kavati manohar naidu
-
గుంటూరు మేయర్, కమిషనర్ మధ్య వివాదం
-
YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం
-
టీడీపీ మెప్పు కోసం కన్నా విమర్శలు చేస్తున్నారు: గుంటూరు మేయర్
-
నీ ప్రచారం చూస్తుంటే.. గుండె తరుక్కుపోతుంది
సాక్షి, విజయవాడ: టీడీపీ కోసం వంగవీటి రాధ ప్రచారం చేయడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావటి మనోహర్ నాయుడు విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వంగవీటి రంగాను క్రూరంగా హత్యచేసిన టీడీపీ నేతలతో కలిసి రాధా ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రంగాని టీడీపీ నేతలు హత్య చేయలేదు అంటున్న రాధా మాటలు వింటుంటే.. రంగా కడుపున పుట్టావా అన్న అనుమానం వస్తోందన్నారు. మీ ఇంటి పేరు వంగవీటి కాదు చెన్నుపాటి రాధాగా మార్చుకో వాలని సూచించారు. ‘రాధా నువ్వు టీడీపీలో చేరి నెల దాటిపోయింది కదా, మరి చంద్రబాబుని నీ తండ్రి విగ్రహం వద్దకు ఎందుకు తీసుకురాలేకపోయావు. రాధా నిన్ను వైఎస్ జగన్ యువజన విభాగం అధ్యక్షుడుగా చేసినా ఏ రోజు అయినా పోరాడావా? రెండు నియోజకవర్గాలకు బాధ్యత ఇస్తే ఒక్కసారి అయినా ఒక్క కార్యక్రమం చేశావా? చంద్రబాబు నిన్ను కుట్రలో పావుగా వాడుకుంటున్నారు. చంద్రబాబు నీకు పోటీ చేసే అవకాశం ఇచ్చారా? రాధా నువ్వు టీడీపీ ప్రచారం కోసం వెళ్లడం చూస్తే గుండె తరుక్కుపోతుంద’ని అన్నారు. ఎందుకు పోటీ చేయడం లేదు? బుద్దా వెంకన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. ఇత్తడి బెల్లులు, కొబ్బరి చిప్పలు అమ్ముకున్న ఆయన వైఎస్ జగన్‌ను విమర్శించడం శోచనీయమన్నారు. టీడీపీతో జనసేన కుమ్ముకైందని ఆరోపించారు. మంగళగిరిలో జనసేన పోటీ ఎందుకు చేయడం లేదన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదని మనోహర్ నాయుడు అన్నారు. -
కాల్‌మనీ, వడ్డీ వ్యాపారాలు టీడీపీ నేతలవే
వైఎస్సార్ సీపీ యూత్ జిల్లా అధ్యక్షుడు కావటి ఇంట్లో సోదాలపై ఖండన టీడీపీ ప్రభుత్వం తీరు అభ్యంతరకరం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పట్నంబజారు : వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న యూత్ జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున ఎటువంటి ఆరోపణలు లేకుండానే పోలీసులు సోదాలు చేయడాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. కావటి కుటుంబసభ్యులు, చిన్నారులను భయభ్రాంతులకు గురిచేసేలా 30 మంది పోలీసులు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్‌మనీ, వడ్డీ వ్యాపారాలు చేసేది టీడీపీ నేతలే అని ఆరోపించారు. శ్రీనివాసరావుపేటలోని కావటి కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలతో కలిసి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ విలేకరులతో మాట్లాడారు. కాల్‌మనీ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, నేతలు పీకల్లోతు కూరుకుపోతే వారిపై చర్యలు తీసుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం ఇతరులపై బురదచల్లేందుకు యత్నిస్తోందని విమర్శించారు. గతంలో కూడా కావటికి చెందిన బార్‌షాపుల లెసైన్సులు రద్దు చేరుుంచారని, దానిపై పోరాడి మళ్లీ లెసైన్సులు పొందినట్లు గుర్తు చేశారు. ఓ మంత్రి అండదండలతో టీడీపీ నేతలు వడ్డీ వ్యాపారాలు చేస్తుంటే వారిని వదిలి వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేయడం సిగ్గుచేటన్నారు. కాల్‌మనీ కేసులో ఎవరున్నా వారి ఆస్తులు జప్తు చేసి, శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేరుుస్తున్న సోదాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సీఈసీ సభ్యుడు రావి వెంకటరమణ తదితరులు మాట్లాడారు. -
కారులో వెళుతున్న వైఎస్ఆర్సీపీ నేత అరెస్ట్
గుంటూరు : గుంటూరు జిల్లా లాలాపేట పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కారులో వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కావటి మనోహర్ నాయుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా కారణం లేకుండా కావటి మనోహర్ నాయుడిని అరెస్ట్ చేయడంపై పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు విశాఖలోని గోపాలపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై టీడీపీ అభ్యర్థి గణబాబు ఆధ్వర్యంలో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.