lalapeta
-
అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు
లాలాపేట (హైదరాబాద్): హైదరాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం తార్నాక డివిజన్ లాలాపేటలోని బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులంతా పలు సమ స్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు కిషన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడు తూ... హైదరాబాద్ నగరంలోని బస్తీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ మొత్తం సింగపూర్, డల్లాస్ అయినట్లు బీఆర్ఎస్ నేతలు మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, బంధులు వంటి పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నాలుగు రైల్వే స్టేషన్ల నిర్మాణం చేపట్టిందన్నారు. చర్లపల్లిలో మరో టెర్మినల్ నిర్మాణంలో ఉందన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తు న్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ట్రిపుల్ ఆర్ రోడ్డును రూ.26 కోట్లతో మంజూరు చేశామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా దగ్గర రూ.450 కోట్లతో నేషనల్ సైన్స్ సిటీని మంజూరు చేశామని కానీ దాని కోసం 25 ఎకరాల స్థలం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీ కార్యాలయాలకు తప్ప ఇప్పటివరకు సైన్స్ సిటీకి స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి బీజేపీ నేతలు బండ చంద్రారెడ్డి, రాము వర్మ పాల్గొన్నారు. -
గోపి కుటుంబానికి ఆపన్నహస్తం
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సెలూన్ నిర్వాహకుడి కుటుంబానికి నాయీ బ్రాహ్మణులు ఆపన్నహస్తం అందించారు. లాలాపేటకు చెందిన పయ్యావుల గోపి.. సీతాఫల్మండిలో సెలూన్ నిర్వహించేవాడు. కరోనా కారణంగా గిరాకీ లేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక, దుకాణం కిరాయి చెల్లించలేక గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబం దిక్కులేనిదయింది. గోపి కుటుంబానికి వరంగల్ సెలూన్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. మంగళవారం లాలాపేటలో పయ్యావుల గోపి కుటుంబ సభ్యులను కలిసి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని స్వయంగా అందజేశారు. అన్నివేళలా అండగా ఉంటామని వారికి భరోసాయిచ్చారు. గోపి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వరంగల్ సెలూన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగవెల్లి సురేశ్, బీజేపీ నాయకుడు సూర్యపల్లి శ్రీనివాస్, సింగారపు శ్యామ్, శ్రీరాములు, మహేష్, జంపాల రమేశ్, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తాగి.. తూలి.. ప్రాణాలు విడిచాడు..!
-
ప్రతి జిల్లాలోనూ ఆయూష్ ఆస్పత్రులు
లాలాపేట: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 20 పడకల ఆయూష్ హాస్పిటల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ఆయూష్ వైద్యాధికారుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయూష్ వైద్య సేవలపై ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయి నుంచే ఆయూష్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. గతంలో అల్లోపతి, హోమియోపతి, ఆయూష్ వేర్వేరు విభాగాలుగా ఉన్నందున నిరాదరణకు గురయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇందులో భాగంగా అన్ని రకాలైన వైద్య సేవలను ఒకే గొడుగు కిందికు తెస్తున్నామన్నారు. ప్రస్తుత ఆయూష్ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు నూతనంగా నిర్మించే హాస్పిటల్లలో ఆయూష్‌కు ప్రత్యేక స్థలం కేటాయించేలా, ఆహ్లదకరమైన వాతావరణం నెలకొల్పేలా వైద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తామన్నారు. అనంతగిరిలో ఆయూష్ హాస్పిటల్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయూష్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి, కమిషనర్ బుద్ధప్రకాష్, డాక్టర్ రమణి, లలితకుమారి, డా. కరుణాకర్‌రెడ్డి, నీరజారెడ్డి, మనోహర్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా కండక్టర్ ఆత్మహత్య
గుంటూరు ఈస్ట్ : నమ్మించి మోసగించడమే కాకుండా వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్తాపం చెందని ఓ మహిళా కండెక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో వినయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలు మండలం శేకూరుకు చెందిన జొన్న శివమ్మ కుమార్తె వెంకటేశ్వరమ్మకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. తీవ్ర అనారోగ్యంతో ఉండి, ఆ విషయం చెప్పలేదని తెలిసి పెళ్లయిన మూడు నెలలకే ఆమె భర్త నుంచి విడిపోయి కొంతకాలానికి విడాకులు తీసుకుంది. తెనాలి ఆర్టీసీ డిపోలో ఐదేళ్లుగా కండక్టర్ ఉద్యోగం చేస్తున్న ఆమె తన తల్లితో కలిసి ఐతానగర్లో అద్దెఇంట్లో నివాసం ఉంటోంది. అదేప్రాంతానికి చెందిన పెయింటర్ సీహెచ్ రవి తనకు వివాహం కాలేదని నమ్మించి వెంకటేశ్వరమ్మతో సంవత్సరం నుంచి స్నేహం చేసుకున్నాడు. మూడు నెలల క్రితం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తీసుకువెళ్లాడు. ఈ విషయం తెలిసి రవి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్దల సమక్షంలో రవి, వెంకటేశ్వరమ్మ విడిపోయేవిధంగా తీర్మానం చేశారు. అయినా నెలరోజులుగా ఆమె వెంటపడుతూ తామిద్దరూ స్నేహంగా ఉన్నప్పడు తీసిన ఫొటోలను అందరికీ చూపిస్తానని బెదిరించసాగాడు. ఈ విషయమై బాధితురాలు తెనాలి రెండోపట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. 15 రోజుల క్రితం తన నివాసాన్ని లాలాపేట సిద్ధాబత్తుని వారివీధిలోకి మార్చింది. డ్యూటీ నిమిత్తం తెనాలి వెళ్లిన ఆమెను శనివారం ఉదయం బస్టాండ్ సమీపంలో కలిసి మళ్లీ బెదిరించాడు. విషయం తెలిసి ఆమె సోదరుడు రాజేష్ అక్కడకు వెళ్లగా గొడవ జరిగింది. రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు రవిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేశ్వరమ్మ రాత్రికి గుంటూరు చేరుకొంది. ఆదివారం మధ్యాహ్నం తన తల్లి ఇంటిలో లేని సమయంలో వెంకటేశ్వరమ్మ ఇంటి దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్‌హెచ్‌వో వినయ్‌కుమార్, ఎస్ఐ మురళీకృష్ణ సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రాజేష్ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
కారులో వెళుతున్న వైఎస్ఆర్సీపీ నేత అరెస్ట్
గుంటూరు : గుంటూరు జిల్లా లాలాపేట పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కారులో వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కావటి మనోహర్ నాయుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా కారణం లేకుండా కావటి మనోహర్ నాయుడిని అరెస్ట్ చేయడంపై పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు విశాఖలోని గోపాలపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై టీడీపీ అభ్యర్థి గణబాబు ఆధ్వర్యంలో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.