
నాయీ బ్రాహ్మణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు (ఫైల్‌ఫోటో)
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయీ బ్రాహ్మణుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంపై బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. శుక్రవారం దాసరి భవనంలో నాయిబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు యానాదయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా బీసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ విషయాన్ని మరిచి బీసీల పట్ల అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం హోదా వ్యక్తి బీసీ కులాలను కించపరిచేలా వ్యవహరించడం సబబు కాదన్నారు. నాయీ బ్రాహ్మణులపై అనుచితంగా ప్రవర్తించినందుకు చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. పార్థసారధి, జంగా కృష్ణమూర్తి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ( వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), దోనెపూడి శంకర్(సీపీఐ), కుమారస్వామి, బాజీ(బీజేపీ), పలువురు బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment