poker
-
పేకతో ఖాకీల ఆటవిడుపు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆ నలుగురు సీఐలది పేరుకు దసరా ఉత్సవాల బందోబస్తు విధులు.. కానీ వారి ధ్యాసంతా లాడ్జీలో పేకాటపైనే. దుర్గగుడిలో జరుగు తున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల బందోబస్తు విధులకు హాజరైన సీఐలు ఓ లాడ్జీలో హుషారుగా పేకాడుతున్న వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విజయవాడ టూ టౌన్ సీఐ కొండలరావు, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్, సైబర్ క్రైం సీఐ పల్లెపు శ్రీను, అతని స్నేహితుడు, ఏలూరు రేంజి వీఆర్‌లో సీఐగా ఉన్న రఘు పేకాడుతూ వీడియోకు చిక్కారు. ఎవరైనా పేకాడుతుంటే అడ్డుకుని చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు, అమ్మవారి ఉత్సవాల బందోబస్తుకు వచ్చి పేకాటలో తమ ప్రవీణ్యాన్ని చాటుకోవటానికి తహ తహలాడారు. ఏయ్ ముక్కేయ్ అంటూ హూషారుగా వారు పేకాడుతున్న వీడియోను చూసి నెటిజన్లు సైతం నివ్వెరపోయారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీస్ ఉన్నతాధికారులు నలుగురు సీఐలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. వారు ఎప్పుడు, ఏ రోజు పేకాడారనే స్పష్టత లేదు. వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సైతం విచారణ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి విచారణాధికారిగా ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్నకుమార్‌ను నియమించారు. pic.twitter.com/iXLy7DwXVh— Telugu Scribe (@TeluguScribe) October 7, 2024 -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. పట్టుబడ్డ డిప్యూటీ మేయర్
సాక్షి, మేడ్చల్: మేడిపల్లిలోని పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్ నేతలు, డిప్యూటీ మేయర్ అడ్డంగా దొరికిపోయారు. బీఆర్ఎస్ నేతలంతా పీర్జాదిగూడ డ్యిప్యూటీ మేయర్ శివకుమార్ ఆఫీస్‌లో ఆడుతూ పట్టుబడినట్లు సమాచారం. దీంతో పోలీసులు డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ తోపాటు ఏడుగురు కార్పోరేటర్లను, ఆరుగురు బిల్డర్లను అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతున్నారు. -
పేకాట ఆడుతూ పట్టుబడ్డ టీడీపీ నేతలు
-
పేకాట ఆడుతూ పట్టుబడ్డ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు
-
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ అరెస్ట్
సాక్షి, హిందూపురం: హైటెక్ పద్ధతిలో పేకాట ఆడుతున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగిరిగెర బీఎన్ఆర్ రెస్టారెంట్ వద్ద జూద కేంద్రంపై కర్ణాటక స్పెషల్ టాస్క్ఫోర్సు పోలీసులు ఆదివారం దాడి చేశారు. బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు 19 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,56,750 నగదు, 8 కార్లు, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఉపాధ్యాయులతో పాటు రాజకీయ నాయకులూ ఉన్నారు. వీరిని సోమవారం గౌరీబిదనూరు పోలీసులు గుడిబండే కోర్టుకు హాజరు హాజరుపర్చగా..రిమాండ్‌కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. కాగా.. గతంలో బాలకృష్ణ పీఏగా పనిచేసిన శేఖర్ కూడా పంచాయతీ రాజ్ శాఖలో భారీ అవినీతికి పాల్పడి జైలుకెళ్లాడు. ప్రస్తుత పీఏ బాలాజీ సైతం పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడడంతో బాలకృష్ణ పీఏల తీరు ఇలాగే ఉంటుందా అంటూ హిందూపురం ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ రాజకీయ బ్రోకర్: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి) -
హైదరాబాద్ బేగంపేటలో పేకాట రాయుళ్లు అరెస్ట్
-
నాగశౌర్య తండ్రికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
-
నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట
మణికొండ (హైదరాబాద్): నగర శివారులోని ప్రముఖుల ఫాంహౌజ్‌లను అద్దెకు తీసుకొని పేకాట దందా సాగిస్తున్న వ్యవహారాన్ని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) బట్టబయలు చేసింది. ప్రముఖులకు బర్త్‌డే పార్టీ పేరిట వాట్సాప్‌లో ఆహ్వానాలు పంపి క్యాసినోలు నడిపిస్తున్న ప్రధాన సూత్రదారితోపాటు 30మంది పేకాటరాయుళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సూత్రధారి సుమన్ చౌదరి గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్ చౌదరి ఓ టీవీ చానల్లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. అతను గతంలో గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు. ఫాంహౌజ్‌ను లీజుకు తీసుకున్న రవీంద్రప్రసాద్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేసి స్టేషన్‌కు రప్పించి విచారించారు. అంతా ప్రముఖులే... ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంలో పోలీసులకు చిక్కిన వారిలో రాజకీయ, రియల్ఎస్టేట్ గ్రూపులకు చెందిన ప్రముఖులు ఉన్నారు. మహాబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్యతోపాటు వాసవి డెవలపర్స్ గ్రూప్‌నకు చెందిన రాజారామ్, మద్దుల ప్రకాశ్‌లతోపాటు మరీడు తనున్, గుమ్మడి రామస్వామి చౌదరి, ననదిగ ఉదయ్, సీహెచ్ శ్రీనివాసరావు, టి.శివరామకృష్ణ, బాడిగ సుబ్రమణ్యం, పండిటాగ సురేష్, నాగార్జున, కౌతాపు వెంకటేశ్, మిర్యాల భానుప్రకాశ్, పాతూరి తిరుమల, వీర్ల శ్రీకాంత్, ఎం.మల్లిఖార్జున్‌రెడ్డి, బొగ్గారాపూర్ నాగ, గట్ట వెంకటేశ్వర్రావు, ఎస్ఎస్ఎన్ రాజు, యు.గోపాల్‌రావు, బి.రమేశ్‌కుమార్, కాంపల్లి శ్రీనివాస్, ఇమ్రాన్ ఖాన్, టి.రోహిత్, బొల్లబోడ ఆదిత్య, సీహెచ్ గణేష్, తోట ఆనందకిషోర్, షేక్ ఖదీర్, బి.రాజేశ్వర్ ఉన్నారు. రెడ్‌కాయిన్‌కు రూ.5 వేలు ఫామ్‌హౌజ్‌లో ప్రముఖులతో మూడు ముక్కల ఆట ఆడించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పేకాట శిబిరాల్లో డబ్బు బదులుగా కాయిన్స్‌ను సరఫరా చేస్తారు. రెడ్ కాయిన్‌కు ఐదు వేలు, గ్రీన్ కాయిన్‌కు రెండువేలు, బ్లూ కాయిన్‌కు వెయ్యి రూపాయల లెక్క కడుతున్నారు. పోలీసులకు చిక్కిన 30 మందికి రాజేంద్రనగర్ అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. కొందరు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిని న్యాయమూర్తి తిరస్కరించారు. చంద్రబాబు, లోకేశ్‌లతో ఫొటోలు మంచిరేవుల ఫాంహౌజ్‌లో క్యాసినో నిర్వహిస్తున్న గుత్తా సుమన్ చౌదరి ప్రముఖులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తోపాటు ఓ పత్రిక యజమానితో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. చదవండి: సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల పట్టివేత -
పేకాట పాపారాయుళ్లు: ప్రతిసారి వాళ్లే ఎలా గెలుస్తున్నారని..
సాక్షి, మేడ్చల్ రూరల్: పోలీసులంటూ పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసి నగదు దోచుకెళ్లిన ముఠాను మేడ్చల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ పద్మజ వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా ముథోల్ కు చెందిన అఖిల్ అహ్మద్ (32) మేడ్చల్ పట్టణంలోని చంద్రానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతని మిత్రులు ఇస్లాంపూర్‌కు చెందిన షేక్ అహ్మద్(21), షేక్ అజీమ్(25) ముగ్గురు తరచూ పేకాట ఆడేవారు. భాదితులు మణికంఠ, శ్రీహరి, సామ్‌సంగ్‌లతో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. పలుమార్లు వారితో కలిసి పేకాట ఆడారు. ఎప్పుడు పేకాట ఆడినా మణికంఠ, శ్రీహరి, సామ్‌సంగ్‌లు డబ్బు గెలుచుకునేవారు. అఖిల్ అహ్మద్, షేక్ అహ్మద్, షేక్ అజీమ్‌లు సుమారు రూ.7 నుంచి 8 లక్షల వరకు పోగొట్టుకున్నారు. తరుచూ డబ్బు వాళ్లే ఎలా గెలుస్తున్నారు.. ఏదో చేస్తున్నారు అంటూ వీరి నుంచి డబ్బులు ఎలాగైనా రాబట్టాలని ప్లాన్ చేసుకున్న ముగ్గురు మిత్రులు వారి స్నేహితులైన ఇస్లాంపూర్ కు చెందిన షేక్ అక్బర్(32), నిజామాబాద్‌కు చెందిన గణేశ్(28), షేక్ కైసర్(30) లతో కలిసి నకిలీ పోలీసులమంటూ బెదిరించి డబ్బులు దోచుకోవాలని పథకం వేసుకున్నారు. ఈ నెల 14న మేడ్చల్‌లోని ఆర్ఆర్ లాడ్జిలో రెండు గదులు అద్దెకు తీసుకున్నారు. ప్లాన్‌లో భాగంగా అఖిల్ అహ్మద్ మధ్యాహ్నం మణికంఠ, శ్రీహరి, సామ్‌సంగ్‌లకు ఫోన్ చేసి పేకాట ఆడేందుకు లాడ్జికి పిలువగా వారు సాయంత్రం వచ్చి అఖిల్ అహ్మద్,షేక్ అహ్మద్, షేక్ అజీమ్‌లతో కలిసి ఆరుగురు లాడ్జీలోని ఓ రూమ్‌లో పేకాట ఆడుతున్నారు. కొంతసేపటికి డోర్ చప్పుడు కావడంతో అఖిల్ అహ్మద్ పోలీసులు వచ్చారంటూ అరుస్తూ అక్కడ ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని బాత్రూమ్లో దాక్కున్నాడు. షేక్ అహ్మద్ వెళ్లి తలుపులు తీసాడు. గణేశ్, షేక్ కైసర్‌లు పోలీసులమంటూ గదిలోకి చొరబడి గణేశ్ డమ్మీ గన్‌తో బెదిరించి డబ్బు తీసుకొని వెళ్లిపోయారు. ఆ సమయంలో షేక్ అక్బర్ ఇతరులు ఎవరూ అటు వైపు రాకుండా చూస్తూ లాడ్జ్ వారితో మాటలు కలుపుతూ పని ముగిసాక వెళ్లిపోయాడు. తరువాత అఖిల్ అహ్మద్,షేక్ అహ్మద్‌లు తమకు భయం అవుతుందంటూ బాదితులకు చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి రూ.2.22లక్షల నగదు, 6 సెల్ఫోన్లు, బైక్, డమ్మీ గన్, ఫైబర్ లాఠీ లను స్వాధీనం చేసుకున్నారు. -
ఆడేదెవరైనా గెలుపు అతడిదే!
హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పేకాటలో గెలుపెవరిదో పసిగట్టి ఆపై బెట్టింగ్ జరిపే ముఠాను శనివారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఊస నాగప్రవీణ్ కుమార్ (31) బీటెక్ పూర్తి చేశాడు. యూసఫ్‌గూడలో నివసించే అతడు కొద్దికాలంగా యాదగిరినగర్‌లో హైటెక్ పేకాట శిబిరాన్ని నిర్వహి స్తున్నాడు. పేకాట శిబిరంలపై పోలీసులు దాడి చేయ గా విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. పేకాటలో ఎవరు గెలుస్తారో ముందుగా చెప్పే టెక్నాలజీ ఉన్న సెల్‌ఫోన్‌ను ఢిల్లీ నుంచి రూ.28 వేలకు ప్రవీణ్ కొనుగోలు చేశాడు. దీనిద్వారా గెలుపొందే వ్యక్తిపై బెట్టింగ్ నిర్వహించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకునేవాడు. పోలీసులు ప్రవీణ్, ఇంటి యజమాని అజయ్‌తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. రూ. 38 వేల నగదును, ఐదు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ కేఎస్ రావు వెల్లడించారు. టెక్నాలజీ పనితీరు ఇదీ.. ప్రవీణ్ కొనుగోలు చేసిన సెల్‌లోని డిజైన్డ్ కార్డ్ స్కానర్ ముందుగా పేకముక్కల్ని స్కాన్ చేస్తుంది. ఒక్కొక్కరికీ మూడు పేకముక్కల చొప్పున పంచే తీన్‌పత్తా ఆటలో ముందుగా సీక్వెల్ వచ్చిన వారు గెలుపొందుతారు. పంచిన పేకలు ఎవరెవరికి వెళ్లాయో సెన్సర్ల ద్వారా విశ్లేషించుకుని వరుస నంబర్లు (సీక్వెల్) ఎవరికి వచ్చిందన్న విషయాన్ని సంఖ్యల ద్వారా కొత్త టెక్నాలజీ చెప్పేస్తుంది. -
అనంత స్వేచ్ఛ ఆటా.. పాట!
జోరుగా పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం ►బళ్లారి, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి రాకపోకలు ►స్టార్ హోటళ్లు, లాడ్జీలు, క్లబ్‌లు, పర్యాటక, అటవీ ప్రాంతాలే అడ్డాలు ►బంకినీకో అడ్డాతో నిర్వహణ ►వాట్సాప్‌లో అడ్రస్‌లు.. ఫొటోలు, పేకాటరాయుళ్ల వివరాలు పీఏబీఆర్ డ్యాం.. తాడిపత్రి.. పెన్నహోబిళం.. మాసినేని గ్రాండ్! ప్లేస్ ఏదైనా ఆడే ఆట మాత్రం ఒక్కటే! కర్నూలు, వైఎస్సార్ కడప, బళ్లారి జిల్లాల నుంచి అనంతపురానికి పేకాట ఆడేందుకు రోజూ వందల సంఖ్యలో వస్తున్నారంటే ‘అనంత’ స్వేచ్ఛ ఇట్టే అర్థమవుతోంది. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం దెబ్బకు వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. కొన్నేళ్లుగా వేళ్లూనుకున్న ఈ అసాంఘిక కార్యకలాపాల విషయంలో పోలీసు బాస్ నిఘా సారించినా.. కళ్లుగప్పి సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మాసినేనిగ్రాండ్ ఓ త్రీస్టార్ హోటల్. ఇక్కడ ఒకే రోజు ఏకంగా ఆరు గదుల్లో 48 మంది పేకాట రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. అంతమంది ఆరు గదుల్లో ఉంటే ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? అనే విషయాన్ని యాజమాన్యం కూడా గాలికొదిలేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. పేకాట దెబ్బకు రెండు నెలల క్రితం తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి కుటుంబం ఛిద్రమైంది. ఆ ఉదంతం తర్వాత పేకాటపై ఎస్పీ అశోక్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. తాడిపత్రితో పాటు పేకాట అడ్డాలపై ప్రత్యేక బృందంతో తనిఖీలు చేయించారు. ఈ క్రమంలో వీరంతా స్టార్‌హోటళ్లు, లాడ్జీలకు మకాం మార్చారు. అక్కడ పోలీసుల తనిఖీలు ఉండవనే భావనతో వీటిని ఎంచుకున్నారు. తాడిపత్రి, పీఏబీఆర్, వై.రాంపురం ప్రాంతాల్లో సాగుతున్న పేకాటకు ఇతర జిల్లాలు, కర్ణాటక వాసులు కూడా వచ్చి వెళ్తున్నారు. ఒక్కో బంకినీ వద్ద రూ.10లక్షల నుంచి రూ.20లక్షలు ఆట జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీఏబీఆర్ ప్రాంతంలోనే రోజూ 5–10 బంకినీలు ఉంటాయి. తాడిపత్రి, రాంపురంలో కలిపి మరో 10 వరకూ ఉంటున్నాయి. ఇక్కడ ఒక్కోచోట రూ.10లక్షల వరకు.. హోటళ్లలో రూ. రూ.2లక్షల నుంచి రూ.5లక్షల ఆట జరుగుతోంది. రాయదుర్గంలోని క్లబ్లో పేకాట ఆడి ఓ రాజకీయ నాయకుడి బంధువు రూ.70లక్షలు, మరొకరు రూ.30లక్షలు పొగొట్టుకోవడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు తెలిసిన తంతే.. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ చిట్టా స్థానిక పోలీసులకు తెలియనిది కాదు. అయితే వారితో ఉన్న సత్ససంబంధాల నేపథ్యంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలోని వన్‌టౌన్ పరిధిలో సుదీర్ఘకాలం ఎస్ఐలు, కానిస్టేబుళ్లు తిష్టవేసి ఉండటంతో వీటి నియంత్రణను గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. వన్‌టౌన్ ఏరియాలో ఇప్పటికీ మట్కా విచ్చలవిడిగా సాగుతోంది. గతంలో మట్కాకింగ్ అరెస్టు తర్వాత కొద్దికాలం నిలిపేశారనిపించినా.. ఆ తర్వాత ‘మూడు బ్రాకెట్లు.. ఆరు క్లోజ్’లుగా వర్ధిల్లుతోంది. ‘అనంత’తో పాటు తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలో భారీగా నడుస్తోంది. గతంలో రతన్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరురోజులు నిర్వహిస్తున్నారు. ఈ మాట్కా నెంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నడుపుతున్నారు. ఇది ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5గంటల వరకూ డబ్బు తీసుకుంటారు. రాత్రి 9.15 గంటలకు ఓపెన్, రాత్రి 11.15 గంటలకు క్లోజ్(బ్రాకెట్) నెంబర్ ప్రకటిస్తారు. మట్కా రాసే జాబితాలో కాలేజీ విద్యార్థులు కూడా చేరుతున్నారు. అయినా పోలీసులు నివారణ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ‘క్రికెట్ బెట్టింగ్’కు అడ్డాగా ‘అనంత’ ప్రొద్దుటూరులో బెట్టింగ్ ఏ స్థాయిలో నడుస్తోందో, ఇప్పుడు ‘అనంత’లోనూ అదేస్థాయిలో సాగుతోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకున్నారు. క్రికెట్ ఆడే దేశం ఏదైనా టీవీలో ‘లైవ్’ కన్పిస్తే చాలు బెట్టింగ్ తెరపైకి వస్తోంది. వీరిలో అధికశాతం మంది కేఫ్‌లలో కూర్చుని లెక్కలేసుకుంటున్నారు. బెట్టింగ్ ఆడేవారిలో వ్యాపారులతో పాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అధికంగా ఉంటున్నారు. మ్యాచ్ గెలుపోటములపై బుకీలు నిర్వహించే బెట్టింగ్‌లతో పాటు ‘లైవ్’ ఉన్న సమయంలో లాడ్జీల్లో గదులు అద్దెకు తీసుకుని గ్రూపులుగా వెళ్లి బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడుతున్నారు. యథేచ్ఛగా వ్యభిచారం ‘అనంత’తో పాటు తాడిపత్రి, కదిరి, హిందూపురం, గుంతకల్లులోనూ వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. అనంతపురంలోని ఓ ప్రముఖ హోటల్లో 8 నెలల కిందట ఇద్దరు ఆర్డీఓ స్థాయి అధికారులు, ఓ కమిషనర్ స్థాయి అధికారి ఒకే రోజు వేర్వేరు గదుల్లో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. అరెస్టు చూపిస్తే ఉద్యోగాలు, పరువు పోతాయని భారీగా ముట్టజెప్పి తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘అనంత’లోని శ్రీకంఠం సర్కిల్లో వీటికి అడ్డాగా ఉన్న లాడ్జీలను మూయించారు. ప్రస్తుతం బస్టాండ్ సమీపంలోని లాడ్జీలకు మకాం మారింది. దీంతో పాటు ప్రముఖ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం నడుస్తోంది. ఆన్లైన్ డేటింగ్సైట్లో బుక్‌చేసుకున్న యువతలు ఇలాంటి హోటళ్లలో దిగుతున్నారు. అలాగే హౌసింగ్‌బోర్డు, శారదానగర్, కళ్యాణదుర్గం రోడ్డులో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. తాడిపత్రిలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరు నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వీరిని ఆసరాగా చేసుకుని బుగ్గ సమీపంలో ఎక్కువగా వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం. ఎస్పీకి తప్పుడు నివేదికలు ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు తీసుకునే సమయంలో జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో చితికిపోయిన ఈ జిల్లాలో ఇప్పుడు పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలు మాత్రమే సాగుతున్నాయి. వీటిని నివారిస్తే చాలా కుటుంబాల్లో ప్రశాంతత నింపినట్లే! తద్వారా క్రైం రేటును పరోక్షంగా తగ్గించినట్లు అవుతుంది. ఇది గ్రహించిన ఎస్పీ బాధ్యతలు తీసుకోగానే వీటిపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ తర్వాత మట్కారాయుళ్ల ఊరొదిలి వెళ్లారు. పేకాట నిలిచిపోయింది, బెట్టింగ్ జరగడం లేదని కొంతమంది మిడిల్ బాస్‌లు ఎస్పీకి తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తాజా పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. -
ఆన్లైన్ ‘ఆటలూ’ సాగవు!
∙ నెట్లో పేకాటపై సర్కారు కన్నెర్ర ∙ గేమింగ్ యాక్ట్‌కు సవరణలు తెస్తూ ఆర్డినెన్స్ ∙ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం గడిచిన కొన్నేళ్లుగా పేకాటపై ఉక్కుపాదం మోపుతోంది. ఫలితంగా పేకాట క్లబ్బులు మూతపడ్డాయి. అక్కడక్కడా నిర్వహిస్తున్న పేకాట శిబిరాలనూ పోలీసులు వదిలిపెట్టట్లేదు. దీంతో ఇటీవల కాలంలో అనేక మంది ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడుతున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో గేమింగ్ యాక్ట్ సవరణకు సంబంధించి కీలక ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర పడింది. ఆకర్షణీయమైన ప్రకటనలతో ఆన్లైన్ రమ్మీని నిర్వహిస్తున్న వెబ్సైట్లు లెక్కకుమించి ఉంటున్నాయి. వీటికి బానిసలుగా మారిన వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. సర్వర్లను రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేసుకుంటున్న ఈ వెబ్సైట్ నిర్వాహకులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరు కొత్తవారిని ఆకర్షించేందుకు తొలినాళ్లల్లో కొంత నగదు గెల్చుకునేలా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఎదుటి వ్యక్తి పూర్తిగా బానిసయ్యాడని గుర్తించిన తర్వాత ప్రోగ్రామింగ్ మార్చడం ద్వారా తమకే లాభాలు వచ్చేలా మార్పుచేర్పులు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2014లో అప్పటికే అమలులో ఉన్న గేమింగ్ యాక్ట్‌ను స్వీకరించింది. 1974 నాటి ‘ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్’ ఆధారంగానే ఇప్పటికీ పేకాటపై చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ విస్తరణ, మార్పుచేర్పుల నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనూ పేకాట విస్తరించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గేమింగ్ యాక్ట్‌కు సవరణలు చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా ఆన్లైన్లో పేకాట ఆడుతూ చిక్కిన వారిపై నేరం నిరూపణైతే రూ.5 వేల జరిమానా, ఏడాది జైలు శిక్షకు ఆస్కారం ఉండేలా ఆర్డినెన్స్ తేనున్నారు. ఇది అమలులోకి వస్తే ఆన్లైన్ గాంబ్లింగ్ సర్వీసులను అందించే వెబ్సైట్లను నిషేధించే అధికారం పోలీసులకు వస్తుంది. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ఆయా వెబ్సైట్లు వినియోగిస్తున్న వారి వివరాలు తెలుసుకోవడానికి వాటితో లింక్ చేసి ఉన్న బ్యాంకు ఖాతాలు, క్రెడిట్/డెబిట్‌కార్డుల వివరాలు గుర్తించేందుకు ఆస్కారం ఏర్పడనుంది. వీటి ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండనుంది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆయా వెబ్సైట్లు రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమం కానుంది. ఇంటర్నెట్ సేవలను అందించే సంస్థలకు లేఖలు రాయడం ద్వారా పోలీసులు అధికారికంగా గాంబ్లింగ్ సైట్లు రాష్ట్రంలో ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఏర్పడనుంది. -
సెల్‌పోన్ యాప్‌తో పేకాట మోసం
-
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
బీబిగూడెం(చివ్వెంల) : పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్ఐ రౌతు రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బీబిగూడెం గ్రామ శివారులోని ఓ మామిడి తొటలో పేకాట ఆడుతున్న ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన కొండేటి బుచ్చిరెడ్డి, మల్లోజు వెంకన్న, బొప్పారం గ్రామానికి చెందిన పగడాల క్రిష్ణారెడ్డి, ఏపూర్ గ్రామానికి చెందిన తొండల నారాయణ, సూర్యాపేట మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన కాటోజు జనార్ధనాచారి, చివ్వెంల మండల కేంద్రానికి చెందిన శిగ లచ్చయ్యలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.12,700 నగదు, మూడు బైక్‌లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలోని పేకాట స్థావరంపై ఆదివారం సాయంత్రం ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.36వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసును జవాహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
పేకాట స్థావరాలపై పోలీసుల ఆక్మసిక దాడి
హిందూపూర్ పట్టణ శివారులోని పరిగి వద్ద ఓ తోటలో పేకాట స్తావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పేకాటాడుతున్న 40 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4 లక్షలకు పైగా నగదు, 20 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాటస్థావరం పై పోలీసుల దాడి..
-11 మంది అరెస్ట్ హైదరాబాద్‌సిటీ మల్కాజిగిరిలో ఓ పేకాటస్థావరంపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడిచేశారు. పేకాటాడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి రూ.76 వేల నగదు,11 సెల్ఫోన్లు, ఒక సీసీ కెమెరా, ఒక డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిభిరం పై దాడులు నిర్వహించిన పోలీసులు అరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 14 వేల నగదుతో పాటు ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి కాలనీలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఆదివారం రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. -
ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడెంలో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.80 లక్షలతో పాటు, 8 సెల్ఫోన్లు, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దమ్మాయిగూడెంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిలో పోలీస్ కానిస్టేబుళ్లు కూడా ఉన్నట్లు సమాచారం. -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
అశ్వారావుపేట మండలం కేమీలాయిడ్స్ ఫ్యాక్టరీ సమీపలలో పేకాటస్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పేకాటాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి 4 బైక్‌లు, రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూరు గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. -
కొ..క్కో..కోట్లు
రూ.100కోట్లు చేతులు మారాయి యథేచ్ఛగా కోడిపందేలు, పేకాట గ్రామల్లో మూడురోజుల జాతర అధికార పార్టీ నేతల అండ పోలీసుల ప్రేక్షకపాత్ర మచిలీపట్నం : సంక్రాంతి సందర్భంగా జిల్లాలో మూడు రోజుల పాటు కోడిపందేలు, పేకాట జోరుగా సాగాయి. ప్రజాప్రతినిధులే స్వయంగా కోడిపందేలు, పేకాట శిబిరాలను ప్రోత్సహించడం వివాదాస్పదమైంది. మూడు రోజుల వ్యవధిలో కోడిపందేలు, పేకాట, గుండాట తదితరాల రూపంలో దాదాపు రూ. 100 కోట్లు చేతులు మారాయని అంచనా. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలో ‘బరులు’ ఏర్పాటు చేయడంతో వ్యసనపరులు చేతులు కాల్చుకున్నారు. వేలాది కోళ్లు రక్తం చిందించాయి. కోతముక్కలో పాల్గొన్న పేకాట రాయుళ్లు ఊసూరుమంటున్నారు. సంప్రదాయం ముసుగులో సాగిన ఈ పందేల వ్యవహారంలో నగదు పోగొట్టుకున్న వారే అధికశాతం ఉండడం గమనార్హం. నవ్యాంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పందెం, పేకాట రాయుళ్లు బరితెగించి ఈ ఏడాది తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. రాజకీయ నాయకుల మద్దతు కూడగట్టుకున్న పందెంరాయుళ్లు బరితెగించి కోడి పందేలు, పేకాట శిబిరాలు నిర్వహించడంతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. గత ఏడాది విజయవాడ పరిసరాల్లో కోడి పందేలు అంతగా జరగలేదు. ఈ ఏడాది ఇందుకు విరుద్ధంగా కోడిపందేల శిబిరాలు ఏర్పాటు చేయడం, అక్కడే మద్యం, భోజన వసతులు, విద్యుత్‌లైట్ల ఏర్పాటు చేయడం గమనార్హం. టీడీపీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుల కనుసన్నల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు ఎలాంటి జంకు లేకుండా నిర్వహించడం వివాదాస్పదమవుతోంది. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో మూడురోజుల క్రితమే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కోడిపందేల శిబిరాన్ని ప్రారంభించారు. ఇక్కడ యథేచ్ఛగా కోడిపందేలు జరిగాయి. విజయవాడ రూరల్ మండలం నున్నలోనూ కోడిపందేల జోరు కొనసాగింది. పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెందుర్రులో పదెకరాల విస్తీర్ణంలో కోడిపందేల బరిని ఏర్పాటు చేశారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఈ పోటీల వద్దకు వెళ్లి తిలకించడం గమనార్హం. నాగేశ్వరరావుపేటలో ఎమ్మెల్యే కాగిత స్వయంగా కోడిపందేలను ప్రారంభించారు. కోడిపందేలతో పాటు గుండాట, పేకాట యథేచ్ఛగా ఇక్కడ కొనసాగాయి. పెడన మండలం బల్లిపర్రు, కోంకేపూడి, కట్లపూడి గ్రామాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కనే ఉన్న మల్లెతోటల్లో జోరుగా కోడిపందేలు, పేకాట కొనసాగాయి. గూడూరు మండలంలో చిట్టిగూడూరు, పోసినవారిపాలెం, రామన్నపేట గ్రామాల్లో పెద్ద ఎత్తున బరులు నిర్వహించారు. పేకాట జోరుగా కొనసాగింది. కృత్తివెన్ను మండలం కొమాళ్లపూడి, పోడు, చినగొల్లపాలెం, వాలంక తదితర గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించారు. కైకలూరు మండలం భుజబలపట్నలో శుక్రవారం జరిగిన కోడిపందేల శిబిరాన్ని ఏలూరు ఎంపీ మాగంటి బాబు పరిశీలించి పందేలను తిలకించారు. ముదినేపల్లి మండలం వైవాక, చిగురుకోట తదితర గ్రామాల్లో కోడిపందేల బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. భుజబలపట్నంలో గుండాట భారీ ఎత్తున సాగింది. మండవల్లి మండలం చింతపాటు, బైరవపట్నం, ఇంగిలిపాకం గ్రామాల్లోనూ కోడి పందేలు, పేకాట జోరుగా సాగాయి. నూజివీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లోని మామిడి తోటల్లో జోరుగా కోడిపందేలు, పేకాట నిర్వహించారు. కొంత మంది పందెం రాయుళ్లు పశ్చిమగోదావరి జిల్లాకు తరలివెళ్లారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కోడిపందేలు పెద్ద ఎత్తున కొనసాగాయి. మోపిదేవి మండలం చిర్లపాలెంలో కోడిపందేలు శిబిరాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కోడూరు మండలం జరుగువానిపాలెంలో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించారు. పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలంలోని కారకంపాడు, గూడపాడు, మెరకనపల్లి తదితర గ్రామాల్లో బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు కొనసాగించారు. కూచిపూడిలో గురువారం కోడిపందేల శిబిరం వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణలకు దారి తీసింది. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ, గుడ్లవల్లేరులలో పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. గుడివాడ పట్టణంలోనే కోడిపందేలు భారీస్థాయిలో నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో పోలాటితిప్ప, చిన్నాపురం, గుండుపాలెం, మేకవానిపాలెం గ్రామాల్లో జోరుగా కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు. ఇదేం సంప్రదాయం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు బరి తెగించారు. మూడు రోజులుగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కోడిపందేలు, గుండాట, పేకాట జోరుగా కొనసాగాయి. టీడీపీ ప్రభుత్వం కోడిపందేలు, జూదాలను ప్రోత్సహించి రైతులను నిలువునా ముంచింది. ప్రభుత్వ వైఖరి కారణంగా జిల్లా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించాల్సి వచ్చింది. సంక్రాంతి సంప్రదాయం పేరుతో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కోడిపందేలు, పేకాట శిబిరాల్లో వేలాది మంది నగదు పోగొట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్రాంతి కానుక ఇదేనా. - నరహరిశెట్టి నరసింహారావు,డీసీసీ అధ్యక్షుడు -
బాబోయ్...టూ టౌన్ పోలీస్‌స్టేషన్
స్టేషన్ మెట్లు ఎక్కడానికి భయపడుతున్న సామాన్యుడు సెటిల్మెంట్ల పేరుతో వసూళ్లు పాత నేరస్తులను పిలిచి మామూళ్లు దండుకుంటున్న సిబ్బంది గుడివాడ : గుడివాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. స్టేషన్ మెట్లు ఎక్కడానికి సామాన్యుడు భయపడుతున్నాడు. మామూళ్లు ముట్టజెప్పిన వారికే న్యాయం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన ద్వితీయశ్రేణి అధికారి అన్నీ తానే చక్రం తిప్పుతున్నాడు. పై అధికారులకు ఇవ్వాలంటూ ఫిర్యాదుదారుల నుంచి ముడుపులు పుచ్చుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్టేషన్ పరిధిలో ఎక్కువగా మురికి వాడలే ఉన్నాయి. సరిహద్దు తగాదాలు, మంచినీటి ట్యాపుల వద్ద గొడవలు ఎక్కువుగా వస్తుంటాయి. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయటానికి వస్తే రెండో వారిని పిలిచి ప్రత్యర్థులపై ఎలా కేసులు పెట్టాలో ఇక్కడ సిబ్బంది సలహాలు ఇస్తారని, చివరికి ఇద్దరినీ పిలిచి సెటిల్మెంట్లు చేసి డబ్బుదండుకుని పంపుతారని పలువురు ఆరోపిస్తున్నారు. పేకాట శిబిరాలపై వేరే ప్రాంతం పోలీసుల దాడి స్టేషన్ పరిధిలో పెద్దఎత్తున జూదాలు జరుగుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో ఆగ్రహించిన జిల్లా ఎస్పీ వీరికి తెలియకుండా రెండుసార్లు పెడన పోలీసు సిబ్బందితో దాడులు చేయించి పెద్దమొత్తంలోనే నగదు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది పిలిచి చీవాట్లు పెట్టినట్లు వినికిడి. పాత నేరస్థులకు వేధింపులు స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులను పిలిచి స్టేట్మెంట్లు రికార్డు చేయాలని జిల్లా ఎస్పీ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇదే అదునుగా భావించిన స్టేషన్ సిబ్బంది పాత నేరస్తులను పిలిచి భారీగా డబ్బులు వసూలు చేసి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లా పోలీసు అధికారులు స్పందించి స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
పేకాట.. ప్రాణం తీసింది!!