10న నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక | Nayee Brahmin Vivaha Parichaya Vedika at Hyderabad | Sakshi
Sakshi News home page

10న నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక

Published Fri, Nov 8 2019 8:28 AM | Last Updated on Fri, Nov 8 2019 8:28 AM

Nayee Brahmin Vivaha Parichaya Vedika at Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాయి బ్రాహ్మణ యువతీ యువకుల వివాహ సంబంధాల కోసం పరిచయ కార్యాక్రమం ఈనెల 10న జరగనుంది. ఆదివారం దిల్‌షుక్‌నగర్‌ కొత్తపేటలోని బాబు జగ్జీవన్‌రామ్ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహేష్ చంద్ర నాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిచయ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న నాయి బ్రాహ్మణలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పునర్వివివాహ సంబంధాల కోసం చూస్తున్న వితంతువులు, డైవోర్సిలు కూడా తమకు నచ్చిన భాగస్వామిని ఈ వివాహ పరిచయ కార్యక్రమం ద్వారా వెతుక్కునే అవకాశముందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 9849566988, 9391357109 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement