వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి | attack on YSR CP activists | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి

Published Tue, Jan 17 2017 12:31 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

గుత్తి (గుంతకల్లు): గుత్తి మండలం నేమతాబాద్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జానకి రామిరెడ్డి, రాఘవేంద్రరెడ్డి (తండ్రీ కొడుకులు)లపై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శివలింగారెడ్డి, ఈయన కుమారులు హనుమంతరెడ్డి, నారాయణరెడ్డిలు సోమవారం దాడి చేశారు.

గుత్తి (గుంతకల్లు): గుత్తి మండలం నేమతాబాద్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జానకి రామిరెడ్డి, రాఘవేంద్రరెడ్డి (తండ్రీ కొడుకులు)లపై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శివలింగారెడ్డి, ఈయన కుమారులు హనుమంతరెడ్డి, నారాయణరెడ్డిలు సోమవారం దాడి చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు ... జానకి రామిరెడ్డి దొడ్డిలో గడ్డి తీసుకురావడానికి సైకిల్లో వెళుతుండగా ఎదురుగా నారాయణరెడ్డి వచ్చారు.

నాకే ఎదురు వస్తావా? నీకెంత ధైర్యమంటూ జానకి రామిరెడ్డితో గొడవ పడ్డాడు. చుట్టు పక్కల వారు సర్దిజెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే ఈ విషయాన్ని నారాయణరెడ్డి తన తండ్రి శివలింగారెడ్డి, సోదరుడు హనుమంతరెడ్డికి చెప్పాడు. దీంతో కోపోద్రుక్తులైన ముగ్గురూ జానకి రామిరెడ్డి ఇంటికెళ్లి అతడితోపాటు కుమారుడు రాఘవేంద్ర రెడ్డిలపై కట్టెలతో దాడి చేశారు. వదలండని ప్రాధేయపడినా వినకుండా చితకబాదారు. ఈ దాడిలో జానకి రామిరెడ్డి చెయ్యి విరిగింది. మరో చేతికి కూడా తీవ్రగాయాలయ్యాయి. రాఘవేంద్రరెడ్డి తల పగిలింది.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చాంద్‌బాషా తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement