బాబోయ్...టూ టౌన్ పోలీస్‌స్టేషన్ | Baboy ... Two Town Police | Sakshi
Sakshi News home page

బాబోయ్...టూ టౌన్ పోలీస్‌స్టేషన్

Sep 12 2014 1:27 AM | Updated on Sep 2 2017 1:13 PM

బాబోయ్...టూ టౌన్ పోలీస్‌స్టేషన్

బాబోయ్...టూ టౌన్ పోలీస్‌స్టేషన్

గుడివాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. స్టేషన్ మెట్లు ఎక్కడానికి సామాన్యుడు భయపడుతున్నాడు.

  • స్టేషన్ మెట్లు ఎక్కడానికి భయపడుతున్న సామాన్యుడు
  • సెటిల్‌మెంట్ల పేరుతో వసూళ్లు
  • పాత నేరస్తులను పిలిచి మామూళ్లు దండుకుంటున్న సిబ్బంది
  • గుడివాడ : గుడివాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. స్టేషన్ మెట్లు ఎక్కడానికి సామాన్యుడు భయపడుతున్నాడు. మామూళ్లు ముట్టజెప్పిన వారికే న్యాయం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన ద్వితీయశ్రేణి అధికారి అన్నీ తానే చక్రం తిప్పుతున్నాడు.  

    పై అధికారులకు ఇవ్వాలంటూ ఫిర్యాదుదారుల నుంచి ముడుపులు పుచ్చుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్టేషన్ పరిధిలో ఎక్కువగా మురికి వాడలే ఉన్నాయి. సరిహద్దు తగాదాలు, మంచినీటి ట్యాపుల వద్ద గొడవలు ఎక్కువుగా వస్తుంటాయి. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయటానికి వస్తే రెండో వారిని పిలిచి ప్రత్యర్థులపై ఎలా కేసులు పెట్టాలో ఇక్కడ సిబ్బంది సలహాలు ఇస్తారని, చివరికి ఇద్దరినీ పిలిచి సెటిల్‌మెంట్లు చేసి డబ్బుదండుకుని పంపుతారని పలువురు ఆరోపిస్తున్నారు.

     పేకాట శిబిరాలపై వేరే ప్రాంతం పోలీసుల దాడి
     
    స్టేషన్ పరిధిలో పెద్దఎత్తున జూదాలు జరుగుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో ఆగ్రహించిన జిల్లా ఎస్పీ వీరికి తెలియకుండా రెండుసార్లు పెడన పోలీసు సిబ్బందితో దాడులు చేయించి పెద్దమొత్తంలోనే నగదు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది పిలిచి చీవాట్లు పెట్టినట్లు వినికిడి.
     
    పాత నేరస్థులకు వేధింపులు

    స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులను పిలిచి స్టేట్‌మెంట్లు రికార్డు చేయాలని జిల్లా ఎస్పీ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇదే అదునుగా భావించిన స్టేషన్ సిబ్బంది పాత నేరస్తులను పిలిచి భారీగా డబ్బులు వసూలు చేసి స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లా పోలీసు అధికారులు స్పందించి స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement