌కు చెందిన సుబ్బరాయుడికి పోలీస్‌స్టేషన్ పక్కనే మూడు షాపులున్నాయి. వాటిని 30 ఏళ్లుగా అద్దెకు ఇచ్చారు. వాటి విలువ సుమారు రూ.2.5 కోట్లకు పైబడి ఉంటుంది. అయితే ఆ మూడు షాపులు ఖాదర్‌వలీ అనే వ్యక్తివి అంటూ దస్తగిరి రంగప్రవేశం చేశాడు. డాక్యుమెంట్లు ఉన్నాయని, మీరంతా ఖాళీ చేయాలంటూ వీరంగం వేశాడు. దీనిపై ఆదివారం రాత్రి స్థానిక సీఐ విశ్వనాథరెడ్డి కార్యాలయంలో ఇరువర్గాల మధ్య చర్చలు సాగాయి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం దస్తగిరి రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. ఐదుగురు గన్మెన్లను వెంట బెట్టుకొని ప్రధాన రహదారిలో నడుచుకుంటూ వెళ్లి మూడు షాపులకు తాళాలు వేశాడు. అనంతరం పెద్ద మనుషుల సూచన మేరకు జిరాక్స్ డాక్యుమెంట్లు తీసుకొని 10 రోజుల్లో తిరిగి వస్తానంటూ హెచ్చరించాడు. రైల్వేకోడూరుకు చెందిన ఖాదర్‌వలీ ఆ షాపులు తనవేనని ఏనాడూ ముందుకొచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. మందు, ముక్క.. విలాస జీవితం వివేకా హత్య కేసులో నిందితుడైన దస్తగిరి విలాస జీవితం గడుపుతూ తరచూ దందాలు, దౌర్జన్యకాండకు దిగుతున్నాడు. కష్టపడితేనే పూట గడిచే స్థితి నుంచి ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి చేరుకున్నాడు. అతడిప్పుడు చుక్క, ముక్క లేకుండా భోజనం చేసే పరిస్థితి లేదు. ఖరీదైన స్కాచ్ ఎప్పుడూ వెంట ఉండాల్సిందే. ప్రైవేట్ పంచాయితీలు నిత్యకృత్యమయ్యాయి. సెటిల్మెంట్లపై దృష్టి పెట్టాడు. ప్రాణరక్షణ పేరిట ఐదుగురు గన్మెన్లను సమకూర్చుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నాడు. పోలీస్ స్టేషన్లలోనే దాడులు.. అప్రూవర్‌గా మారిన దస్తగిరి పోలీసులను సైతం లెక్కచేయడం లేదు. ఏకంగా పోలీసు స్టేషన్లలోనే దౌర్జన్యాలు, దాడికి తెగబడుతున్నాడు. వైఎస్సార్ జిల్లా తొండూరులో మల్లెల గ్రామానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తిపై పోలీసు స్టేషన్లోనే దస్తగిరి దాడి చేశాడు. ఈ మేరకు క్రైమ్ నంబర్ 41/2022 కింద 2022 మే 29న కేసు నమోదైంది. అదే మండలంలో ఎలక్ట్రిక్ ఉపకరణాల చౌర్యం కేసు కూడా 2022 ఆగస్టు 2న దస్తగిరిపై నమోదైంది. ♦ శ్రీకాళహస్తిలో దర్గా స్థలంపై 20 ఏళ్లుగా ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న వివాదంలో బెదిరింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించి ఖాదర్‌బాషా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు దస్తగిరిపై క్రైమ్ నెంబర్ 121/2022 కేసు నమోదైంది. ♦ వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల కేంద్రంగా ఫైనాన్స్ వాహనాల సీజ్, వ్యక్తుల మధ్య ఉన్న విభేదాల్లో తలదూరుస్తూ దస్తగిరి సెటిల్మెంట్లకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏ దస్తగిరి అంటావేందీ..? బెయిల్‌పై ఉన్న నిందితుడు దస్తగిరి షరతులను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడు. ‘‘హలో... నేను దస్తగిరిని మాట్లాడుతున్నా! ఏ దస్తగిరి అంటావేందీ..? వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన దస్తగిరిని’’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బెయిల్ షరతులేవీ తనకు వర్తించవన్న రీతిలో యథేచ్ఛగా దౌర్జన్యాలకు దిగుతున్నాడు. -
దివాలా పరిష్కార ప్రక్రియ సమయం కుదింపు!
న్యూఢిల్లీ: దివాలా ఆస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడం, తద్వారా ఆయా రుణ ఆస్తుల విలువ గణనీయమైన కోతను నిరోధించడం లక్ష్యంగా కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ దిశలో దివాలా చట్టాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దివాలా ఆస్తుల పరిష్కారానికి 2016లో అమల్లోకి వచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ)కు సవరణలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. బ్యాంకర్లు, న్యాయవాదులతో సహా సంబంధిత వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, రాబోయే వారాల్లో మార్పులు ఖరారు కావచ్చని తెలిపారు. ప్రస్తుతం ఇలా... ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నుండి ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు అందిన గణాంకాల ప్రకారం, ఐబీసి కింద మొత్తం 553 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందుకు సగటు సమయం 473 రోజులు. ఒక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 57 కేసులు పరిష్కారం అయితే, ఇందుకు సగటు సమయం 679 రోజులు తీసుకుంది. 2021–22లో 143 కేసులు పరిష్కారం అయితే ఇందుకు పట్టిన సమయం 560 రోజులు. 2020–21లో 120 కేసులకు 468 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. నిజానికి రిజల్యూషన్ ప్రాసెస్ కోసం ఐబీసీ కాలపరిమితి 330 రోజులు. లిటిగేషన్లో క్లిష్టతలుసహా పలు కారణాలతో దివాలా పరిష్కార పక్రియ కాలయాపన జరుగుతోంది. ఈ లోపాలు సవరించడానికి కేంద్రం తాజాగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. -
లోక్ అదాలత్‌లో 1,11,232 కేసుల పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యాయి. 1,11,232 కేసులు పరిష్కారం కాగా, రూ.46.06 కోట్ల పరిహారం అందజేశారు. పరిష్కారం అయిన కేసుల్లో 97,455 పెండింగ్ కేసులు కాగా, 13,777 ప్రీ లిటిగేషన్ కేసులున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ మార్గదర్శకత్వంలో లోక్ అదాలత్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లో 418 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. రాజీకి ఆస్కారం ఉన్న కేసులను ఇందులో పరిష్కరించారు. ఇదిలా ఉంటే హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 511 కేసులను పరిష్కరించారు. రూ.4.01 కోట్ల పరిహారం అందజేశారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కుంభజడల మన్మధరావు, జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ నేతృత్వంలో కేసుల విచారణ జరిగింది. -
ఎల్ఐసీకి భారీ షాక్, తగ్గుతున్న ఆదాయం
జీవిత బీమా కంపెనీల (లైఫ్ ఇన్సూరెన్స్)కు డిసెంబర్ నెలలో నూతన పాలసీల రూపంలో రూ.24,466 కోట్ల ప్రీమియం ఆదాయం వచ్చింది. 2020 డిసెంబర్లో ఆదాయం రూ.24,383 కోట్లతో పోలిస్తే పెద్దగా వృద్ధి చెందలేదని తెలుస్తోంది. 2021 డిసెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను ఐఆర్డీఏఐ విడుదల చేసింది. జీవిత బీమా దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్ఐసీ పనితీరు నిరాశపరిచింది. ఈ సంస్థకు కొత్త పాలసీల ప్రీమియం (న్యూ బిజినెస్) రూపంలో ఆదాయం డిసెంబర్ నెలలో 20 శాతం క్షీణించి రూ.11,434 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఎల్ఐసీకి కొత్త పాలసీ రూపంలో రూ.14,345 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. ప్రైవేటు సంస్థల మెరుగైన పనితీరు మిగిలిన 23 ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం ఆదాయం ఉమ్మడిగా 30 శాతం పెరిగింది. రూ.13,032 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఇది రూ.10,037 కోట్లుగానే ఉంది. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ న్యూ బిజినెస్ ఆదాయం 55 శాతం పెరిగి రూ.2,973 కోట్లకు చేరింది. ఎస్బీఐ లైఫ్ ఆదాయం సైతం 27 శాతం వృద్ధితో రూ.2,943 కోట్లుగా నమోదైంది. బజాజ్ అలియాంజ్ లైఫ్ కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం 70 శాతం పెరిగి రూ.1,164 కోట్లకు చేరుకుంది. మ్యాక్స్‌లైఫ్ ఆదాయం 32 శాతం పెరిగి రూ.1,013 కోట్లుగా ఉంటే, టాటా ఏఐఏ లైఫ్ ఆదాయం 50 శాతం పెరిగి రూ.660 కోట్లుగా ఉంది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఆదాయం 6 శాతం పెరిగి రూ.544 కోట్లకు చేరింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆదాయం 6 శాతం క్షీణించి రూ.1,380 కోట్లకు పరిమితమైంది. కోటక్ మహీంద్రా లైఫ్ ఆదాయం స్వల్పంగా తగ్గగా.. ఏగాన్ లైఫ్ న్యూ బిజినెస్ ప్రీమియం 36 శాతం పడిపోయి రూ1.29 కోట్లుగా ఉంది. తొమ్మిది నెలల్లో మిశ్రమ ధోరణి 2021–22లో మొదటి తొమ్మిది నెలల్లో అన్ని జీవిత బీమా సంస్థల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 7 శాతం పెరిగి రూ.2,05,231 కోట్లుగా ఉంది. ఈ కాలంలో ఎల్ఐసీ ఆదాయం 3 శాతం తగ్గి రూ.1,26,015 కోట్లుగా ఉంటే.. 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థల ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.79,217 కోట్లుగా నమోదైంది. చదవండి: ఇన్సురెన్స్ కంపెనీకి వార్నింగ్.. రూ.79 లక్షలు చెల్లించాలంటూ ఆదేశం -
ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ ట్రేడింగ్‌పై బీఎస్ఈ కసరత్తు
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) ట్రేడింగ్‌ను తమ ప్లాట్‌ఫాంపై ఆవిష్కరించేందుకు అవసరమైన టెక్నాలజీతో సిద్ధంగా ఉన్నట్లు బాంబే స్టాక్ ఎక్సే్చంజీ (బీఎస్ఈ)చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ పాటిల్ తెలిపారు. త్వరలో దీనికి అనుమతులు పొందేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పసిడి ధరలు దాదాపు ఒకే రకంగా ఉండేలా చూసేందుకు ఈజీఆర్‌లు తోడ్పడగలవని పాటిల్ చెప్పారు. ఇతర షేర్ల లావాదేవీల తరహాలోనే ఈజీఆర్‌ల ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ విధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈజీఆర్‌లను డీమ్యాట్ తరహాలోనే ఉంచుకోవచ్చని, అవసరమైనప్పుడు భౌతిక బంగారం రూపంలోకి మార్చుకోవచ్చని పాటిల్ చెప్పారు. ఇదంతా మూడు అంచెల్లో జరుగుతుందన్నారు. ముందుగా భౌతిక బంగారాన్ని ఈజీఆర్ల్లోకి మార్చడం, ఈజీఆర్ రూపంలో ట్రేడింగ్ నిర్వహించడం, తర్వాత ఈజీఆర్‌ను తిరిగి భౌతతిక రూపంలోకి మార్చడం ఉంటుందని పాటిల్ చెప్పారు. ముందుగా 1 కేజీ, 100 గ్రాముల డినామినేషన్లో ఈజీఆర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు దశలవారీగా 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాముల పరిమాణంలో కూడా ఈజీఆర్‌లను అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. క్లయింట్లు కావాలనుకుంటే భౌతిక బంగారాన్ని నిర్దిష్ట డెలివరీ సెంటర్లో జమ చేసి ఈజీఆర్‌ను కూడా పొందవచ్చని పాటిల్ వివరించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ప్రస్తుతం భౌతిక రూపంలో బంగారం ట్రేడింగ్‌కు కూడా స్పాట్ ఎక్సే్చంజీలు ఉన్నప్పటికీ, భారత్‌లో మాత్రం గోల్డ్ డెరివేటివ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మాత్రమే ట్రేడింగ్‌కు అనుమతి ఉంటోంది. -
టీప్లస్1 సెటిల్మెంట్కు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐచ్ఛిక(ఆప్షనల్) విధానంలో టీప్లస్1 సెటిల్మెంట్కు అనుమతించింది. దీంతో మార్కెట్లలో లిక్విడిటీ మెరుగుపడేందుకు వీలుంటుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో టీప్లస్2 సెటిల్మెంట్ అమలవుతోంది. అంటే లావాదేవీ నిర్వహించిన రెండు రోజుల తదుపరి సెటిల్మెంట్ ఉంటోంది. తాజా విధానాన్ని ఎంచుకుంటే లావాదేవీ చేప ట్టాక ఒక రోజు తదుపరి సెటిల్మెంట్కు వీలుంటుంది. అయితే టీప్లస్2 లేదా టీప్లస్1 విధానాలు రెండింటినీ సెబీ అనుమతించింది. దీంతో స్టాక్ ఎక్సే్ఛంజీలు ఐచ్ఛికంగా వీటిని ఎంపిక చేసుకునేం దుకు వీలుంటుంది. ఇందుకు వీలుగా ఆప్షనల్‌గా టీప్లస్1 విధానాన్ని ప్రవేశపెడుతూ సెబీ తాజాగా సర్క్యులర్‌ను జారీ చేసింది. తాజా మార్గదర్శకాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నెల రోజుల ముందుగా.. సెబీ తాజా నిబంధనల ప్రకారం కనీసం నెల రోజుల ముందుగా నోటీసు ఇవ్వడం ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలు ఎంపిక చేసుకున్న ఏ కౌంటర్(కంపెనీ)లోనైనా టీప్లస్1 సెటిల్మెంట్ను చేపట్టవచ్చు. అయితే ఏ కౌంటర్లోనైనా టీప్లస్1 సెటిల్మెంట్ను ఎంచుకుంటే కనీసం ఆరు నెలలపాటు తప్పనిసరిగా ఈ విధానాన్ని అమలు చేయవలసి ఉంటుంది. తిరిగి టీప్లస్2 సెటిల్‌మెంట్‌లోకి మార్పు చేయాలనుకుంటే యథావిధిగా నెల రోజుల ముందుగా వెబ్సైట్ లేదా పబ్లిక్కు తెలిసేలా నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. స్టాక్ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు తదితర మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థల నుంచి అందిన సూచనలు, చర్చల తదుపరి తాజా సెటిల్మెంట్ను సెబీ ప్రవేశపెట్టింది. ఇందుకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవలసిందిగా స్టాక్ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలకు సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇంతక్రితం 2003లో సెబీ టీప్లస్3 సెటిల్మెంట్ను టీప్లస్2కు సవరించింది. చదవండి: గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ -
రామగిరి ఠాణా.. అక్రమాలకు ఠికానా!
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది గట్టు వామనరావు, పీవీ నాగమణి దంపతుల హత్య విషయంలో పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్.. స్థానికంగా పేరున్న ఓ ప్రజాప్రతినిధి, అతడి అనుచరులు చేసే పంచాయతీలకు అడ్డాగా మారిందని కల్వచర్ల గ్రామస్తులు వాపోతున్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్‌కు చేరిన వివాదాల్లో సదరు ప్రజాప్రతినిధి అనుచరులు జోక్యం చేసుకోవడం ఆనవాయితీగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కోర్టుకు వెళ్లేవి చాలా తక్కువ. భూ వివాదాలు, కుటుంబ సమస్యల విషయంలో ఠాణా మెట్లెక్కిన వారి చేతి చమురు వదలాల్సిందే. విషయం తెలవగానే సదరు నేత అనుచరులు వాలిపోతారు. ఎవరో ఒకరి పక్షం వహిస్తారు. వారు ఎవరి పక్షాన నిలిస్తే వారికి స్టేషన్ సిబ్బంది పూర్తిగా సహకరిస్తారు. బాధితుల్లో ముందుగా వెళ్లి సదరు నేత అనుచరులను ప్రసన్నం చేసుకుంటారో వారిదే పైచేయి అవుతుంది. అతడి మాటే ‘సత్యం’.. ఆపై ‘మహేంద్ర’జాలం.. రామగిరి పోలీస్‌స్టేషన్‌లో కల్వచర్లకు చెందిన ఓ నేత సదరు ముఖ్య అనుచరుడిదే హవా. స్థానిక ప్రజాప్రతినిధికి అతడు కుడిభుజం అన్న ప్రచారం ఉంది. అందుకే స్టేషన్లో అతడు ఎంత చెబితే అంత. ఆయన ఆదేశాలు వారిపై ‘మహేంద్ర’జాలంలా పనిచేస్తాయి. రామగిరి పోలీసులు, సదరు నేత కలసి 2019లో రామగిరి పోలీస్ స్టేషన్ వేదికగా ఓ భారీ సెటిల్మెంట్ చేశారని సమాచారం. తన ఎన్నారై భర్త వేధిస్తున్నాడంటూ రామగిరి పోలీసులను ఓ యువతి ఆశ్రయించింది. ఈ విషయలో కల్వచర్ల స్థానిక నేత జోక్యం చేసుకున్నాడు. అంతే సీన్ మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించాలి లేదా కేసు నమోదు చేయాలి. ఇవేమీ చేయలేదు. 2019 నవంబర్ 22న కౌన్సెలింగ్ పేరిట ఆ ఎన్నారై భర్తను ఠాణాకు పిలిపించారు. తనకు ఆరోగ్యం బాగా లేదని ఆ ఎన్నారై చెబుతున్నా.. అతడిని గంటల పాటు మోకాళ్లపై నిల్చోబెట్టారు. స్టేషన్లో గుంజీలు తీయించారు. రకరకాల కేసులు పెడతామని, కెరీర్ నాశనం చేస్తామని, జీవితంలో తిరిగి అమెరికా వెళ్లకుండా చేస్తామని బెదిరించారు. వాస్తవానికి ఆ యువకుడికి అమెరికాలో మరో మూడేళ్ల పాటు వీసా ఉంది. దీంతో భయపడ్డ బాధితుడు కాళ్లబేరానికి వచ్చాడు. బాధితురాలితో రాజీకి రావాలని అందుకు రూ.50 లక్షలు ముట్టజెప్పాలని సదరు నేత, రామగిరి పోలీసులు తీర్పు చెప్పారు. తాను అంత ఇచ్చుకోలేనని బ్రతిమిలాడి.. ఆఖరికి యువతికి రూ.30 లక్షలు ఇవ్వాలని డీల్ క్లోజ్ చేశారు. చేసేదిలేక బాధితుడు సరేనన్నాడు. తర్వాత ఎన్నారై నుంచి రూ.50 వేలు తీసుకున్నారు. భారీగా వసూలు చేసి ఇచ్చినందుకు సదరు యువతి తండ్రి వద్ద నుంచి కూడా తమ వాటాను పోలీసులు, సదరు నేత పంచుకున్నారు. ఇలాంటి ఉదంతాలకు అక్కడ లెక్కేలేదు. అర కిలోమీటర్‌లోపే హత్య.. మొత్తం వ్యవహారంలో ఓ నేతపై తీవ్ర విమర్శలు వస్తుండటం.. అతడికి, అతడి అనుచరులకు బాగా పట్టున్న రామగిరి పోలీస్స్టేషన్పరిధిలోనే జంటహత్యలు జరగడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గట్టు వామనరావును అతడికి తెలియకుండానే నిందితులు మంథని నుంచి వెంబడిస్తూ వచ్చారు. మంథని కోర్టు నుంచి హత్యలు జరిగిన ఘటనాస్థలానికి మధ్య దాదాపు 16 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రదేశానికి ముందు మంథని ఠాణా, అది దాటాక కమాన్‌పూర్ ఠాణా పరిధి ఉంటాయి. ఈ రెండు స్టేషన్ల పరిధిలోనూ అడవి, నిర్మానుష్య ప్రాంతాలు అధికం. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. అయితే నిత్యం రద్దీగా ఉండే రామగిరి పీఎస్ పరిధిలో హత్యలు చేయడం, అది కూడా మరో అర కిలోమీటరు దూరంలో స్టేషన్ పరిధి ముగుస్తుందనగా ఘటన జరగడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామగిరి పోలీసుల అండ చూసుకునే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో క్రైం సీన్ (నేరం జరిగిన ప్రదేశం)లో సాక్ష్యాధారాల సేకరణకు పోలీసులు పెద్దగా ఆసక్తి చూపలేదని స్థానిక నేతలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా అర్ధరాత్రి వెళ్లి క్రైం సీన్ వద్ద ట్రాఫిక్ కోన్స్ పెట్టడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -
నయీం అనుచరుడి హల్చల్!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత.. అతని అనుచరుల కదలికలు పెద్దగా లేవు. నయీం హతమై రెండేళ్లు గడిచింది. ఇప్పుడు అతని అనుచరుడు శేషన్న విశ్వరూపం చూపిస్తున్నాడు. నయీం చేసిన దందాలు, సెటిల్ మెంట్లు, కూడబెట్టిన ఆస్తులు, ఇతరత్రా అన్నీ ఇతని కనుసన్నల్లోనే ఉన్నట్టు చెప్పుకుంటారు. అందుకే నయీం ఎన్కౌంటర్ జరిగిన రెండేళ్ల తర్వాత దందాలు మొదలుపెట్టాడు. ఎల్బీనగర్లోనే ఉంటూ కల్వకుర్తి, అమన్‌గల్, అచ్చంపేట్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో కార్యకలాపాలను విస్తృతం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నయీం గ్యాంగంతా అతడి వెనుకే... నయీం రెండు రకాలుగా గ్యాంగ్‌ను నడిపాడు. ఒకటి తన గురించి తెలిసిన కుటుంబీకులతో, రెండోది తనతో ముందు నుంచి ఉన్న అనుచరులతో.. ఎన్కౌంటర్ తర్వాత అతడి కుటుంబీకులు మొత్తం సైలెంట్ అయిపోయారు. కొందరు జైల్లో ఉంటే మరికొందరు అజ్ఞాతంలో గడుపుతున్నారు. కానీ అనుచర వర్గంగా ఉన్నవారంతా మళ్లీ రంగంలోకి దిగారు. అనుచరులుగా ఉన్న 16 మంది గ్యాంగ్‌లో నంబర్ 2గా ఉన్న శేషన్నతో చేతులు కలిపినట్టు మహబూబ్‌నగర్ పోలీస్ వర్గాలు స్పçష్టం చేశాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొం డలో బినామీ ఆస్తులను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ శేషన్న ఆర్థికంగా బలపడుతూ మళ్లీ దందాలోకి దిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. అతని వెంటే ప్రజాప్రతినిధులు.. నయీం ఎన్కౌంటర్ మరుసటి రోజు నుంచి ఎల్బీనగర్లో ఉన్న ఎంపీపీ ఇంటి పక్కన అపార్ట్మెంట్లోనే శేషన్న షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి అక్కడే ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాడని తెలిసింది. అచ్చంపేట ప్రాంత ఓ ప్రజాప్రతినిధి, మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్, డీఎస్పీ, కల్వకుర్తికి చెందిన మరో ప్రజాప్రతినిధితో కలసి శేషన్న సెటిల్మెంట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. నయీం బినామీల ఆస్తులను శేషన్న ద్వారా దక్కించుకునేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆచూకీ తెలియడంలేదు... శేషన్న ఎక్కడున్నాడని పోలీస్ అధికారులను ప్రశ్నిస్తే ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అతను మాత్రం బహిరంగంగానే తిరుగుతున్నాడు. పైగా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే దందాలు చేస్తుండటం అనుమానం కలిగిస్తోంది. నయీం ఎన్కౌంటర్లో కీలక సమాచారం ఇచ్చినందుకే శేషన్నను వదిలిపెట్టినట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. నలుగురు రియల్టర్లకు బెదిరింపులు.. కల్వకుర్తి, షాద్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ చేస్తున్న నలుగురు వ్యాపారులను ఇటీవల శేషన్న బెదిరించినట్లు తెలిసింది. నయీం గతంలో కబ్జా చేసిన భూములను విక్రయించేందుకు మళ్లీ రియల్టర్లు ప్రయత్నం చేయడమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై రియల్టర్లు ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఆ ఎమ్మెల్యే శేషన్నకు దగ్గరగా ఉన్న ఓ ఎంపీపీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. శేషన్న జోలికి రావద్దని ఎంపీపీ కూడా ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. రాచకొండ పరిధిలోని మల్కాజ్గిరి జోన్లో ఓ అపార్ట్మెంట్ విషయంలోనూ శేషన్న బెదిరింపులకు పాల్పడినట్లు ఓ సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. -
‘సెటిల్మెంట్’ వివాదంలో.. మోహన్‌రెడ్డి
కోర్టు కేసుల విచారణ అంటేనే మోహన్‌రెడ్డికి ములాఖత్‌ల వ్యవహారంగా మారింది. విచారణకు వచ్చిన ప్రతీసారి మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి ములాఖత్‌లతో తన వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటున్నాడనే ఆరోపణలకు బలం చేకూర్చింది తాజా సంఘటన. కేసుల విచారణకు కరీంనగర్ వచ్చే ఆయన ముందు.. తర్వాత.. హోటళ్లు, దాబాల్లో అడ్డాలు పెట్టి కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలతో తనకు కావాల్సినంత సమయం తీసుకొని సెటిల్మెంట్స్ నడిపిస్తున్నారనే విమర్శలు గతం నుంచి కూడా ఉన్నాయి. మార్చి 25న ఏకంగా కోర్టు ఎదుట గణేష్భవన్లో నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్‌లు జరిపారంటూ ఆయన బాధితుల సంఘం, లోక్‌సత్తా పోలీసు, జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈనెల 1న కరీంనగర్ సబ్‌కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన మోహన్‌రెడ్డి లగ్జరీ ఏసీ కారు (క్రేటా)లో యూనిఫాంలో ఉన్న ఎస్కార్టు పోలీసులతో ఓ హోటల్లో కొందరితో ములాఖత్ నిర్వహించడం, ప్రైవేట్ కారు, హోటల్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు శుక్రవారం మోహన్‌రెడ్డి బాధితుల సంఘం, లోక్‌సత్తా పోలీసు, జైలు ఉన్నతాధికారులకు మరోమారు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రసాద్‌రావు ఆత్మహత్య కేసులో అరెస్టై ఇప్పటికి 72 కేసులను ఎదుర్కొంటున్న మోహన్‌రెడ్డి చాలా కాలం కరీంనగర్ జైలులో ఉన్నారు. ఈ తరుణంలోనే సంచలన వీడియో బయటపడడం, కరీంనగర్ జైలు అధికారి కార్యాలయంలోనే నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్‌లు నిర్వహిం చారన్న ఆరోపణలపై జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం, మోహన్‌రెడ్డి, ఆయన బావమరిదిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించింది. కరీంనగర్ జైల్లో ఉన్నప్పుడు వీఐపీలాగా జైల్లోనే ములాఖత్‌లు పెట్టడం, వీడియో దృశ్యాలు బయటపడడంతో మోహన్‌రెడ్డిని వరంగల్ జైలుకు తరలించారు. అయినా మోహన్‌రెడ్డి ములాఖత్‌లకు ఎక్కడా భంగం వాటిల్లినట్లు కనబడకపోగా, ఆయనకు పోలీసుశాఖకు చెందిన టాటా సుమో ఏసీ వాహనం సమకూర్చడం అప్పట్లో వివాదం అయ్యింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మోహన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరు పరచే నిమిత్తం గతంలో టీఎస్09–పీఏ1339 నంబర్ గల ఏసీ టాటా సుమో మఫ్టీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌తో తీసుకురావడం కూడా వివాదాస్పదమైంది. ఆ విషయం మరువక ముందే మార్చి 25న ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులను, అనుమాయులను కలిసి చర్చించడమే కాకుండా పోలీసులకు నజరానా ముట్టజెప్పిన దృశ్యాల వీడియోలు బయటపడడం సంచలనం రేపింది. కరీంనగర్ కోర్టుకు వచ్చిన మోహన్‌రెడ్డి, దానికి ఎదురుగా ఉన్న గణేష్భవన్ ఉడిపి హోటల్లో సాయంత్రం 6.02 గంటలకు ప్రవేశించి ఏకంగా 23 నిమిషాలు హోటల్లో గడిపారు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు అక్షయ్‌రెడ్డి తమ్ముడు బొబ్బల మహేందర్‌రెడ్డితోపాటు బంధువులు, మణింధర్సింగ్తో చర్చలు జరిపారు. 6.24 నిమిషాలకు మోహన్‌రెడ్డి సూచనల మేరకు చర్చల అనంతరం మహేందర్‌రెడ్డి హోటల్ బెంచీపై డబ్బులు పెట్టాడు. మోహన్‌రెడ్డి లేవగానే అక్కడున్న కానిస్టేబుల్ ఆ మొత్తాన్ని తన జేబులో పెట్టుకొని నడుస్తున్న దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపించడం కలకలం రేపగా, ఎస్కార్టు పోలీసులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. తాజా సంఘటన మరోమారు కలకలానికి కారణమైంది. మోహన్‌రెడ్డి, ఎస్కార్టుపై చర్యలు తీసుకోవాలి..: బాధితుల సంఘం సబ్‌కోర్టు నంబర్ 416లో ఓ కేసు విచారణ నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటళ్లో సెటిల్మెంట్ చేసి ఎస్కార్టు పోలీసులతో ఏసీ కారులో బయటకు వెళ్తున్న వీడియో దృశ్యాలు బయట పెట్టిన బాధితుల సంఘం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈనెల 1న కరీంనగర్ కోర్టుకు వచ్చినప్పుడు జిల్లా సమీపంలో ఒక ప్రైవేట్ భోజనశాలల్లో కూర్చొని సన్నిహితులతో ములాఖత్ నిర్వహించారని, సెటిల్మెంట్ చేసుకున్నారని, మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డితోపాటు ఆయనకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ముస్కు మహేందర్‌రెడ్డి, బండమీది సామన్న ఒక ప్రకటనలో కోరారు. ప్రైవేట్ వాహనాన్ని అనుమతించి మోహన్‌రెడ్డి ప్రైవేట్ ములాఖా™Œత్‌కు సహకరించిన ఎస్కార్ట్ పోలీసులపై తక్షణమే చర్య తీసుకోవాలని బాధితుల సంఘం ప్రకటనలో డిమాండ్ చేసింది. విషయం తెలిసింది.. విచారణకు ఆదేశించాం.. కోర్టు కేసు నిమిత్తం కరీంనగర్‌కు వచ్చిన మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి, ఎస్కార్టు పోలీసుల విష యం మా దృష్టికి వచ్చింది. డీఐజీ దృష్టికి కూడా తీసుకెళ్లి విచారణకు ఆదేశించాం. వీడియోలో వ్యక్తులు స్పష్టంగా కనిపించడం లేదు. అయినప్పటికీ ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం. ఎస్కార్టు పోలీసుల తీరుపైనా ఆరా తీస్తున్నాం. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీబీ కమలాసన్ రెడ్డి, పోలీసు కమిషనర్, కరీంనగర్ -
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా
-
సల్మాన్‌కే వార్నింగ్ ఇచ్చాడు
సాక్షి, హైదరాబాద్ : సైబరాబాద్, మియాపూర్ ఠాణా పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న ఇతను బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌నూ విడిచిపెట్టలేదు. అతడి నుంచి డబ్బులు వసూలు చేయడానికి పథకం పన్ని వార్నింగ్ ఇచ్చాడు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో రాజస్థాన్ కోర్టుకు వచ్చినప్పుడు చంపేస్తానంటూ బెదిరించాడు. ప్రధానంగా సోషల్‌మీడియా వేదికగానే ఇతడి దందాలు నడిచాయని పోలీసులు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని కలోడి ప్రాంతానికి చెందిన సంపత్ తండ్రి రామ్‌చంద్ర పోలీసు అధికారి. చండీఘడ్ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్గా పని చేసి పదవీ విరమణ చేశారు. పంజాబ్ యూనివర్శిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలో బీఏ పూర్తి చేసిన సంపత్ పంజాబ్ యూనివర్శిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. విద్యార్థి దశలోనే ఘర్షణలకు దిగి, బెదిరింపులకు పాల్పడి పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. జోధ్‌పూర్‌లో నమోదైన ఓ కేసులో అరెస్టైన సంపత్‌కు జైలులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పరిచయమై అతడి అనుచరుడిగా మారాడు. తమ సామ్రాజ్యాన్ని హర్యానాతో పాటు పంజాబ్, రాజస్థాన్, చండీఘడ్లకూ విస్తరించాడు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ కోర్టుకు హాజరవుతున్న సల్మాన్ ఖాన్‌ను ఈ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఆయన నుంచి అందినకాడికి దండుకోవాలని భావించిన బిష్ణోయ్ బెదిరించాల్సిందిగా సంపత్‌ను ఆదేశించాడు. దీంతో సోషల్‌మీడియా ద్వారా తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగిన సంపత్ జోధ్‌పూర్ కోర్టు ప్రాంగణంలోనే హతమారుస్తానంటూ సల్మాన్‌కు గతేడాది వార్నింగ్ ఇచ్చాడు. సంపత్‌కు రాజ్‌ఘర్ కోర్టు ఆవరణలో అజయ్ అనే ప్రత్యర్థిపై కాల్పులు జరిపి హత్య చేసిన చరిత్ర ఉండటంతో ఈ వార్నింగ్ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న జోధ్‌పూర్ పోలీసులు సల్మాన్ హాజరైనప్పుడల్లా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసే వారు. బిష్ణోయ్ గ్యాంగ్ ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ఎక్కువగా సోషల్‌మీడియానే వాడుకునేది. బిష్ణోయ్ అరెస్టు తర్వాత ఆ గ్యాంగ్‌కు నేతృత్వం వహించిన సంపత్ వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ పరోక్షంగా అనేక మందికి వార్నింగ్స్ ఇచ్చేవాడు. వరుస నేరాలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ నాలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరిన సంపత్‌పై పది సంచలనాత్మక హత్యలు, మూడు హత్యాయత్నాలతో పాటు బెదిరింపులు, దోపిడీల కేసులు ఉన్నాయి. అతడి కోసం పోలీసులు వేట ముమ్మరం చేయడంతో తన అనుచరుడి సహాయంతో సిటీకి మకాం మార్చాడు. దాదాపు నెల రోజుల క్రితం గోకుల్ ప్లాట్స్‌లోని ఓ అద్దె ఇంట్లో తన ఉనికి బయపడకుండా సాధారణ జీవితం పడిపాడు. ఎంబీఏ చదువుతున్నఇద్దరు విద్యార్థులతో కలిసి నిరుద్యోగి ముసుగులో నివసించాడు. నిత్యం సెల్ఫోన్లో చాటింగ్స్, ఫోన్లలో బిజీగా ఉండే సంపత్ ఓ గ్యాంగ్‌స్టర్ అన్న విషయం తమకు తెలియదని ఆ ఇద్దరు విద్యార్థులు సైబరాబాద్ ఎస్ఓటీ విచారణలో వెల్లడించారు. ఇతడి కోసం ముమ్మరంగా గాలించిన ఎస్టీఎఫ్ అధికారులు ఫలితం లేకపోవడంతో సాంకేతికంగా ముందుకు వెళ్లారు. సంపత్ ప్రధాన అనుచరులతో పాటు అతడి గర్ల్‌ఫ్రెండ్ హిసార్ సెల్ఫోన్లను ట్యాప్ చేశారు. దీంతో సంపత్ ఆచూకీ బయటపడటంతో సైబరాబాద్‌కు వచ్చి ఎస్ఓటీ సహాయం కోరారు. బుధవారం రంగంలోకి దిగిన టీమ్స్ తొలుత అతడి వద్ద మారణాయుధాలు ఉంటాయని అనుమానించారు. అతడు అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ సమీపంలో కాపుకాసిన పోలీసులు బుధవారం సాయంత్రం ఈవెనింగ్ వాక్కు వచ్చిన సంపత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి ఫ్లాట్‌లో సోదాలు చేశారు. -
ఠాణా.. సెటిల్మెంట్లకు అడ్డా!
సాక్షి, మచిలీపట్నం : పోలీస్ అంటేనే భరోసా.. పోలీసు వ్యవస్థ అంటే బాధ్యత.. అంతకు మించి విశ్వాసం. సగటు మనిషికి పోలీసు స్నేహితుడిలా మెలగాలి. కానీ బందరు తాలూకా స్టేషన్ పరి ధిలో పరిస్థితి దీనికి విరుద్ధంగా నడుస్తోంది. వరుసగా జరుగుతున్న సెటిల్మెంట్లు వారి అవినీతికి అద్దం పడుతున్నాయి. వారి వ్యవహార శైలి వివా దాస్పదం అవుతుండటంతో ప్రజల్లో పోలీసు శాఖకే మాయని మచ్చలా మారుతోంది. ఇందుకు ఇటీవల బందరు తాలూకా స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బాధితులకు న్యాయం చేసేందుకు ఉద్దేశించిన ఠాణాను అవినీతికి ఠికానాగా మార్చేస్తున్నారు. న్యాయం కోసం ఎవరు వెళ్లినా.. న్యాయం తమవైపు ఉన్నా పైసలు సమర్పించుకోవాల్సి వస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. క్రిమినల్, సివిల్ కేసులన్న బేధం లేకుండా వాటిలో కాలు పెట్టేస్తున్నారు. కాసుల కక్కుర్తితో న్యాయం చేయాల్సిన వారిని బెదిరించి మరీ సెటిల్మెంట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిత్యకృత్యంగా మారాయి. మచ్చుకు కొన్ని పరిశీలిస్తే...సివిల్ పంచాయతీల్లో హవా... బందరు మండల పరిధిలోని తుమ్మలచెరువులో 20 మంది రైతులకు సంబంధించి 73.46 ఎకరాల రొయ్యల చెరువు ఉంది. సదరు రైతులు ఎనిమిదేళ్ల క్రితం సత్యనారాయణమూర్తి అనే వ్యక్తికి లీజ్ ఇచ్చారు. కొంత కాలం సాగు చేసుకున్న అనంతరం సత్యనారాయణమూర్తి మంగళగిరికి చెందిన శ్రీనివాసరావుకు అప్పజెప్పాడు. శ్రీనివాసరావు.. గాంధీ అనే వ్యక్తికి అప్పగించారు. గాంధీ చెరువు సాగు చేస్తుండగా.. బెంగళూరుకు చెందిన లక్ష్మీనరసింహన్ అనే ఆమె అకస్మాత్తుగా తెరపైకి వచ్చి చెరువు తనదేనంటూ హంగామా చేసింది. ఈ పంచాయతీ ఎస్పీ వద్దకు చేరింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇది సివిల్ కేసైనా అందులో తల దూర్చి సెటిల్మెంట్కు దిగారు. చెరువుపై పూర్తి హక్కులు లక్ష్మీనరసింహన్‌కే ఉన్నాయంటూ గాంధీ వర్గీయులను బుధవారం బెదిరింపులకు గురి చేశారు. ఏకంగా చెరువు వద్దకు వెళ్లి నానా హంగామా చేశారు. చెరువు వదిలి వెళ్లకపోతే తప్పుడు కేసులు బనాయిస్తామని హెచ్చరించారని బాధితుడు గాంధీ వాపోయాడు. లక్ష్మీనరసింహన్ నుంచి ముడుపులు తీసుకుని తనకు అన్యాయం చేస్తున్నారంటూ గాంధీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒక సివిల్ కేసులో అంత అత్యుత్సాహం చూపాల్సిన అవసరం పోలీసులకు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం ఈ వ్యవహారమే కాదు జిల్లావ్యాప్తంగా ప్రతి నిత్యం ఇలాంటి సివిల్ సెటిల్మెంట్లతో జేబు నిండా సంపాదిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి తమకు సంపూర్ణ మద్దతు ఉండటంతో ఇలాంటి తంతుకు తెగబడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. -
ఖాకీలకు అవినీతి మరక
రాజమహేంద్రవరం క్రైం: పోలీస్స్టేషన్లు సెటిల్మెంట్లకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపకుండా తమ స్వలాభం కోసం హౌస్ ఆఫీసర్లు ఇరువర్గాల వద్ద లంచాలు గుంజుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని దాదాపు ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సెటిల్మెంట్లు ఎక్కువగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు స్థానిక రాజకీయ నేతల అంగీకారం లేనిదే ఆ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లో హౌస్ ఆఫీసర్ విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించాలంటే ఆయా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకొని అనంతరం వారు చెప్పిన రేటు చెల్లించిన తరువాత పోస్టింగ్‌లు తీసుకోవలసి వస్తుందని పోలీస్ అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. ఇలా చెల్లించిన మొత్తాన్ని రాబట్టుకోవాలని కొందరు పోలీస్ అధికారులు లంచాలకు పాల్పడుతున్నారు. ఏసీబీకీ చిక్కిన సౌత్‌జోన్ డీఎస్పీ అలాగే 2017 మే 31వ తేదీన రాజమహేంద్రవరం రూరల్, రాజవోలు గ్రామానికి చెందిన పాస్టర్ తాడికొండ విల్సన్ కుమార్, సామర్లకోటకు చెందిన కీర్తిప్రియ అనే మహిళ వద్ద ఇల్లు కొన్నాడు. ఇంటి అగ్రిమెంట్ చేసుకున్న తరువాత కీర్తిప్రియ ఇంటికి మరికొంత ఎక్కువ సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీన విల్సన్ కుమార్‌పై కీర్తిప్రియ ధవళేళ్వరం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ కేసులో సౌత్‌జోన్ డీఎస్పీ నారా యణరావు, కీర్తిప్రియ వద్ద లంచం తీసుకొని వారికి అనుకూలంగా కేసు రాజీ చేసుకునే విధంగా విల్సన్ కుమార్‌పై వత్తిడి తెచ్చాడు. రూ.ఏడు లక్షల నష్టానికి విల్సన్, కీర్తిప్రియతో రాజీ చేసుకున్నాడు. కేసు రాజీ కుదుర్చుకున్న అనంతరం సౌత్‌జోన్ డీఎస్పీ పి.నారాయణరావు తన వద్ద ఉన్న కానిస్టేబుల్ రమేష్‌తో ఫోన్లు చేయిస్తూ రాజీ కుదుర్చుకున్న తరువాత తనకు రావలసిన వాటా రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో విల్సన్ కుమార్ రూ.50 వేలు డీఎస్పీకి, రూ.5 వేలు కానిస్టేబుల్ రమేష్‌కు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై బాధితుడు విల్సన్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో రూ.55 వేలు కానిస్టేబుల్ రమేష్‌కు ఇస్తుండగాఏసీబీ అధికారులు మే 31వ తేదీ గురువారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. ఈ లంచం కానిస్టేబుల్ రమేష్‌కు ఇవ్వాలని చెప్పి బయటకు వెళ్లిపోతున్న సౌత్‌జోన్ డీఎస్పీ పి.నారాయణరావును గేటు వద్ద అరెస్ట్ చేశారు. పోలీస్ శాఖలో కింది నుంచి పై స్థాయి వరకూ అవినీతి మయంగా మారింది. కొందరు అవినీతి పోలీస్ అధికారుల వలన మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. పట్టుబడిన పోలీస్ అధికారులు వీరే అవినీతికి పాల్పడుతూ పోలీస్ అధికారులు ఏసీబీకీ చిక్కుతున్నారు. 2016 మార్చి 15వ తేదీన రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్సై రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అలాగే 2016 డిసెంబర్ 12వ తేదీన అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న జక్కి నాగేశ్వరరావు, హోమ్ గార్డు గంటి శ్రీనివాసరావు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవనిగడ్డ టెంపోరావుకు చెందిన ఒక కేసు విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 2017 ఫిబ్రవరి 22వ తేదీన ద్రాక్షారామ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న ఫజల్ రహ్మన్, రామచంద్రపురం మండలం కాపవరం గ్రామానికి చెందిన యనమదల భరత్ వద్ద ఒక కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి, చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్ హేండెడ్‌గా చిక్కాడు. -
ఏసీబీ వలలో ఏసీపీ
సాక్షి, చెన్నై: చెన్నై తిరుమంగళం ఏసీపీ కమిల్ బాషా ఏసీబీ వలలో పడ్డారు. ఆయన కార్యాలయంలో జరిగిన సోదాల్లో రూ.5 లక్షల మేరకు నగదు బయట పడింది. స్థల వివాదం సెటిల్ మెంట్లో భాగంగానే ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటూ అవినీతి ఏసీపీ ఏసీబీకి చిక్కారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల కాలంగా పనిభారం, మానసిక ఒత్తిడి కారణంగా పోలీసు విభాగంలోని కింది స్థాయి సిబ్బంది బలవన్మరణాలకు పాల్పడుతూ రావడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అదే సమయంలో పోలీసు బాసుల మీద అవినీతి ఆరోపణలు క్రమంగా పెరుగుతూ రావడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో తిరుమంగళం ఏసీపీ కార్యాలయంలో సోదాలు సాగడం పోలీసుల్ని కలవరంలో పడేసింది. తిరుమంగళం పరిసరాల్లో ఇటీవల కాలంగా నిర్మాణాలు జోరందుకోవడంతో పోలీసు సెటిల్మెంట్లు సైతం పెరిగినట్టుగా అందిన రహస్య సమాచారంతో నిఘా వేసి మరీ అవినీతి భాషాను తమ వలలోకి ఏసీబీ వర్గాలు వేసుకున్నాయి. అవినీతి బాషా : తిరుమంగళం ఏసీపీ కార్యాలయానికి కొత్త భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో జేజే నగర్ ఏసీపీ కార్యాలయంలోనే తిరుమంగళంకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏసీపీగా కమిల్ భాషా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమంగళం ఏసీపీ కార్యాలయంలో పంచాయితీలు పెరిగినట్టు, సెటిల్ మెంట్లు జోరందుకున్నట్టుగా ఏసీబీకి సమాచారం అందిందింది. దీంతో ఏసీబీ వర్గాలు నిఘా వేశాయి. శుక్రవారం రాత్రి పద కొండుగంటల సమయంలో తమ నిఘాకు తగ్గట్టుగా ఆధారం చిక్కడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. కొడుంగయూరుకు చెందిన కాంట్రాక్టర్ సెల్వం ఏసీపీ కమిల్ భాషా గదిలో సుదీర్గ చర్చలో ఉన్నట్టు సమాచారం ఏసీబీకి అందింది. ఏసీబీ ఏఎస్పీ కుమార్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. వచ్చి రాగానే నేరుగా ఏసీపీ గదిలోకి ఈ బృందం దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ సెల్వం, కమిల్ బాషాఏదో విషయంగా సుదీర్ఘ చర్చలో మునిగి ఉండడం, ఏసీపీ టేబుల్ మీద నోట్ల కట్టలు ఉండటాన్ని ఏసీబీ గుర్తించింది. ఏసీబీ వర్గాల ప్రవేశంతో కమిల్ బాషా, సెల్వంలకు షాక్ తప్పలేదు. ఆ టేబుల్ మీదున్న 2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, ఆ నగదు ఎక్కడిదని ఏసీబీ విచారణ మొదలెట్టింది. తన మిత్రుడి వద్ద అప్పుగా తీసుకున్నది అని కమిల్ బాషా పేర్కొనడం తక్షణం, పక్కనే ఉన్న సెల్వం వద్ద ఉన్న బ్యాగ్‌లో తనిఖీ చేయగా అందులో నుంచి రెండున్నర లక్షలకు పైగా నగదు లభించడంతో తమ విచారణను ముమ్మరం చేశారు. ఆ ఇద్దరు పొంతన లేని సమాధానం ఇవ్వడంతో రాత్రంతా విచారణ సాగింది. శనివారం ఉదయాన్నే విచారణను ముగించిన ఏసీబీ వర్గాలు, ఆ నగదును సీజ్ చేశారు. సరైన వివరణ ఇవ్వని పక్షంలో అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించి, ఆ ఇద్దరికి కొంత సమయం ఇచ్చి వెళ్లారు. కమిల్ బాషా ఏసీబీకి చిక్కిన సమాచారం పోలీసు వర్గాల్ని కలవరంలో పడేసింది. ఇంత పెద్ద మొత్తం సెటిల్ మెంట్ సాగుతున్న నేపథ్యంలో ఇందులో వాటా ఒక్క కమిల్ బాషాకే కాదు, మరి కొందరికి సైతం ఉండ వచ్చన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో జేజే నగర్ ఇన్స్పెక్టర్ పాండియరాజన్‌ను సైతం విచారణ వలయంలోకి ఏసీబీ తీసుకొచ్చింది. స్థల వివాదం పరిష్కారంలో భాగంగా ఎనిమిది లక్షలకు బేరం సాగినట్టు, ఇందులో అడ్వాన్స్ తీసుకుంటున్న సమయంలో ఏసీబీ రంగంలోకి దిగినట్టుగా జేజేనగర్ పోలీసు స్టేషన్లో చర్చ సాగుతున్నది. ఈ అవినీతి వెనుక ఒక్క కమిల్ బాషానే కాదు, మరెందరో ఉన్నారని, మరెందరో ఉన్నతాధికారులకు సైతం వాటాలు తప్పనిసరి అన్నట్టుగా కింది స్థాయి సిబ్బంది పెదవి కొరుకుతుండడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి లోతైనా విచారణ సాగించేనా లేదా, ఈ తనిఖీలతో మమా అనిపించేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇది వరకు చెన్నైలో ఐపీఎల్ బెట్టింగ్ వెలుగులోకి రాగా, కమిల్ భాషా నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే, చెన్నైలో ఏదేని కీలక కేసుల విచారణలో ప్రత్యేక బృందంగా కమిల్ బాషా టీం గుర్తింపు పొంది ఉండం గమనార్హం. -
పెద్దాయన పేరు చెప్పి ..దందాలు
అధికార పార్టీలో ఆయనో పెద్దాయన.. గత ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి జిల్లాలో చక్రం తిప్పిన వ్యక్తి. ప్రస్తుతం అధికార పార్టీలోకి మూడేళ్ల క్రితం చేరి ప్రస్తుతం ఒక నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయాల్లో సమకాలికుడిగా ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇన్చార్జి హోదాలో ఉన్నప్పటికీ అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడు. అలాంటి పెద్దాయన పేరు చెప్పి ఆయన ముఖ్య అనుచరుడుగా ఉన్న ఓ నాయకుడు బరితెగింపు దందాలకు పాల్పడుతున్నాడు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారపార్టీలో ఉన్న ఓ పెద్ద నాయకుడి పేరు చెప్పి ఆయన అనుచరుడు చిన్నపాటి వివాదాలు మొదలుకుని భారీ భూదందాల వరకు అన్ని యథేచ్ఛగా సాగిస్తున్నాడు. స్టేషన్లలో, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి పనికీ ఒక ప్యాకేజ్‌తో పాటు పెద్దాయన పేరు అదనపు బ్రాండ్‌గా మార్చుకుని దందాలు సాగిస్తున్నాడు. ఒక కానిస్టేబుల్‌కు చెందిన పొలంలో పంటను అతనికి తెలియకుండా విక్రయించటంతో వివాదం మొదలైంది. అధికార పార్టీ నేత కావటం, పెద్దాయన బ్రాండ్ ఉండటంతో చివరకు పోలీసులు కూడా సొంత ఖాకీకి న్యాయం చేయలేక సెటిల్మెంట్ చేసుకోమని ఒత్తిడి తేవటం జిల్లాలో అధికార పార్టీ తీరుకు ఈ ఘటన పరాకాష్టగా నిలిచింది. ఏదేమైనా అతని జోలికి రావద్దంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేవటం గమనార్హం. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలానికి చెందిన అధికార పార్టీ నేత గంగినేని నాగేశ్వరరావు అలియాస్ తిక్కవరం నాగేశ్వరరావు నియోజకవర్గంలో సాగి స్తున్న వ్యవహారం ఇది. మూడేళ్లలో అతనిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందులో స్టేషన్లలోనే ఐదు కేసులు సెటిల్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆత్మకూరు స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ భార్యకు పుట్టింటి ద్వారా అక్కడ ఏడు ఎకరాల పొలం వచ్చింది. దానిలో ఏడేళ్లుగా సరుగుడు తోట సాగు చేశారు. మంచి ధర వస్తే పంటను విక్రయించాలని కానిస్టేబుల్ భావించాడు. అయితే కానిస్టేబుల్‌కు తెలియకుండా రాత్రికి రాత్రే నాగేశ్వరరావు మనుషులను పెట్టి సరుగుడు తోటను కొట్టించి రూ.4.60 లక్షలకు విక్రయించాడు. దీనిపై కానిస్టేబుల్ ఫిర్యాదు చేస్తే, ఆయన పెద్దాయన మనిషి కదా రూ.2 లక్షలు తీసుకుని రాజీ చేసుకోమని స్టేషన్ ఎస్సై బాధిత పోలీసుకు సలహా ఇచ్చాడు. చివరకు ఉన్నతాధికారుల దృష్టికి రావటంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి కేసులు గడిచిన మూడేళ్లలో అనేకం చోటుచేసుకున్నాయి. అలాగే గతంలో కేవీ సుబ్బారెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమిని కూరపాటి సుశీలమ్మ అనే మహిళకు రూ.91 లక్షలకు విక్రయించాడు. చివరకు స్టేషన్లో పంచాయతీ చేసి రూ.30 లక్షలు వెనక్కి ఇచ్చి కేసు లేకుండా చేసుకున్నాడు. రైతుల భూములు రియల్ కంపెనీకి విక్రయం మరోవైపు రైతుల భూములు వారికి తెలియకుండా చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి విక్రయించాడు. వాటిలో ప్రస్తుతం కొన్ని పంచాయతీలు పెండింగ్‌లో ఉన్నాయి. నరసింహారెడ్డి అనే వ్యక్తికి చెందిన 9 ఎకరాల భూమిని అతని ప్రమేయం లేకుండా చెన్నైకి చెందిన రెయిన్ ఫారెస్ట్ ఆగ్రో వెంచర్ సంస్థకు విక్రయించాడు. అలాగే చిన్న కొండయ్య అనే వ్యక్తి భూమిని కూడా అదే కంపెనికి విక్రయించాడు. ఇక తిక్కవరం, పల్లవోలు గ్రామాల్లో ఉన్న సీజేఎఫ్ ఎస్ భూముల్ని గతంలో మహిళ తహసీల్దార్ సహకారంతో పట్టాలు సృష్టించి, వాటిని కూడా ఇదే రియ ల్ ఎస్టేట్ కంపెనీకి తక్కువ ధరకు విక్రయించాడు. వాటికి గతంలో ఉదయగిరిలో ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌తో కలిసి అన్ని రిజిస్ట్రేషన్లు చేశాడు. ప్రస్తుతం ఇవన్నీ పంచాయతీ దశలో ఉన్నాయి. పశువులను కూడా వదలరు చివరకు పశువులను కూడా వదలరనే పేరుంది. రోడ్లపై కనిపించిన గేదెలను ప్రత్యేకంగా ఉండే రెండు వాహనాల్లో తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో విక్రయించటం, లేదంటే కడప సరిహద్దు గ్రామాలకు తరలించటం చేస్తారు. వీటికి సంబంధించి నమోదైన ఫిర్యాదుల్లోనూ పోలీసుల వ్యవహార శైలి ఏకపక్షమే. ఒక రైతుకు చెందిన ఐదు గేదెలను తీసుకెళ్లి ఆ నాయకుడు అమ్మేశాడు. బాధిత రైతులు కేసు పెడితే విచారణ పేరుతో కేసును పెండింగ్‌లో ఉంచారు. అలాగే గతంలో వెంకటనర్సయ్య అనే వ్యక్తి గేదెలను కూడా విక్రయించాడు. రాంపల్లి గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన ఐదు గేదెలను కూడా ఇదే రీతిలో అమ్మేశాడు. చివరకు బాధిత రైతులతో మాట్లాడి స్టేషన్లో ఎస్సై సెటిల్మెంట్ చేసి రూ.50 వేలు ఇప్పించాడు. ఇలాంటి నేత జోలికి రావద్దని తరచూ అధికార పార్టీ పెద్దాయన నుంచి పోలీసులకు ఫోన్లు రావటంతో పూర్తిగా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. -
అంతా నా ఇష్టం
అధికార పార్టీకి చెందిన కీలక నేత సిఫారసుతో నియామకం.. మరో వివాదాస్పద ప్రజాప్రతినిధి ప్రోత్సాహం.. ఇక తిరుగేం ఉంటుంది. అందుకే ఆ పోలీస్ అధికారి అన్నింటికీ అతీతుడు. నిబంధనలు పట్టించుకోరు. సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోకూడదన్నా అసలే పట్టదు. అధికార పార్టీ నేతల దందాలకు ఏకపక్షంగా వత్తాసు పలుకుతారు. కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ వేధిస్తారు. ఆయన బదిలీలకూ అతీతమే. కొన్నేళ్లుగా ఎంతోమంది అధికారులు బదిలీ అవుతున్నా.. బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఆయన మాత్రం జిల్లాలోనే కొనసాగుతూ వివాదాస్పదంగా మారారు. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ పోలీస్ కమిషరేట్‌లో ఓ మధ్యస్థాయి పోలీస్ అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. జిల్లాలో కీలక టీడీపీ నేత అండదండలతో ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయనంటే ఉన్నతాధికారులు హడలిపోతారు. ఇక విజయవాడలో దందాలతో బెంబేలెత్తిస్తున్న ఓ ప్రజాప్రతినిధి అండదండలూ ఆయనకు ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆయన వివాదాస్పదంగా మారుతున్నా అడ్డుకునే వారే లేరు. రెండుసార్లు అధికారులను బదిలీచేసినా ఆయనకు మాత్రం స్థానచలనం లేదు. అసలు ఆయనను బదిలీ చేయాలన్న యోచనకే ఉన్నతాధికారులు సాహసించలేకపోతున్నారని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. వివాదాస్పదంగా మారిన ఆ అధికారి వ్యవహారాల్లో కొన్ని ఉదాహరణలు.. - ఇటీవల విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో 20 సెంట్ల ప్రైవేట్ భూమిని టీడీపీ నేతలు ఆక్రమించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం ఖరీదు దాదాపు రూ.2కోట్లు. ఆ స్థల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ, ఆ ఉత్తర్వులను అమలు చేయడానికి ఈ పోలీస్ అధికారి ససేమిరా అన్నారు. అప్పటికే అక్కడ తాత్కాలిక గుడారాలు వేసుకుని ఉన్న అధికార పార్టీ నేతలకు వత్తాసు పలికారు. తమకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కదా అని బాధితులు అనడంతో పోలీస్ అధికారి శివాలెత్తిపోయారు. ఎక్కువగా మాట్లాడితే అంతు చూస్తానని బెదిరించారు. అధికార పార్టీ నేతలు రూ.50 లక్షల వరకు ఇస్తారు. అవి తీసుకుని స్థలాన్ని వదిలేయాలని కూడా అధికారి వారికి చెప్పడంతో బాధితులకు నోట మాట రాలేదు. రూ.2 కోట్ల స్థలాన్ని కేవలం రూ.50 లక్షలకు విక్రయించాలని ఆ అధికారి సెటిల్మెంట్ పేరుతో దందా చేయడం విస్మయపరిచింది. - ఆ పోలీసు అధికారి తన పరిధిలోని కిందిస్థాయి అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లపర్వం కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కిందిస్థాయి సిబ్బంది ప్రధానంగా బంగారు వర్తకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. తరచూ చిన్న బంగారు వర్తకులను అదుపులోకి తీసుకుని రికవరీల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏ దొంగతనం కేసు అన్నది కూడా చెప్పకుండా ఏకపక్షంగా రికవరీలంటూ వసూళ్లకు పాల్పడుతుండటంతో చిరు వర్తకులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతోపాటు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, ఇతర చిన్నచిన్న వ్యాపారులను పెట్టీ కేసుల పేరుతో వేధిస్తున్నారు. - విజయవాడ శివారులోని గొల్లపూడి– ఇబ్రహీంపట్నం మధ్యలో చాలా ఏళ్ల క్రితం రిటైర్డ్ ఉద్యోగులు, వన్‌టౌన్‌కు చెందిన చిన్న వ్యాపారులు ప్లాట్లు కొన్నారు. కానీ, రాష్ట్ర విభజన తరువాత ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో జిల్లా కీలక నేత అనుచరులు ఆ ప్రాంతంలో ఉన్న అసైన్డ్ భూములతోపాటు ఈ ప్లాట్లను కూడా చదును చేసి లే అవుట్ వేశారు. దాదాపు 30 ప్లాట్ల వరకు అలా కలిపేసుకున్నారు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. పోలీసులను ఆశ్రయించారు. కానీ, ఆ పోలీస్ అధికారి కబ్జాదారులకు అనుకూల వాదన వినిపించారు. ‘వాళ్లంతా పెద్ద వాళ్ల మనుషులు. వారితో గొడవ ఎందుకు..? ఎంతో కొంత తీసుకుని ఆ ప్లాట్లు వదిలేయండి’ అని చెప్పడం గమనార్హం. అందుకు వ్యాపారులు ససేమిరా అనడంతో వారిపై ఆ పోలీస్ అధికారి ఆగ్రహించారు. మాట వినకపోతే వన్‌టౌన్‌లో వ్యాపారాలు చేసుకోలేరని పరోక్షంగా హెచ్చరించారు. -
పోలీసులు వెతకరు.. దొంగలు దొరకరు!
కోడుమూరు: సివిల్ పంచాయితీలు, సెటిల్మెంట్లలో కోడుమూరు పోలీసులు బిజీగా ఉన్నారని దొంగలకు కూడా తెలిసినట్లు ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని అడ్డా్డగా మార్చుకుని చెలరేగి పోతున్నారు. వరుస చోరీలు ఇందుకు బలం చేకూరుస్తు న్నాయి. కోడుమూరు స్టేషన్ పరిధిలో ప్రజలకు భద్రత కరువైంది. దొంగలు పడిన ఆర్నెల్లకు కూడా సొత్తు రికవరీ కావడం లేదు. అసలు కేసులే నమోదు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేసు నమోదు.. దర్యాప్తు.. విచారణ.. అరెస్ట్.. కోర్టులు ఇవన్నీ ఎందుకు అనుకున్నారేమో.. స్టేషన్‌కు వచ్చిన బాధితులకు చూద్దాం.. చేద్దామంటూ హామీ ఇచ్చి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. పోలీసులు వెతకరు.. దొంగలు దొరకరు అన్నట్లుగా మారింది. కోడుమూరు మండలంలో దొంగలు తమ చేతివాటానికి వేగం పెంచారు. స్టేషన్ పరిధిలో చోరీల సంఖ్య పెరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యం వీడటం లేదు. దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెండింగ్ చోరీ కేసుల స్థానంలో ఈ స్టేషన్ జిల్లాలో నాలుగు స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 28 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వర్కూరు గ్రామంలో 4 నెలల వ్యవధిలో ఆరు చోరీలు జరిగాయి. ఇవన్నీ ఒకే తరహాలో జరిగినా ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులను చేధించడంలో ఘోరంగా విఫలమయ్యారు. వర్కూరు గ్రామంలో రామాంజినేయులు ఇంట్లో 8 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి, రూ.70 వేల నగదును దొంగలు దోచుకుపోయారు. అయితే కేవలం 5 తులాల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుల్లేవు.. దర్యాప్తు లేదు ♦ గత ఏడాది సెప్టెంబరు 23వ తేదీన వల్లెలాంబ గుడి దగ్గర ఫ్యాషన్ ప్రొ ద్విచక్ర వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు గొల్ల నాగరాజు కేసు నమోదు చేసుకోవాలంటూ నాలుగు నెలలుగా పోలీసులను కోరుతున్నా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. ♦ కోడుమూరు పట్టణంలోని శ్రీరాములవారి దేవాలయం వద్ద నిలిపిన ఆటోను గతేడాది అక్టోబర్ నెలలో దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు వెంకటస్వామి ఆటో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. నెలన్నర రోజులుగా బాధితుడు ఆటో కోసం గాలించి గూడూరులో ఓ రహస్య ప్రాంతంలో దాచిపెట్టిన ఆటోను గుర్తించి తెచ్చుకున్నాడు. ♦ గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన కోడుమూరు పట్టణంలోని కొండపేటలో నివాసముంటున్న లక్ష్మీదేవి ఇంటికి ఓ గుర్తు తెలియని మహిళ ఇల్లు అద్దెకు కావాలంటూ మాటలు కలిపింది. లక్ష్మీదేవికి మత్తు మందు ఇచ్చి ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లింది. బాధితురాలు మత్తులో నుంచి 48 గంటల తర్వాత సృహలోకొచ్చింది. ఈ విషయం సంచలనం అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాధితులంతా డీఎస్పీ దగ్గరకు వెళ్లడంతో కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్పీ మందలింపు ఇటీవల జరిగిన సెట్ కాన్ఫరెన్స్‌లో కోడుమూరు పోలీసులను ఎస్పీ గోపినాథ్‌జెట్టి తీవ్రంగా మందలించారు. ప్రైవేట్ పంచాయతీల జోరు తగ్గించండంటూ ఎస్పీ హెచ్చరించినా వీరి తీరు మారలేదనే విమర్శలు ఉన్నాయి. దోపిడీల్లో నగదు, బంగారు, వెండి ఆభరణాలు పొగొట్టుకొని నష్టపోయిన బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే కానీ కోడుమూరు పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని ఎస్పీకి సమాచారం అందింది. ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
పోలీస్ దాదా.!
సాక్షిప్రతినిధి, విజయనగరం: పోలీస్ శాఖలోని వారంతా సేవా భావం అలవర్చుకోవాలనీ... ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని వారి పెద్ద బాస్ ఎప్పటికప్పుడు హితవు పలుకుతున్నారున. కానీ అవేవీ తాము లెక్కచేయక్కరలేదని కొందరు తమ పంథాలోనే నడుస్తున్నారు. వారిలో ఎస్‌కోట సర్కిల్లో ఓ అధికారి ముందు వరుసలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన అక్రమార్జన గురించి ఆరా తీస్తే కళ్లు బైర్లు కమ్మే అంశాలు బయటపడుతున్నాయి. కోటలో పాగా... శ్రీకాకుళం జిల్లాలో నాలుగు ప్రాంతాల్లోనూ, విశాఖ జిల్లాలోనూ పనిచేసిన ఆ అధికారి విశాఖపట్నం జిల్లాలో అవినీతి ఆరోపణలతో వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లోకి వెళ్లారు. కొంతకాలానికి ఎస్కోటకు బదిలీపై వచ్చారు. ఏడాది క్రితం వచ్చిన ఆ అధికారి వస్తూనే తన పంథాను మళ్లీ కొనసాగిస్తున్నారు. తన పరిధిలోని మరో అధికారి సహకారంతో దందాలు కొనసాగిస్తున్నారు. వీరిద్దరి వల్ల మిగతా వాళ్లు కూడా వీరినే అనుసరిస్తున్నారు. అతని చర్యల గురించి జిల్లా ఎస్సీకి కూడా ఫిర్యాదులు అందడంతో పిలిచి మందలించారని సమాచారం. అయినప్పటికీ ఆయన లెక్కచేయకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. దాని కోసం తన చుట్టూ కానిస్టేబుళ్లతో ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. ఏళ్ల తరబడి బదిలీ కాకుండా ఉండేందుకు వారికి ఆయన అండగా ఉంటున్నారు. ఇదీ దందా: కొత్తవలస నుంచి ఎల్‌కోటకు తక్కువ పరిమాణంలో గుట్కా వచ్చింది. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీస్ అధికారి విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న గుట్కా నిల్వలను కనుగొన్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను తప్పించేందుకు రూ.50 వేలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ♦ అలమండ సంత నుంచి లారీల్లో పశువులను అక్రమంగా తరలిస్తుంటారు. వీటిలో నాలుగు లారీలు పట్టుకుని, ఒకదానినే పట్టుకున్నట్లు కేసు నమోదు చేసి నిర్వాహకుల నుంచి మూడు లారీలకు ఒక్కో లారీకి రూ. 12వేలు చొప్పున తీసుకున్నారని సమాచారం. ♦ గడచిన మూడు నెలల్లో ఎస్.కోటలో ఏడు కేసులు, జామిలో రెండు కేసులు, ఎల్.కోటలో రెండు కేసులు, వేపాడలో రెండు కేసులు చొప్పున నమోదయ్యాయి. అయితే పట్టుకున్నప్పుడు ఉన్న వాహనాలు, నిందితుల సంఖ్య, దొరికిన సరుకు కేసు నమోదు చేసే నాటికి తగ్గిపోతోంది. ఒక కేసులో అయితే ఏకంగా గంజాయి రవాణా చేసిన లారీనే పక్కకు తప్పించారని తెలుస్తోంది. ♦ ఎల్.కోటలో ఏడు, ఎస్‌కోటలో తొమ్మిది, వేపాడలో నాలుగు, జామిలో ఏడు లైసెన్స్ మద్యం షాపులున్నాయి. వీటి పరిధిలో బెల్టు షాపులు నడిపించేందుకు ఆ అధికారి వాటాగా నెలకు రూ. 4,500ల నుంచి రూ.6 వేల వరకూ ఇవ్వాల్సిందేనట. దీనికి ప్రతిగా గ్రామాల్లో గతంలో ఉన్నదానికి రెట్టింపు సంఖ్యలో బెల్టుషాపులు వెలిశాయి. ♦ ఎస్‌కోట మండలం గోపాలపల్లి, బొడ్డవర ప్రాంతాల్లో రెండు ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఈ రెండింటిలో ఒక్కో దాని నుంచి రూ. 50వేలు చొప్పున అయ్యవారికి సమర్పించాల్సిందేనని చెబుతున్నారు. దీనికి ప్రతిఫలంగా ఎస్.కోట నుంచి అరకు–విశాఖ రోడ్డు ద్వారా విశాఖ జిల్లాకు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ♦ జామి పోలీస్ స్టేషన్లో కొన్ని నెలల క్రితం ఒక పోలీస్ జీపు తగలబడింది. పోలీస్‌లపై కక్షతో పొక్లెయిన్ యజమాని ఈ జీపును తగులబెట్టారని తెలిసినప్పటికీ అతని నుంచి రూ. 1.50లక్షలు స్వపరిహారంగా తీసుకుని ఓ కానిస్టేబుల్ పొరపాటున సిగరెట్ పడేయడం వల్ల ప్రమాద వశాత్తూ జీపు తగులబడిందని కేసు క్లోజ్ చేశారు. దీనిపై డీజీపీకి కూడా ఫిర్యాదు వెళ్లడంతో రహస్య విచారణ జరుగుతున్నట్లు సమాచారం. -
మేం ప్రశ్నిస్తే కేసులు మీరు నేరం చేస్తే రాజీలా?
-
మేం ప్రశ్నిస్తే కేసులు... మీరు నేరం చేస్తే రాజీలా?
⇔ చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్న ⇔ ముఖ్యమంత్రే రాజీలు, సెటిల్మెంట్లు చేయడమేమిటి? ⇔ తప్పు చేసినోళ్లని కాపాడటం ఏమిటి? ⇔ నేను నోరు తెరిస్తే బాగోతాలు బయటకొస్తాయంటే దానర్థం ఏమిటి! ⇔ ఐపీఎస్ అధికారికే క్షమాపణలా..? ⇔ కానిస్టేబుల్‌కు చెప్పరా... వారికి ఆత్మగౌరవం ఉండదా! ⇔ మాకో న్యాయం, వాళ్లకో న్యాయం అన్నందుకు చెవిరెడ్డిని అరెస్టు చేస్తారా? సాక్షి, అమరావతి: చట్టం తన పని తాను చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని రాజీలు, సెటిల్మెంట్లు, పంచాయితీలు చేయడం ధర్మమేనా! అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించి తరలించడంపై అసెంబ్లీలో ప్రస్తావించేందుకు విఫలయత్నం చేసిన జగన్ స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో లాబీల్లోని తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ‘‘మావాళ్లు తిరుపతి ఎయిర్‌పోర్టులో అధికారులపై దౌర్జన్యం చేసినట్లు ఎక్కడా లేక పోయినా మా ఎంపీని, ఎమ్మెల్యేను 25 రోజులు జైల్లో పెట్టారు. అదే టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విజయవాడలో ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌పై దురుసుగా మాట్లాడినా... ఆయన గన్‌మెన్ అయిన కానిస్టేబుల్‌ను దౌర్జన్యంగా తోసి వేసినా అరెస్టు చేయరు. గన్‌మెన్‌పై ఎమ్మెల్యే చెయ్యేసి గట్టిగా తోసినట్లు స్పష్టంగా టీవీల్లో కనిపిస్తున్నా...చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేస్తారు... ఇదే విషయాన్ని మాకో న్యాయం... తన వారికో న్యాయమా! అని చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించినందుకు అరెస్టు చేసి తీసుకెళతారా... మా ఎమ్మెల్యేను ఉదయం అరెస్టు చేసి సాయంత్రం వరకూ విడుదల చేయలేదు. మా సహచర ఎమ్మెల్యేలు వెళ్లినా కూడా పోలీస్‌స్టేషన్‌లో చెవిరెడ్డితో మాట్లాడ్డానికి గాని, కనీసం చూడ్డానికి గాని అనుమతించలేదు. ఇదెక్కడి న్యాయం?’’ అని జగన్ ప్రశ్నించారు. వివరాలు ఆయన మాటల్లోనే.... సీఎం ఆదేశించినందుకే సారీ చెప్పారట... ముఖ్యమంత్రి తమను ఆదేశించినందుకే సారీ చెప్పామని టీడీపీ నేతలంటున్నారు. ఐపీఎస్‌కు సారీ చెప్పారు సరే... మరి కానిస్టేబుల్ మాటేమిటి? ఆయనకు సారీ చెప్పరా... సాధారణ పోలీసు కానిస్టేబుల్‌కు ఆత్మగౌరవం ఉండదా? ముఖ్యమంత్రి చెబితేనే సారీ చెప్పామంటున్న వారికి కానిస్టేబుల్‌కు క్షమాపణలు చెప్పమని చంద్రబాబు ఆదేశించలేదా? నేను నోరు తెరిస్తే చాలా బాగోతాలు బయటకు వస్తాయని సదరు ఐపీఎస్ అధికారి అన్నారంటే...దానర్థం ఏంటి? మీరు (అధికారపక్షం) చేసిన అన్యాయాలు చెప్పకనే చెప్పినట్లు కాదా? టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లింది ప్రజల కోసమో, వారి మంచికోసమో కానే కాదు, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం. తమకు పోటీగా బస్సులను నడుపుతున్న మరో ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇప్పించేలా, తమకు అనుకూలంగా వ్యవహరించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు వెళ్లారు. దీన్ని సాక్షాత్తూ ఆ అధికారే ధృవీకరించారు. అధికార యంత్రాంగాన్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసే విధంగా చంద్రబాబు జోక్యం చేసుకుని రాజీ చేయించడం సబబేనా? గతంలో ఎమ్మార్వో వనజాక్షి ఉదంతంలో కూడా ముఖ్యమంత్రి ఇలాగే చేశారు. ఆమెను జుట్టు పట్టుకుని దౌర్జన్యం చేసిన టీడీపీ ఎమ్మెల్యేను మంచివాడంటూ మంత్రివర్గంలో చంద్రబాబు పొగిడి కేసుల్లేకుండా చేశారు. టీడీపీ నేతలు అధికారులపై తిరగబడి దౌర్జన్యం చేసిన వ్యవహారాలన్నింటిలోనూ కేసులు లేకుండా చంద్రబాబు సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అధికారులను కొట్టించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఆ తరువాత రాజీలు చేయించడం సబబేనా? ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలే! ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు. ఆరెంజ్ కంపెనీ ఏందో నాకు తెలియనే తెలియదు. టీడీపీ ఎంపీ తమ సొంత వ్యవహారానికి సంబంధించి కమిషనర్ కార్యాలయానికి వెళ్లి గొడవ పడ్డారనేది అసలు విషయమైతే దానిని తప్పుదోవ పట్టించేందుకే జగన్ పేరును లాగుతున్నారు. ఆరెంజ్ కంపెనీతో నాకు సంబంధాలున్నాయని అవాస్తవాలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా... చివరకు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఏదైనా అన్నా దీని వెనుక జగనే ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. మసిపూసి మారేడు కాయ చేయడమే కాక నాపై బురద జల్లి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. టీడీపీ వారు చేసిందానికి సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి నాపై నిందలు వేస్తున్నారు. పోలవరానికి రూ 3,000 కోట్లా! పోలవరం ప్రాజెక్టుకు గత మూడేళ్లలో కేటాయించింది రూ. 3,000 కోట్లే... వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే రూ 5,500 కోట్లు ఈ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టారు. కానీ జాతీయ ప్రాజెక్టుగా దీనిని ప్రకటించిన తరువాత మూడేళ్లలో మూడు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక అలాంటి దానిపై ఇంకా ప్రెజెంటేషన్ ఏమిటి? ఇపుడు తాజాగా పోలవరం నుంచి బొల్లాపల్లి, అక్కడి నుంచి సోమశిలకు పెన్నా అనుసంధానం పేరుతో రూ . 1 లక్ష కోట్ల వ్యయంతో ప్రాజెక్టు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకే ఏడాదికి రూ .వెయ్యి కోట్లు మించి ఇవ్వని మహానుభావుడు (చంద్రబాబు) మళ్లీ రూ. 1 లక్ష కోట్లతో అనుసంధానం అని ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిదీ కుంభకోణమే కొనసాగుతోంది. మేమెంత ప్రయత్నించినా సభలో మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వడం లేదు. నేనెప్పుడూ అసెంబ్లీలో నా కోసం ఏదీ ప్రస్తావించలేదు. నేను మాట్లాడేదల్లా ప్రజల తరపునే... వారి సమస్యలపైనే .. నేను లేవనెత్తే అంశాలను వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, మాకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది. కానీ ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా చేయడం వల్ల ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు. భాస్కర్‌రెడ్డి చేసిన తప్పేమిటి? ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనల్లో తాము అధికారిపై దౌర్జన్యం చేసినట్లు ఎలాంటి దృశ్యపరమైన ఆధారాలు లేక పోయినా తననూ, ఎంపీని ఎందుకు అరెస్టు చేశారు? ఇపుడు కానిస్టేబుల్‌పై దౌర్జన్యం చేసినట్లు, అధికారులను దుర్భాషలాడినట్లు టీవీల్లో సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నా ఎందుకు వారిని అరెస్టు చేయరు? వారికో న్యాయం? మాకో న్యాయమా? అని ప్రశ్నించినందుకే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేశారు. నందిగామ వద్ద బస్సు ప్రమాదం జరిగిన ఘటనలో పరామర్శ కోసం నేను వెళ్లింది ప్రజలకు సంబంధించిన సమస్యమీద. నేనక్కడకు వెళ్లి పోస్టుమార్టం చేశారా అని ప్రశ్నించినందుకు వైద్యాధికారి తడబడుతూ చేయలేదన్నారు. అలాంటపుడు తరలించేయడానికి కొన్ని మృతదేహాలను ఎలా ప్యాక్ చేసి పెట్టారని గట్టిగా అడిగాను. అక్కడ ఆయన చూపించిన కాగితాన్ని నేను తీసుకున్నాను. నేనే మాత్రం లాక్కోలేదు. ఈ విషయం టీవీలు చూస్తే తెలుస్తుంది. కానీ నా మీద రివర్స్ కేసు పెట్టారు. నేను ఆసుపత్రిలోకి ఆరోజు వెళ్లినపుడు ఏం జరిగిందీ మీడియా మొత్తం కవర్ చేసింది. నేనెక్కడా ఎవరినీ టచ్ చేయలేదనేది టీవీలు చూస్తే తెలుస్తుంది. కానీ రవాణా శాఖ కమిషనర్ విషయంలో జరిగిన సంఘటనకు, ఆసుపత్రి సంఘటనకూ నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. మనస్సాక్షిని అమ్ముకుంటే ఎలా... ప్రతిపక్షం గాని, మీడియా గాని అధికారపక్షానికి తమ మనస్సాక్షికి అమ్ముకుంటే ప్రజాస్వామ్యం అనేది నిలబడదు. ఈ అన్యాయాలను మీడియా కూడా ప్రశ్నించాలి. ఇలాంటి అన్యాయాలను కనుక మనం ప్రశ్నించక పోతే ఇక ప్రజల తరపున మాట్లాడ్డానికి ఎవరూ ముందుకు రారు. రేపు జర్నలిస్టులకు అన్యాయం జరిగినా ఎవరూ అడగడానికి ముందుకు రాలేరు’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. -
సింహంలా పనిచేశాను.. జీరోలా చేస్తున్నారు
► శత్రువుల కన్నా పార్టీలోని మిత్రులతోనే నష్టం ► టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి గుంటూరు : శత్రువుల కన్నా టీడీపీలో ఉన్న మిత్రులతోనే ఎక్కువ నష్టమని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థాగత ఎన్నికలపై ఆదివారం నిర్వహించిన టీడీపీ నగర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ నియోజకవర్గంలో, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో సింహంలా పనిచేసిన వాడిని అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో వారే సున్నా చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే మోదుగుల ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇతరుల జోక్యం ఎక్కువగా ఉండటం వల్ల పనులు, పార్టీ పదవులు తన ప్రమేయం లేకుండానే కొనసాగుతున్నాయని చెప్పారు. పేదలు, కార్యకర్తల కోసం చేసిన సిఫార్సులను అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. పార్టీ అధికారం లోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా నగరపాలక సంస్థ ఎన్నికలుగానీ, వక్ఫ్‌బోర్డు, దేవస్థాన కమిటీలు ఏర్పాటు చేయలేక కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. పార్టీ పదవులతో విజిటింగ్ కార్డులు కొట్టించుకొని అమరావతిలో సెటిల్మెంట్లు చేసుకునేవారు ఎక్కువయ్యారన్నారు. సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పదవులు పొందిన వారిపై ఫిర్యాదులు వస్తే అధిష్టానం ఐవీఆర్ఎస్, ఇతర మార్గాల్లో సర్వే చేయిస్తుందన్నారు. -
గుంటూరులో గూండాలు
