Nayi Brahmins
-
చరిత్రలో తొలిసారి నాయీ బ్రాహ్మణులకు టీటీడీ బోర్డులో చోటు
కడప కార్పొరేషన్: సీఎం వైఎస్ జగన్‌కి నాయీ బ్రాహ్మణులు ఆజన్మాంతం రుణపడి ఉంటారని ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు సిద్దవటం యానాదయ్య అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో స్థానిక హెడ్‌పోస్టాఫీసు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. యానాదయ్య మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా టీటీడీ పాలక మండలిలో నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
బాబు చీకటికి.. జగన్ వెలుగులకు ప్రతినిధి
సాక్షి, అమరావతి: చంద్రబాబు చీకటికి ప్రతినిధి అయితే సీఎం వైఎస్ జగన్ వెలుగులకు ప్రతినిధి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తొస్తారని.. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు వారిని అవహేళన చేశారని గుర్తుచేశారు. బాబుకు బీసీలంటే చిన్నచూపు అని, వారిని అణిచివేయడమే లక్ష్యంగా పనిచేస్తారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన నాయీబ్రాహ్మణ కృతజ్ఞతా సభలో సజ్జల మాట్లాడారు.. నాయీ బ్రాహ్మణులు కాలర్ ఎగరేసి బతికేలా సీఎం జగన్ చేశారు. అలాంటి నాయకుడికి నాయీ బ్రాహ్మణులు అండగా నిలవాలి. వారికి ఇప్పటికే ఆలయాల పాలక మండళ్లలో అవకాశం కల్పించారు. చట్ట సభల్లో కూడా అవకాశం దక్కుతుంది. త్వరలో ఎమ్మెల్సీ కూడా వస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీసీలే బాబును భూస్థాపితం చేస్తారు. బీసీలకు ఇప్పటికే అధికభాగం పదవులు ఇవ్వగలిగాం. సమాజంలో బీసీల ఆత్మగౌరవం పెరిగేందుకే ఇదంతా చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు బాబు హయాంలో అంతటా అవినీతి, అక్రమాలే. లోకేశ్‌కు ఏం పీకుతున్నారనే మాట తప్ప మరేదీ నేర్పలేదేమో? నోరు తెరిస్తే ఆ పీకుడు భాషే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు మీడియా బలం తప్ప మరేమీలేదు. ఇక వచ్చే ఎన్నికలలో వంచనతోనే చంద్రబాబు గెలవాలనుకుంటున్నారు. ఆయన పాలనలో సామాన్యులు బతకలేరు. ఈసారి చంద్రబాబును రాజకీయంగా అంతం చేయాలి. వైఎస్సార్సీపీ 175కి 175 సీట్లు విజయం సాధించడమే లక్ష్యంగా బీసీలు పనిచేయాలి. చెప్పింది చెప్పినట్లుగా.. : యానాదయ్య సభాధ్యక్షుడు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పాదయాత్రలో నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారన్నారు. జగనన్న చేదోడు ద్వారా రాష్ట్రంలోని వృత్తిదారులైన నాయీబ్రాహ్మణులకు ఇప్పటికీ మూడుసార్లు పదివేల చొప్పున అంటే రూ.30 వేలు వారి ఖాతాల్లో వేశారన్నారు. అలాగే, వృత్తిదారులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని గుర్తుచేశారు. అంతేకాక, వివిధ దేవాలయాలలో పనిచేసే నాయిబ్రాహ్మణులకు రూ.20 వేలు వేతనం అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. సీఎం జగన్‌కు ఎప్పటికీ అండగా నిలుస్తామని యానాదయ్య స్పష్టంచేశారు. బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలి.. మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. అసెంబ్లీలో, మండలిలో వారిని అడుగుపెట్టించేలా చేయగల సత్తా సీఎం జగన్‌కే ఉందన్నారు. ఆయన తన పాదయాత్ర ద్వారా 139 బీసీ కులాల వారితో మాట్లాడి ఆయా కులాల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని.. తన కేబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందిని మంత్రులుగా చేసి సామాజిక న్యాయాన్ని అమలుచేసిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. ఆయన తన మాటను ఎలా నెరవేర్చారో నాయీ బ్రాహ్మణులందరూ అదే రీతిలో వచ్చే ఎన్నికల్లో జగన్‌ని సీఎంని చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు అండగా నిలవాల్సిన బాధ్యత బీసీలందరిపై ఉందన్నారు. దివంగత నేత వైఎస్సార్, జ్యోతిరావు ఫూలే, ధన్వంతరీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సభలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఎ. నారాయణమూర్తి, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ సుబ్బారావు, ఆరెపాటి పెంటారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు కోటేశ్వరరావు (ఆంధ్ర), ఎం సుబ్బరాయుడు (రాయలసీమ) వెంపటాపు లోకరాజు (ఉత్తరాంధ్ర), రాష్ట్ర కోశాధికారి ఎస్. ధనవిజయుడు, గౌరవ సలహాదారులు కిందాడ సత్యన్నారాయణ దేవాలయాల జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, డైరెక్టర్ తొండమల్లు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ వృత్తిని మాకు మాత్రమే పరిమితం చేయాలి
