
మార్చి 25న కరీంనగర్ కోర్టు ఎదుట గణేష్‌భవన్‌లో మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డికి ములాఖత్ కల్పించి దూరంగా ఎస్కార్టు పోలీసులు (ఫైల్)
కోర్టు కేసుల విచారణ అంటేనే మోహన్‌రెడ్డికి ములాఖత్‌ల వ్యవహారంగా మారింది. విచారణకు వచ్చిన ప్రతీసారి మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి ములాఖత్‌లతో తన వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటున్నాడనే ఆరోపణలకు బలం చేకూర్చింది తాజా సంఘటన. కేసుల విచారణకు కరీంనగర్ వచ్చే ఆయన ముందు.. తర్వాత.. హోటళ్లు, దాబాల్లో అడ్డాలు పెట్టి కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలతో తనకు కావాల్సినంత సమయం తీసుకొని సెటిల్‌మెంట్స్ నడిపిస్తున్నారనే విమర్శలు గతం నుంచి కూడా ఉన్నాయి. మార్చి 25న ఏకంగా కోర్టు ఎదుట గణేష్‌భవన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్‌లు జరిపారంటూ ఆయన బాధితుల సంఘం, లోక్‌సత్తా పోలీసు, జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈనెల 1న కరీంనగర్ సబ్‌కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన మోహన్‌రెడ్డి లగ్జరీ ఏసీ కారు (క్రేటా)లో యూనిఫాంలో ఉన్న ఎస్కార్టు పోలీసులతో ఓ హోటల్‌లో కొందరితో ములాఖత్ నిర్వహించడం, ప్రైవేట్ కారు, హోటల్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు శుక్రవారం మోహన్‌రెడ్డి బాధితుల సంఘం, లోక్‌సత్తా పోలీసు, జైలు ఉన్నతాధికారులకు మరోమారు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. – సాక్షిప్రతినిధి, కరీంనగర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రసాద్‌రావు ఆత్మహత్య కేసులో అరెస్టై ఇప్పటికి 72 కేసులను ఎదుర్కొంటున్న మోహన్‌రెడ్డి చాలా కాలం కరీంనగర్ జైలులో ఉన్నారు. ఈ తరుణంలోనే సంచలన వీడియో బయటపడడం, కరీంనగర్ జైలు అధికారి కార్యాలయంలోనే నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్‌లు నిర్వహిం చారన్న ఆరోపణలపై జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం, మోహన్‌రెడ్డి, ఆయన బావమరిదిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించింది. కరీంనగర్ జైల్లో ఉన్నప్పుడు వీఐపీలాగా జైల్లోనే ములాఖత్‌లు పెట్టడం, వీడియో దృశ్యాలు బయటపడడంతో మోహన్‌రెడ్డిని వరంగల్ జైలుకు తరలించారు. అయినా మోహన్‌రెడ్డి ములాఖత్‌లకు ఎక్కడా భంగం వాటిల్లినట్లు కనబడకపోగా, ఆయనకు పోలీసుశాఖకు చెందిన టాటా సుమో ఏసీ వాహనం సమకూర్చడం అప్పట్లో వివాదం అయ్యింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మోహన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరు పరచే నిమిత్తం గతంలో టీఎస్09–పీఏ1339 నంబర్ గల ఏసీ టాటా సుమో మఫ్టీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌తో తీసుకురావడం కూడా వివాదాస్పదమైంది.
ఆ విషయం మరువక ముందే మార్చి 25న ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులను, అనుమాయులను కలిసి చర్చించడమే కాకుండా పోలీసులకు నజరానా ముట్టజెప్పిన దృశ్యాల వీడియోలు బయటపడడం సంచలనం రేపింది. కరీంనగర్ కోర్టుకు వచ్చిన మోహన్‌రెడ్డి, దానికి ఎదురుగా ఉన్న గణేష్‌భవన్ ఉడిపి హోటల్‌లో సాయంత్రం 6.02 గంటలకు ప్రవేశించి ఏకంగా 23 నిమిషాలు హోటల్‌లో గడిపారు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు అక్షయ్‌రెడ్డి తమ్ముడు బొబ్బల మహేందర్‌రెడ్డితోపాటు బంధువులు, మణింధర్‌సింగ్‌తో చర్చలు జరిపారు. 6.24 నిమిషాలకు మోహన్‌రెడ్డి సూచనల మేరకు చర్చల అనంతరం మహేందర్‌రెడ్డి హోటల్ బెంచీపై డబ్బులు పెట్టాడు. మోహన్‌రెడ్డి లేవగానే అక్కడున్న కానిస్టేబుల్ ఆ మొత్తాన్ని తన జేబులో పెట్టుకొని నడుస్తున్న దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపించడం కలకలం రేపగా, ఎస్కార్టు పోలీసులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. తాజా సంఘటన మరోమారు కలకలానికి కారణమైంది.
మోహన్‌రెడ్డి, ఎస్కార్టుపై చర్యలు తీసుకోవాలి..: బాధితుల సంఘం
సబ్‌కోర్టు నంబర్ 416లో ఓ కేసు విచారణ నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటళ్లో సెటిల్‌మెంట్ చేసి ఎస్కార్టు పోలీసులతో ఏసీ కారులో బయటకు వెళ్తున్న వీడియో దృశ్యాలు బయట పెట్టిన బాధితుల సంఘం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈనెల 1న కరీంనగర్ కోర్టుకు వచ్చినప్పుడు జిల్లా సమీపంలో ఒక ప్రైవేట్ భోజనశాలల్లో కూర్చొని సన్నిహితులతో ములాఖత్ నిర్వహించారని, సెటిల్‌మెంట్ చేసుకున్నారని, మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డితోపాటు ఆయనకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ముస్కు మహేందర్‌రెడ్డి, బండమీది సామన్న ఒక ప్రకటనలో కోరారు. ప్రైవేట్ వాహనాన్ని అనుమతించి మోహన్‌రెడ్డి ప్రైవేట్ ములాఖా™Œత్‌కు సహకరించిన ఎస్కార్ట్ పోలీసులపై తక్షణమే చర్య తీసుకోవాలని బాధితుల సంఘం ప్రకటనలో డిమాండ్ చేసింది.
విషయం తెలిసింది.. విచారణకు ఆదేశించాం..
కోర్టు కేసు నిమిత్తం కరీంనగర్‌కు వచ్చిన మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి, ఎస్కార్టు పోలీసుల విష యం మా దృష్టికి వచ్చింది. డీఐజీ దృష్టికి కూడా తీసుకెళ్లి విచారణకు ఆదేశించాం. వీడియోలో వ్యక్తులు స్పష్టంగా కనిపించడం లేదు. అయినప్పటికీ ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం. ఎస్కార్టు పోలీసుల తీరుపైనా ఆరా తీస్తున్నాం. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీబీ కమలాసన్ రెడ్డి, పోలీసు కమిషనర్, కరీంనగర్