చట్టం తన పని తాను చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని రాజీలు, సెటిల్‌మెంట్లు, పంచాయితీలు చేయడం ధర్మమేనా! అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించి తరలించడంపై అసెంబ్లీలో ప్రస్తావించేందుకు విఫలయత్నం చేసిన జగన్ స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో లాబీల్లోని తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు