అత్యాచారాల స్నేక్బ్యాచ్! | Snake Batch arrest! | Sakshi
Sakshi News home page

అత్యాచారాల స్నేక్బ్యాచ్!

Published Sun, Aug 24 2014 6:30 PM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

అత్యాచారాల స్నేక్బ్యాచ్! - Sakshi

అత్యాచారాల స్నేక్బ్యాచ్!

హైదరాబాద్‌ పహాడీ షరీఫ్‌లో యువతిపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన స్నేక్‌బ్యాచ్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

హైదరాబాద్: హైదరాబాద్‌ పహాడీ షరీఫ్‌లో యువతిపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన స్నేక్‌బ్యాచ్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాతబస్తీలో కాబోయే భర్త ఎదుటే యువతిపై అత్యాచారం చేసిన ఈ స్నేక్‌ బ్యాచ్ ఇలాంటి ఎన్నో నేరాలకు పాల్పడిందని పోలీసులు విచారణలో తెలిసింది. అత్యాచారాలే కాకుండా ఈ బ్యాచ్‌ పాములతో బెదిరించి  అనేక సెటిల్‌మెంట్‌లు  కూడా చేసినట్లు తేలింది. ఈ బ్యాచ్ గతంలో కూడా  ఎన్నో నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

వీరు ప్రేమ జంటలకు పామును చూపించి బెదిరించేవారు. ప్రేమికుడు ముందే ప్రేమికురాలిపై అత్యాచారం చేసేవారు. అంతేకాకుండా అదంతా సెల్ఫోన్లో, వీడియో కెమెరాలతో చిత్రీకరించి మరీ వారిని బెదిరించేవారు. పోలీసులతో చెబితే ఫేస్ బుక్ లో పెడతామని బెదిరించేవారు. ఈ రకంగా వీరు పలువురిపై అత్యాచారం చేశారు.  పాములను ఆడించడంలో వారు సిద్దహస్తులు. దాంతో వారు చాలా అరాచకాలు చేశారు. ఈ నిందితులలో ఒక వ్యక్తి  హత్య కేసులో నిందతుడని పోలీసులు చెప్పారు.

పాతబస్తీలోని ఈ బ్యాచ్‌కు సంబంధించిన వారందరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండటంతో  నేరచరిత్ర ఒక్కొక్కటిగా బయటపడుతోంది. పాతబస్తీలో రియల్‌ ‌ఎస్టేట్‌ వ్యాపారం చేసే వారందరికి సెటిల్‌ మెంట్ చేయడం ఈ బ్యాచ్‌ ప్రధాన దందా అని పోలీసులు భావిస్తున్నారు. ఈ స్నేక్‌ బ్యాచ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు చూసిన పోలీసులు వీరి ఆగడాలు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. రోడ్డుపైనే కూర్చుని ఈ బ్యాచ్‌  సెటిల్‌మెంట్‌లు చేసినట్లు వీడియోల ద్వారా తెలిసింది. వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిసిన తరువాత ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement