పోలీసులకు టెక్నాలజీని వివరిస్తున్న నిందితుడు
హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పేకాటలో గెలుపెవరిదో పసిగట్టి ఆపై బెట్టింగ్ జరిపే ముఠాను శనివారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఊస నాగప్రవీణ్ కుమార్ (31) బీటెక్ పూర్తి చేశాడు. యూసఫ్‌గూడలో నివసించే అతడు కొద్దికాలంగా యాదగిరినగర్‌లో హైటెక్ పేకాట శిబిరాన్ని నిర్వహి స్తున్నాడు.
పేకాట శిబిరంలపై పోలీసులు దాడి చేయ గా విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. పేకాటలో ఎవరు గెలుస్తారో ముందుగా చెప్పే టెక్నాలజీ ఉన్న సెల్‌ఫోన్‌ను ఢిల్లీ నుంచి రూ.28 వేలకు ప్రవీణ్ కొనుగోలు చేశాడు. దీనిద్వారా గెలుపొందే వ్యక్తిపై బెట్టింగ్ నిర్వహించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకునేవాడు. పోలీసులు ప్రవీణ్, ఇంటి యజమాని అజయ్‌తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. రూ. 38 వేల నగదును, ఐదు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ కేఎస్ రావు వెల్లడించారు.
టెక్నాలజీ పనితీరు ఇదీ..
ప్రవీణ్ కొనుగోలు చేసిన సెల్‌లోని డిజైన్డ్ కార్డ్ స్కానర్ ముందుగా పేకముక్కల్ని స్కాన్ చేస్తుంది. ఒక్కొక్కరికీ మూడు పేకముక్కల చొప్పున పంచే తీన్‌పత్తా ఆటలో ముందుగా సీక్వెల్ వచ్చిన వారు గెలుపొందుతారు. పంచిన పేకలు ఎవరెవరికి వెళ్లాయో సెన్సర్ల ద్వారా విశ్లేషించుకుని వరుస నంబర్లు (సీక్వెల్) ఎవరికి వచ్చిందన్న విషయాన్ని సంఖ్యల ద్వారా కొత్త టెక్నాలజీ చెప్పేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment