సాక్షి, విజయవాడ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో క్షురకుల ఆందోళన కొసాగుతోంది. క్షురుకులు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరింది. విజయవాడ దుర్గగుడిలో క్షురకులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో తలనీలాల సమర్పణ నిలిచిపోయింది. కనీస వేతనం 15వేల రూపాయలు ఇవ్వడంతో పాటు, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.
అలాగే పదవీ విరమణ చేసిన క్షురకులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాయీ బ్రాహ్మణ సంఘాలతో ప్రభుత్వం ఈరోజు సాయంత్రం చర్చలు జరుపనుంది. దేవాదాయశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయంలో ఈ చర్చలు జరుగనున్నాయి. ప్రభుత్వ చర్చల్లో సానుకూల ఫలితం వస్తే సమ్మె విరమిస్తామని .. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని క్షురకులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment