నీ ప్రచారం చూస్తుంటే.. గుండె తరుక్కుపోతుంది | Kavati Manohar Naidu Takes On Vangaveeti Radha | Sakshi
Sakshi News home page

నీ ప్రచారం చూస్తుంటే.. గుండె తరుక్కుపోతుంది

Published Thu, Mar 28 2019 3:44 PM | Last Updated on Thu, Mar 28 2019 4:15 PM

Kavati Manohar Naidu Takes On Vangaveeti Radha - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ కోసం వంగవీటి రాధ  ప్రచారం చేయడం సిగ్గుచేటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కావటి మనోహర్ నాయుడు విమర్శించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వంగవీటి రంగాను క్రూరంగా హత్యచేసిన టీడీపీ నేతలతో కలిసి రాధా ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రంగాని టీడీపీ నేతలు హత్య చేయలేదు అంటున్న రాధా మాటలు వింటుంటే.. రంగా కడుపున పుట్టావా అన్న అనుమానం వస్తోందన్నారు. మీ ఇంటి పేరు వంగవీటి కాదు చెన్నుపాటి రాధాగా మార్చుకో వాలని సూచించారు.

‘రాధా నువ్వు టీడీపీలో చేరి నెల దాటిపోయింది కదా, మరి చంద్రబాబుని నీ తండ్రి విగ్రహం వద్దకు ఎందుకు తీసుకురాలేకపోయావు. రాధా నిన్ను వైఎస్‌ జగన్ యువజన విభాగం అధ్యక్షుడుగా చేసినా ఏ రోజు అయినా పోరాడావా? రెండు నియోజకవర్గాలకు బాధ్యత ఇస్తే ఒక్కసారి అయినా ఒక్క కార్యక్రమం చేశావా? చంద్రబాబు నిన్ను కుట్రలో పావుగా వాడుకుంటున్నారు. చంద్రబాబు నీకు పోటీ చేసే అవకాశం ఇచ్చారా? రాధా నువ్వు టీడీపీ ప్రచారం కోసం వెళ్లడం చూస్తే గుండె తరుక్కుపోతుంద’ని అన్నారు.

ఎందుకు పోటీ చేయడం లేదు?
బుద్దా వెంకన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. ఇత్తడి బెల్లులు, కొబ్బరి చిప్పలు అమ్ముకున్న ఆయన వైఎస్‌ జగన్‌ను విమర్శించడం శోచనీయమన్నారు. టీడీపీతో జనసేన కుమ్ముకైందని ఆరోపించారు. మంగళగిరిలో జనసేన పోటీ ఎందుకు చేయడం లేదన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదని మనోహర్ నాయుడు అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement