పేరుకు దసరా ఉత్సవాల బందోబస్తు విధులు
నలుగురు సీఐల ధ్యాసంతా లాడ్జీలో పేకాటపైనే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆ నలుగురు సీఐలది పేరుకు దసరా ఉత్సవాల బందోబస్తు విధులు.. కానీ వారి ధ్యాసంతా లాడ్జీలో పేకాటపైనే. దుర్గగుడిలో జరుగు తున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల బందోబస్తు విధులకు హాజరైన సీఐలు ఓ లాడ్జీలో హుషారుగా పేకాడుతున్న వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
విజయవాడ టూ టౌన్ సీఐ కొండలరావు, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్, సైబర్ క్రైం సీఐ పల్లెపు శ్రీను, అతని స్నేహితుడు, ఏలూరు రేంజి వీఆర్‌లో సీఐగా ఉన్న రఘు పేకాడుతూ వీడియోకు చిక్కారు. ఎవరైనా పేకాడుతుంటే అడ్డుకుని చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు, అమ్మవారి ఉత్సవాల బందోబస్తుకు వచ్చి పేకాటలో తమ ప్రవీణ్యాన్ని చాటుకోవటానికి తహ తహలాడారు. ఏయ్ ముక్కేయ్ అంటూ హూషారుగా వారు పేకాడుతున్న వీడియోను చూసి నెటిజన్లు సైతం నివ్వెరపోయారు.
ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీస్ ఉన్నతాధికారులు నలుగురు సీఐలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. వారు ఎప్పుడు, ఏ రోజు పేకాడారనే స్పష్టత లేదు. వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సైతం విచారణ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి విచారణాధికారిగా ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్నకుమార్‌ను నియమించారు.
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2024
Comments
Please login to add a commentAdd a comment