
చంద్రబాబు నాయుడు (పాత ఫొటో)
సాక్షి, అమరావతి : నాయి బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంపై నాయి బ్రాహ్మణుల సంఘ అధ్యక్షుడు యానాదయ్య మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ, యానాంలలో నాయి బ్రహ్మణుల షాపులకు వచ్చిన ప్రతి ఒక్కరికీ చంద్రబాబు వైఖరిపై ప్రచారం చేస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు లోన్లు రావు, ఆదరణ పథకంలో పేర్లు తొలగిస్తామని నాయి బ్రాహ్మణ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. నాయి బ్రహ్మణులను అవమానించి, తిరిగి వారిని బెదిరిస్తున్న చంద్రబాబుకు నాయి బ్రహ్మణుల సత్తా చూపిస్తామని యానాదయ్య హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయి బ్రాహ్మణులకు సిగ్గుంటే చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలని అన్నారు. లేకపోతే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశంలో వున్న నాయి బ్రాహ్మణులందరూ రాజీనామాలు చేసి ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment