గుంటూరు జిల్లా లాలాపేట పోలీసులు ఓవరాక్షన్ చేశారు.
గుంటూరు : గుంటూరు జిల్లా లాలాపేట పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కారులో వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కావటి మనోహర్ నాయుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా కారణం లేకుండా కావటి మనోహర్ నాయుడిని అరెస్ట్ చేయడంపై పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
మరోవైపు విశాఖలోని గోపాలపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై టీడీపీ అభ్యర్థి గణబాబు ఆధ్వర్యంలో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.