‘చంద్రబాబు అందుకే యూటర్న్’ | Chandrababu Takes You Turn On Special Status Says Pardhasaradhi | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు అందుకే యూటర్న్’

Published Thu, Jun 21 2018 8:41 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

Chandrababu Takes You Turn On Special Status Says Pardhasaradhi - Sakshi

పార్థసారధి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, అమరావతి: తమకు పదవుల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్సార్‌సీపీ నేత పార్థసారధి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమమవుతుందని, హోదా కోసం తమ పార్టీ మొదటి నుంచి పోరాడుతోందని అన్నారు.  హోదాని చంద్రబాబు నాయుడు అవహేళన చేశారని ప్రత్యేక హోదా రాకపోవడానికి ఏపీ సీఎం ముఖ్యకారణమంటూ విమర్శించారు. హోదాపై వైఎస్సార్‌సీపీ పోరాటాన్ని చూసి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని, మొదటి నుంచి ప్రత్యేక హోదాకు బాబు వ్యతిరేకమని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని పార్థసారధి పేర్కొన్నారు. ఏప్రిల్‌ 6న వైఎస్సార్‌సీపీ నేతలు తమ ఎంపీ పదవులకు చేసిన రాజీనామాలు నేడు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement