సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సెలూన్ నిర్వాహకుడి కుటుంబానికి నాయీ బ్రాహ్మణులు ఆపన్నహస్తం అందించారు. లాలాపేటకు చెందిన పయ్యావుల గోపి.. సీతాఫల్‌మండిలో సెలూన్ నిర్వహించేవాడు. కరోనా కారణంగా గిరాకీ లేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక, దుకాణం కిరాయి చెల్లించలేక గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబం దిక్కులేనిదయింది.
గోపి కుటుంబానికి వరంగల్ సెలూన్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. మంగళవారం లాలాపేటలో పయ్యావుల గోపి కుటుంబ సభ్యులను కలిసి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని స్వయంగా అందజేశారు. అన్నివేళలా అండగా ఉంటామని వారికి భరోసాయిచ్చారు. గోపి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వరంగల్ సెలూన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగవెల్లి సురేశ్, బీజేపీ నాయకుడు సూర్యపల్లి శ్రీనివాస్, సింగారపు శ్యామ్, శ్రీరాములు, మహేష్, జంపాల రమేశ్, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment