సింహంలా పనిచేశాను.. జీరోలా చేస్తున్నారు | guntur mla modugula venugopala reddy comments on tdp positions | Sakshi
Sakshi News home page

సింహంలా పనిచేశాను.. జీరోలా చేస్తున్నారు

Published Mon, Feb 6 2017 11:30 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM

సింహంలా పనిచేశాను.. జీరోలా చేస్తున్నారు - Sakshi

సింహంలా పనిచేశాను.. జీరోలా చేస్తున్నారు

శత్రువుల కన్నా పార్టీలోని మిత్రులతోనే నష్టం
టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్
డి

గుంటూరు : శత్రువుల కన్నా టీడీపీలో ఉన్న మిత్రులతోనే ఎక్కువ నష్టమని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థాగత ఎన్నికలపై ఆదివారం నిర్వహించిన టీడీపీ నగర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్‌ నియోజకవర్గంలో, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో సింహంలా పనిచేసిన వాడిని అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో వారే సున్నా చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే మోదుగుల ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇతరుల జోక్యం ఎక్కువగా ఉండటం వల్ల పనులు, పార్టీ పదవులు తన ప్రమేయం లేకుండానే కొనసాగుతున్నాయని చెప్పారు.

పేదలు, కార్యకర్తల కోసం చేసిన సిఫార్సులను అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. పార్టీ అధికారం లోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా నగరపాలక సంస్థ ఎన్నికలుగానీ, వక్ఫ్‌బోర్డు, దేవస్థాన కమిటీలు ఏర్పాటు చేయలేక కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. పార్టీ పదవులతో విజిటింగ్‌ కార్డులు కొట్టించుకొని అమరావతిలో సెటిల్‌మెంట్‌లు చేసుకునేవారు ఎక్కువయ్యారన్నారు. సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ పదవులు పొందిన వారిపై ఫిర్యాదులు వస్తే అధిష్టానం ఐవీఆర్‌ఎస్, ఇతర మార్గాల్లో సర్వే చేయిస్తుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement