
సాక్షి, విజయవాడ : దేవాలయాలలో పనిచేసే క్షురకులు(నాయి బ్రాహ్మణులకు) రూ. 10వేలు అడ్వాన్స్‌గా ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరోనా తీవ్రత దృష్యా దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దేవాలయాలలో భక్తులకు శిరోముండనం చేస్తూ జీవనం సాగిస్తున్న క్షురకులు ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రముఖ దేవాలయాలలో పని చేస్తున్న 517 మంది, 80 చిన్న దేవాలయాలలో 451 మంది కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 968 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికి ఉపాధి లేని కారణంగా కేశఖండన శాల జేఏసీ ఆర్ధికంగా ఆదుకోవాలని అభ్యర్థన చేశారు. వీరి అభ్యర్థన మేరకు క్షురకుడు ఏ దేవాలయంలో పనిచేస్తాడో ఆ దేవాలయం నుంచి ప్రభుత్వం రూ. 10వేలు అడ్వాన్సుగా చెల్లింస్తుంది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ మొత్తాన్ని నెలవారీ సులభ వాయిదాల్లో సంబంధిత దేవాలయానికి జమ చేయడం జరుగుతుందన్నారు. దీని వలన రాష్ట్రంలోని 968 మంది క్షురకులు లబ్ధి పొందగలుగుతారని వెల్లంపల్లి తెలిపారు.
(లాక్‌డౌన్.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు)
Comments
Please login to add a commentAdd a comment