* జోరుగా ప్రైవేటు పంచాయితీలు * నగరంపై రౌడీలు, గూండాల మార్కు దందా * నీటిపై రాతలుగానే పోలీసుల మాటలు నగరంలో రౌడీలు, గూండాల మూకలు చెలరేగిపోతున్నాయి. భూ దందాలు, సెటిల్మెంట్స్, పంచాయితీలు, ఆస్తి గొడవల్లో తలదూర్చి వీరి మార్కు దందా చూపిస్తున్నారు. నగరంలోని దాదాపు అన్ని ఏరియాల్లో చోటామోటా మొదలుకొని పెద్ద స్థాయి వరకూ రౌడీలు, గూండాలు రాజ్యమేలుతున్నారు. కిరాయి హత్యలకు పాల్పడే వారు సైతం నగరంలోనే మకాం వేసి ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు (పట్నంబజారు): నగరంలోని పట్టాభిపురం, అరండల్‌పేట, నగరంపాలెం, కొత్తపేట, లాలాపేట, పాతగంటూరు, రూరల్ పోలీసుస్టేషన్లలో కలిసి 300 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో ఏ ప్లస్, ఏ, బీ, సీ కేటగిరీలకు చెందిన వారున్నారు. ఇటీవల కాలంలో రౌడీల దందా పెరిగిపోయింది. చిన్న స్థాయి పంచాయితీల దగ్గర నుంచి స్టేషన్ ఉన్నతాధికారుల వద్ద కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు రౌడీషీటర్లుకు అధికారపార్టీ నేతల అండదండలుండటంతో పోలీసులు సైతం ఏమిచేయలేని పరిస్థితి దాపురించింది. దీనితో రౌడీలు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోందని పలువురు అంటున్నారు. ఇటీవల కాలంలో నగరంలో వరుసగా చోసుచేసుకుంటున్న ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పోలీసు నిఘా ఏదీ...? రౌడీషీటర్లుపై పోలీసుల నిఘా పూర్తిగా కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పలువురు అధికారులు యాంటీ రౌడీ స్వా్కడ్ (ఏఆర్ఎస్)తో ఎప్పటికప్పుడు రౌడీల కదలికలపై దృష్టి సారించేవారు. ప్రస్తుతం అటువంటి ప్రత్యేక బృందం లేదని తెలుస్తోంది. నగరంలోని శివారు కాలనీలు స్థావరాలుగా చేసుకుని కొందరు రౌడీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గుంటూరులో రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద అర్ధరాత్రి కూడా అరాచకాలు సృష్టిస్తున్నారు. ఏదైమైనా పోలీసు ఉన్నతాధికారులు రౌడీల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్ డల్..... ఆయా స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లుకు ప్రతి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించటంతో పాటు వారి సంతకాలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్‌లు ఇవ్వటంలేదని తెలుస్తోంది. ప్రతి ఆదివారం స్టేషన్‌కు రాకుండా.. సిబ్బందికి కాసులు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని స్టేషన్లలో నేరుగా సిబ్బందే రౌడీలకు సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈస్ట్ సబ్‌డివిజన్ పరిధిలోని ఒక పోలీసుస్టేషన్లో ప్రతి ఆదివారం రౌడీషీటర్లు సంతకాలు తీసుకుని రైటర్ డబ్బులివ్వాలని, లేకపోతే మాంసం తెచ్చిపెట్టాలంటూ ప్రతి వారం ఇబ్బందులకు గురి చేయటంతో నేరుగా స్టేషన్ ఉన్నతాధికారికే ఫిర్యాదు చేయటం గమనార్హం. రౌడీయిజాన్ని సహించం.. నగరంలో రౌడీకార్యకలాపాలు సాగిస్తే ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించం. వారి కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నాం. అసాంఘిక పనులు, దౌర్జన్యాలు చేస్తే చర్యలు చేపడతాం. పోలీసు స్టేషన్లలో ప్రతి వారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. సత్ప్రవర్తన లేకపోతే రౌడీషీటర్లను తీవ్రంగా పరిగణిస్తాం. – భాస్కరరావు, అడిషనల్ ఎస్పీ -
నయీమ్.. నాట్ ఏ జోక్
* సెటిల్మెంట్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో దిట్ట * డబ్బులు వసూలు చేయాల్సిన వ్యక్తుల పూర్తి సమాచారం సేకరణ * చంపడం కిరాతకంగానే.. కానీ సెటిల్మెంట్లు మాత్రం చాలా సాఫ్ట్‌గా.. * ‘అన్నా’ అని సంబోధిస్తూనే తనకు కావాల్సింది రాబట్టుకునే నైజం * వినకపోతే చితకబాదడం.. అవసరమనుకుంటే లేపేయడమే.. సాక్షి హైదరాబాద్: నయీమ్.. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ఈ పేరు చాలా కాలంగా అండర్ వరల్డ్ మాఫియాలో సుపరిచితమైందే. విప్లవ పార్టీ నేపథ్యం నుంచి వచ్చిన అతడు గ్యాంగ్‌స్టర్‌గా మారి పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఈ మాఫియా డాన్ నైజమే చాలా ప్రత్యేకమైనదని, ఎప్పుడు ఎలా వ్యవహరించాలో, ఏ కేసును ఎలా డీల్ చేయాలో అతడికి వెన్నతో పెట్టిన విద్య అని గతంలో జరిగిన పరిణామాలు తెలియజేస్తున్నాయి. తన ప్రత్యర్థులను హతమార్చడంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. కానీ, సెటిల్మెంట్ల విషయంలో మాత్రం నయీమ్ చాలా సాఫ్ట్‌గా డీల్ చేస్తాడు. డబ్బులు వసూలు చేయాలన్నా, వివాదాలు సెటిల్ చేయాలన్నా ఆయన అనుచరుల నుంచీ అందరూ పకడ్బందీగానే వ్యవహరిస్తారు. నయీమ్‌ను కలవాలని ఎవరూ అనుకోరు కానీ.. కలిసే పరిస్థితి వస్తే మాత్రం ఆయన చెప్పినట్టు చేయాల్సిందే. అందుకు తగిన సరంజామాను సిద్ధం చేసుకుని అలా చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తాడు. కళ్లు తెరిచి చూసే లోపు ఆయుధాలతో ఉన్న సుశిక్షితులైన అంగరక్షకుల నడుమ నవ్వుతూ పలకరిస్తాడు. చెప్పినట్టు వింటే సరి.. లేదంటే మాత్రం దండన తప్పనట్టే. చితకబాదడం.. అవసరమైతే లేపేయడం. మీకు షుగర్ ఉంది కదా.. ట్యాబ్లెట్లు తెచ్చుకున్నారా? నయీమ్ ముఠా చేసిన హత్యలు పైకి కనిపిస్తాయి కాబట్టి ఎంత కిరాతకంగా హత్య చేశాడో అర్థమవుతుంది. కానీ, నయీమ్ అంతర్గతంగా చేసే సెటిల్మెంట్ల గురించి ఆయన బాధితులు, అనుచరులకు మాత్రమే తెలుస్తుంది. ఫలానా వ్యక్తి నుంచి పైసలు వసూలు చేయాలనుకున్నా.. ఏదైనా వివాదం సెటిల్ చేయాలనుకున్నా దాదాపు అనుచరులే కార్యక్రమం పూర్తి చేస్తారు. భాయ్ చెప్పాడు.. అంటూ వెళ్లి భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకుంటారు. కానీ, కీలకమైన వ్యవహారాలను మాత్రం నయీమే స్వయంగా పర్యవేక్షిస్తాడు. ఆ సెటిల్మెంట్లు చేసేందుకు గాను అవసరమైన వ్యక్తులను నయీమ్ ముఠా సభ్యులు ‘భాయ్’ దగ్గరకు తీసుకెళ్తారు. వెళ్లేటప్పుడు కూడా అర్థం కాకుండా తీసుకెళ్తారు. గతంలో నయీమ్‌ను కలిసి వివాదాలు సెటిల్ చేసుకున్న, డబ్బులు ఇచ్చిన కొందరు ఇచ్చిన సమాచారం ప్రకారం.. నయీమ్ అసభ్యంగా మాట్లాడడు. బెదిరించడు. అన్నా అని సంబోధించి దగ్గరకు తీసుకుంటాడు. అన్నా.. నిన్ను ఫలానా పని కోసం పిలిపించాను. అంతవరకు చేయి.. నీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని భరోసా ఇస్తాడు. ఆ తర్వాత కూడా సెటిల్ కాకపోతే సదరు వ్యక్తులకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి.? అవి ఎంత విలువ ఉంటాయి? ఈ మధ్య కాలంలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి ఆ వ్యక్తి జరిపిన లావాదేవీలేంటి? అనే వివరాలను డాక్యుమెంట్లతో సహా ఉంచుతాడు. కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? అనే విషయాలను కూడా చెప్పి వారి యోగక్షేమాల గురించి ఆరా తీస్తాడు. ఎందుకన్నా.. రోజులు బాగాలేవు.. ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో నీ కొడు కో.. కూతురో ఉంటే పరిస్థితేంటి? అని సినీఫక్కీలో హెచ్చరిస్తాడు. సెటిల్మెంట్ల విషయంలో నయీమ్ ఎంత పకడ్బం దీగా ఉంటాడంటే.. సెటిల్మెంట్ చే యాల్సిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా తెలుసుకుంటాడు. ఎంతగా అంటే.. ‘అన్నా నీకు షుగర్ ఉంది కదా.. నువ్వు ఫలానా టాబ్లెట్ వేసుకుంటావు.. ఆ టాబ్లెట్ తెచ్చుకున్నావా.. లేదంటే నా దగ్గర ఉంది ఇస్తాను ’ అని కూడా చెప్తాడంటే నయీమ్ ఎంత పకడ్బందీగా ఉంటాడో ఇట్టే అర్థమవుతుంది. అయితే, మాట వినకపోతే మాత్రం విశ్వరూపం చూపిస్తాడని బాధితులు వాపోతున్నారు. మాఫియా సామ్రాజ్య విస్తరణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మారిన పరిస్థితుల్లో నయీమ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే వెళ్లాడ ని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన కేరళ స్థావరంగా కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది. విదేశాల్లోని కొందరు నేరస్తులతో కూడా సంబంధా లు పెట్టుకున్నాడని, త్వరలోనే దుబాయ్‌కి వెళ్లాలనుకున్నాడని కూడా పోలీ సులు చెబుతున్నారు. ఆయన కోసం గుజరాత్ పోలీసులు వెతుకుతున్నారని, సోహ్రాబుద్దీన్‌తో ఆయనకున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారని కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరించాడని కూడా సమాచారం. -
‘అనుచరుల’ అరాచకాలు ఎన్నెన్నో..!
ఆలస్యంగా వెలుగు చూస్తున్న నయీమ్ గ్యాంగ్ ఆగడాలు ఇబ్రహీంపట్నం రూరల్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రంలో అతని బారిన పడిన బాధితులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లుగా నయీమ్ అరాచకాలకు అధికార, రాజకీయ పక్షాల మద్దతు ఉండడంతో అతని అనుచరుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. పిక్నిక్ల పేరుతో స్త్రీలు.. చిన్న పిల్లలను తీసుకు రావడం.. భూములు చూడడం.. మరుసటి రోజే ఆ భూముల కబ్జాకు పన్నాగం పన్నడం అతడి అనుచరుల పని. భూమి ఎవరిదైనా కాజేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎక్కువ మాట్లాడితే చస్తావా.. భూమి ఇస్తావా అంటూ తుపాకులు పెట్టి భయాభ్రాంతులకు గురి చేసేవారు. ‘‘వ్యవసాయం చేసుకుని బతికేటోళ్లం.. మా భూములపై పడొద్దు.. మీకు దండం పెడ్తాం’’ అన్నా కనికరించే వారు కాదు. ప్రభుత్వాధికారులు, పోలీసుల అండదండలతో కబ్జా రాజ్యాలకు తెరతీశారు. నయీమ్ బతికి ఉన్నన్ని రోజులు కోట్ల విలువ చేసే భూములపై కన్నేసి కబ్జా చేసి తమను తీవ్ర ఇబ్బందులు పెట్టారని రైతులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న భూములపై నయీమ్ అనుచరులు కన్నేశారు. వివాదంలో ఉన్న స్థలాలు కొనుగోలు చేసి పక్కన ఉన్న రైతులను ఇబ్బంది పెట్టేవారు. ఆదిభట్లలో బురుగు పెద్ద వెంకట్‌రెడ్డి, చిన్న వెంకట్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డికి చెందిన సర్వే నంబర్ 490, 410లో 8 ఎకరాల భూమి ఉందని చాలా రోజులుగా వారిని చిత్రహింసలకు గురి చేశారు. 2013 నుంచి ఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. నయీం ప్రధాన అనుచరులుగా చెప్పుకుంటున్న సామ సంజీవరెడ్డి, శ్రీహరి, అడ్వొకేట్ తులసీదాస్ తమను చిత్రహింసలకు గురి చేశారని రైతులు వాపోయారు. చాలామందిని వీరి వల్ల ఇబ్బందులు పడ్డారని.. త్వరలో వారంతా బయటకు వస్తారని చెప్పారు. -
'చిన్నప్పటి నుంచీ నేర ప్రవృత్తే'
-
పాపం పండింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గౌస్ మొహియిద్దీన్.. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్. ఏలూరు రేంజి పరిధిలో ఈయన పేరు చెబితే చాలు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు సలాం చేయాల్సిందే. ఢిల్లీ యూని వర్సిటీలో చదువుకునే రోజుల్లో అతడి రూమ్ మేట్స్, క్లాస్‌మేట్స్‌లో కొందరు అనంతర కాలంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. వారితో గల సాన్నిహిత్యంతో గౌస్ మొహియిద్దీన్ ఏలూరు రేంజి పరిధిలోనే కాకుండా పోలీస్ శాఖలోనే అనధికార పోలీస్ బాస్‌గా ఎదిగిపోయారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు బదిలీలు, పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు నిలిపివేయించడం.. ఇలా ఏ పని కావాలన్నా ఆయన గుమ్మం తొక్కాల్సిందే. జనవరి 1వ తేదీ వచ్చిందంటే డీఐజీ, ఎస్పీ కార్యాలయాల కంటే ఈయన ఇల్లు పోలీస్ అధికారులతో కిక్కిరిసిపోయేది. పూల బొకేలు పట్టుకుని పోలీసు అధికారులు గౌస్ ఇంటి వద్ద క్యూ కట్టేవారంటే అతడు ఏ రేంజ్లో హవా నడిపించారో అర్థం చేసుకోవచ్చు. జిల్లాకు వచ్చే పోలీస్ ఉన్నతాధికారులు ఈయన ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించాల్సిందే. ఈ పరిచయాలనే ఆయన పెట్టుబడిగా వాడుకున్నారు. సెటిల్మెంట్లు, దందాలు, రియల్ ఎస్టేట్ మోసాలతో గౌస్ భారీగానే వెనకేసుకున్నారు. ఇదే సమయంలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురికి విసిరిన వల ఆయన్ని కటకటాల పాల్జేసింది. ‘నూరు గొడ్లను తిన్న రాబందు.. ఒక్క గాలివానకు కొట్టుకుపోయింది’ అని ఓ పోలీస్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారంటే సదరు గౌస్ అక్రమాల జాబితా ఎంతో.. అతని వ్యవహార శైలి ఎలాంటిదో అవగతం చేసుకోవచ్చు. పాపం పండిందిలా.. పోలీస్ శాఖలో ఏ పనైనా గౌస్ ద్వారా సులువుగా అతుందని తెలుసుకుని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కొండ్రెడ్డి సూర్యప్రకాశరెడ్డి అతణ్ణి ఆశ్రయించాడు. ఒక నిరుద్యోగికి ఎస్సై ఉద్యోగం ఇప్పించడానికి గౌస్‌కు 2012లో రూ.14 లక్షలు ఇచ్చాడు. ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో రూ.3 లక్షలను గౌస్ వెనక్కి ఇచ్చేశాడు. మిగిలిన డబ్బు ఇవ్వలేదు. దీంతోపాటు ఒంగోలులో వివాదంలో ఉన్న ఒక స్థలం విషయంలో సెటిల్మెంట్ చేసేందుకు 2013 ఫిబ్రవరిలో రూ.10 లక్షలను సూర్యప్రకాశ్‌రెడ్డి నుంచి తీసుకున్న గౌస్ ఆ పని చేసిపెట్టలేదు. అలాగే గుంటూరు రేంజ్ పరిధిలో ఒక సీఐకి మంచి పోస్టింగ్ ఇప్పిం చడానికి రూ.10 లక్షలను సూర్యప్రకాశ్రెడ్డినుంచి గౌస్ తీసుకున్నాడు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో ప్రకాశం జిల్లాలో కోట్లాది రూపాయలను వసూలు చేసి బోర్డు తిప్పే సిన భారత్ ప్రేమసదన్ సంస్థ నుంచి రూ.20 లక్షలు ఇప్పిం చేలా సెటిల్మెంట్ చేసేందుకు రూ.5 లక్షలను సూర్యప్రకాశరెడ్డి నుంచి గౌస్ తీసుకున్నాడు. ఈ లావాదేవీలన్నీ గౌస్ తన వ్యాపార భాగస్వామి వెంకటరత్నం ద్వారా నిర్వహించాడు. డబ్బులు ఇచ్చినా ఏ పనీ కాకపోగా, గౌస్ బెదిరింపులకు పాల్పడటంతో సూర్యప్రకాశ్‌రెడ్డి జిల్లా పోలీసులను ఆశ్రయించారు. దీంతో గౌస్ ఇంటిని భారీ బందోబస్తు మధ్య సెర్చ్ వారెంట్‌తో రెవెన్యూ అధికారులు, వీడియోగ్రాఫర్ల సమక్షంలో తనిఖీలు చేపట్టారు. ఏలూరు డీఎస్పీ సరిత ఆధ్వర్యంలో టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు సోదాలు నిర్వహించారు. అనంతరం గౌస్మొహిద్దీన్ను అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా వచ్చే నెల 5వరకు రిమాండ్ విధించారు. గుట్టు రట్టుచేసిన హార్డ్ డిస్క్ పెద్దమనిషిగా వ్యవహరిస్తూ.. పోలీస్ బాస్‌లతో సార్ అని పిలిపించుకుంటూ.. షాడో బాస్‌గా వ్యవహరించిన లెక్చరర్ గౌస్ గుట్టును అతని కంప్యూటర్లోని హార్డ్‌డిస్క్ బట్టబయలు చేసింది. దానిని తనిఖీ చేసిన అధికారులకు కళ్లు బైర్లుకమ్మే నిజాలు వెలుగు చూశాయి. సెటిల్మెంట్లు, దందాలు, పోలీసులకు పదోన్నతులు, అవార్డులు, రివార్డులు, పనిష్మెంట్ వంటి ఎన్నో అడ్డుగోలు వ్యవహారాలకు అతని ఇల్లు కేరాఫ్ అడ్రస్‌గా మారడం పోలీస్ అధికారులనే కంగు తినిపించింది. తనకు నచ్చిన అధికారులకు అవార్డులు, ప్రోత్సాహాకాలు ఇప్పించడానికి తయారు చేసిన విజ్ఞాపన పత్రాలు, మాట వినని పోలీస్ అధికారులపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు, సీబీఐకి ఆకాశరామన్న పేరుతో రాసిన ఉత్తరాలు దొరకడం పోలీసులకు విస్మయం కలిగిం చింది. మొత్తంగా ఇతని ఇంటిలో వివిధ కేసులకు సంబంధించి 50కు పైగా డాక్యుమెంట్లు దొరికాయి. గతంలో ఏలూ రు డీఎస్పీగా పనిచేసి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న అధికారి తనపై చర్యలు నిలుపుదల చేయించుకునేందుకు ఈయనను ఆశ్రయించడం, ఈయన అందుకోసం చేసిన ప్రయత్నాలకు సంబంధించిన పత్రాలు కూడా లభ్యమయ్యాయి. సీడీ ఫైళ్లు లభ్యం ఏలూరు త్రీటౌన్‌కు సంబంధించి రెండు కేసుల్లో పార్ట్-1, పార్ట్-2 సీడీ ఫైళ్లు గౌస్ ఇంట్లో లభ్యం కావడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి చార్జ్‌షీట్ దాఖలు చేసిన తరువాత సీడీ ఫైళ్లకు సంబంధించిన ఒక కాపీను తమ వద్ద ఉంచుకుని మరొక ఒరిజనల్ కాపీని పోలీసులు కోర్టుకు అందచేస్తారు. కాని గౌస్ ఇంట్లో లభ్యమైన సీడీ పైళ్లల్లో చార్జ్ షీట్లు దాఖలు కానివి కూడా ఉండటం కలకలం రేపుతోం ది. గౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్స్‌కు సంబంధించి కాల్‌డేటాను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మూడేళ్ల కాలంలో గౌస్ ఏయే పోలీస్ అధికారులతో సంభాషించారు.. ఇతనికి ఎవరు సహకరించారు తది తర విషయాలన్ని కాల్‌డేటాతో బట్టబయలు కానున్నాయి. ఈ వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రకాశం ఎస్పీకి లేఖ లెక్చరర్‌గా పనిచేసిన గౌస్‌మొహియిద్దీన్ భారీగా ఆస్తులు కూడబెట్టడంపైనా పోలీసులు దృష్టి సారించారు. రాష్ట్ర రాజ ధాని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటవుతోందంటూ గౌస్ రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ కేం ద్రంగా ఏర్పడిన సిరిసంపద రియల్ ఎస్టేట్ సంస్థకు గౌస్‌మొహియిద్దీన్ మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరించాడు. ఏడాది కాలంలోనే కోట్లాది రూపాయల విలువైన 50 ఎకరాలకు పైగా భూమిని క్రయవిక్రయాలు జరిపించారు. ఈ సందర్భంగానే మోసాలకు పాల్పడినట్టు 2013లో ప్రకాశం జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్లో సిరిసంపద రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదైంది. అయితే మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరించిన గౌస్‌ను మాత్రం పోలీసులు విచారించలేదు. ఈ సంస్థలో కొంతమంది పోలీసు అధికారులు కూడా పెట్టుబడులు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. తాజా ఘటన నేపథ్యంలో సిరిసంపద రియల్ మోసాలపై గౌస్‌ను సైతం విచారించాలని ప్రకాశం జిల్లా ఎస్పీకి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి లేఖ రాశారు. విజయవాడ తరలింపు ఏలూరు (వన్ టౌన్) : మోసాల కేసులో అరెస్టైన లెక్చరర్ గౌస్ మొహియిద్దీన్‌ను శుక్రవారం సాయంత్రం విజ యవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాను గుండెపోటుతో బాధపడుతున్నట్టు గౌస్ చెప్పడంతో పోలీసులు తొలుత అతన్ని ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. బాధితులూ.. ఫిర్యాదు చేయండి : ఎస్పీ జిల్లాలో గౌస్ చేతిలో మోసపోయిన వారెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి కోరారు. పోలీసు ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఇతరత్రా లావాదేవీలతో సొమ్ము చేసుకుంటున్న గౌస్ బాధితులెవరైనా ఉంటే భయపడాల్సిన పనిలేదని, నేరుగా తనను సంప్రదించవచ్చని అన్నారు. పోలీసు అధికారుల్లో కలవరం గౌస్‌తో సన్నిహితంగా మెలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో కలవరం మొదలైంది. కాల్‌డేటా బయటకు రాకుండా ఉండేందుకు సన్నిహిత ఐపీఎస్ అధికారులు జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు గౌస్ ఇంటి చుట్టూ చ క్కర్లు కొట్టిన పోలీస్ అధికారుల్లో గౌస్ అరెస్ట్ తరువాత ఆందోళన ప్రారంభమైంది. ఈ కేసు ఎటు తిరిగి ఎటొస్తుందోనంటూ ఆయనతో సన్నిహితంగా ఉన్న పోలీసు అధికారులు భయాందోళనలో ఉన్నారు. ఇదిలా ఉండగా, విచారణ చేయడానికి వీలుగా గౌస్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ టూటౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఏసీబీ కేసు నుంచి బయటపడేస్తానంటూ గౌస్ రూ.80 వేలు తీసుకుని మోసగించినట్టు 2007లోనే ఒక ఉద్యోగి జిల్లా పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు ఆ కేసును కూడా తవ్వే పనిలో జిల్లా అధికారులు ఉన్నారు. ఈ వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. -
బాబోయ్...టూ టౌన్ పోలీస్‌స్టేషన్
స్టేషన్ మెట్లు ఎక్కడానికి భయపడుతున్న సామాన్యుడు సెటిల్మెంట్ల పేరుతో వసూళ్లు పాత నేరస్తులను పిలిచి మామూళ్లు దండుకుంటున్న సిబ్బంది గుడివాడ : గుడివాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. స్టేషన్ మెట్లు ఎక్కడానికి సామాన్యుడు భయపడుతున్నాడు. మామూళ్లు ముట్టజెప్పిన వారికే న్యాయం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన ద్వితీయశ్రేణి అధికారి అన్నీ తానే చక్రం తిప్పుతున్నాడు. పై అధికారులకు ఇవ్వాలంటూ ఫిర్యాదుదారుల నుంచి ముడుపులు పుచ్చుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్టేషన్ పరిధిలో ఎక్కువగా మురికి వాడలే ఉన్నాయి. సరిహద్దు తగాదాలు, మంచినీటి ట్యాపుల వద్ద గొడవలు ఎక్కువుగా వస్తుంటాయి. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయటానికి వస్తే రెండో వారిని పిలిచి ప్రత్యర్థులపై ఎలా కేసులు పెట్టాలో ఇక్కడ సిబ్బంది సలహాలు ఇస్తారని, చివరికి ఇద్దరినీ పిలిచి సెటిల్మెంట్లు చేసి డబ్బుదండుకుని పంపుతారని పలువురు ఆరోపిస్తున్నారు. పేకాట శిబిరాలపై వేరే ప్రాంతం పోలీసుల దాడి స్టేషన్ పరిధిలో పెద్దఎత్తున జూదాలు జరుగుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో ఆగ్రహించిన జిల్లా ఎస్పీ వీరికి తెలియకుండా రెండుసార్లు పెడన పోలీసు సిబ్బందితో దాడులు చేయించి పెద్దమొత్తంలోనే నగదు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది పిలిచి చీవాట్లు పెట్టినట్లు వినికిడి. పాత నేరస్థులకు వేధింపులు స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులను పిలిచి స్టేట్మెంట్లు రికార్డు చేయాలని జిల్లా ఎస్పీ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇదే అదునుగా భావించిన స్టేషన్ సిబ్బంది పాత నేరస్తులను పిలిచి భారీగా డబ్బులు వసూలు చేసి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లా పోలీసు అధికారులు స్పందించి స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సెటిల్మెంట్ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సివిల్ తగాదాల్లో తలదూర్చినందుకు... పోలీసు విభాగం ఇరుకున పడింది. చినికి చినికి గాలివానగా మారిన ఒక కుటుంబ ఆస్తి తగాదా పోలీసు అధికారుల మధ్య చిచ్చు రేపింది. ఈ రాద్ధాంతంలో సీఐ లక్ష్మీబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్, కుటుంబ తగాదాల్లో తలదూర్చి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయనను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ శివకుమార్ ప్రకటించారు. దీంతో దాదాపు కోటిన్నర రూపాయల విలువైన ఈ ఆస్తి తగాదా వ్యవహారం మరో మలుపు తిరిగింది. పోలీసు అధికారుల మధ్యనే చిచ్చు పెట్టినట్లయింది. మూడు రోజుల కిందట పెద్దపల్లి డీఎస్పీ, గంగాధర ఎస్సైతో తమకు ప్రాణభయం ఉందని.. తమ కుటుంబానికి సంబంధించిన భూ తగాదాలో తలదూర్చి తమను బెదిరిస్తున్నట్లు గంగాధర మండల కేంద్రానికి చెందిన అన్నతమ్ముళ్లు శ్రీరాం మల్లేశం, శ్రీరాం రవీందర్ నార్త్‌జోన్ ఐజీకి ఆగస్టు 30న ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఐజీ ఈ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈలోగా.. ఇదే ఘటనలో వెకెన్సీ రిజర్వులో ఉన్న సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేయటంతో ఈ సెటిల్మెంట్ల వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది. గంగాధర పోలీస్‌స్టేషన్‌కు సంబంధం లేని సీఐ లక్ష్మీబాబును సస్పెండ్ చేయటం... ఎస్సై, డీఎస్పీలపై వచ్చిన ఫిర్యాదును దర్యాప్తు చేస్తుంటే ఈయన ఎందుకు ఇరుక్కున్నారు? అనేది సందేహాస్పదంగా మారింది. ఈ ఘటనలో రవీందర్, మల్లేశం ఐజీకి ఫిర్యాదు చేయటం వెనుక సీఐ లక్ష్మీబాబుపాత్ర ఉందనేది ప్రధాన అభియోగం. మరోవైపు బాధితుల్లో ఒకరైన రవీందర్‌కు సీఐకి దగ్గరి దోస్తానా ఉంది. అందుకే వారికి మద్దతుగా ఈ భూ వివాదాన్ని సెటిల్ చేసేందుకు రూ.లక్షల్లో ఒప్పందం చేసుకున్నాడనే అభియోగంపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించటం తగదని... కొద్ది రోజుల్లో తానే చొప్పదండి సీఐగా వస్తున్నానని అప్పుడు ఈ తగాదాను సెటిల్ చేస్తానని సీఐ లక్ష్మీబాబు స్థానిక పోలీసు అధికారులతోనూ ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు పడినట్లు గుప్పుమంది. కానీ.. ఈ తగాదాలో అసలు పోలీసు అధికారులు ఎందుకు తలదూర్చారు.. లక్ష్మీబాబు ఒకవైపు వకాల్తా పుచ్చుకున్నట్లు ధ్రువీకరించిన పోలీసు యంత్రాంగం... మరోవైపు మద్దతు పలికినట్లుగా ఫిర్యాదులు ఎదుర్కొన్న ఎస్సై, డీఎస్పీల పాత్ర ఏమిటి? అనేది వెల్లడించలేదు. సెటిల్మెంట్ దందాలో ఒకరి ప్రమేయాన్ని ఒకరిపై తోసిపుచ్చేందుకు పోలీసు అధికారులు ఈ కేసును తమకు అనుకూలంగా మలుచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కొందరిని వెనుకేసుకు వచ్చి.. ఒక్కరిపైనే వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలేం జరిగింది గంగాధర మండలకేంద్రానికి చెందిన శ్రీరాం మల్లేశం, రవీందర్, మధుకర్ ముగ్గురు అన్నదమ్ములు. మల్లేశం, రవీందర్ స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతుండగా... చిన్న కుమారుడు మధుకర్ బెంగుళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా అన్నదమ్ముళ్ల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. పలుమార్లు పంచాయితీలు నిర్వహించుకున్నా పరిష్కారం కాలేదు. జూలై మొదటి వారంలో మధుకర్ తన సోదరులైన మల్లేశం, రవీందర్‌పై గంగాధర ఎస్సై రాజేంద్రప్రసాద్, డీఎస్పీ వేణుగోపాల్‌రావుకు ఫిర్యాదు చేశాడు. పలుమార్లు పంచాయితీ పెట్టడంతోపాటు.. మధుకర్‌కు మద్దతుగా సివిల్ పంచాయితీలో తలదూర్చిన డీఎస్పీ, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని మల్లేశం, రవీందర్ కలిసికట్టుగా ఐజీకి ఫిర్యాదు చేశారు. తమ దగ్గరున్న ఫోన్‌రికార్డులను సమర్పించారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు మరోవైపు పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావు, గంగాధర ఎస్సై రాజేంద్రప్రసాద్‌తో తన కుమారులకు ప్రాణభయం ఉందని మల్లేశం, రవిందర్ తల్లి లక్ష్మి బుధవారం మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. తన కుమారులతోపాటు తనను స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా నానా బూతులు తిట్టారని అందులో పేర్కొంది. -
అత్యాచారాల స్నేక్బ్యాచ్!
హైదరాబాద్: హైదరాబాద్ పహాడీ షరీఫ్‌లో యువతిపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన స్నేక్బ్యాచ్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాతబస్తీలో కాబోయే భర్త ఎదుటే యువతిపై అత్యాచారం చేసిన ఈ స్నేక్ బ్యాచ్ ఇలాంటి ఎన్నో నేరాలకు పాల్పడిందని పోలీసులు విచారణలో తెలిసింది. అత్యాచారాలే కాకుండా ఈ బ్యాచ్ పాములతో బెదిరించి అనేక సెటిల్మెంట్లు కూడా చేసినట్లు తేలింది. ఈ బ్యాచ్ గతంలో కూడా ఎన్నో నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వీరు ప్రేమ జంటలకు పామును చూపించి బెదిరించేవారు. ప్రేమికుడు ముందే ప్రేమికురాలిపై అత్యాచారం చేసేవారు. అంతేకాకుండా అదంతా సెల్ఫోన్లో, వీడియో కెమెరాలతో చిత్రీకరించి మరీ వారిని బెదిరించేవారు. పోలీసులతో చెబితే ఫేస్ బుక్ లో పెడతామని బెదిరించేవారు. ఈ రకంగా వీరు పలువురిపై అత్యాచారం చేశారు. పాములను ఆడించడంలో వారు సిద్దహస్తులు. దాంతో వారు చాలా అరాచకాలు చేశారు. ఈ నిందితులలో ఒక వ్యక్తి హత్య కేసులో నిందతుడని పోలీసులు చెప్పారు. పాతబస్తీలోని ఈ బ్యాచ్‌కు సంబంధించిన వారందరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండటంతో నేరచరిత్ర ఒక్కొక్కటిగా బయటపడుతోంది. పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారందరికి సెటిల్ మెంట్ చేయడం ఈ బ్యాచ్ ప్రధాన దందా అని పోలీసులు భావిస్తున్నారు. ఈ స్నేక్ బ్యాచ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు చూసిన పోలీసులు వీరి ఆగడాలు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. రోడ్డుపైనే కూర్చుని ఈ బ్యాచ్ సెటిల్మెంట్లు చేసినట్లు వీడియోల ద్వారా తెలిసింది. వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిసిన తరువాత ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
తమ్ముళ్ల వెతుకులాట
పదేళ్లుగా అధికారం కోసం ఆవురావురమని ఎదురుచూసి రైతన్న పుణ్యమో.. నమో మంత్రమో గానీ ఎట్టకేలకు పవర్లోకి వచ్చిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు అడ్డంగా సంపాదించడం కోసం అక్రమ మార్గాల వెతుకులాటలో ఉన్నారు. ‘నేనొచ్చానంటే చాలు. చక్రం తిప్పేస్తా. కేంద్రం మెడలు వంచేస్తా’ అంటూ బీరాలు పలికిన చంద్రబాబు తీరా అధికారంలోకి రాగానే ‘నేను కూర్చోడానికే కుర్చీ లేదు.. పైసల్లేవ్.. ఖజానా ఖాళీ’ అంటూ రాజధాని నిర్మాణం పేరిట విరాళాలు సేకరించే పనిలో నిమగ్నమైపోయారు. దీంతో సర్కారీ పనులు, కాంట్రాక్టుల కోసం ఎదురుచూసిన తమ్ముళ్లు ఇప్పట్లో అవి దక్కేలా లేవని భావించి అక్రమ ఆదాయం కోసం సెటిల్మెంట్లు, భూదందాలపై పడుతున్నారు. ఎక్కడో.. ఏమో గానీ.. మన జిల్లా కేంద్రం ఏలూరులో మాత్రం కొందరు పచ్చచొక్కా నేతలు ప్రస్తుతం ఇవే పనులపై దృష్టి కేంద్రీకరించారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేయడమనేది ఇప్పటివరకు మనం చూస్తున్న పాత పద్ధతి. ఇళ్లు కట్టుకుని నివాసముంటున్న వాళ్లను కూడా ఖాళీ చేయించి ఆయా స్థలాల్లో పాగా వేయడమే ప్రస్తుత తెలుగు తమ్ముళ్లనయా ‘రియల్’ కల్చర్. పొరుగునే ఉన్న బెజవాడే రాజధాని అని తేలడంతో ఏలూరు శివారు కాలనీలపై బడాబాబుల కన్నుపడింది. బీ.ఫారాలతో ఇళ్ల పట్టాలు పొందిన వారిని నయానో భయానో బెదిరించి ఆ ప్లాట్లను సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. మంచిగా పట్టాలు అప్పగిస్తే బదులుగా ఎక్కడో మరో మూలన స్థలం కేటాయిస్తామంటూ బేరసారాలు చేస్తున్నారు. ఇందుకు అధికారుల సాయం కూడా తీసుకుంటున్నారు. ఏలూరులో బీ.ఫారం పట్టాలతో ఇళ్లు ఉన్న కాలనీలు ఎక్కడెక్కడున్నాయి.. ఖాళీ చేయించి వారిని ఎక్కడికి తరలించొచ్చు అంటూ అధికారులతో సమగ్ర సర్వే చేయిస్తున్నారట. మొత్తంగా ఏలూరు శివారులోని బీ.ఫారం పట్టాలు ఉన్న ఇళ్లన్నీ తొలగించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలన్నదే తెలుగు తమ్ముళ్ల లక్ష్యమట. ఇలానే వదిలేస్తే.. శివారు ప్రాంతాలే కాదు ఏలూరు నగరంలో మురుగునీరు, ముళ్లకంపలన్న ఖాళీ స్థలాలు కూడా సర్వాంగసుందరమైన వెంచర్లుగా మారిపోయినా ఆశ్చర్యం లేదు. అయితే ఇవన్నీ హేలాపురి ప్రజ సిత్రాలుగా చూస్తుందా.. పోరుబాటతో తెలుగుతమ్ముళ్లకు ‘సినిమా’ చూపిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. పైడికొండల.. ఇలాగైతే ఎలా? హయవేగంలోనూ హలో హలో అంటూ అన్ని వ్యవహారాలూ ఫోన్లలోనే చక్కబెడు తున్న ఈ రోజుల్లో మన మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం ఆ వేగాన్ని ఒంటపట్టించుకున్నట్టు కనిపించడం లేదు. సచివులు, చాలామంది ప్రజాప్రతినిధులు ఫోన్లలో అందుబాటులోకి రావడం లేదు. ఫోన్‌చేస్తే నేరుగా మంత్రులు మాట్లాడకపోయినా వాళ్ల సీసీలు, పీఏలు స్పందించి, ఆ తర్వాత విషయాన్ని బట్టి సచివులు లైన్లోకి వస్తుం టారు. కనీసం సీసీలు, పీఏలు కూడా ఎత్తి సరైన సమాధానం, సమాచారం చెప్పని స్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఎమ్మెల్యేనే రెండురోజుల కిందట సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన మంత్రులకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారట. ఇక మన మంత్రుల విషయానికి వస్తే దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఫోన్లకు దొరకరనే విమర్శలున్నాయి. ఇటీవల దేవాదాయ శాఖలో అవినీతిపై నేరుగా మంత్రికి ఫోన్‌చేసి సమాచారం చెబుదామనుకున్న నగరానికి చెందిన ఓ ఔత్సాహికుడు ఎలాగోలా ఫోన్ నంబర్ పట్టుకుని రింగ్ చేశారు. రోజంతా ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయలేదట. కనీసం ఎవరు చేశారో.. అని తిరిగి ఫోన్ రాకపోవడంతో చేసేదిలేక సదరు యువకుడు మిన్నకుండిపోయాడట. రెండోరోజైనా ఎవరు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశారో తెలుసుకుందామన్న కనీస స్పృహ కూడా సదరు మంత్రి సీసీలు, పీఏలకు పట్టలేదట. మంత్రి పదవి పొందిన తొలినాళ్లలో తాడేపల్లిగూడెంలో ఓ మహిళ కరెంటు సమస్యపై పొద్దుపోయాక ఫోన్ చేసినా స్పందించి ధర్నా చేసిన మాణిక్యం పలుకు ఇప్పుడు ఫోన్లలో బంగారమైపోయిందా!? - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
సెటిల్మెంట్లు చేస్తే రౌడీషీట్ తెరుస్తాం
ధర్మవరం : జిల్లాలో సెటిల్మెంట్లు, పంచాయితీ లు ఎవరు చేసినా, అవి తన దృష్టికి వచ్చినట్లయితే అలాంటి వారిపై రౌడీషీట్ తెరుస్తామని ఎస్పీ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు. సోమవారం ధర్మవరం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన పోలీసు ప్రజాబాటలో ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతితో కలసి ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యం గా ధర్మవరంలాంటి ప్రాంతంలో బయటి వ్యక్తులు పంచాయితీలు, సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారి కదలికలపై నిఘా ఉంచుతామన్నారు. మట్కా, దొంగనోట్ల చలామణి, తదితర నేరాలపైనా గట్టి నిఘా ఉంచుతామన్నారు. ఫిర్యాదుదారులు కాళ్లరిగేలా పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగకూడదని, వారికి సత్వర న్యాయం చేయాలన్న తలంపుతో ప్రజాబాట నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత తేదీలో పు పరిష్కరిస్తామని రసీదులో నమోదు చేస్తున్నామన్నారు. సంబంధిత స్టేషన్ పోలీసు అధికారి ఫిర్యాదుదారుడి సమస్యను పరిష్కరించిన తరువాత తనకూ సమాచారం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. నిర్దేశిత తేదీ లోపు పరిష్కారం కాని సమస్యలపై రివ్యూ కమిటీ వేస్తామని, ఈ కమిటీ సభ్యు లు దీర్ఘ కాల పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించే ందుకు కృషి చేస్తారని ఎస్పీ వెల్లడించారు. తొలుత తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహంచిన ప్రజాబాటలో వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించామన్నారు. హిందూపురంలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కార దిశలో ఉన్నాయన్నారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా జిల్లాలోని పెన్నా, చిత్రావతి, మద్దిలేరు ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ అన్నారు. ఈ అక్రమ తరలింపును అడ్డుకునేందుకు ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం బలహీన వర్గాల వారి ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం మాత్రమే ఇసుకను.. అదీ ట్రాక్టర్ల ద్వారా మాత్రమే రవాణా చేసేలా చర్యలు చేపడతామన్నారు. అలాంటి వారు తప్పని సరిగా సంబంధిత మండల పరిధిలోనే ఇసుకను వినియోగించుకోవాలని, అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంపై మైనింగ్ శాఖ అధికారులతో ఇప్పటికే చర్చించామన్నారు. జిల్లాలో మూడు ప్రాంతాల్లోనే ప్రైవేటు సైట్లలో ఇసుకను విక్రయించే అనుమతులున్నాయని, వారు కూడా కేవలం రాష్ట్రంలో మాత్రమే విక్రయించుకోవచ్చని అన్నారు. అందులోనూ అక్రమాలు చో టుచేసుకోకుండా లైజన్ ఆఫీసర్లను నియమించి ఇసుక ఎక్కడికి రవాణా అవుతోంద న్న విషయాలపై నిఘా ఉంచుతామని చెప్పారు. మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీ వాహనాలను ఆయా పట్టణాల్లోకి నిర్దేశించిన సమయంలో మాత్రమే వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. ధర్మవరంలో పని చేయని నిఘా కెమెరాలను వినియోగంలోకి తెస్తామన్నారు. అనంతరం స్థానిక జర్నలిస్టులు ఎస్పీని ఘనంగా సన్మానించారు. ఇసుక దందాను అడ్డుకోండి : ఎస్పీకి కేతిరెడ్డి వినతి ధర్మవరం: నియోజకవర్గ పరిధిలోని ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లో ఇసుక అక్ర మ రవాణా భారీ స్థాయిలో జరుగుతోందని, దీనిని అరికట్టాలని ధర్మవ రం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎస్పీ రాజశేఖర్‌బాబును కో రారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన పోలీసు ప్రజాబాటలో ఆయ న ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఎస్పీకి వివరించారు. అక్రమార్కులు చిత్రావతి నది నుంచి ఇసుకను డంప్‌లకు తరలిస్తున్నారని, అక్కడి నుంచి రాత్రికి రాత్రే లారీల ద్వారా బెంగళూరుకు రవాణా చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, ఫలితంగా తాగునీరు సైతం లభించక పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. ఇక ధర్మవరంలో శాంతిభద్రతల పరిరక్షణ కు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ లోపంతో పని చేయడం లేదని, వాటిని పునరుద్ధరించాలని ఎస్పీని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు బగ్గిరి బయపరెడ్డి, శివారెడ్డి, వడ్డేబాలాజీ, కనంపల్లి భాస్కరరెడ్డి, కత్తేకొట్టా కిష్ట, పోతిరెడ్డి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కోరుకున్న చోటు..అరకోటి రేటు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :వారం, పది రోజుల్లో తమ శాఖలో జరిగే బదిలీలపై పోలీసు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పోలీసు బదిలీలనగానే.. కొందరు నేతలు తమకు నచ్చిన వారిని తెచ్చుకోవాలనుకుంటారు. మరి కొందరు నేతలు, బ్రోకర్లు లక్షలు దండుకోవడానికి ఇదే మంచి అవకాశమనుకుంటారు. అలాంటి వారి పంట పండిస్తూ కొన్ని సర్కిళ్లలో పోస్టింగ్‌ల కోసం ఇద్దరికంటే ఎక్కువ మంది పోటీ పడుతూ లక్షలు కుమ్మరించేందుకు సైతం వెనుకాడటం లేదు. రాజమండ్రి అర్బన్ జిల్లా మినహాయిస్తే జిల్లాలో ప్రధానంగా కాకినాడ, పెద్దాపురం, అమలాపురం పోలీసు సబ్డివిజన్లలో, సర్కిళ్లలో సీఐ పోస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆయా సర్కిళ్లలో తెరచాటు వ్యవహారాలు, ప్రైవేటు సెటిల్మెంట్లతో లక్షలు చేతులు మారడమే ఇందుకు కారణమంటున్నారు. కీలక సర్కిళ్లలో పోస్టింగ్ కోసం కొందరు సీఐలు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు ముట్టచెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అదనుగా అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు పైరవీలకు తెరతీశారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పది ఈ జిల్లాయే కావడంతో పైరవీల జోరు కాస్త అధికంగానే ఉంటోంది. మంత్రి సైతం ఎమ్మెల్యేలు అభీష్టానికి భిన్నంగా సిఫార్సులు చేసే పరిస్థితి ఉండదంటున్నారు. దీంతో నియోజకవర్గ నేతలు, వారి అనుచరగణం భారీగానే సిఫార్సు లేఖలతో క్యూ కడుతున్నారు. కాకినాడలో ఓ వ్యాపారి,టీడీపీ నేతలే సూత్రధారులు జిల్లాలో నాలుగు డీఎస్పీ, 56 సర్కిల్ ఇన్స్పెక్టర్, 144 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. కాకినాడ పోలీసు సబ్‌డివిజన్‌లో కాకినాడ వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, పోర్టు, సర్పవరం పోలీస్ స్టేషన్లు ఎస్హెచ్ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్-సీఐ) స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యాయి. నగరంలోని సెంట్రల్‌క్రైం స్టేషన్‌తో పాటు కాకినాడ రూరల్ సర్కిల్, సర్పవరం, వన్‌టౌన్, టూటౌన్, పోర్టు స్టేషన్లలో సీఐ పోస్టుల కోసం గట్టి పోటీ నెలకొంది. కాకినాడ నగర పరిధిలో పోస్టింగ్‌ల కోసం క్యూలో ఉన్న పోలీసు అధికారులతో నగరంలో అధికారపార్టీకి అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త, పార్టీ నాయకుడు బేరసారాలు జరుపుతున్నారు. సిటీ నియోజకవర్గానికి చెందిన నేత తన వద్దకు పోస్టింగ్‌ల కోసం వచ్చే వారిని అన్ని విషయాలూ ఆ వ్యాపారవేత్తతో మాట్లాడాలని సూచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వన్‌టౌన్ ఎస్హెచ్ఓగా ఉన్న అద్దంకి శ్రీనివాసరావు టూటౌన్, త్రీటౌన్, పోర్టు పోలీసు స్టేషన్లకు ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన ఇక్కడకు వచ్చి ఎనిమిది నెలలవుతోంది. ఈ సర్కిళ్లలో పోస్టింగ్‌ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు ప్రారంభమయ్యాయి. వన్‌టౌన్ సర్కిల్ పరిధి విస్తృతం కావడంతో ఈ పోస్టుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానిస్టేబుళ్లు కూడా ఈ స్టేషన్లో పోస్టింగ్ కోసం పోటీ పడుతున్నారంటే ఇక ఇన్స్పెక్టర్ స్థాయికి పోటీ ఎలా ఉంటుందో చెప్పనక్కర లేదు. ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ బంగ్లా వంటి వీఐపీ ఏరియా టూ టౌన్ పరిధిలోనే ఉండటంతో అక్కడి సీఐ పోస్టింగ్‌కు కూడా అంతే డిమాండ్ ఉంది. ప్రముఖ ఫ్యాక్టరీలు, ఆయిల్ కంపెనీలు, పోర్టు వంటి వ్యాపార, వాణిజ్య సంస్థలు సర్పవరం స్టేషన్ పరిధిలో ఉండడంతో ఇక్కడి ఎస్హెచ్ఓ పోస్టు కోసం నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. పోర్టు, టూటౌన్ పోలీసు స్టేషన్లలో పోస్టింగ్‌ల కోసం ఒకపక్క సిటీ నేత, మరోపక్క కాకినాడ పార్లమెంటు స్థాయి నాయకుడొకరు సిఫార్సు లేఖలతో సిద్ధమవడంతో ఈ పోస్టింగ్‌లపై పోలీసు వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అక్కడ పోస్టు రేటు రూ.25 లక్షలు రామచంద్రపురం పోలీసు సబ్ డివిజన్లో రామచంద్రపురం, మండపేట రూరల్, మండపేట టౌన్, అనపర్తి సర్కిళ్లలో పోస్టింగ్‌లకు కూడా మంచి గిరాకీ ఉంది. వీటిలో మండపేట, అనపర్తి సర్కిళ్లలో పోస్టు పాతిక లక్షలు పలుకుతోంది. పెద్దాపురం డివిజన్లో పెద్దాపురం, జగ్గంపేట, తుని సర్కిళ్లలో ఇన్స్పెక్టర్ల పోస్టులకు గట్టి పోటీయే కనిపిస్తోంది. అమలాపురం డివిజన్లో అమలాపురం టౌన్, రాజోలు, రావులపాలెం సర్కిళ్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. రావులపాలెం, అమలాపురం టౌన్ కోసం ఎక్కువ మంది పోటీపడుతున్నారు. హోం మంత్రి చినరాజప్ప సొంత నియోజకవర్గం కావడం, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు కూడా ఇదే నియోజకవర్గంలో ఉండటంతో ఇక్కడ పోస్టింగ్‌లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏజెన్సీలో కనిపిస్తోంది. ఏజెన్సీకి ఎవరూ వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో రంపచోడవరం డివిజన్లోని సీఐ పోస్టులకు పోటీయే లేదు. కాగా, ఎన్నికల ముందు కృష్ణా జిల్లాకు బదిలీపై వెళ్లిన రవికాంత్, వైఆర్కే శ్రీనివాస్, దేవకుమార్ వంటి సీఐలు జిల్లాకు తిరిగొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. డీఎస్పీ పోస్టులకూ పైరవీలే.. సీఐ పోస్టింగ్‌లతో పాటు డీఎస్పీల పోస్టింగ్‌ల కోసమూ పైరవీలు ప్రారంభమయ్యాయి. అమలాపురం డీఎస్సీ వీరారెడ్డి మినహా కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం డీఎస్పీలకు బదిలీలు తప్పవు. కాకినాడ కోసం అరిటాకుల శ్రీనివాస్, పెద్దాపురం కోసం రత్నకుమార్ గట్టిప్రయత్నాల్లో ఉన్నారు. రామచంద్రపురం డీఎస్పీ వచ్చి ఏడాదిన్నర పూర్తికాకుండానే రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులతో వెళ్లిపోయేందుకు మొగ్గు చూపుతున్నారని పోలీసు వర్గాల సమాచారం. ఆ పోస్టులో తమకు అనుకూలమైన వారిని తెచ్చుకునేందుకు టీడీపీ నాయకులు పావులు కదుపుతున్నారు. -
సెటిల్మెంట్లలో ఆరితేరిన టీడీపీ నేతలు
రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైతే ఏమవుతుందో జిల్లా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఆదినుంచీ అలవాటైన సెటిల్మెంట్లను అధికారమనే అండతో యథేచ్ఛగా సాగిస్తున్న టీడీపీ నేతల తీరుతో జనం బేజారెత్తిపోతున్నారు. ఏలూరు నగరం నడిబొడ్డున, డీఐజీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ యువకుడిని పది రోజులపాటు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తుంటే పోలీసులే తెలుసుకోలేకపోయారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ దాష్టీకాలు పెచ్చుమీరుతున్నాయి. రాష్ట్ర మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని లింగపాలెం మండలంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాక్షి, ఏలూరు/ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : ఒక యువకుడిని కిడ్నాప్ చేసి.. ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఏలూరు నగరంలో సంచలనం సృష్టించింది. ఆ యువకుడి బంధువులకు ఎమ్మెల్యే అనుచరుడు ఫోన్‌చేసి డబ్బు డిమాండ్ చేయడంతో వారు జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డిని ఆశ్రయించారు. దీంతో ఏలూరు టూటౌన్ పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని కిడ్నాప్ చెరనుండి విడిపించారు. ఇందుకు కారకులైన నగర డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంతోపాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంతో టీడీపీ దాష్టీకాలు వెలుగులోకి వచ్చారుు. అసలేం జరిగిందంటే.. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన శింగంరెడ్డి రామకోటిరెడ్డి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. బీహెచ్ఈఎల్, ప్రభుత్వ శాఖలలో ప్రముఖులతో తనకు పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికిన రామకోటిరెడ్డి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. సత్తుపల్లికి చెందిన బి.రవిప్రసాద్ అనే వ్యక్తి ద్వారా ఏలూరుకు చెందిన ఐదుగురు నిరుద్యోగుల నుంచి రామకోటిరెడ్డి సుమారు రూ.40 లక్షలు వసూలు చేశాడు. ఇది జరిగి నెల రోజులైనా ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులిచ్చిన వారు రామకోటిరెడ్డికి ఫోన్ చేశారు. ఉద్యోగాలు రావాలంటే మరికొంత డబ్బు ఇవ్వాలని రామకోటిరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో అతడికి డబ్బులిచ్చిన నిరుద్యోగులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జిని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులైన నగర డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంనాయుడు, రౌడీషీటర్ నిమ్మల శ్రీనివాస్ మరో ఆరుగురితో కలిసి సింగంరెడ్డి రామకోటిరెడ్డిని అక్రమంగా నిర్బం ధించారు. అతని శరీరంపై బ్లేడుతో కోసి, కర్రలతో కొట్టి, చిత్రహింసలకు పాల్పడ్డారు. బయటపడిందిలా ఎమ్మెల్యే అనుచరుడైన నిమ్మల శ్రీనివాస్ సోమవారం సాయంత్రం రామకోటిరెడ్డి బంధువులకు ఫోన్‌చేసి మంగళవారం ఉదయం 10 గంటలకు డబ్బు ఇవ్వకపోతే తమ నిర్బంధంలో ఉన్న రామకోటిరెడ్డిని చంపేస్తామని బెదిరిం చాడు. కంగారుపడిన అతని బంధువులు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రోసిరెడ్డిని తీసుకుని మంగళవారం ఉదయం ఏలూరు చేరుకున్నారు. ఎస్పీ కె.రఘురామ్ రెడ్డిని కలిసి జరిగిన ఘటనను వివరించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. స్పందించిన ఎస్పీ విషయం ఏమిటో చూడాలంటూ టూటౌన్ పోలీసులకు ఆదేశాలిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు పవర్‌పేటలోని చర్చి సమీపంలో ఎమ్మెల్యే అనుచరుడికి చెందిన రెండంతస్తుల గృహంలో నిర్బంధంలో ఉన్న రామకోటిరెడ్డిని, అతనికి కాపలాగా ఉన్న అజయ్, ప్రభు, బాబి అనేవారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నివాసంలో ఉన్న నగర డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంనాయుడు, రౌడీ షీటర్ నిమ్మల శ్రీనుతోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రామకోటిరెడ్డి సోదరులు వెంకటేశ్వరరెడ్డి, సంజీవ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రోసిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, రౌడీ షీటర్ నిమ్మల శ్రీనివాస్, తదితరులపై సెక్షన్ 365, 394, 506, 144, రెడ్‌విత్ 34 కింద కేసును నమోదు చేసినట్టు టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపారు. డెప్యూటీ మేయర్ వెంకటరత్నంను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. రామకోటిరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తెరవెనుక ప్రయత్నాలు ఓ వ్యక్తిని ఎమ్మెల్యే అనుచరులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట తీవ్ర కలకలం రేపుతుంటే.. ఎమ్మెల్యే బడేటి బుజ్జి కొత్త డీఐజీ హరికుమార్‌ను పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న డీఐజీ కార్యాలయంలో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా వచ్చిన డీఐజీని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లానని ఎమ్మెల్యే పైకి చెబుతున్నా, తనపేరు బయటకు రాకుండా జాగ్రత్తపడేందుకే వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే పోలీసులు తమపై రకరకాల వత్తిళ్లు ఉంటాయని మీడియా వద్ద వ్యాఖ్యానించి ఉంటారని భావిస్తున్నారు. ఎన్నికల ముందు బుజ్జిపై పలు కేసులు నమోదయ్యాయి. సెటిల్మెంట్లు, దందాలు వంటి అసాంఘిక కార్యకలాపాల్లో అతనికి భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నైజంతోనే తాజా సెటిల్మెంట్ను ప్రోత్సహించి ఉంటారని, ఆయనకు తెలియకుండా ఆయన కార్యాలయంలో వ్యవహారం నడవదని బాధితులు చెబుతున్నారు. వాళ్లిద్దరూ ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరులు ఏలూరు నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం నాయుడు 1999-2004 మధ్య అప్పటి మునిసిపాలిటీలో 34వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో 17వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా గెలుపొందిన ఆయన డెప్యూటీ మేయర్ అయ్యారు. ఆయన ఎమ్మెల్యే బడేటి బుజ్జికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ సెటిల్మెంట్లు చేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యం గా జూదాలను ప్రోత్సహిస్తూ, స్వయంగా ఆడతారని చెబుతున్నారు. ఎమ్మెలేకు మరో అనుచరుడైన నిమ్మల శ్రీనివాస్‌పై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి. ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో దందా నిర్వహిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. వారికివి సర్వసాధారణమే టీడీపీ నేతలకు సెటిల్మెంట్లు, దందాలు సర్వసాధారణమైపోయాయి. ఎన్నికల్లో గెలిచి పదవులు దక్కించుకున్న తర్వాత వాటిని మరింతగా విస్తరించారు. కొందరు స్వయంగా, మరికొందరు తెరవెనుక ఉండి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారు. గత నెలలో దెందులూరు ఎమ్మెల్యే ఇదేవిధంగా కొందరు వ్యక్తులపై దాడికి పాల్పడ్డారు. అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా అరెస్ట్‌లు చేయించి విమర్శల పాలయ్యారు. అంతకుముందు టీడీపీ వర్గీయులు అంకన్నగూడెంలో అరాచకం సృష్టించి కొందరి ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. తాజాగా ఏలూరు ఎమ్మెల్యే అనుచరులు అక్రమ నిర్బంధానికి పాల్పడి వార్తల్లోకి ఎక్కారు. వీరి దందాలతో సామాన్యులు వణికిపోతున్నారు. -
స్టేషన్లలో సెటిల్మెంట్లు సహించను
►తప్పుడు ఫిర్యాదులు చేస్తే కౌంటర్ కేసులు ►కొత్త ఎస్పీ కొల్లి రఘురామ్‌రెడ్డి హెచ్చరిక ఏలూరు( ఫైర్‌స్టేషన్ సెంటర్) : స్టేషన్లలో సెటిల్మెంట్లు, దళారులతో కుమ్మక్కు వంటి వ్యవహారాలు చేస్తే సంబంధిత స్టేషన్ అధికారులపై చర్యలు తప్పవని ఆదివారం బాధ్యతలు చేపట్టిన ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామ్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఉదయం ఏఎస్పీ ఎన్.చంద్రశేఖర్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు సన్నగిల్లిన విషయం తెలిసిందని, పోలీసులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఎవరైనా అడ్డదారుల్లో వెళితే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. తప్పుడు ఫిర్యాదుచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారిపై కౌంటర్ కేసులు పెడతామని చెప్పారు. ప్రాధాన్యతా అంశాలు నాలుగు తాను నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని ఎస్పీ తెలిపారు. న్యాయం చేయాలని స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదీ నుంచి ఫిర్యాదును స్వీకరించి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పారు. రాజీపడాలనుకునే కక్షిదారులు లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకోవాలన్నా రు. కానీ కేసు నమోదు చేయకుండా సెటిల్మెంట్ చేస్తే సంబంధిత అధికారిపై చర్యలు ఉంటాయన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై దృష్టి సారించి వారికి పూర్తి రక్షణ కల్పించడం తన ధ్యేయమన్నారు. జిల్లా నుంచి మహిళల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్థిక నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుం టామని చెప్పారు. దొంగతనాల కేసుల్లో బాధితులకు సొమ్ము రికవరీ చే సి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నివారించేందు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకుగాను ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. దొంగనోట్లు, డబ్లింగ్‌కరెన్సీ ముఠాల కార్యకలాపాలను నిర్మూలించటానికి నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోలీసుల సంక్షేమానికి కృషి పోలీసుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎస్పీ తెలిపారు. బాధ్యతల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందిలేకుండా సిబ్బంది అందరికీ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. జిల్లాలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, వాటికి మరమ్మతులు చేయించి సిబ్బందికి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పారు. పోలీస్ శాఖలో పౌర సంబంధాల వ్యవస్థను మెరుగుపరుస్తానని తెలిపారు. శుభాకాంక్షలు.. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రఘరామిరెడ్డిని పలువురు కలిసి శుభాకాంక్షులు తెలిపారు. కలిసిన వారిలో నాయ్యవాది బీవీ కృష్ణారెడ్డి, ఏఎస్డీ రామకృష్ణ, ఏఆర్ డీఎస్పీ కె.కోటేశ్వరరావు, డీటీసీ డీఎస్పీ సరిత, ఏఆర్ ఆర్ఐ వెంకటేశ్వరరావు, ఏలూరు డీఎస్పీ ఎం.సత్తిబాబు, ఏలూరు వన్‌టౌన్ సీఐ సీహెచ్ మురళీకృష్ణ, టూటౌన్ సీఐ వై.సత్య కిషోర్, త్రీటౌన్ సీఐ కె.శ్రీనివాసరావు, పలువురు ఎస్సైలు ఉన్నారు. -
రౌడీయిజం.. మోసమే నైజం
దెందులూరులో చింతమనేని దందాలు సెటిల్మెంట్ల కింగ్ ఏలూరు అభ్యర్థి బడేటి బుజ్జి మోసాల్లో దిట్ట గన్ని వీరాంజనేయులు ఇతర ప్రాంతాల్లోని అభ్యర్థులపైనా వెల్లువెత్తుతున్న విమర్శలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : రౌడీ కార్యకలాపాలు.. మోసాలు.. సెటిల్మెంట్లు.. రాజకీయం ముసుగులో జిల్లాలోని టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలివి. వారే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో ఆయా నియోజకవర్గాల్లో జనం భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. తమకంటే గొప్పవాళ్లు లేరని, తమ పార్టీ కంటే గొప్ప పార్టీ మరొకటి లేదని చెప్పుకునే టీడీపీ తరఫున కొందరు అరాచకవాదులు ఎన్నికల బరిలో ఉండడం గమనార్హం. వారి అరాచకాలను ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుతూ వచ్చిన టీడీపీ అధిష్టానం చివరకు వారినే ఎన్నికల్లో పోటీ చేయిస్తోంది.చింతమనేని దౌర్జన్యకాండ దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో అధికార యంత్రాగాన్ని ఆయన భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకూ అందరిపైనా జులుం ప్రదర్శించారు. అనేక పనులకు సంబంధించిన కాం ట్రాక్టులను సొంత మనుషులతో చేయించి బిల్లుల కోసం అధికారులపై దౌర్జన్యం చేయడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. పోలవరం ఎడమ కాలువ గట్టు నుంచి గ్రావెల్, తమ్మిలేరు నుంచి ఇసుకను రోడ్లు ఇతర పనులకు వాడిన ఆయన ఆ తర్వాత వాటికి బిల్లులు చేయించుకుని జేబులో వేసుకున్నారు. పలుమార్లు అధికారులను కొట్టి గాయపరిచిన ఉదంతాలున్నాయి. ఏడాది క్రితం పెదవేగిలో ఎస్సైపై దాడి చేశారు. ఇటీవలే అధికారులను దుర్భాషలాడటంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా ఆయనకు ఎదురుతిరిగారు. వారినీ ఆయన ఇష్టానుసారం తిట్టారు. తన అరాచకానికి ఎదురుతిరిగిన వారిపై దాడి చేయడం, కొట్టడం ఆయన నైజంగా మారింది. ఇలాంటి వ్యవహారాల్లోనే ఆయనపై లెక్కకు మిక్కిలిగా కేసులున్నాయి. ఇప్పటికే అనేకసార్లు అరెస్టు కూడా అయ్యారు. ఆయన్ను భరించలేక ఆ నియోజకవర్గం నుంచి పలువురు అధికారులు సెలవుపై వెళ్లిపోయారు. కొంతమంది బదిలీలు చేయించుకుని ఆయనకూ దూరంగా పారిపోయారు. ఆయన అండ చూసుకుని గ్రామాల్లో చింతమనేని అనుచరులు రెచ్చిపోయి ఆగడా లు చేయడం కూడా సర్వసాధారణమే. ఆయన మరోసారి ఎమ్మెల్యే అయితే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయని జనం భయపడుతున్నారు. టీడీపీలోనే అనేక మంది చింతమనేని రౌడీ రాజకీయాలపై అసంతృప్తితో ఆయనకు దూరమై అతనికి సీటివ్వొదని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయినా చంద్రబాబు అరాచకానికే ఓటువేసి చింతమనేనికి సీటిచ్చారు. సెటిల్మెంట్ల కింగ్ బుజ్జి ఏలూరు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బడేటి బుజ్జిపై అనేక ఆరోపణలున్నాయి. సెటిల్మెంట్ల కింగ్‌గా ఆయన పేరుగడించారు. బుజ్జి బారినపడి అనేక మంది అష్టకష్టాల పాలయ్యారనే విషయం ఏలూరులో బహిరంగ రహస్యం. వివాదాలున్న స్థలాల వ్యవహారాల్లో తలదూర్చి వాటిని సెటిల్ చేసే పేరుతో సామాన్యులను ఇబ్బందిె పట్టడం, వారి ఆస్తులను దోచుకోవడం లేదా ఇతరుల పరం చేయడం ఆయన నైజం. ఏలూరు వన్‌టౌన్‌లోని చాలామంది వ్యాపారులు బుజ్జి పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు. మునిసిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను బెదిరించి లొంగదీసుకోవడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేశారు. తన మాట వినలేదని పలువురిపై దాడులు కూడా చేయించారు. ఏ పదవీ లేకుండానే ఇంత అరాచకం చేసిన బుజ్జి ఎమ్మెల్యే అయితే తాము బతకలేమనే చర్చ నగరంలో చాలాకాలం నుంచే జరుగుతోంది. కొద్దినెలల క్రితం విజయవాడలోని ఒక ఇంట్లో వ్యభిచారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆయన ఊచలు కూడా లెక్కబెట్టారు. ఈ కేసును ఎలాగోలా మాఫీ చేసుకున్నా ఆయన వ్యవహార శైలి మాత్రం నగరంలో అందరికీ అర్థమైపోయింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తుండడం విశేషం. ‘రియల్’ చీటర్ ఉంగుటూరు టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు గతంలో చీటింగ్ కేసులో అరెస్టయ్యారు. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఒక వ్యవహారంలో ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు వీరాంజనేయుల్ని అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. ఆయన అండ చూసుకుని అనుచరగణం కూడా బెదిరింపులు, దాడులకు దిగుతోంది. నాలుగు రోజుల క్రితం భీమడోలు మండలంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కారును టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఇలా తీవ్రమైన ఆరోపణలున్న వారిని టీడీపీ అభ్యర్థులుగా నిలబెట్టడంతో స్థానికంగా ఆ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అరాచకవాదులకు అవకాశం ఇస్తే అన్నీ అరాచకాలే జరుగుతాయనే భయం ప్రజల్లో కనిపిస్తోంది. -
మొండిబకాయిల కొండబాబు
సెటిల్మెంట్లు, కబ్జాలు, దందాలు చేయడంలోనే మొనగాడిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఈసారి తన టాలెంట్‌ను ఓ బ్యాంకుకు చూపించారు. తన సోదరుడు, మరో ఏడుగురి సన్నిహితులతో కలసి సదరు బ్యాంకు నుంచి దాదాపు రూ. ఏడుకోట్ల రుణాన్ని తీసుకొని వారికి ఏడు చెరువుల నీళ్లు తాగించారు. రుణం తిరిగి చెల్లించకుండా తన బండతనంతో మొండిగా వ్యవహరించిన కొండబాబు ఆస్తులను బుధవారం వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) కాకినాడలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి తీసుకున్న రుణం చెల్లించకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. కొండబాబు, ఆయన సోదరుడు సత్యనారాయణతోపాటు మరో ఏడుగురు సన్నిహితులు కలిసి బ్యాంకు నుంచి తీసుకున్న రూ.6.88 కోట్ల రుణం చెల్లించలేదు. వీరంతా మెసర్స్ శంభులింగం మెరైన్ సర్వీసెస్ పేరుతో ఏర్పాటైన కంపెనీ తరఫున బ్యాంక్ నుంచి మూడేళ్ల క్రితం రుణం తీసుకున్నారు. వీరిలో టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావు, భార్య శ్రీదేవి రూ.48 లక్షలు తీసుకున్నారు. తాను తీసుకున్న రుణం వివరాలను ఇటీవల కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే సందర్భంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో కూడా పొందుపరిచారు. ఆయన సోదరుడు వనమాడి సత్యనారాయణ, భార్య సత్యగౌరి పేరుతో మరో రూ.67 లక్షలు తీసుకున్నారు. వీరితోపాటు మిగిలిన వారంతా కలిసి బ్యాంక్ నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదు. తీసుకున్న రుణం చెల్లించాలంటూ తమ ప్రతినిధులు పలు పర్యాయాలు చేసిన విజ్ఞప్తులు వారు పట్టించుకోలేదని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. ఎంతకూ రుణం చెల్లించకపోవడంతో చేసేది లేక బ్యాంక్ అధికారులు వారి ఆస్తుల వేలానికి పత్రికల్లో ఇటీవల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం బుధవారం కొండబాబుతోపాటు ఆయన సోదరుడు, సన్నిహితుల ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంక్ అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఫిబ్రవరి 28 నాటికి ఉన్న బ్యాంక్ రుణంతో పాటు మార్చి ఒకటో తేదీ వరకు వడ్డీ, ఇతర బ్యాంక్ ఖర్చులు కూడా వసూలు చేసుకునేందుకు బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటైజేషన్ అండ్ రీ కనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 ప్రకారం తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ కాకినాడ బ్రాంచి ఈ మేరకు వేలం కోసం సీల్డుటెండర్లు ఆహ్వానించింది. రుణం కోసం బ్యాంక్‌లో తాకట్టుపెట్టిన కొండబాబుకు చెందిన కాకినాడ జగన్నాథపురం చర్చ్‌స్క్వేర్ సెంటర్లోని నివాస భవనాన్ని వేలం నిర్వహిస్తున్నట్టుగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ బ్రాంచి ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే రుణం తీసుకున్న మిగిలినవారి ఆస్తులకు కూడా బ్యాంకు అధికారులు బుధవారం వేలం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న వెంకటేశ్వరరావు రుణం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. నలుగురికీ సూక్తులు విన్పించే నాయకుడు తాను మాత్రం ఆదర్శంగా ఉండరా అని ప్రశ్నిస్తున్నారు. కావాలనే ఎన్నికల సమయంలో సానుభూతి కోసం అలా చేశారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. రుణాలు సక్రమంగా చెల్లించండి, కొత్త రుణాలు తీసుకోండని ఎమ్మెల్యేగా ఉండగా అనేక పర్యాయాలు వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కొండబాబుకు ఇప్పుడు తాను తీసుకున్న రుణం చెల్లించాలనే విషయం గుర్తుకు రావడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
‘కోటి’ తిప్పలు
రాజంపేట, న్యూస్‌లైన్: రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన శాఖలో గత ఏడాది జరిగిన చోరీకి సంబంధించి బ్యాంకు అధికారులు ఖాతాదారులతో సెటిల్మెంట్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన బ్యాంకులో జరిగిన చోరీ జిల్లాలో సంచలనం రేకెత్తించిన విషయం విదితమే. రూ. 18 లక్షల నగదు, 62 మంది ఖాతాదారులకు సంబంధించి తాకట్టు పెట్టిన 3 కిలోల బంగారు నగలు కలిపి మొత్తం దాదాపు రూ.కోటి చోరీకి గురైనట్లు అప్పట్లో బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల సమస్య పరిష్కారానికి ఏపీజీబీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. న ష్టపోయిన వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని తీర్మానించింది. ఈ దిశగా అధికారులు దృష్టి సారించారు. తాకట్టు పెట్టిన 62 మందిలో నలుగురు మాత్రం తాము తీసుకున్న అప్పును బ్యాంకుకు చెల్లించినట్లు సమాచారం. దీంతో అధికారులు పక్కాగా రికార్డు ఆధారంగా బాధితులు నష్టపోయిన మొత్తాన్ని చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఏపీజీబీ ఆర్ఎం శివశంకర్‌రెడ్డిని న్యూస్‌లైన్ వివరణ కోరగా చోరీకి గురైన ఖాతాదారుల తాకట్టు నగలు, నగదుకు సంబంధించిన చెల్లింపు ప్రక్రియను చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఇలా చెల్లించాలని.. ఖాతాదారుల డబ్బుకు సంబంధించి అంతే మొత్తాన్ని తిరిగి వారికి చెల్లించనున్నారు. అలాగే నగల విషయంలో వారికి నగలకు బదులు వాటికి సరిపడే డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. వీరికి డబ్బులు చెల్లించే నాటికి ఆ రోజున మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందో అంత మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం.అయితే తాకట్టు పెట్టిన బంగారంపై ఖాతాదారులు తీసుకున్న అప్పులు ఏవైనా ఉంటే వాటిని లెక్కలోకి తీసుకోనున్నారు. నగలకు విలువకట్టి మొత్తంలో అప్పుగా ఉన్న మొత్తాన్ని తీసుకొని మిగిలిన మొత్తాన్ని ఇవ్వడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. -
సివిల్ ‘సెటిల్’మెంట్లు
సాక్షి, ఒంగోలు: ‘ఎవరేమంటే మాకేమీ.. అధికారం వ చేతుల్లో ఉంది. మేం ఏ చెబితే అదే.. పిల్లిని కుక్కంటాం.. కుక్కని పిల్లంటాం. ఎవరెదురు చెప్తారు?’ అన్నట్లు ఉంది సివిల్ వ్యవహారాల్లో కొంతమంది పోలీసు అధికారుల తీరు. ‘ఇచ్చట సివిల్ కేసులు పరిష్కరించబడవు’ అంటూ తాటికాయంత అక్షరాలతో పోలీస్‌స్టేషన్‌లో బోర్డులు వేలాడుతుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సివిల్ కేసులను పరిష్కరించవద్దని ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం ఉన్నాయి. అయినా సరే మేమింతే.. అన్నట్లుగా జిల్లాలోని పలువురు స్టేషన్ హౌస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీస్ ఠాణాల్లో పేదవారికి ఒక న్యాయం, పెద్ద వారికి మరో న్యాయం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కొన్ని వ్యవహారాల్లో సంబంధిత ఎస్‌హెచ్‌వోలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ఒంగోలు నగరంలోని పోలీస్స్టేషన్లలో సివిల్ పంచాయతీలు, కేసులు నమోదు చేయకుండా ‘రాజీ’లతో సరిపెడుతున్నారు. నగరంలోని ఒక పోలీస్‌స్టేషన్‌లో అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నేత జోక్యం లేనిదే పని కాదు అని బాధితులు వాపోతున్నారు. ఇటీవల జిల్లాలోని ఒక ఎస్సై ఏకంగా 45 కేసుల్లో ఇరువర్గాలకు రాజీ కుదిర్చి ఏ మాత్రం కేసులు నమోదు చేయకపోవడంతో పోలీసు బాస్ ఆగ్రహానికి గురయ్యారు. వీఆర్‌లో ఉంటూ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పోలీసు పరేడ్ గ్రౌండ్‌కి పరుగులు పెట్టాడు. నగరానికి చెందిన ఒక పోలీసు అధికారి ఓ కేసును నమోదు చేయకపోవడమే కాకుండా ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. అయితే సదరు కేసును దర్యాప్తు చేయాల్సింది మాత్రం ఆయన పై అధికారే. ఇది తెలిసినా.. అసలు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లక పోగా.. ఒక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి మరొకరికి రూ.50 వేలు చెల్లించేలా తీర్పునిచ్చారు. ఇక సదరు అధికారికి, పోలీస్‌స్టేషన్‌కు ఇవ్వాల్సిన మొత్తం మామూలే. కేసుకు సంబంధించిన వివరాలివీ.. నగరంలోని ఓ అపార్టుమెంట్‌కు వాచ్‌మెన్‌గా ఉన్న ఒక వ్యక్తి కొండముచ్చును పెంచుకుంటున్నాడు. అయితే ఆ కొండముచ్చు.. పక్కింట్లో ఉండే ఒక ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్‌కి చెందిన పూలమొక్కలను ధ్వంసం చేస్తోంది. ఈ నేపథ్యంలో సదరు ప్రొఫెసర్ వాచ్‌మెన్‌ను గట్టిగా ప్రశ్నించాడు. ఈ విషయంలో ఘర్షణ పెరగడంతో ఇరువర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. వాచ్మెన్ మాత్రం తనను ప్రొఫెసర్ కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేయగా, తనపై వాచ్మెన్ దాడికి పాల్పడ్డాడని ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు కాకుండా ఉండేందుకు.. వాచ్‌మెన్‌కు ప్రొఫెసర్ నుంచి రూ.50 వేలను ఇప్పించారు. ఇది ఉన్నతాధికారుల దృష్టికెళ్లింది. నగరంలోని మరో పోలీస్ అధికారి తన స్టేషన్లో తరచూ సివిల్ పంచాయతీలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ స్థానిక నేతను మధ్యవర్తిగా ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా శివప్రసాద్ కాలనీకి చెందిన ఓ యువకుడిపై గోపాల్‌నగర్‌కు చెందిన ఫైనాన్షియర్ నగదు లావాదేవీల విషయమై ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంలో ఆ యువకుడు చేసిన నేరం పెద్దగా లేనప్పటికీ సదరు కాంగ్రెస్ పార్టీ నేత మధ్యవర్తిత్వంతో రూ.50 వేలకు బేరం కుదిరినట్లు సమాచారం. ఈ విధంగా పోలీస్స్టేషన్లలో అవినీతి రాజ్యమేలుతోంది. దీనికి ముగింపు ఎప్పుడో ఉన్నతాధికారులే చెప్పాలి. -
సెటిల్మెంట్లపై ప్రత్యేక దృష్టి
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :జిల్లాలో రౌడీషీటర్ల సెటిల్మెంట్లు, వారి ఆధిపత్యపోరుతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇకపై ఇటువంటి అసాంఘిక శక్తులపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రా రీజియన్ ఐజీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గురువారం రాత్రి ఆయన అమలాపురం డివిజన్లో నేరాలు, దర్యాప్తు పురోగతిపై డీఎస్పీ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రౌడీలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కేసుల దర్యాప్తులో కొంత వెనుకబడిందన్నారు. ఇపుడు సమైక్యాంధ్ర ఉద్యమం ముగిసినందున పూర్తిగా కేసుల దర్యాప్తుపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమాన్సింగ్, జిల్లా ఎస్పీ శివశంకరరెడ్డి, అమలాపురం డీఎస్పీ కె.రఘు, అమలాపురం సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, రావులపాలెం సీఐ సీహెచ్‌వీ రామారావు, ముమ్మిడివరం సీఐ ఆలీ, రాజోలు సీఐ పెద్దిరాజుతో ఆయన డివిజన్లో శాంతి భద్రతల పరిస్థితి, కేసుల దర్యాప్తులో పురోగతిపై చర్చించారు. ప్రధానంగా ఇటీవల అమలాపురం పట్టణంలో రౌడీషీటర్లకు చెందిన రెండు వర్గాల పరస్పర హత్యాయత్నం ఘటనలపై ఐజీ లోతుగా ఆరా తీశారు. రౌడీలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన డీఎస్పీ రఘును ప్రశ్నించినట్టు తెలిసింది. పట్టణంలో రౌడీషీటర్లపై నిఘా ఉంచామని చెప్పిన డీఎస్పీ వారిపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. డివిజన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలపై లైంగిక దాడులు, వరకట్న వేధింపులకు సంబంధించిన కేసులు, ఇతర నేరాలపై ఐజీ, డీఐజీ కోనసీమలోని స్టేషన్ల వారీగా రికార్డులను పరిశీలించి సమీక్షించారు. -
రూ.6 వేలకో తపంచా.. రూ.200కో తూటా ?
లింగాలఘణపురం, న్యూస్‌లైన్ : సెటిల్మెంట్లు.. సుపారీ హత్యలకు జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.. బీహార్‌లాంటి రాష్ట్రాల్లో రూ.6 వేలకో తపంచా.. రూ.200 ఒక తూటా లభిస్తుండడం ప్రైవేట్ గ్యాంగ్‌లకు వరంగా మారింది. నెల్లుట్ల శివారు వడ్డెరకాలనీలో జరిగిన విజయ్ హత్య కోసం నిందితులు ఇదే తరహాలో ఆయుధాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ నెల 23న నెల్లుట్ల శివారు వడ్డెర కాలనీలో శివరాత్రి విజయ్(35) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా విజయ్ను హతమార్చేందుకు ఎదురు చూస్తున్న అతడి ప్రత్యర్థి పందిగోటి మురళి ఈ పని కోసం పలువురిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అడ్వాన్స్‌గా సుమారు రూ.రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడికి జనగామలో దాబా నిర్వహించే ఓ వ్యక్తితో పరిచయమేర్పడింది. అతడు కిశోర్‌తో విజయ్ హత్యకు రూ.6 ల క్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అందులో అడ్వాన్స్‌గా కిషోర్‌కు రూ.80 వేలు ముట్టజెప్పారు. అనంతరం అతడు తన డైరీ ఫామ్‌లో పనిచేసే బీహార్ కూలీలతో మాట్లాడి అక్కడి నుంచి రూ.6 వేలకు తపంచా, ఒక్కో తూటాను రూ.200కు కొనుగోలు చేసినట్లు సమాచారం. వారు రెండు తపంచాలను అక్కడి నుంచి కొనుగోలు చేసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వస్తున్న నిందితులు భువనగిరి టోల్‌ప్లాజా సమీపంలోని అడవుల్లో తపంచాల పనితీరును రిహర్సల్స్ చేసినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. విజయ్ హత్య కేసులో కారు డ్రైవర్ మినహా ప్రధాన నిందితులంతా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో నిందితులందరిని పోలీసులు రిమాండ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బతుకుదెరువు కోసం వచ్చి హత్యోదంతం.. దేశంలో బీహర్ అనగానే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పేరుంది. అక్షరాస్యత అంతగాలేని ఆ రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధిలేక అనేకమంది ఇతర రాష్ట్రాల్లో కూలీలుగా వలసలు వెళుతున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా డైయిరీ ఫాంలో పనిచేసేందుకు వస్తుంటారు. అనేకమంది కూలీలు వరంగల్ జిల్లాలోని పలు ప్రైవేట్ డైరీల్లో పనిచేస్తున్నారు.