సాక్షి, హైదరాబాద్: క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. బడా పారిశ్రామిక వేత్తలు, ఇతర కులాలు తమ వృత్తిలోకి ప్రవేశించి నాయీబ్రాహ్మణుల జీవనోపాధికి గండికొడుతున్నాయని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు యం. లింగం నాయీ ఆవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్ సహా పలు బడా సంస్థలు మోడ్రన్ సెలూన్స్ పేరుతో తమ పొట్ట కొడుతున్నాయని.. ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మోడ్రన్ సెలూన్స్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఆందోళనకు కేసీఆర్ అండగా నిలబడ్డారని.. ప్రత్యేక రాష్ట్రం రాగానే క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ జీవో ఇస్తానని మాటిచ్చినట్టు గుర్తు చేశారు. ఇతర కులవృత్తులను కాపాడటానికి జీవోలు ఇచ్చినట్టుగానే తమకు కూడా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థించారు. నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య ద్వారా క్షౌరవృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించాలని పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కాగా, రిలయన్స్ సెలూన్స్ వ్యాపారంలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయీబ్రాహ్మణులు ఆందోళనలకు దిగుతున్నారు. -
నాడు అవమానం.. నేడు అందలం
తిరుపతి తుడా: గతంలో చంద్రబాబు తీరుతో నాయిబ్రాహ్మణులు తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారని నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ సిద్దవటం యానాదయ్య చెప్పారు. అవమానాలన్నీ దిగమింగి జగనన్నను సీఎంగా గెలిపించుకోవడంతో ఇప్పుడు గౌరవ ప్రదమైన స్థానంలో నిలిపారని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా సుందరయ్యనగర్‌లో బుధవారం నాయిబ్రాహ్మణులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని తీర్మానించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించారు. అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ నేత చిమటా రమేష్, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తొండమల్ల పుల్లయ్య, కుల సంఘాల నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యానాదయ్య మాట్లాడుతూ తిరుమలలో పీస్ రేట్‌పై పనిచేసే 241 క్షురకులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించారని, జగనన్న తోడు పథకం ద్వారా క్షురకులకు రూ.10 వేల చొప్పున రూ.58 కోట్లు, దేవాలయాల్లో పనిచేసే మంగళ వాయిద్యకారులకు గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచిన విషయాన్ని ప్రస్థావించారు. నాయిబ్రాహ్మణుల రాజకీయ ఎదుగుదలకు ఇప్పుడే అడుగులు పడ్డాయని.. భవిష్యత్తులో నాయిబ్రాహ్మణులకు మరింత ప్రాధాన్యం పెరగాలంటే జగనన్న వెంట నడవాలని యానాదయ్య పిలుపునిచ్చారు. నాయిబ్రాహ్మణులంతా మూకుమ్మడిగా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేస్తున్నట్టు ఈ సందర్భంగా వారు మీడియాతో చెప్పారు. -
3న క్షౌరశాలలు మూసివేత
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాలలో కార్పొరేట్ బ్యూటీ సెలూన్ ఏర్పాటును నిరసిస్తూ క్షౌరవృత్తిదారులు చేపట్టిన నిరసనలు తీవ్రతరం చేస్తామని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రకటించింది. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటుకానున్న కార్పొరేట్ బ్యూటీ సెలూన్‌ను వ్యతిరేకిస్తూ జనవరి 21 నుంచి క్షౌరవృత్తిదారులు దుకాణాలు మూసివేసి రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం శోచనీయమని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ అన్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ అత్యవసరంగా సమావేశమైందని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3న (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా క్షౌరశాలలు మూసివేసి నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులు తమ పొట్టగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ క్షౌరవృత్తిదారులు నిద్రాహారాలు మాని పది రోజులుగా నిరసనలు చేస్తున్నా పాలక యంత్రాంగం నుంచి కనీస స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. ఫిబ్రవరి 3న జరగనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్షౌరవృత్తిదారులకు ఆయన పిలుపునిచ్చారు. -
తొలివైద్యుల చరిత్ర
అనేక కులవృత్తులు ఉన్నాయి. వాటన్నింటికీ వాటి వాటి చరిత్రలూ ఉన్నాయి. అణగారిన కొన్ని కులాల వృత్తుల చరిత్రలు చాలావరకు మరుగునపడ్డాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి వాటిని వెలికితీసే ప్రయత్నం అంత తేలికేమీ కాదు. ‘తొలి వైద్యులు’ పుస్తకం ద్వారా అలాంటి ప్రయత్నమే చేశారు రచయిత అన్నవరపు బ్రహ్మయ్య. అంతేకాదు, తన ప్రయత్నంలో కృతకృత్యులయ్యారు కూడా. క్షురక వృత్తికి సంబంధించిన ప్రాచీన మూలలను పరిశోధించి, చక్కని పుస్తకాన్ని అందించిన రచయితకు అభినందనలు. భారత భూభాగాన్ని ఏలిన తొలి చక్రవర్తి మహాపద్మనందుడు మంగలి కులస్తుడు. భారతదేశంలోనే కాదు, మిగిలిన ప్రపంచ దేశాల్లోనూ ఎక్కడైనా తొలినాటి వైద్యులు క్షురక వృత్తి చేసేవారే. శరీర శుభ్రతకు దోహదపడేలా వెంట్రుకలు కత్తిరించడమే కాదు, వ్రణాలు, గాయాల వల్ల పాడైపోయిన అవయవాలను తొలగించే తొలి శస్త్రచికిత్సకులు క్షురకులే! మంగళవాద్యాలను వాయించే క్షురకులకు సంగీతంతో గల చిరకాల అనుబంధాన్ని కూడా ఈ పుస్తకంలో చారిత్రక ఆధారాలతో సహా ప్రస్తావించడం విశేషం. క్షురక సామాజిక వర్గం నుంచి ఎదిగి వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారి సంక్షిప్త పరిచయ వ్యాసాలు ఈ పుస్తకానికి నిండుదనాన్ని ఇచ్చాయి. ఒకనాడు దేశాన్ని ఏలిన కులానికి చెందిన వారు, ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచిన కులానికి చెందినవారు కాలక్రమంలో వెనుకబాటుకు లోనైన క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే! కుల వివక్ష వేళ్లూనుకున్న మన దేశంలో అణగారిన కులాలకు సంబంధించిన చారిత్రక విశేషాలను వెలుగులోకి తెచ్చే ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - దాసు తొలివైద్యులు రచయిత: అన్నవరపు బ్రహ్మయ్య ప్రచురణ: తెలుగు తోరణం ప్రచురణ, విజయవాడ ధర: రూ.180 ప్రతులకు: రచయిత, ఇంటినం: 15–103/3డి, గొల్లపూడి డైమండ్ అపార్ట్మెంట్, గొల్లపూడి, విజయవాడ మొబైల్: 94403 20886, 89198 23256 -
‘లింగం నాయీకి ఎమ్మెల్సీ ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రతినిధులు గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఆధ్వర్యంలో కవిత నివాసానికి వెళ్లి ఆమెను కలిశారు. నాయీ బ్రాహ్మణులకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. తమ సామాజిక వర్గం స్థితిగతులపై సంపూర్ణ అవగాహనతో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారని, ఇప్పటివరకు నాయీ బ్రాహ్మణులు రాష్ట్ర చట్టసభలో అడుగుపెట్టలేదని గుర్తు చేశారు. తమకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా లింగం నాయీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక తరపున కవితను ఈ సందర్భంగా అభ్యర్థించారు. మూడు దశాబ్దాల నుంచి నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి లింగం నాయీ పాటుపడుతున్నారని తెలిపారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కూడా ఆయన తన వంతు కృషి చేశారని వెల్లడించారు. కవితను కలిసిన వారిలో ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు గోవింద్భక్ష మహేష్ చంద్ర, కోశాధికారి రమేశ్, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు ఉన్నారు. అంతకుముందు మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డితో పాటు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌లను వీరు కలిశారు. లింగం నాయీ పేరును సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్సీగా నామినేట్ చేసేలా చూడాలని కోరారు. -
‘సీఎం ఆదేశాలను పక్కదారి పట్టిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను విద్యుత్ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఆరోపించారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న క్షౌరశాలలకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వగా... అవగాహనలేమితో అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇతర కులాలు, మతాల వారు నడుపుతున్న క్షౌరశాలలు, బ్యూటీపార్లర్లను కూడా ఈ పథకం కింద నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా.. నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు అందలేదని జవాబిచ్చారని తెలిపారు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే క్షౌరవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న క్షురకులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే ఉచిత విద్యుత్ పథకంలో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని లింగం నాయీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
‘గ్రేటర్’ ఎన్నికల్లో 10 శాతం సీట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: పాలకులు తమను పట్టించుకోవడం లేదని నాయీ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకపోవడంతో తమ గళం వినిపించే అవకాశం లేకుండాపోయిందని వాపోయారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభ్రదుల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లుగాల్ల గురప్ప ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుబడిన నాయీ బ్రాహ్మణులు ఆత్మగౌరవం రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురప్పను గెలిపించుకోవాలని బహుజనులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లాక్డౌన్లో క్షౌరశాలలు మూతపడటంతో వృత్తిదారులు చాలా కష్టాలు పడ్డారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని తెలిపారు. తెలంగాణ సర్కారు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణులకు 10 శాతం సీట్లు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు, ప్రధాన కార్యదర్శ ఎం. సుబ్బారాయుడు, సీఎల్ఎన్ గాంధీ, రామానంద స్వామి, సీనియర్ కార్టూనిస్ట్ నారూ, డాక్టర్ రాపోలు సుదర్శన్, బాలరాజు, ఎం రమేశ్, ఎ. సుధాకర్, ధన్‌రాజ్, కె. యాదగిరి, కె. ఈశ్వర్, జె. మనోహర్ తదితరులు పాల్గొన్నారు. (జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల) -
గోపి కుటుంబానికి ఆపన్నహస్తం
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సెలూన్ నిర్వాహకుడి కుటుంబానికి నాయీ బ్రాహ్మణులు ఆపన్నహస్తం అందించారు. లాలాపేటకు చెందిన పయ్యావుల గోపి.. సీతాఫల్మండిలో సెలూన్ నిర్వహించేవాడు. కరోనా కారణంగా గిరాకీ లేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక, దుకాణం కిరాయి చెల్లించలేక గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబం దిక్కులేనిదయింది. గోపి కుటుంబానికి వరంగల్ సెలూన్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. మంగళవారం లాలాపేటలో పయ్యావుల గోపి కుటుంబ సభ్యులను కలిసి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని స్వయంగా అందజేశారు. అన్నివేళలా అండగా ఉంటామని వారికి భరోసాయిచ్చారు. గోపి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వరంగల్ సెలూన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగవెల్లి సురేశ్, బీజేపీ నాయకుడు సూర్యపల్లి శ్రీనివాస్, సింగారపు శ్యామ్, శ్రీరాములు, మహేష్, జంపాల రమేశ్, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘జగనన్న చేదోడు’కు జావెద్ హబీబ్ బిగ్ థ్యాంక్స్
ముంబై : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ ప్రశంసల వర్షం కురిపించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థిక సాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించడంపై జావెద్ హబీబ్ స్పందించారు.('పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు') ‘కరోనా ప్రపంచం మొత్తాన్ని మార్చివేసింది. ఫ్రొఫెషన్లను కూడా మార్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పథకం పేరే జగనన్న చేదోడు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు అండగా నిలవడానికి తీసుకొచ్చిన పథకం ఇది. ఒకేసారి వీరికి రూ.10 వేల సాయం అందనుంది. దేశంలోనే ఇలాంటి పథకం తీసుకువచ్చిన మొదటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి’ బిగ్ థ్యాంక్స్ అంటూ ‘జగనన్న చేదోడు’ పథకంపై జావెద్ హబీబ్ ప్రశంసలు ఝల్లు కురిపించారు. మరోవైపు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి జగనన్న చేదోడు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సెలబ్రిటీ స్టైలీస్ట్ హర్మన్ కౌర్ అన్నారు. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు) కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేసి జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. (‘జగనన్న చేదోడు’ ప్రారంభం) తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. -
'పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు'
సాక్షి, తాడేపల్లి: రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం 'జగనన్న చేదోడు' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం రోజున సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున నగదును జమచేశారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం చూపిన చొరవకు లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కోటిపల్లి రామతులసి మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబం సీఎం జగన్‌కు రుణపడి ఉంటుంది. నవరత్నాలు పేదల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా పెన్షన్లు ఇస్తున్నారు. ఇంక్రిమెంట్ పెరిగినట్టుగా పెన్షన్ పెంచుతున్నారు, అవ్వతాతలు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు. నేనున్నానని చెప్పిన విధంగానే మాకు మీకు సాయపడుతున్నారు. కరోనా సమయంలో బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేకపోవడంతో మీరు అందించిన సాయం ఎంతగానే అక్కరకొచ్చింది. రాబోయే తరంలోనూ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి' అంటూ రామతులశమ్మ ఉద్వేగానికి లోనైంది. చదవండి: ‘జగనన్న చేదోడు’ ప్రారంభం వాలంటీర్ల వ్యవస్థ అద్భుతం చిన్న పిల్లలకు ఓటు హక్కు ఉండదని ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోవు. అమ్మఒడి పథకం ద్వారా మా పిల్లలకు చేయూత ఇచ్చారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పేదలకు ఏ పథకం రావాలో వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చెప్తున్నారు. మా గురించి ఇంతగా ఆలోచించిన పాలకులు ఎవరూ లేరు. ఐదేళ్లలో చేయాల్సిన పనులను ఏడాదిలోనే చేసి చూపించారు. -ఎం. హేమావతి(రజకురాలు), అనంతపురం నాయీ బ్రాహ్మణులు మీకు రుణపడి ఉన్నారు వాలంటీర్ నేరుగా మా షాప్‌కు వచ్చి లబ్ధిదారుడిగా ఎంపిక చేశారు. 30 ఏళ్లుగా నేను ఇలాంటి స్కీమ్ చూడలేదు. లబ్ధిదారుల్లో నా పేరు ఉండటం సంతోషాన్ని కలిగించింది. నాయీ బ్రాహ్మణులు మీకు రుణపడి ఉన్నారు. మీ నాన్న దయగారి వల్ల నాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడు మీ దయతో నా మేనల్లుడికి స్థలం వచ్చింది. తరతరాలకు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి. - పైడియ్య (నాయీ బ్రాహ్మణుడు) - శ్రీకాకుళం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారు జగనన్న చోదోడుతో కరోనా సమయంలో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. మరో 50 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలి. గ్రామ సచివాలయాలు నిర్మించి ఎంతో మంచిపని చేశారు. గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసిన నాయకుడు వైఎస్ జగన్. మీరు ధన్యులు సార్, మా గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారు. -రామకోటేశ్వరరావు (దర్జీ) - పశ్చిమ గోదావరి -
మరో పథకానికి శ్రీకారం
-
చెప్పిన ప్రతి మాటను నెరవేర్చగలిగాను
-
‘జగనన్న చేదోడు’ ప్రారంభం
సాక్షి, అమరావతి: పేదల అభ్యున్నతి కోసం వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న చేదోడు పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. 3.58 కోట్ల మంది పేదలకు సంక్షేమ పథకాలు అందించామని వెల్లడించారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ, సున్నా వడ్డీ వంటి ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చగలిగానని సీఎం జగన్ అన్నారు. (ప్రత్యేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్) -
అర్హులందరికీ రూ.10వేలు సాయం
-
నేడు జగనన్న చేదోడు
సాక్షి, అమరావతి: ‘షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, లాండ్రీ షాపు ఉన్న రజకులకు, టైలరింగ్ షాపులున్న దర్జీలకు ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తాం.. వారికి తోడుగా ఉంటాం’.. ఇది వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని అంశం. ఈ హామీని అమలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. ఈ వర్గాలను ఇంత వరకూ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని తొలిసారి ఆలోచన చేసి, పార్టీ మేనిఫెస్టోలో వారికి స్థానం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ► ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌ను నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. మన ప్రభుత్వం వచ్చాక మీ కష్టాలు తీరుస్తానని నాడు వారికి భరోసా ఇచ్చారు. ► అధికారంలోకొచ్చి ఏడాది కాగానే వారికి ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ► ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశారు. ఆయా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. ► రాజకీయాలు, పార్టీలకతీతంగా అర్హులైన నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. మొత్తం 2,47,040 మంది అర్హులగా తేలారు. వీరిలో టైలర్లు 1,25,926 మంది, రజకులు 82,347 మంది, నాయీ బ్రాహ్మణులు 38,767 మంది ఉన్నారు. వీరందరికీ జగనన్న చేదోడు పథకం కింద మొత్తం రూ.247.04 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేయనున్నారు. -
మా అనుమతి లేకుండా సెలూన్ పెడతవా..
శంషాబాద్: తమ అనుమతి లేకుండా సెలూన్ షాపు ఎలా పెడతావని ఓ వ్యక్తిపై నాయీబ్రాహ్మణ సంఘం నేథ దాడి చేశాడు. ఈ సంఘటన శంషాబాద్ పట్టణంలో బుధవారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. దూసకంటి జానకీరాం, రమాదేవి దంపతులు పట్టణంలోని వీకర్‌సెక్షన్ కాలనీలో కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. జీవనోపాధి నిమిత్తం జానకీరాం పురపాలక సంఘం అనుమతి తీసుకొని వెళాంగనీ కాలనీ వద్ద సెలూన్ షాప్ పెట్టుకోడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ విషయమై స్థానిక నాయిబ్రాహ్మణ సంఘం నేతలు కొద్దిరోజులుగా అతడిని అడ్డుకుంటున్నారు. జానకీరాం స్థానికుడు కాదని, స్థానికులు మాత్రమే దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా బుధవారం జానకీరాం ఏర్పాటు చేసుకుంటున్న దుకాణం వద్దకు వచ్చిన పట్టణ నాయిబ్రాహ్మణ సంఘం నాయకుడు పాండు అతడిపై దాడికి పాల్పడ్డాడు. అతడి భార్య రమాదేవి వేడుకున్నా వదిలిపెట్టకుండా జానకీరాంపై పిడిగుద్దులు కురిపించాడు. దుకాణం వెంటనే తీసేయాలని హెచ్చరించాడు. ఈ విషయమై బాధిత దంపతులు ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. శంషాబాద్‌లో పుట్టి పెరిగిన తమను స్థానికులు కాదని దౌర్జన్యానికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొన్నిరోజులుగా నాయీబ్రాహ్మణ సంఘం నేతలు బెదిరిస్తున్నారని ఆర్జీఐఏ పోలీసులతో పాటు మున్సిపల్ కార్యాలయంలో పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని బాధిత దంపతులు పోలీస్‌స్టేషన్ వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
నాయీ బ్రాహ్మణులను ఆదుకుంటాం: వినోద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు వినోద్‌ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో హెయిర్ సెలూన్లతో పాటు తమ వృత్తికి జరిగిన నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని, విద్యుత్ రాయితీ ఇవ్వడంతో పాటు పనిముట్లను ఉచితంగా అందించాలని కోరారు. నాయీ బ్రాహ్మణుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన వినోద్.. దశల వారీగా వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన్ను కలిసిన వారిలో నాయీ బ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మోహన్, గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి జితేందర్ తదితరులున్నారు. -
రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మిర్దొడ్డి మండలం ఖాజీపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన క్షౌరవృత్తిదారుడు రవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అతడి కుటుంబానికి రూ. 20 లక్షలు పరిహారం అందించాలని కోరింది. క్షౌరవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రవి లాక్‌డౌన్‌తో ఉపాధిలేక, ఆర్థిక ఇబ్బందులతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమని ఐక్యవేదిక అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ అన్నారు. అతడి ఇద్దరు కూతుళ్లు కావ్య(13), వైష్ణవి(10)లను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. క్షౌరవృత్తిదారులు మనోధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న క్షౌరవృత్తిదారులను ఆదుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతి క్షురకునికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా మూతపడిన సెలూన్లకు మూడు నెలల పాటు కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయాలని లింగం నాయీ డిమాండ్ చేశారు. రవి కుటుంబానికి అండగా నిలబడాలని జిల్లా నాయీ బ్రాహ్మణ నాయకులను ఆదేశించారు. -
కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయండి..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న క్షురకులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నెలన్నర రోజులుగా క్షౌరశాలలను మూసివేయడంతో వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఒక ప్రకటనలో తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. క్షౌర వృత్తిదారులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు రూ. 5 వేలు చొప్పున సహాయం అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న రెడ్జోన్లలో 35 వేలకు పైగా క్షౌరశాలలు ఇప్పటికీ మూతపడివున్నాయని వెల్లడించారు. వీటిపై ఆధారపడి జీవిస్తున్న వృత్తిదారుల జీవనం దుర్భరంగా మారిందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి క్షౌర వృత్తిదారులకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవస్థానాల్లోని కల్యాణ్ కట్టలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కూడా ఇదే విధంగా తోడ్పాటు అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సెలూన్లకు మూడు నెలల పాటు కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయాలని లింగం నాయీ డిమాండ్ చేశారు. -
కులవృత్తులపై కరోనా ఎఫెక్ట్
-
బతుకు చిత్రం మారుతోంది!
సాక్షి, అమరావతి: ‘ఇల వృత్తులెన్ని ఉన్నా.. కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా’ అని నమ్మి.. వృత్తులపైనే ఆధారపడిన జీవిస్తున్న వారి బతుకు చిత్రాలను కరోనా వైరస్ మార్చేసింది. వృత్తిదారుల వెతలను వెనుకటి కాలానికి తీసుకెళ్లింది. దాదాపు 30 ఏళ్ల క్రితం నాయీ బ్రాహ్మణులు ప్రజల ఇళ్లకే వెళ్లి వృత్తి నిర్వహించేవారు. ప్రస్తుతం పూట గడుపుకోవటానికి పాత పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ► మూడు దశాబ్దాల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాలు, చిన్నపాటి పట్టణాల్లో నాయీ బ్రాహ్మణులు పొది (కత్తెరలు, కత్తులు, దువ్వెన, చిన్న గిన్నె వంటివి) తీసుకుని ఇంటింటికీ తిరిగి కేశ సంస్కారం చేసేవారు. ► అప్పట్లో పంటలు వచ్చే సమయంలో ఏడాదికి రెండుసార్లు బస్తాల లెక్కన ధాన్యం, కొంత నగదు, బియ్యం ఇచ్చేవారు. ఈ విధానాన్ని ‘వతను’ అనేవారు. ► రానురాను ఫ్యాషన్ ప్రపంచంతో పోటీపడుతూ పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లోనూ అద్దాల క్యాబిన్లు, ఈజీ చైర్లు వంటి సౌకర్యాలతో సెలూన్లు అందుబాటులోకి వచ్చాయి. ► కరోన దెబ్బతో సెలూన్లన్నీ మూతపడ్డాయి. దీంతో వాటిలో పనిచేసే వారు ఉపాధి కోల్పోయారు. పూట గడవని దయనీయ స్థితిలో వారంతా పాత పద్ధతిని అనుసరిస్తూ ఇంటింటికీ వెళ్లి క్షౌ ర వృత్తి చేస్తూ ఉపాధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ► లాక్డౌన్ ఆంక్షలను సడలించే వేళ ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య మొహానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించి.. శానిటైజర్లు వినియోగిస్తూ కేశ సంస్కారం చేస్తున్నారు. ► ఒకవేళ ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే వినియోగదారులే వారిని అప్రమత్తం చేయడం.. వినియోగదారులు అలక్ష్యంగా ఉంటే వృత్తిదారులు చైతన్యంతో వ్యవహరిస్తున్నారు. ► రాష్ట్రంలో సుమారు 5 లక్షల నాయీ బ్రాహ్మణ కుటుంబాలు కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఒక అంచనా. ప్రస్తుతం వారికి ఉపాధి దొరకడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న సాయంపైనే ఆధారపడి బతుకుల్ని నెట్టుకొస్తున్నారు. వృత్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం కరోనా కారణంగా వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. ఈ రోజుల్లోనే నాలుగు డబ్బులు కనిపించేవి. ఇప్పుడు పూట గడవని పరిస్థితుల్లో నాయీ బ్రాహ్మణులు పాత పద్ధతిలోనే ఇంటింటికీ వెళ్లి వృత్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. – పొన్నాడ సూర్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ నంద యువసేన -
కరోనా: నాయీ బ్రాహ్మణుల్ని ఆదుకుంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులకు వైద్యం అం దించే స్వచ్ఛంద సంస్థల వివరాలు అందజేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. కరోనా కారణంగా దీర్ఘకాలంగా అనారోగ్య స మస్యలతో బాధపడే వారికి చికిత్స చేయించేం దుకు బాధితులతోపాటు వారి సహాయకులు ఆస్పత్రులకు వెళ్లేందుకు పాస్‌లు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది కె.శివగణేశ్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. బాధితులకు ప్రభుత్వం వలంటీర్లను ఏర్పాటుచేయాలని కోరడం సబబుకాదని, వారికి సేవలందించే స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆసక్తి చూపే వారిని పిటిషనరే గుర్తించి తమకు నివేదించాలని ధర్మాసనం సూచించింది. విచారణను ఈ నెల 22కి వాయిదా వేస్తున్నట్లు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ధర్మాసనం ఉత్తర్వు లు జారీ చేసింది. కరోనాకు సంబంధించి ఇత ర వ్యాజ్యాల్లో ప్రభుత్వం ఈ నెల 22 నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నాయీ బ్రాహ్మణుల్ని ఆదుకుంటున్నారా? లాక్‌డౌన్‌తో క్షౌరశాలలు మూతపడటంతో నా యీ బ్రాహ్మణులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటున్నదీ వివరించాలని ప్రభుత్వాన్ని హైకో ర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ధర్మాసనం ఉత్తర్వు లు జారీ చేసింది. రేషన్ కార్డులు లేని వారిని, ఇతర రాష్ట్రాల వారికి, వలస కార్మికులకు ప్ర భుత్వం మనిషికి 12 కిలోల బియ్యాన్ని ఉచి తంగా పంపిణీ చేసిందని, రూ.1,500 నగదు కూడా ఇచ్చిందని, అలాగే తమకూ ఇచ్చేలా ప్ర భుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ నా యీ బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షుడు బి.ధనరాజ్ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటోగా స్వీకరించి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ 22కి వాయిదా పడింది. -
నాయి బ్రాహ్మణులకు రూ.10వేలు అడ్వాన్స్
సాక్షి, విజయవాడ : దేవాలయాలలో పనిచేసే క్షురకులు(నాయి బ్రాహ్మణులకు) రూ. 10వేలు అడ్వాన్స్‌గా ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరోనా తీవ్రత దృష్యా దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దేవాలయాలలో భక్తులకు శిరోముండనం చేస్తూ జీవనం సాగిస్తున్న క్షురకులు ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రముఖ దేవాలయాలలో పని చేస్తున్న 517 మంది, 80 చిన్న దేవాలయాలలో 451 మంది కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 968 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికి ఉపాధి లేని కారణంగా కేశఖండన శాల జేఏసీ ఆర్ధికంగా ఆదుకోవాలని అభ్యర్థన చేశారు. వీరి అభ్యర్థన మేరకు క్షురకుడు ఏ దేవాలయంలో పనిచేస్తాడో ఆ దేవాలయం నుంచి ప్రభుత్వం రూ. 10వేలు అడ్వాన్సుగా చెల్లింస్తుంది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ మొత్తాన్ని నెలవారీ సులభ వాయిదాల్లో సంబంధిత దేవాలయానికి జమ చేయడం జరుగుతుందన్నారు. దీని వలన రాష్ట్రంలోని 968 మంది క్షురకులు లబ్ధి పొందగలుగుతారని వెల్లంపల్లి తెలిపారు. (లాక్డౌన్.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు) ('పచ్చడి మెతుకులు తిని అయినా బతుకుదాం')