సాక్షి, వైఎస్సార్ కడప: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద కుటుంబాలకు చేయూత అందిస్తున్నామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పేద కుంటుంబానికి రూ. 1000 పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (సీఎంఆర్‌ఎఫ్‌కు భారీగా విరాళాలు)
బాబు, పవన్ విమర్శలు మానుకోవాలి: వెల్లంపల్లి
విజయవాడలోని పలు ప్రాంతాల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం పర్యటించారు. కరోనా నియంత్రణపై అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి ఇంటి వద్దకే రూ.1000 పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది కొనియాడారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి ఆయన సూచించారు. ప్రభుత్వ అధికారులకు ప్రజలు సహకరించాలి మంత్రి కోరారు. కరోనాతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు, పవన్ మాత్రం ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ విమర్శలు మానుకోవాలి హితవు పలికారు. (తొలి మరణం విజయవాడలో జరగడం బాధాకరం)
Comments
Please login to add a commentAdd a comment